MV Ramana Reddy
-
MV Ramana Reddy: మనకాలం వీరుడు ఎమ్వీఆర్
2001వ సంవత్సరం. అమీర్ పేటలో ఆర్టిస్ట్ మోహన్ ఆఫీసు. ఉదయం పది గంటలకి ఎం.వి. రమణారెడ్డి ఫోన్ చేశారు. ‘హైద రాబాద్ బస్టాండ్‌లో వున్నా. అర గంటలో మీ ఆఫీసుకి వస్తాను’ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హెన్రీ షారియర్ నవల ‘పాపిలాన్’ని ఆయన అనువ దించారు. కవర్ పేజీ బొమ్మ కోసం వస్తున్నారు. ఆయన చాలా రోజుల ముందే చెప్పినా మోహన్ బొమ్మ వేయలేదు. తాపీగా ఒక ఎ4 సైజ్ బాండ్ పేపర్ తీసుకుని, రెక్కలతో ఒక మనిషి ఎగురుతున్న ఒక చిన్న బొమ్మ వేశాడు. దాన్ని స్కాన్ చేసి, పచ్చని అడివి వున్న ఒక బ్రోషర్ తీసి ఇచ్చి, దాన్ని బ్యాక్ గ్రౌండ్‌గా వాడమని కంప్యూటర్ ఆపరేటర్‌కి చెప్పాడు. ఆ పని అయ్యేలోగా ‘రెక్కలు సాచిన పంజరం – ఎం.వి. రమణారెడ్డి’ అని అక్షరాలు రాసిచ్చాడు. కవర్ పేజీ పైన అడివి, కింద సముద్రం అలలు, మధ్యలో ఎగిరే స్వేచ్ఛాజీవి– 20 నిమిషాల్లోనే రెడీ అయింది అందమైన కవర్ డిజైన్. ఎమ్వీఆర్ వచ్చారు. హాయిగా నవ్వి ‘బాగుంది’ అన్నారు. నాకు ఒకటే ఆశ్చర్యం. ప్రొద్దుటూరు ఫ్యాక్షనిస్టూ, హత్య కేసులో జైలుకెళ్లిన మనిషీ, వైద్యం చేసే డాక్టరూ, ఉద్యమాలూ నడిపి, నిరాహార దీక్షలు చేసి, ఎమ్మెల్యేగా గెలిచి రాయలసీమ కోసం గొంతెత్తినవాడూ, పుస్తకాలు రాసినవాడూ ఈయనేనా? సౌమ్యంగా, వినమ్రంగా, సంస్కారవంతంగా, స్నేహశీలిగా ఉన్న ఈ నిరాడంబరమైన బక్కపలచని మానవుడేనా? ఎమ్వీఆర్‌గా ప్రసిద్ధుడైన మల్లెల వెంకట రమణా రెడ్డి తెలుగు సాహిత్యానికి కొన్ని అరుదైన కానుకలు ప్రసాదించిన ప్రతిభామూర్తి. విప్లవ కారుడూ, తిరుగుబాటుదారుడూ అయిన ఎమ్వీఆర్ మహాభారతాన్ని లోతుగా అధ్యయనం చేసినవాడు. ‘గుడిపాటి వెంకటచలం వచనం నాకిష్టం. ఆ ప్రభావం నా మీద వుంది’ అని ప్రకటించినవాడు. ఎంత విస్తృ తంగా చదువుకున్నాడో ఆయన రచనల్లోని వైవిధ్యమే మనకి చెబుతుంది. మార్గరెట్ మిషెల్ ‘గాన్ విత్ ది విండ్’, గోర్కీ ‘అమ్మ’, ఆర్కె నారాయణ్ ‘పెద్దపులి ఆత్మకథ’, ‘మాటకారి’ నవలలు తేట తెలుగులోకి అనువదించారు ఎమ్వీఆర్. ‘ఆయుధం పట్టని యోధుడు’ టైటిల్‌తో మార్టిన్ లూథర్ కింగ్ జీవిత చరిత్ర రాశారు. భారతంలో ద్రౌపది ప్రాధా న్యాన్నీ, విశిష్టతనీ తెలియజెప్పే ‘తెలుగింటికొచ్చిన ద్రౌపది’ ఒక అరుదైన రచన. ఎమ్వీఆర్ రాసిన ‘రాయల సీమ కన్నీటి గాథ’ ప్రజాదరణ పొందిన ఒక సీరియస్ డాక్యుమెంట్. జీవిత చరమాంకంలో రాసిన ‘తెలుగింటి వ్యాకరణం’ ఒక అసాధారణమైన రచన. ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ అని ఏకంగా నాలుగు సంపుటాలు రాసిన మన హెచ్.జి. వెల్స్ ఎమ్వీ రమణారెడ్డి. నవ చైనా సామాజిక జీవితం గురించి ఒక బ్రిటిష్ డాక్టర్ రాసిన పుస్తకాన్ని ‘పురోగమనం’ పేరుతో అనువదించారు. ఎనిమిది ఉత్తమ తెలుగు చిత్రాలకు ఆయన రాసిన సమీక్షలు ఎప్పటికీ మరిచిపోలేనివి. ‘తెలుగు సినిమా స్వర్ణయుగం’లో మల్లీశ్వరి, జయభేరి, దొంగరాముడు, దేవదాసు, బంగారు పాప, పాతాళ భైరవి, మాయాబజార్, విప్రనారాయణలను ఆయన సమీక్షించిన తీరు పాఠకుల్ని పరవశుల్ని చేస్తుంది. అవి డాక్టోరల్ థీసిస్‌కు ధీటైన పరిశోధన చేసి రాసినవని ముళ్ళపూడి వెంకట రమణ కితాబిచ్చారు. (క్లిక్: కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ ఎందుకు రాశారు!?) ఎమ్వీ రమణారెడ్డి అనే పదహా రణాల ప్రజల మనిషి, అక్షరాలా ఉత్తమ సాహితీవేత్త మన సాహిత్యానికి చేసిన కంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది. కడప జిల్లా ప్రొద్దుటూరు అంటే ఆనాడు ‘శివతాండవం’ చేసిన పుట్టపర్తి నారాయణాచార్యులవారు, ప్రొద్దుటూరు అంటే తెలుగు సాహితీ పతాకాన్ని నీలాకాశం చేసి ఎగరేసిన ఎమ్వీ రమణారెడ్డి... అనే మనకాలం వీరుడు. ఉద్యమం, అధ్యయనం, ఆదర్శం కలిసి ప్రవహిస్తే... అదే ఉజ్వలమైన, ఉత్తేజకరమైన ఎమ్వీఆర్ జీవితం. (క్లిక్: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం) - తాడి ప్రకాష్ సీనియర్ జర్నలిస్ట్ (సెప్టెంబర్ 30న ప్రొద్దుటూరులో ఎమ్వీఆర్ విగ్రహ ఆవిష్కరణ) -
ఆయనే ఒక చరిత్ర
నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఎంవీ రమణారెడ్డి (ఎంవీఆర్) పేరు వింటున్నాను. మా ఊరు ప్రొద్దుటూరుకు పక్కనే ఉండటంతో రమణారెడ్డి గురించి ప్రచారమయ్యే ప్రతి విషయం నాకూ తెలిసేది. ప్రొద్దుటూరులోని షావుకార్లకు, మిల్లుల యజమానులు ఆయనంటే భయపడేవారు. బీదలకు, కార్మికులకైతే ఆయన దేవుడు. రాయలసీమ అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. దాన్ని కష్టాల నుంచి విమోచనం చేయడానికి ఉద్యమించాడు. ముల్కీ ఉద్యమం 1968లో మర్రి చెన్నారెడ్డి వల్ల తెలంగాణా ఏర్పాటు ఉద్యమంగా ఊపందుకున్నప్పుడు, దాన్ని పలుచన చేసేందుకు అప్పటి కాంగ్రెస్ నేతలు ప్రొద్దుటూరులో ‘రాయలసీమ మహాసభలు’ నిర్వహిం చారు. ఆనాటి సభల్లోనే యువకుడైన ఎంవీఆర్ మైకును స్వాధీనం చేసుకొని– ‘రాయలసీమ అభివృద్ధి కోసం నిర్దిష్ట ప్రతిపాదనలతో పదవులను వదులుకొని ఉద్యమం చేయగలరా?’ అంటూ పెద్దలను ప్రశ్నించాడు. ఆ పెద్దల నోట మాటలేదు. 1983లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో ఉన్నా, ఆయన పదవులకోసం తన లక్ష్యాన్ని వదులుకోలేదు. ‘తెలుగు గంగ’ ప్రాజెక్టు రాయలసీమ నేలకు చుక్క నీరివ్వదని తెలుసుకున్న వెంటనే ఎన్టీఆర్‌ను ప్రశ్నించాడు. ఆ తర్వాత ఎదిరించాడు. ‘రాయలసీమ విమోచన సమితిని’ స్థాపించి రాయలసీమ కోసం నాలుగు జిల్లాలూ తిరుగుతూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు. వంచనతో ఆ దీక్షను ముఖ్యమంత్రి వివరమింపజేయడంతో, తెలుగుదేశం పార్టీని వీడి ‘రాయలసీమ విమోచన సంస్థ ’ అభ్యర్థిగా 1985 శాసనసభ ఎన్నికల్లో పోటీచేశాడు. ప్రజాభిమానం ఉన్న నాయకుడు ఓడిపోవడానికి, ప్రజాభిమానం లేని నాయకుడు గెలవడానికి ఈ ప్రజాస్వామ్యంలో ఎంత అవకాశం వుందో చూపడానికి 1985 ఎన్నికల నాటి ప్రొద్దుటూరు ఎన్నిక ఒక కొండగుర్తు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా, ఆ తరువాత ఆయన గానీ, ఆయన భార్య గానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ప్రతి ఎన్నికలో 25 వేల ఓటు బ్యాంక్ తనకుందని నిరూపించుకున్నారు. ఓడిపోయాక కూడా ఆయన రాయలసీమపై తనకున్న ప్రేమను చంపుకోలేదు. రాయలసీమ అభివృద్ధి కోసం ఏ పార్టీలు, ఏ ప్రజాసంఘాలు ఉద్యమించినా తను ప్రోత్సహించేవాడు. చిన్నాపెద్ద చూడకుండా ఆ నిరసనలలో పాల్గొనేవాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమైనప్పడు... ఆంధ్ర, రాయలసీమల్లో జరిగిన ‘సమైక్యాంధ్ర’ ఉద్యమాన్ని ఆయన వ్యతిరేకించాడు. దాన్ని నడిపిస్తున్న శక్తులెవరో, రాయలసీమకు మరెంతగా అన్యాయం జరుగుతుందో వివరించాడు. (చదవండి: గ్రహణం పట్టిన భాస్కరుడు) రాజధాని కర్నూలు కావాలనీ, గుంతకల్లు రైల్వేజోన్ చేయాలనీ ప్రజాసంఘాలు చేసిన నిరసనల వెనుక వెన్నుదన్నుగా ఉండటమే కాకుండా, ఆరోగ్యం సహకరించకపోయినా ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్థాపన, రైల్వే డబ్లింగ్ పనులు వంటి ఒకటి రెండు మినహా, ఎంవీ రమణారెడ్డి ఎప్పుడో గుర్తించిన రాయలసీమ సమస్యలు దాదాపు అన్నీ ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ప్రాజెక్టులు కొన్ని పూర్తయినా నీటి కేటాయింపులు లేవు. (చదవండి: ఒక తరపు పోరాట గాథ) తొలినాళ్ళలో తీవ్రవాద మావోయిస్టు – లెనినిస్టు పార్టీతో ఎంవీఆర్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. తర్వాత కాలంలో మార్టిన్ లూథర్ కింగ్ అహింసా పోరాటాన్ని ‘ఆయుధం పట్టని యోధుడు’ పేరుతో మనకందించడం చూస్తే ఆయనలో వచ్చిన సైద్ధాంతిక మార్పు తెలుస్తుంది. రాయలసీమ కన్నీటిగాథపై ఆయన రాజేసిపోయిన నిప్పు ఆయన లేకపోయినా రాజుకుంటూనే ఉంటుంది. - పాలగిరి విశ్వప్రసాద్ వ్యాసకర్త కథా రచయిత (ఏప్రిల్ 4న ఎంవీ రమణారెడ్డి జయంతి) -
బహుముఖ యోధుడు
ఎం.వి. రమణారెడ్డి (1944–2021) అనారో గ్యంతో బాధపడుతూ మరణించారు. వైద్యుడిగా, రాయలసీమ వాదిగా, సాహితీవేత్తగా ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి. 1969లో, పాతికేళ్ళ వయసులోనే ‘ప్రభంజనం’ పత్రికను ప్రారంభించి, మూడు నాలుగేళ్ళు నడిపారు. విరసంలో చేరి, ప్రథమ మహాసభలలో కార్యవర్గ సభ్యునిగా ఎన్నికై పని చేశారు. తర్వాత కాలంలో విరసం నుంచి దూరమై తనవైన కార్యకలాపాలను సాగించారు. తెలుగు దేశం, కాంగ్రెస్, వైసీపీ వంటి ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల్లో పనిచేశారు. ఎమ్మెల్యేగా ఎన్నిక య్యారు. రాయలసీమ విమోచనా సమితిని స్థాపించి, రాయలసీమ హక్కుల కోసం గళ మెత్తారు. ఆయనది బహుముఖమైన వ్యక్తిత్వం గనుక వేర్వేరు విషయాలు గుర్తుకువస్తాయి. ఆయన వాదనలతో అంగీకరించని వాళ్ళు సైతం ఆయన ఆలోచనలు, ప్రతిపాదనలలోని మౌలికత్వాన్ని గుర్తిస్తారు. రాజకీయ కృషి చేస్తూనే, సాహిత్య సృజనని నిరాఘాటంగా కొనసాగించారు. ‘ఆయుధం పట్టని యోధుడు’ అంటూ మార్టిన్ లూథర్‌కింగ్ గురించి రాసినా; చెరసాలలను ధిక్కరించి, నిర్బంధం నుంచి తప్పించుకు తీరాలన్న తపనతో పెనుగు లాడిన హెన్రీ షారియార్ ప్రసిద్ధ రచన ‘పాపి యాన్’ను ‘రెక్కలు చాచిన పంజరం’గా అనువాదం చేసినా; ఆయన సాహిత్య కృషి విలువైనది. మార్గరెట్ మిషెల్ ప్రఖ్యాత రచన ‘గాన్ విత్ ద విండ్’ నవలను ‘చివరకు మిగిలింది’ పేరుతో అనువదించి ప్రచురించారు. ఇవి కాక, రాయలసీమ కన్నీటి గాథ, తెలుగింటి వ్యాకరణం, తెలుగింటి కొచ్చిన ద్రౌపది, ప్రపంచ చరిత్ర వంటి స్వతంత్ర రచనలు ఆయన విలువైన సాహిత్య సృజనకు తార్కాణం. అనువాదం కోసం ఎంచుకున్న పుస్తకాలు ఆయన అభిరుచికీ, వ్యక్తిత్వానికీ అద్దం పడతాయి. తిక్కన పద్యాలపైన, పదాలకి అర్థాల పైన చేసిన వ్యాఖ్యానాలు ఆయన పరిశీలనా శక్తికీ, పరిశోధనా పటిమకీ నిదర్శనంగా నిలబడతాయి. భాష పట్లా, రాయలసీమ కన్నీటి గాథల పట్లా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన లోతైన అవగాహననీ, ఆలోచనల విస్తృతినీ వెల్లడిస్తాయి. తీవ్ర అనా రోగ్యంతో బాధపడుతూ కూడా నాలుగు సంపు టాల ప్రపంచ చరిత్ర పుస్తకం తేవాలన్న తాప త్రయం తన పట్టుదలకీ, ధీశక్తికీ సాక్ష్యమిస్తుంది. మొత్తం మీద చూస్తే– రచయితగా, సాహిత్య వేత్తగా, రాజకీయవాదిగా మరొకరితో పోల్చలేని అరుదైన, విలక్షణమైన వ్యక్తి అని చెప్పుకోవాలి. రాజకీయాల నుంచి సాహిత్యంలోకి మళ్ళినవారూ, సాహిత్య సృజనకర్తలుగా, రాజకీయవేత్తలుగా ఏక కాలంలో కొనసాగుతున్నవారూ చాలామందే ఉన్నారు. కాలక్రమంలో వారిలో సాహితీవేత్త పార్శ్వమో, రాజకీయవేత్త పార్శ్వమో ప్రధానంగా ముందుకొస్తుంది. రమణారెడ్డి గారిలో బహుశా రెండు పార్శా్వలనూ సమపాళ్లలో చూడవచ్చునేమో. యూరప్ వికాస యుగపు ప్రతినిధుల గురించి చర్చిస్తూ ఎంగెల్స్ ఒక విలువైన పరిశీలన చేస్తాడు. మానవ జాతి చరిత్రలోనే అతిగొప్ప ప్రగతిశీల యుగంగా వెలుగొందిన ఆ కాలం– ఆలోచనలో, ఆశయాలలో, ఆవేశాలలో, వ్యక్తిత్వంలో, విశ్వజ నీనతలో, విజ్ఞానంలో మహా ప్రతిభావంతులని సృష్టించిందని అంటాడు. లియోనార్డో డా వించి, అల్బ్రెక్ట్ డూరర్, మాకియవెల్లి, మార్టిన్ లూథర్ వంటి వారిని ప్రస్తావిస్తూ, వ్యక్తులను ఒకే పార్శా్వ నికి పరిమితం చేసే శ్రమ విభజన ప్రభావానికి ఆనాటి ప్రతిభావంతులు ఇంకా లోబడలేదని చెబు తాడు. వైద్య వృత్తి నుంచి, రాజకీయాలు, సాహిత్య సృజన, విభిన్న ఆసక్తుల దాకా విస్తరించిన రమణా రెడ్డిని కూడా ఈ కోణం నుంచే అంచనా వేయా లేమో. తెలుగుసీమలోని రాజకీయ, సాహిత్య ఉద్య మాల వికాసంతో, ఉత్థాన పతనాలతో సన్నిహితంగా ముడిపడిన ఆయన ప్రస్థానాన్ని, తాను వేసిన విలక్షణమైన ముద్రనుంచి విడ దీసి చూడలేము. – సుధా కిరణ్ ఈ–మెయిల్ : sukira2001@yahoo.com -
మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత
-
మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ ఉద్యమ నేత, సాహితీవేత్త డాక్టర్ ఎంవీ రమణారెడ్డి (78) – ఎంవీఆర్ బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన ఏడాదిగా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని జీవిస్తున్నారు. తీవ్ర అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం ఆయన్ను కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఉదయం కాలకృత్యాల అనంతరం ఆయనకు గుండెపోటు వచ్చింది. చికిత్స అందిస్తుండగానే కన్ను మూశారు. ఆయనకు భార్య లక్ష్మీకాంతమ్మ, కుమారులు మల్లేల మురళీధర్‌రెడ్డి, మల్లేల రాజారాంరెడ్డి, కుమార్తె కవిత ఉన్నారు. చిన్న కోడలు మల్లేల ఝాన్సీరాణి ప్రస్తుతం ఆప్కాబ్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. సామాజిక, సాహిత్య అంశాలపై వ్యాసకర్తగా, కరపత్ర, కథా రచయితగా, అనువాదకునిగా, విమర్శకునిగా, చరిత్రకారునిగా, పత్రికా నిర్వాహకుడిగా విభిన్న విశిష్టతలు కలిగిన వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు గడించారు. డాక్టర్ నుంచి రాజకీయ నేతగా.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో 1944 ఏప్రిల్ 4న జన్మించిన ఎంవీఆర్ స్థానికంగా ప్రాథమిక విద్య, గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత ఎల్ఎల్బీ చదివారు. ప్రొద్దుటూరులో ప్రగతి క్లినిక్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయికే వైద్య సేవలు అందించారు. ఆంధ్రా కాటన్ మిల్లు కార్మికులకు సేవలు అందిస్తూ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని సిమెంటు కర్మాగారాల్లోని ట్రేడ్ యూనియన్లకు నాయకత్వం వహించారు. రైతు కూలీ ఉద్యమం చేశారు. కొంత కాలం న్యాయవాదిగా పనిచేశారు. 1983లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత పలుమార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సాహిత్య పరిచయం ► 1966లో ‘కవిత’ అనే సాహిత్య మాస పత్రికను ప్రారంభించారు. 1969లో ‘ప్రభంజనం’ అనే రాజకీయ పక్ష పత్రికను ప్రారంభించి, నాలుగేళ్ల పాటు నడిపారు. 