The mysterious death of status
-
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
తండ్రిపైనే అనుమానం! కట్నమివ్వాల్సి వస్తుందనే ఘాతుకం! గొల్లపల్లి: కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం వెన్గుమట్లలో పాట్కూరి మౌనశ్రీ(23) అనుమానాస్పద స్థితిలో మరణించింది. గ్రామానికి చెందిన పాట్కూరి సత్యనారాయణరెడ్డి-ప్రేమలత దంపతులు 20 ఏళ్ల క్రితం విడిపోగా, వారికి కుమార్తె మౌనశ్రీ ఉంది. కాగా, తండ్రి సత్యనారాయణ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. పోషణకోసం ప్రేమలత కోర్టుకెక్కడంతో తల్లీకూతుళ్ల పోషణను సత్యనారాయణరెడ్డి చూడాలని, కూతురు వివాహం కూడా ఆయనే చేయాలని ఆదేశించింది. ప్రేమలత భర్తపై ఆధారపడకుండా కుమార్తెను చదివించింది. వెటర్నరీ డిప్లొమా పూర్తి చేసిన మౌనశ్రీ ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఆమె పెళ్లి బాధ్యత తనపై ఉండడంతో సత్యనారాయణరెడ్డి ప్రయత్నాలు మొదలెట్టాడు. వారం రోజుల క్రితం కరీంనగర్లో ఓ సంబంధం కుదిరింది. మాట్లాడేందుకు సత్యనారాయణరెడ్డి వెళ్లాడు. మంగళవారం మౌనశ్రీని వెన్గుమట్లకు రావాలని, వివాహం గురించి మాట్లాడదామని తన మిత్రుడితో సత్యనారాయణరెడ్డి ఫోన్ చేయించాడు. తండ్రి పిలుపుతో మౌనశ్రీ వెన్గుమట్లకు వచ్చింది. భోజనం చేసి ఇంట్లోనే నిద్రించింది. తెల్లారేసరికి చనిపోయి ఉంది. తన కుమార్తెను కన్నతండ్రి, అతడి రెండోభార్య, ఆమె సోదరుడు కలిసి పథకం ప్రకారమే హతమార్చారంటూ ప్రేమలత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, మౌనశ్రీ వివాహానికి రూ.25 లక్షలు కట్నంగా కుదరగా, ఆ మేరకు ఇస్తానని హామీ ఇచ్చి.. అంత కట్నం ఇచ్చి వివాహం జరిపించాల్సి వస్తుందనే కోపంతోనే తన భర్త, అతడి రెండో భార్య, ఆమె సోదరుడు కలిసి తన కూతురును చంపారని తల్లి ప్రేమలత ఆరోపిస్తోంది. -
నవవధువు అనుమానాస్పద మృతి
పంజగుట్టలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఘటన పంజగుట్ట: వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఓ నవవధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన అనూష (27) చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) పూర్తి చేసింది. 2014 జూలై నుంచి బంజారాహిల్స్‌లోని ధర్మల్ పవర్ టెక్నో ఇండియా లిమిటెట్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఫైనాన్షియర్‌గా పని చేస్తోంది. రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న సొనాలికా క్యాస్టేల్ అపార్ట్మెంట్లో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఈనెల 8వ తేదీని అనూషకు రాజమండ్రికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్జున్‌తో పెళ్లైంది. దుస్తులు తెచ్చుకొనేందుకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముషీరాబాద్‌లో ఉండే తన బంధువుల ఇంటికి వెళ్లిన అనూష రాత్రి 10.30కి హాస్టల్‌కు తిరిగి వచ్చింది. భోజనం చేయమని ఆయా అడగ్గా... చేసి వచ్చానని చెప్పి, పాలు తాగి బెడ్రూమ్లోకి వెళ్లింది. ఉదయం ఆమె బెడ్‌పై శవమై కనిపించింది. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. నోటి నుంచి తెల్లటి నురుగు కారడం బట్టి విషం తాగి ఆత్మహత్య చేసుకుందా? లేక ఫుడ్ఫైయిజిన్ అయిందా? గుండెపోటు వచ్చిందా.. అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ గదిలో ఒక్కత్తే ఉంది... అనూషతో పాటు హాస్టల్లో మొత్తం 8 మంది ఉంటున్నారు. అనూష ఉండే గదిలో హర్షిత అనే యువతి ఉంటోంది. ఆమె షిరిడీ వెళ్లడంతో అనూష ఒక్కత్తే ఆదివారం రాత్రి తన గదిలో పడుకుంది. సోమవారం ఉదయం నగరానికి తిరిగి చేరుకున్న హర్షిత సుమారు 7.20కి హాస్టల్లోని తమ గదికి వెళ్లగా అనుమానాస్పదస్థితిలో అనూష బెడ్‌పై పడి ఉంది. వెంటనే హాస్టల్ సిబ్బంది పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు 108 సిబ్బందిని ర ప్పించారు. అనూషను పరిశీలించిన 108 సిబ్బంది అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్థారించారు. పోలీసులు క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించి ఆధారాల కోసం శోధించారు. పోలీస్ జాగిలం మృతదేహం వద్ద నుంచి డోర్ పక్కనే ఉన్న లిఫ్ట్ వద్దకు వచ్చి... తిరిగి కామన్ బాల్కనీలోకి వెళ్లింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనూష తల్లిదండ్రులు నేరుగా గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. భర్త అర్జున్ కూడా బెంగళూరు నుంచి నగరానికి బయలుదేరినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మంగళవారం అనూష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు. -
ఆసిఫ్‌ది హత్యే
నిర్ధారించిన పోలీసులు తోటి బాలుడే నిందితుడు సిటీబ్యూరో: సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలుర గృహం (జువెనైల్ హోమ్)లో బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాలుడు ఆసిఫ్ (12)ది హత్యగా పోలీసుల విచారణలో తేలింది. తాను లైంగికదాడికి యత్నించిన విషయాన్ని జువైనల్ హోం అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆసిఫ్ బెదిరించడంతో గొంతు పిసికి చంపేశానని అదే హోమ్‌లో ఉంటున్న హరీష్ (16..పేరు మార్చబడింది) వెల్లడించాడు. వివరాలు... సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలుర గృహం (జువెనైల్ హోమ్)లో ఆసిఫ్ 2013 ఆగస్టు నుంచి ఉంటున్నాడు. కాగా, మంగళవారం రాత్రి హోంలోని మెడికల్ వార్డులో ఆసిఫ్, హరీష్‌లతో పాటు మరో ఏడుగురు పడుకున్నారు. అర్ధరాత్రి ఆసిఫ్‌ను హరీష్ నిద్రలేపి లైంగికదాడికి యత్నించాడు. ఆసిఫ్ ప్రతిఘటించడంతో పాటు విషయాన్ని హోం అధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. దీంతో తన బండారం బయట పడుతుందని భావించిన హరీష్.. నీళ్లు తాగుదామని ఆసిఫ్‌ను వంట గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ దాడి చేసి గొంతుపిసికి చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించాడు. వీలు కాలేక పోవడంతో శవాన్ని లాక్కొచ్చి అతని బెడ్‌పై పడేశాడు. బుధవారం ఉదయం ఆసిఫ్ నిద్రలేవకపోవడంతో సూపర్వైజర్లు శివశంకర్‌రెడ్డి, నరేందర్ అతడిని లేపేందుకు యత్నించారు. చలనం లేకపోవడంతో చనిపోయాడని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో హరీష్ తన నేరాన్ని అంగీకరించాడు. బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు గురువారం ఉదయం హోంను సందర్శించి అక్కడి పిల్లల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడు హరీష్‌ను శుక్రవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. ఆసిఫ్ మృతదేహానికి పోలీసులు ఉస్మానియాలో పోస్టుమార్టం చేయించి తండ్రికి అప్పగించారు. ఇద్దరు సూపర్వైజర్ల సస్పెన్షన్... హోమ్ సూపర్వైజర్లు శివశంకర్‌రెడ్డి, జి.నరేందర్‌లు విధులపై నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ దారుణం జరిగిందని విచారణలో తేలడంతో అధికారులు వారిద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేశారు.