త్వరలో ఆప్కో విభజన
గుంటూరు: ఆప్కో సంస్థను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలవారిగా విడగొట్టనున్నారని ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు చెప్పారు. ఆప్కో విభజన కోసం ఈ నెల 19న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సెంట్రల్ కమిటీకి నివేదించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలోని ఆరుంబాక వీవర్స్ సొసైటీలోని స్టాక్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు 58, తెలంగాణకు 42 సొసైటీలు ఉంటాయని చెప్పారు.
ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, అప్పులు ఆ రాష్ట్రానికే వస్తాయన్నారు. చేనేత సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వాన్ని రూ.175 కోట్లు వెచ్చించాలని కోరినట్లు చెప్పారు. వీవర్స్ సొసైటీలోని కార్మికుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందన్నారు.