1983లో రాయలసీమ కన్నీటి గాథ అనే పుస్తకాన్ని ప్రచురించారు. తెలుగు సినిమా – స్వర్ణయుగం, పురోగమనం, పరిష్కారం, ఆయుధం పట్టని యోధుడు, తెలుగింటికి వచ్చిన ద్రౌపది, చివరకు మిగిలింది, పెద్దపులి ఆత్మకథ, మాటకారి, శంఖారావం, తెలుగింటి వ్యాకరణం తదితర పుస్తకాలు రాశారు. ► చరమాంకంలో అనారోగ్యంగా ఉన్నప్పటికీ మాగ్జిమ్ గోర్కీ ‘మదర్’ నవలను తెలుగులో ‘కడుపు తీపి’ పేరుతో అనువదించారు. టూకీగా ప్రపంచ చరిత్ర పేరుతో నాలుగు సంపుటాలు వెలువరించారు. తన ఆత్మకథను 151 పేజీలు రాసుకున్నారు. ఇది ఇంకా పూర్తవకుండానే తుదిశ్వాస విడిచారు. నేడు తాళ్లమాపురం రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఉదయం డాక్టర్ ఎంవీ రమణారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రాయలసీమ ఉద్యమంలో.. ► 1985 జనవరి 1న ప్రొద్దుటూరు కేంద్రంగా రాయలసీమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టిన 21 రోజుల తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. ఆ తర్వాతే రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వచ్చింది. ► ఎన్టీ రామారావుతో రాయలసీమ సమస్యలపై విభేదించి.. రాయలసీమ విమోచన సమితి స్థాపించారు. 1985 డిసెంబర్ 31 నుంచి 1986 జనవరి 16వ తేదీ వరకు ప్రొద్దుటూరు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకు ‘కరువు యాత్ర’ చేపట్టారు. ► రాయలసీమకు సేద్యపు నీరు కావాలని, సీమ వాటా ఉద్యోగాలివ్వాలని, పరిశ్రమలను స్థాపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా కాటన్ మిల్ కార్మికుల విషయంలో జరిగిన గొడవల్లో ఎంవీఆర్ పలు మార్లు జైలుకు వెళ్లారు. ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవించారు. విప్లవ సాహితీ వేత్తలతో కలిసి పని చేశారు. వివిధ కారణాలతో పలు మార్లు జైలుకెళ్లారు. ► వైఎస్ రాజశేఖరరెడ్డితో ఆనాడు విభేదించినా, రాయలసీమ ఉద్యమ విషయాల్లో కొన్ని వేదికలను పంచుకున్నారు. ఖైదీగా ఉంటూ చేసిన ఆమరణ నిరాహార దీక్ష వల్ల రాష్ట్రంలో జైళ్లలో సంస్కరణలకు కారణమయ్యారు. ► వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి సభ్యుడిగా ఉంటూ పార్టీ విజయం కోసం కృషి చేశారు. గొప్ప మేధావి ఎంవీఆర్ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రచయితగా, చరిత్రకారునిగా, రాయలసీమ విమోచన సమితి వ్యవస్థాపకునిగా, విరసం వ్యవస్థాపక సభ్యునిగా విభిన్న రంగాల్లో నిష్ణాతునిగా పేరు పొందారని తెలిపారు. ఎంవీఆర్ రాసిన విప్లవాత్మక కవితలు, రాజకీయ వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయని పేర్కొన్నారు. ఆయన గొప్ప మేధావి అంటూ కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
ఆ సత్తా చంద్రబాబుకు ఉందా?
సాక్షి, ప్రొద్దుటూరు(కడప) : రాష్ర్టరాజధాని మార్పు విషయంలో ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఒక్క మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే కడుపుమంటతో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ.రమణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ఉండాలని అడిగే హక్కు చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు. ఐదేళ్ల కాలంలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టకుండా రాజధాని పేరుతో పదుల సంఖ్యలో నమూనాలను జనాలకు చూపుతూ మోసం చేస్తూ వచ్చారన్నారు. ఐదేళ్ల కాలంలో ఒక్క నమూనా కూడా ఆమోదం కాలేదన్నారు. ఇప్పుడు కూడా కూలి మనుషులను పెట్టుకొని అమరావతి పరిరక్షణ అంటూ ఉద్యమం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పరిపాలనా వికేంద్రీకరణ వల్లనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చెబుతున్నట్లు అసలు మూడుచోట్ల రాజధానులు అన్న అంశమే తప్పు అన్నారు. రాష్ట్రంలో ఒక్కచోటే రాజధాని ఉంటుందని, అది కూడా వైజాగ్‌లోనే ఉంటుందన్నారు. ఇప్పుడున్న రాజధాని వైజాగ్‌కు మారుతుందే తప్ప మరొకటి కాదన్నారు. మూడు రాజధానులంటూ గగ్గోలు పెడుతూ జనాలను చంద్రబాబు గందరగోళంలో పడేస్తున్నారని తెలిపారు. సచివాలయం ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అవుతుందని, అసెంబ్లీ సమావేశాలు మాత్రం అమరావతిలోనే జరపాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి తీర్మానించారన్నారు. రాజధాని మార్పు వల్ల అటు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, హైకోర్టు ఏర్పాటు పట్ల రాయలసీమ జిల్లాల వారు కూడా ఆనందంగా ఉన్నారన్నారు. చంద్రబాబుకు ధైర్యముంటే అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో పర్యటించడం మానేసి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని ప్రజలతో అమరావతి రాజధానిగా ఉండాలని ఒప్పించగలరా, ఆ సత్తా, ధైర్యం చంద్రబాబుకు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఐదేళ్లు పరిపాలన చేసి కనీసం సొంత ఇల్లు కూడా ఎందుకు కట్టుకోలేకపోయాడో చంద్రబాబు చెప్పాలని కోరారు. బీజేపీ నేతలు ఒక్కోమారు ఒక్కో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ కావాలని, అభివృద్ధి కావాలని చెప్పి ఇప్పుడు ఒక్కో నాయకుడు ఒక్కో రాగం తీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ వల్ల రాష్ట్రం మరింత ముందుకెళుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది
ప్రొద్దుటూరు టౌన్ : మండల పరిధిలోని అమృతాగనర్లో ఉన్న పేదలకు సొంతిల్లు కట్టించాలని నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారని.. అయితే ఆయన అకాల మరణంతో కాలనీ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ ఎంవీ రమణారెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివా రం మండల పరిధిలోని అమృతాగనర్కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. పంచాయతీ నిధులతో కొన్ని పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. కాలనీలో అర్హులైన చాలామందికి పింఛన్లు రాలేదన్నారు. ఒక్క సంవత్సరం ఆగితే జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నా రు. అప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుం దామని తెలిపారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు. ఎంవీఆర్‌తో జెండా ఆవిష్కరణ.. స్థానిక వైఎస్సార్ విగ్రహం ముందు వైఎస్సార్సీపీ జెండాను ఎంవీ రమణారెడ్డితో వైఎస్ జగన్ ఆవిష్కరింపజేశారు. అనంతరం స్థానిక మహిళలు జగన్‌కు సమస్యలు ఏకరువు పెట్టారు. అన్ని అర్హతలు ఉన్నా తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ ఒక్క ఏడాది ఆగితే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. -
‘సీఎం రమేశ్ ఒత్తిడి చేస్తున్నారు’
కడప: వైఎస్సార్ సీపీ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన మద్దతు వైఎస్ వివేకానందరెడ్డికేనని మాజీ ఎమ్మెల్యే ఎమ్వీ రమణారెడ్డి స్పష్టం చేశారు. చాలాసార్లు ఈ విషయం స్పష్టం చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలపాలని తనపై ఎంపీ సీఎం రమేశ్ ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. ఇక వాళ్ల ప్రయత్నాలు మానుకుంటే మంచిదని ఆయన సూచించారు. ఈ మేరకు ఎమ్వీ రమణారెడ్డి ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
తిక్కన ఇచ్చిన సున్నితపు త్రాసు
తెలుగు భాషకు ద్విత్వం ప్రాణాధారం. ‘క’కు కా వొత్తు, ‘త’కు తా ఒత్తు, ఇలా ఏ హల్లుకు ఆ హల్లే జత పడటం- అమ్మ, అక్క, అయ్య వంటి హల్లుల కలయిక తెలుగు పదాల ప్రాథమిక స్వభావం... ద్విత్వాక్షరాలుండే పదాలను ఎన్నుకోవడమే కాకుండా, ప్రాస స్థానంలో వాటిని వినియోగించే చమత్కారంతో తన రచనకు తెలుగుదనాన్ని సమకూర్చాడు తిక్కన. సున్నితపు త్రాసుతో తూచినట్టు సరయిన స్థానంలో తగిన పదం ఎలా వచ్చిపడుతుంది? రాస్తున్నది చరిత్రకు సంబంధించిన తొలి పేజీలు. అందులోనూ వస్తువు సైన్సు. దానికి ఆయన జవాబు ఆశ్చర్యానికి లోను చేసింది. ‘ఈ తెలుగు సామర్థ్యానికి కారణం పద్యం, మూలం పదమూడవ శతాబ్దపు తిక్కన’. ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ పేరుతో ఎం.వి.రమణారెడ్డి ఒక పుస్తకం వెలువరించారు. వారి పై జవాబు ద్వారా, పదేళ్ళ క్రితం వారే వెలువరించిన ‘మహాభారత స్రవంతిలో తెలుగింటికొచ్చిన ద్రౌపది’ గురించి తెలుసుకుని, దాన్నీ చదివాను. వామపక్ష మేధావి రమణారెడ్డి, తిక్కన చిత్రించిన తెలుగు ద్రౌపదిని విశ్లేషించడం ముచ్చట కల్గించింది. పద్యం అనగానే బూర్జువా బూజు ధోరణిలో కాకుండా, హేతుబద్ధమైనది గ్రహించాలనే రీతిలో ఆయన భారతాన్ని, అందునా తిక్కన భారతాన్ని ఇష్టపడి, అందులో ద్రౌపది పాత్ర చిత్రణలో ఎంత తెలుగుదనమున్నదో వివరించడం అర్థవంతంగా అనిపించింది. ‘‘...ఇక్కడ తిక్కన తెలుగు ఇల్లాలితో పాటు, తెలుగు తల్లిని కూడా ఆవిష్కరించాడు. అదివరకటి భారతీయ సాహిత్యానికి స్త్రీలో కనిపించింది కేవలం కామోద్రేకం మాత్రమే. సందర్భం ఒత్తిడి చేస్తే ఒకటి, రెండు సన్నివేశాల్లో ఇతర ఉద్రేకాలను వెల్లడించినా, వాటికి అంత ప్రాముఖ్యం ఆ సాహిత్యంలో కనిపించదు. 13వ శతాబ్దపు తెలుగు సాహిత్యం ఆ సంకుచితత్వానికి వీడ్కోలు పలికింది. అందుకు గాను ఇటు తిక్కన సోమయాజికీ, అటు పాల్కురికి సోమనాథునికీ భారత జాతి రుణ పడిపోయింది’’అని రమణారెడ్డి వ్యాఖ్యానిస్తారు. కీచకునితో అవమానపడిన ద్రౌపది, భీమసేనుడికి కర్తవ్య బోధ చేస్తుంది. తన పరిస్థితి ఏమిటో వివరించిన నేపథ్యంలో-ద్రౌపదిని తిక్కన ఎలా చిత్రించారో చెబుతూ చేసిన విశ్లేషణ ఇది: అంతకు ముందు అధ్యాయంలో కౌరవ సభలో జరిగిన పరాభవం గురించి బాధ పడిన ద్రౌపది నన్నయ్యకు కేవలం ఒక హరికథకురాలిగా కనబడుతుంది. ఇక్కడ రమణారెడ్డి అంటారు: ‘‘ఇప్పుడు గూడ భర్తను ఒక కర్తవ్యానికి ఉసిగొల్పడమే ఆమె ధ్యేయం. అయినా ఉద్రేకాన్ని వెళ్లగక్కే ఆ తీరులో ఆడ హరిదాసులా కాకుండా అచ్చం తెలుగింటి ఆడ బిడ్డలా కనిపిస్తుంది.’’ దీనికాధారం అయిన తిక్కన పద్యమిది: నన్ను పరాభవించి, సదనంబునకున్ జని కీచకుండు, ము న్నున్న తెరంగు తప్పక, సుఖోచిత శయ్యను నిద్రసేయ, నీ కన్ను మొగుడ్చు ఊరటకు కారణమెయ్యది భీమసేన? మీ అన్న పరాక్రమంబు వలదన్ననొకో దయమాలి తక్కటా? (నన్ను పరాభవించి ఆ కీచకుడు తన ఇంటికి జేరి సుఖంగా నిద్ర పోతున్నాడు- అవమాన పడింది పరాయి స్త్రీ కాబట్టి కలత లేకుండా వాడు సుఖంగా నిద్రబోగలుగుతున్నాడు- కట్టుకున్న పెళ్ళానికి ఇంత అవమానం జరిగితే నీ కంటికి కునుకు పట్టేంత నిబ్బరం ఎలా కలిగిందయ్యా? నా మీద జాలి మాత్రమైనా లేకుండా ఇలా పడుకున్నావంటే, పరాక్రమించొద్దని మీ అన్న పెట్టిన ఆంక్ష అడ్డు తగిలిందా ఏమి?) ఈ పద్యం ఆధారంగా రమణారెడ్డి విశ్లేషణ ఇలా సాగుతుంది: ‘‘... ఈ పద్యంలో తెలుగుదనం ఉట్టిపడటం కూడా గమనించదగిన మరో విశేషం. అది కేవలం తెలుగు పదాలను పలికించడంతో సాధించిన ప్రయోజనం కాదు. తత్సమాల మీదా, పొడవాటి సమాసాల మీదా నన్నయకు ఎంత మోజున్నా తెలుగు మాటలను ఆయన తక్కువేం వాడలేదు. అలాగే తిక్కన సంస్కృత పదాలను పూర్తిగా వదిలేయనూ లేదు. హల్లుల కలయికలో సంస్కృతానికి సంయుక్తాక్షరాల ప్రాధాన్యత మెండు. తెలుగు భాషకు ద్విత్వం ప్రాణాధారం. ‘క’కు కా వొత్తు, ‘త’కు తా ఒత్తు, ఇలా ఏ హల్లుకు ఆ హల్లే జత పడటం- అమ్మ, అక్క, అయ్య, చెల్లి, ఎర్ర, నల్ల వంటి హల్లుల కలయిక తెలుగు పదాల ప్రాథమిక స్వభావం... ద్విత్వాక్షరాలుండే పదాలను ఎన్నుకోవడమే కాకుండా, తరచూ ప్రాస స్థానంలో వాటిని వినియోగించే చమత్కారంతో తన రచనకు తెలుగుదనాన్ని సమకూర్చాడు. తెలుగు భాషకు నన్నయ కావ్య గౌరవం కలిగించగా, తిక్కన దానికి సాహిత్య సామర్థ్యాన్ని ప్రసాదించాడు.’’ ద్రౌపది పాత్ర ద్వారా తిక్కన ఎలా తెలుగుదనాన్ని చిత్రించారో వివరించడానికి ఈ 168 పేజీల పుస్తకం రాసినా-మొత్తం భారతాన్ని చదివిన అనుభూతి కలుగుతుంది. వస్తువునూ, శైలినీ, భాషనూ త్రాసుతో లెక్కించినట్టు సాహిత్య సాము చేశారు రమణారెడ్డి. వారి భాష సున్నితపు త్రాసుకు తిక్కన స్ఫూర్తి కావచ్చు, కానీ దాన్ని మరింతగా సొంతం చేసుకొని ప్రపంచ విజ్ఞాన చరిత్రను తెలుగులో అందిస్తున్నారనే అంతరార్థం నాకు అవగతమైంది. - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ 09440732392 -
టూకీగా ప్రపంచ చరిత్ర -108
వేకువ క్షత్రియ వర్ణ ప్రవేశంతో నగరపాలికులకు పునాది ఏర్పడింది. ఒక ప్రధాన పట్టణం, దాని చుట్టుపక్కలున్న వ్యవసాయ గ్రామాలూ ఆ రాజ్యాల ఎల్లలు. ఆ పరిధిలోని భూమి సర్వస్వానికీ యజమాని రాజు. రైతులు కౌలుదార్లు మాత్రమే. మెచ్చినవారికి ఆ పొలంలో కొంతమేర రాజు దానంగా ఇవ్వవచ్చు. అలాంటి సందర్భాల్లో కౌలుదారునికి యజమాని మారుతాడు. ఆటవిక తెగలమీద క్షత్రియుల పెత్తనం ఉండేది గాదని పురాణగాథల ద్వారా తెలుస్తూంది. మహాభారతంలోని అరణ్యపర్వం ఆధారంగా, అడవులేవీ రాజులు ఏలుబడిలో ఉండేవిగాదని స్పష్టంగా అర్థమౌతుంది. పాలన ఏర్పడింది మొదలు క్షత్రియుల నడవడిక బ్రాహ్మణవర్గం కనుసన్నల్లో సాగింది. ఐతే, నిరంతరం ఈ ఆధిపత్యం సజావుగా సాగలేదని సూచించే వృత్తాంతాలు పురాణాల్లోనే కనిపిస్తాయి. అసురులను పక్కనబెడితే, మానవుల్లో బ్రాహ్మణుల పెత్తనాన్ని మొదటిసారిగా ధిక్కరించిన క్షత్రియుడు కార్తవ్యార్జునుడు. అందుకు గుణపాఠంగా, అతనితో పాటు క్షత్రియ వంశాన్నే నాశనం చేసినవాడు పరశురాముడు. రెండవ తిరుగుబాటుకు కారకుడు వేణచక్రవర్తి. బ్రాహ్మణుల ప్రోత్సాహంతో అతని కుమారుడైన పృథు తండ్రిని హత్యజేసి షట్చక్రవర్తుల్లో స్థానం సంపాదించుకున్నాడు. క్రీ.పూ.10వ శతాబ్ద కాలంలో ఆర్యావర్తం రాజ్యాలు తొలిదశ నైలు నాగరికతలో ఏర్పడిన చిన్న చిన్న ఏలుబడుల వంటివి. అక్కడిలాగే ఇక్కడ కూడా ఇరుగుపొరుగు రాజ్యాల పురోహితులతో లాలూచీపడి క్రమంగా విస్తరించడం మొదలెట్టాయి. యుద్ధాలకు అవసరమైన గుర్రాలనూ, ఆయుధాలనూ పర్షియన్ల నుండి కొనుగోలు చేసేందుకు నేటి పెషావర్ (సంస్కృత సాహిత్యంలోని పురుష పురం) వాణిజ్య కూడలిగానూ, దాని సమీపంలోని ‘తక్షశిల’ ఆర్యావర్తం, పారసీకం, మెసొపొటేమియా, ఈజిప్టులకు సాంస్కృతిక కేంద్రంగా ఏర్పడింది. ఉత్తరావర్తంలో అనేకచోట్ల ముడిఖనిజం నిక్షేపాలు దొరకడంతో, లోహ పరిశ్రమలో స్థానిక నైపుణ్యం విరివిగా ప్రవేశించింది. ఇలాంటి వాతావరణంలో, క్రీ.పూ. 6 శతాబ్దంలో కయ్యాలతోనూ, వియ్యాలతోనూ పరిధులు విస్తరించుకుంటూ సామ్రాజ్యంగా ఏర్పడిన మగధకు బింబిసారుడు (క్రీ.పూ.543-491) చక్రవర్తి. ‘రాజగృహ’ పట్టణం అతని రాజధాని. అదే సమయంలో పశ్చిమాసియా మొత్తాన్ని సైరస్ ది గ్రేట్ పాలిస్తున్నాడు. బింబిసార చక్రవర్తికి సమకాలీనుడు సిద్దార్థ గౌతముడు (క్రీ.