mysterious diseases
-
Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి
జమ్ముకశ్మీర్‌ను అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది. రాజౌరి జిల్లాలో వ్యాపించిన ఈ రహస్య వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 15కుపెరిగింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం తాజాగా జమ్మూలోని ఒక ఆసుపత్రిలో తొమ్మిదేళ్ల బాలిక అంతుచిక్కని రుగ్మతతో మరణించింది. దీంతో రాజౌరి జిల్లాలోని మారుమూల గ్రామమైన బాధల్లో గడచిన ఒకటిన్నర నెలల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగింది.గత ఏడాది డిసెంబర్ 7 నుండి..ఈ అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న మరణాలకు గల కారణాలను పరిశోధించడానికి పోలీసులు ఒక సిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే బాధల్ గ్రామంలో మరణాలకు అంతుచిక్కని వ్యాధి కారణమనే వాదనను రాష్ట్ర ఆరోగ్య మంత్రి సకీనా మసూద్ ఖండించారు. కాగా జమ్మూలోని ఎస్ఎంజీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జబీనా అనే బాలిక బుధవారం సాయంత్రం మృతిచెందిందని అధికారులు తెలిపారు. గడచిన నాలుగు రోజుల్లో ఆమె నలుగురు తోబుట్టువులు, తాత కూడా మృతిచెందాడని వారు పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 7 నుండి కోట్రాంకా సబ్ డివిజన్లోని బాధల్ గ్రామంలోని మూడు కుటుంబాల్లో ఇటువంటి పరణాలు సంభవించాయని తెలుస్తోంది.ప్రయోగశాలలకు నమూనాలుతాజాగా ఆరోగ్య మంత్రి సకీనా మసూద్ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ఐదుగురు మరణించారని తెలియగానే ఆరోగ్య శాఖ ఇంటింటికీ వెళ్లి 3,500 మంది నుంచి నమూనాలను తీసుకుని, వివిధ ప్రయోగశాలలకు పరీక్ష కోసం పంపిందన్నారు. ఇదే సమయంలో ఈ వ్యాధితో మరో ముగ్గురు వ్యక్తులు మరణించడంతో దేశంలోని ప్రధాన ఆరోగ్య సంస్థల నుండి సహాయం కోరామన్నారు. దీంతో పలు వైద్య బృందాలు బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయన్నారు.11 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటుమరోవైపు ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, బుధల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) వజాహత్ హుస్సేన్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసినట్లు రాజౌరి ఎస్ఎస్పీ గౌరవ్ సికార్వర్ తెలిపారు. ఏదైనా వ్యాధి కారణంగా మరణాలు సంభవించినట్లయితే, అది వెంటనే వ్యాపించి ఉండేదని, అది ఆ మూడు బాధిత కుటుంబాలకే పరిమితమై ఉండేదికాదన్నారు. పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ), గ్వాలియర్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఆర్‌డీఈ) మైక్రోబయాలజీ విభాగం బాధితుల నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇది కూడా చదవండి: Delhi Elections-2025: బడా పార్టీలకు ఛోటా దళాల షాక్? -
Disease X: ఆ ప్రాణాంతక మహమ్మారి ఇదేనా?
