
‘సీఎం రమేశ్ ఒత్తిడి చేస్తున్నారు’
కడప: వైఎస్సార్ సీపీ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన మద్దతు వైఎస్ వివేకానందరెడ్డికేనని మాజీ ఎమ్మెల్యే ఎమ్వీ రమణారెడ్డి స్పష్టం చేశారు. చాలాసార్లు ఈ విషయం స్పష్టం చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలపాలని తనపై ఎంపీ సీఎం రమేశ్ ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు.
ఇక వాళ్ల ప్రయత్నాలు మానుకుంటే మంచిదని ఆయన సూచించారు. ఈ మేరకు ఎమ్వీ రమణారెడ్డి ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.