పూ.563-483). చక్రవర్తి కంటే వయసులో ఐదేళ్లు పెద్దవాడు. తోటి జనులతో చనువుగా మెలగిన సిద్దార్థుడు రోగపీడితుల యాతన చూశాడు, సత్తువ కోల్పోయిన వృద్ధుల ఆవేదన గమనించాడు. చావుమంచం ఎక్కినవాళ్లు బతికేందుకు పడే తాపత్రయం అవగాహన చేసుకున్నాడు. పేదరికం, అమాయకత్వం, మూఢవిశ్వాసం, పిసినారితనం వంటి మానసిక బలహీనతలతో పాటు, దొంగతనం, జూదం, అసూయ, రాగద్వేషాల వంటి అవలక్షణాలను గుర్తించాడు. అతని మనసు వాటి పరిష్కారానికి తహతహలాడింది. అతని ఆలోచన అందుకు మార్గాలు వెదికే ధ్యాసలో కూరుకుపోయింది. పెళ్లి, దాంపత్య సుఖాలు అతన్ని ఆ ఆలోచన నుండి విరమింపజేసేందుకు విఫలమయ్యాయి. ఒక తాగుబోతుకు భార్యమీది కంటే మద్యం మీద ఆసక్తి ఎక్కువుండే చందంగా, ఒక జిజ్ఞాసాపరునికి తన అన్వేషణే ప్రాణప్రదం. బ్రాహ్మణులు చెప్పే శాస్త్రాల్లో సమాధానాలు దొరకగలవనే ఆశతో అతడు వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నించాడు. అవి బ్రాహ్మణుల గుప్త సంపదగా మారిపోయి ఉన్నాయి. యోగులుగా దేశాలు పట్టుకు తిరిగే సన్యాసులను ఆశ్రయించాడు. దగ్గరగా చూసిన తరువాత వాళ్లు బూటకమని తేల్చుకున్నాడు. గంగానదికి ఆవలిగావున్న రుష్యాశ్రమాల్లో తన దాహం తీరవచ్చుననే నమ్మకంతో కుటుంబాన్ని వదిలేసి, ‘రాజగృహ’ దిశగా బయలుదేరాడు. బయలుదేరే సమయానికి యశోదర కొడుకును ప్రసవించింది. పుత్ర వాత్సల్యమనే మోహపాశమైనా సిద్దార్థుని ప్రయత్నాన్ని ఆపలేకపోయింది. ఆశ్రమవాసంలో సిద్దార్థుడు ఏళ్ల తరబడి తనకు కావలసిన సమాధానాల కోసం ఎదురుచూశాడు. ఒకచోట తృప్తి దొరకక, మరొక చోటికి తరలిపోయాడు. వెళ్లిన ప్రతిచోట అతనిలోని విధేయత ఆశ్రవాసుల ఆప్యాయతను పొందగలిగింది. ధ్యానంతో జ్ఞానం కలుగుతుందని అతడు వాళ్ల నుండి నేర్చుకున్నాడు. ఆ జ్ఞానానికి పర్యవసానం ఏమిటి అనే ప్రశ్న అతనిలో ఉదయించింది. ప్రతిఫలంగా దొరికే మోక్షం జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందనే రుషుల నిర్వచనం సిద్దార్థునికి నచ్చలేదు. మోక్షమనేది వ్యక్తికి ఒనగూరే లాభం. కనీసం పక్కమనిషితోనైనా పంచుకునేందుకు వీలుపడనిది. అందువల్ల, మోక్షసాధన అనేది స్వార్ధానికి పరాకాష్టంగా అతనికి తోచింది. సిద్దార్థుడు కోరుకునేది పదుగురితో పంచుకునేందుకు వీలయ్యే జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని స్వయంగా సంపాదించుకునేందుకు సిద్దార్థుడు నిర్ణయించుకున్నాడు. ఆశ్రమాన్ని వదిలి, సొంత ప్రయత్నం మీద బయలుదేరిన సిద్దార్థునికి తనలాగే ఆశ్రమాలతో విసిగిన ఐదుగురు మిత్రులు తోడైనారు. ఆహారం మానివేసి, అన్నో ఇన్నో ఆకులలుములు తింటూ, నిశ్చలమైన ఏకాంతంలో కూర్చుని తపస్సులో మునిగితే జ్ఞానం సంప్రాప్తిస్తుందని అందరూ కలిసి నిర్ణయించుకున్నాడు. వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక కొండగుహను ఎన్నుకుని సిద్దార్థుడు తపస్సులో కూర్చున్నాడు. మిత్రులు అతని గొప్పతనాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో పెద్దగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని రోజులకు సిద్దార్థుని శరీర బలం పూర్తిగా నీరసించిందేగానీ జ్ఞానం జాడ దొరకలేదు. ఇది సరైన మార్గమేనా అనే సంశయంతో ఆలోచించుకుంటూ నదివొడ్డున పచార్లు చేస్తున్న సిద్దార్థుడు స్పృహ తప్పి నీటిలో పడిపోయాడు. మిత్రుల సహాయంతో బయటపడి కోలుకున్న తరువాత అతడు ఆహారం కావాలని కోరడం మిత్రలను కలవరపెట్టింది. మెదడుకు శక్తి ఉంటేనే జ్ఞానాన్ని సంపాదించగలుగుతుంది గానీ, నీరసంతో అది అసాధ్యం అనే పలుకులు వాళ్లకు ములుకులైనాయి. సిద్దార్థునికి భ్రష్టత్వం ఆపాదించి వాళ్లు తమ దారిని వెదుక్కున్నారు. ఒంటరిగా మిగిలిన సిద్దార్థుని పరిస్థితి గమనించిన పశుకాపరి వనిత సుజాత, కొన్ని పాలు, కొద్ది కొద్ది భోజనంతో అతన్ని ఆరోగ్యవంతుణ్ని చేసింది. తేరుకున్న సిద్దార్థుడు నదివొడ్డున్నే ఉన్న రావిచెట్టు నీడలో కూర్చుని, నెలల పర్యంతం తనలో తాను తర్కించుకోవడం మొదలెట్టాడు. మెదడును కమ్ముకున్న మబ్బులు కొద్దికొద్దిగా విచ్చిపోవడం ప్రారంభించాయి. కొంతకాలానికి జ్ఞానోదయమైన సంతృప్తితో బుద్ధుడైన సిద్దార్థుడు సంచారానికి బయలుదేరాడు. ఇంతకాలం అతడు ఏ నీడన జ్ఞానం సంపాదించాడో ఆ రావిచెట్టు ‘బోధివృక్షం’ అయింది. నేటి బీహార్ రాష్ట్రంలోని ‘గయ’ పట్టణానికి సమీపంలో ఉండే బౌద్ధుల పుణ్యక్షేత్రమే ఆ బోధివృక్షం. బయలుదేరిన సిద్దార్థుడు కాలినడకన ‘వారణాసి’ చేరుకున్నాడు. అక్కడ అతనికి తనను విడిచిపెట్టివెళ్లిన ఐదుగురు మిత్రులూ కనిపించారు. వాళ్లింకా సన్యాస జీవితమే గడుపుతున్నారు. సిద్దార్థుని కళ్లల్లో ప్రజ్వరిల్లుతున్న ఆత్మవిశ్వాసం వాళ్లను ఆశ్చర్యచకితులను చేసింది. సిద్దార్థుడు పొందిన జ్ఞాన రహస్యం తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. ఐదురోజుల పాటు వాళ్ల మధ్య చర్చోపచర్చలు ఏకధాటిగా కొనసాగాయి. సిద్దార్థుని అభిప్రాయాలతో వాళ్లకు సంపూర్ణమైన ఏకీభావం కుదిరింది. సిద్దార్థుణ్ని