myanmar woman
-
మయన్మార్ యువతి.. వేములవాడ యువకుడు
వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు మయన్మార్ దేశానికి చెందిన యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. వేములవాడకు చెందిన శశిధర్‌రెడ్డి దుబాయిలో ఓ ప్రైవేట్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో మయన్మార్‌కు చెందిన కస్తూరి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. రెండు కుటుంబాల ఆమోదంతో శనివారం వేములవాడలోని శశిధర్‌రెడ్డి నివాసంలో జరిగిన వివాహ వేడుకలో వారిద్దరూ ఒక్కటయ్యారు. -
ఎయిర్‌పోర్ట్‌లో 120 సవర్ల బంగారం స్వాధీనం
బ్యాంకాక్ నుంచి అనుమతి లేకుండా తీసుకువచ్చిన 120 సవర్ల బంగారు నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒక మహిళ వద్ద విచారణ జరుపుతున్నారు. బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం తెల్లవారుజామున 1.30 గంటలకు చెన్నై చేరుకుంది. అందులోని ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. మియన్మార్‌కు చెందిన రెజినా మరియం (44) అనే మహిళ టూరిస్టు వద్ద తనిఖీ చేయగా ఆమె వద్ద 120 సవర్ల కొత్త బంగారు నగలున్నట్టు గుర్తించారు. వీటి విలువ రూ. 30 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళను విచారిస్తున్నారు.