అంతుచిక్కని వ్యాధి మధ్య ఆఫ్రికా దేశం కాంగోను వణికిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ఇప్పటిదాకా ఓ అంచనాకి రాలేకపోయింది. ఇప్పటిదాకా ఈ వ్యాధి బారినపడి 31 మంది చనిపోగా.. అందులో పిల్లలే ఎక్కువమంది ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఫ్లూ తరహాలో విజృంభిస్తూ.. శ్వాసకోశ సమస్యలతో మరణాలకు కారణమవుతోందని ఈ వ్యాధిపై వైద్య నిపుణులు ఓ అంచనాకు వచ్చారు.మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి ఈ అంతుచిక్కని వ్యాధి విషయం చేరింది. నవంబర్ 29వ తేదీన కాంగో ఆరోగ్య శాఖ.. డబ్ల్యూహెచ్‌వోకి ఈ వ్యాధి గురించి నివేదిక ఇచ్చింది. ఇప్పటికే దర్యాప్తు నడుస్తోంది. దర్యాప్తులో ఆఫ్రికా సీడీసీ(వ్యాధుల నియంత్రణ &నిర్మూలన) కూడా భాగమైంది. అయితే ఇన్నిరోజులు గడిచినా వ్యాప్తికి గల కారణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో ఈ వ్యాధిని డిసీజ్ (Disease X)గా పరిగణిస్తున్నారు.ఏమిటీ డిసీజ్ ఎక్స్కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరో మహమ్మారి విజృంభణ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత కొంతకాలంగా అంచనా వేస్తోంది. శరవేగంగా వ్యాపిస్తూ మనుషులకు ప్రాణాంతకంగా(హైరిస్క్ రేటు) మారవచ్చని అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలోనే ఆ ముందస్తు మహమ్మారికి ‘డిసీజ్ ఎక్స్’గా నామకరణం చేసింది. ఆపై దానిని ఎబోలా, జికా వైరస్ సరసన జాబితాలో చేర్చింది.అయితే.. డిసీజ్ ఎక్స్‌కు ఏ వైరస్ కారణం కావొచ్చనే దానిపై డబ్ల్యూహెచ్‌వో ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, కోవిడ్ తరహాలోనే శ్వాసకోశ సంబంధమైనదే అయ్యి ఉండొచ్చని మాత్రం నిపుణులు అంచనా వేస్తున్నారు.సంబంధిత వార్త: డిసీజ్ ఎక్స్ ప్రభావం కరోనా కంటే ఎన్ని రేట్లంటే..ఆలోపు వ్యాక్సిన్ సిద్ధం!డిసీజ్ ఎక్స్‌పై ఓవైపు ఆందోళనలు నెలకొంటున్న వేళ.. మరోవైపు వ్యాక్సిన్‌ను తయారు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ కోవిడ్-19 వ్యాక్సిన్‌లోనే మార్పులు చేస్తోందని తెలుస్తోంది. అలాగే.. భవిష్యత్తులో రాబోయే మహమ్మారి కోసం మరిన్ని వ్యాక్సిన్లను సిద్ధం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.కాంగోలో విజృంభిస్తోంది ఏంటి?మారుమూల కువాంగో(Kwango) నుంచి అంతుచిక్కని వ్యాధి విజృంభణ మొదలైందని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటిదాకా 406 కేసులు నమోదుకాగా.. 31 మంది చనిపోయారు. మృతుల్లో పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అయితే పాతికేళ్లలోపు వాళ్లలోనే లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాంగో కొత్త వ్యాధి లక్షణాలుజ్వరంతలనొప్పిదగ్గు,జలుబుఒళ్లు నొప్పులుఅయితే.. కాంగోలో అంతుచిక్కని వ్యాధి రికార్డుల్లోని తీవ్రస్థాయిలో కేసులను పరిశీలించిన డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం.. పౌష్టికాహార లోపాన్ని గుర్తించినట్లు చెబుతోంది. చనిపోతున్నవాళ్లలో శ్వాసకోశ ఇబ్బందులు, రక్తహీనత సమస్యలను గుర్తించినట్లు వెల్లడించింది. అలాగే వ్యాధి వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో ఆహార కొరత, తక్కువ వ్యాక్సినేషన్ నమోదు, పరీక్షలకు.. వైద్యానికి సరైన వసతులు లేకపోవడం కూడా గుర్తించినట్లు ఓ నివేదిక ఇచ్చింది. అయితే కాంగోలో విజృంభిస్తోందని డిసీజ్ ఎక్స్ యేనా? దాని తీవ్రత ఏంటి? వ్యాప్తి రేటు తదితర అంశాలపై ల్యాబోరేటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ఆ తర్వాతనే(అదీ దశలవారీగా) ఈ వ్యాధి విజృంభణకు గల కారణాలపై కచ్చితమైన నిర్దారణకు రాగలమని ఆ బృందం స్పష్టత ఇచ్చింది. -
అంతుచిక్కని వ్యాధిపై లోతైన పరిశోధన
సాక్షి, అమరావతి: ‘2020 డిసెంబర్లో జరిగిన ఏలూరు ఘటనపై విభన్న కోణాల్లో పరిశోధన జరిగింది. వివిధ జాతీయ సంస్థలు మూర్ఛకు కారణాలను అన్వేషించి, నివేదికలిచ్చాయి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మూర్ఛ లక్షణాలతో సొమ్మసిల్లి పడిపోవడం అనేది బాక్టీరియా లేదా వైరస్వల్ల కాదని తేలింది. నీటి నమూనాలను పరీక్షించగా, క్రిమిసంహారక మందుల అవశేషాలు కలిశాయని స్పష్టమైంది. ఇందులో ఆర్గానో ఫాస్ఫరస్ పెస్టిసైడ్ మూలాలున్నాయని జాతీయ పోషకాహార సంస్థ చెప్పింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లాంటి సంస్థ ఆర్గానో ఫాస్ఫరస్ వల్ల మూర్ఛ రావచ్చని.. కానీ, తాము సేకరించిన నమూనాల్లో దాని మూలాల్లేవని చెప్పింది. అందుకే అన్ని సంస్థల అభిప్రాయాలను క్రోడీకరించాక ఆర్నెల్లపాటు లోతైన పరిశోధన చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం మూడు జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం’.. అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరు ఘటనపై మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏలూరులో 600 మందికి పైగా అంతుచిక్కని వ్యాధితో బాధితులు నమోదైతే ఒక్క ప్రాణనష్టం కూడా లేకుండా చేశామన్నారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తదితరులు కూడా పాల్గొన్నారు. నేటి నుంచి రెండో విడత కోవిడ్ వ్యాక్సిన్ రాష్ట్రంలో రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇటీవల వ్యాక్సిన్ తీసుకున్నాక చనిపోయిన ఆశా వర్కర్ కుటుంబానికి మంగళవారం రూ.50 లక్షలు అందించామన్నారు. ఒంగోలు ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డా.ధనలక్ష్మికి మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నె అపోలో ఆసుపత్రికి తరలించామని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. -
అంతుచిక్కని వ్యాధితో 56 గొర్రె పిల్లల..
శ్రీకూర్మం (గార ) : తమను ఆర్థికంగా నిలబెడతాయనుకున్న గొర్రెలు ఒకేసారి మతి చెందడంతో పెంపకందారులు లబోదిబోమంటున్నారు. శ్రీకూర్మం పంచాయతీ కోళ్లపేట గ్రామం కోండ్రు పైడయ్య, కోండ్రు అప్పలరాజు, బాకి అప్పలరాజు, బాకి లక్ష్మణలకు చెందిన గొర్రెలను దువ్వుపేట సమీపంలోని సముద్రపు దిబ్బలపై ఉంచారు. మంగళవారం రాత్రి గూడుల్లో ఉన్న 56 గొర్రె పిల్లలు ఒకేసారి మత్యువాత పడ్డాయి. దీంతో సుమారు రూ. 3లక్షలకు పైగా నష్టం జరిగిందని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేశారు. గార పశువైద్యాధికారి కె.నారాయణమూర్తి పోస్టుమార్టం నిర్వహించి శాంపిల్స్‌ను లేబొరేటరీకి పంపించారు. రైతులు చలి పిడుగు పడి మతి చెందాయని భావిస్తుండగా వైద్యులు మాత్రం యాష్‌పిక్సియా అనే వ్యాధితో చనిపోయి ఉండవచ్చని, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సర్పంచ్ బరాటం రామశేషు ఆర్థికంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.