వాళ్లు బుద్ధునిగా గుర్తించారు. అందరూ కలిసి వారణాసి సమీపంలోని జింకల వనంలో కుటీరం నిర్మించుకున్నారు. అనుయాయుల సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. వర్షాకాలంలో మాత్రమే వాళ్లకు ఆశ్రమవాసం. మిగతా రోజుల్లో బుద్ధునితో సహా ప్రతి ఒక్కరు దిక్కుదిక్కున సంచారం చేస్తూ, జ్ఞానసందేశం ప్రజలకు అందించాలి. ప్రజలు పెట్టింది మాత్రమే తింటూ ప్రాణం నిలుపుకోవడం ఆ భిక్షకుల క్రమశిక్షణ. పేదరికం, అమాయకత్వం, మూఢవిశ్వాసం, పిసినారితనం వంటి మానసిక బలహీనతలతో పాటు, దొంగతనం, జూదం, అసూయ, రాగద్వేషాల వంటి అవలక్షణాలను గుర్తించాడు. బుద్ధుని బోధనల సర్వస్వం వివరంగా చర్చించేందుకు ఇక్కడ వీలుపడదు గాబట్టి, కీలకమైన అంశాలకు మాత్రమే మనం పరిమితమౌదాం. అతని బోధనలు స్పష్టమైనవిగాను, అర్థం చేసుకునేందుకు తేలికైనవిగాను ఉండటమే కాక, అత్యాధునిక భావాలకు బహుదగ్గరగా ఉండటం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లోకంలోని బాధలన్నింటికీ మూలం స్వార్థచింతన; మానవుని అంతరంగానికి ‘దురాశ’ అనేది అంతులేని యాతనకు గురిచేస్తుందనేది బుద్ధుని తాత్వికచింతనకు పునాది. అందువల్ల, వదులుకోవలసినవాటిలో మొదటిది - ఇంద్రియాలను తృప్తిపరచాలనే కోరిక; రెండవది - కీర్తి, సంపదలను ఆర్జించాలనే ఆశ; మూడవది - చిరంజీవిగా ఉండాలనే తాపత్రయం. మనిషి ఆలోచనా ప్రపంచం నుండి ‘నేను’ (అహం) అనే సర్వనామం తొలగించుకుంటే, మహోన్నతమైన జ్ఞానానికి దారి ఏర్పడుతుంది. ‘నిర్వాణం’ అంటే ప్రాణాలను త్యజించడం కాదు, ‘అహం’ అనే భావాన్ని త్యజించడం. ఈ లక్ష్యాల సాధన కోసం తప్పనిసరిగా పాటించవలసిన క్రమశిక్షణగా ఎనిమిది నియమాలనూ గౌతమబుద్ధుడు నిర్దేశించాడు. వాటిల్లో మొదటిది మాటలో నిజాయితి; రెండవది నడవడికలో నిజాయితి; మూడవది బతుకు తెరువులో నిజాయితి; నాలుగవది వాంఛలో పరిశుద్ధత; ఐదవది సరైన దృక్పథం; ఆరవది ప్రయత్నంలో నిజాయితి; ఏడవది ఉద్రేకాల నిగ్రహం; ఎనిమిదవది ఆత్మపరిశీలనలో నిజాయితి. ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది కోరికలు చంపుకోవాలని కాదు బుద్ధుడు చెప్పింది; వాటిని సరైన మార్గానికి మరలించమని. కోరికలు చంపుకోగలిగినవి కావు; అవి చచ్చిపోతే మనిషికి బతుకు మీద ఆశే చచ్చిపోతుంది. పైగా, కోరికలను వదులుకోవడం ఆచరణ సాధ్యం కాని ప్రయత్నం. అందువల్ల, కోరికలను సరైన మార్గంలో నడిపేందుకు ప్రతిమనిషి సరైన దృక్పథం ఏర్పరుచుకోవాలి. ఉదాహరణకు సమాజానికి సేవ చేయడం, న్యాయం నిలబెట్టేందుకు పాటుపడటం. కళల పట్ల ఆసక్తి వంటివి పెంపొందించుకోవాలని ఉద్దేశం. ప్రయత్నంలో నిజాయితి అంటే - పనేమో మంచిదే, కానీ దాన్ని సాధించేందుకు అవలంబించిన మార్గం నీచమైనదై, ఫలితాన్ని బట్టి మార్గాన్ని సమర్థించుకోవడం తగదని ఉద్దేశం. ఉద్రేకాలనేవి జీవికి సహజ లక్షణం. వాటిని అదుపులో పెట్టుకోగలిగినప్పుడే పశుత్వం వదలిన మనిషౌతాడు. అందువల్ల, ఉద్రేకాలను నియంత్రించడమే కాదు, ఆ దశ నిరంతరం కొనసాగాలంటే మనం చేసుకునే ఆత్మపరిశీలనలో నిజాయితీ ఉంటేనే సాధ్యం అనేది వాటి సారాంశం ఈ బోధనలకు తోడు బుద్ధుడు పునర్జన్మల వంటి విశ్వాసాలను ఖండించాడు. బుద్ధుని ప్రచారాలు వైదికులకు వ్యతిరేకంగా ఉద్దేశించినవి కాకపోయినా, ఆ కోవకు చెందినవాళ్లకు అవి కంటగింపు కలిగించినా, ప్రజాబాహుళ్యాన్ని ఆ తత్వం ఆకర్షించింది. జీవితాంతం ఆదరాభిమానాలు చూరగొన్న తాత్వికునిగా తన 80వ ఏట గౌతమబుద్ధుడు ‘కుశినర (నేటి ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్)’లో జీవిత ప్రస్థానం ముగించాడు. సిద్దార్థునికి జ్ఞానోదయమైన బోధివృక్షం ఇప్పటి గయలో కనిపించేది కాకపోయినా, అసలు వృక్షం తాలూకు అంటు సింహళంలో బహు జాగ్రత్తగా పోషింపబడుతూ, ప్రపంచంలోని అతి ప్రాచీనమైన చారిత్రిక వృక్షంగా ఈనాటికీ మిగిలే ఉంది. బోధివృక్షాన్ని కాపాడుకున్నంత జాగ్రత్తగా బుద్ధుని బోధనలను కాపాడుకోవడంలో అతని శిష్యులు విఫలమైనారు. ‘అహం’ను త్యజించడం సమాజాన్ని త్యజించినంత తేలిక కాదు. సంసారాలను విడిచిపెట్టడం వరకే చేయగలిగారు కానీ, ‘అహం’ను వదిలించుకోలేదు. తరాలు గడిచిన తరువాతి బౌద్ధబిక్షువులు రాజుల అనుగ్రహంతో, శిల్పంతో తీర్చిదిద్దిన ఆరామాల్లో సుఖమైన జీవితాలకు అలవాటుపడ్డారు. సిద్దార్థునికి రెండు తరాల తరువాత గానీ భారతదేశంలో లిపి పుట్టిందిగాదు. అందువల్ల, అతని బోధనలను శిష్యులు ఎంతమేరకు అందుకోగలిగారో, ఎంతమేరకు తరువాతి తరాలకు అందించగలిగారో అంచనా వెయ్యడం సాధ్యమయ్యేదిగాదు. పోనుపోను సిద్ధాంతంలో మలినం పేరుకుపోయి, దిశానిర్దేశం లేనిదిగా తయారైంది. ఇటీవలి కాలంలో వెలుగుజూసిన అత్యంత పురాతనమైన పాళీగ్రంథాల మూలంగా మూలతత్వం కొంతమేరకైనా ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాం.