Myth
-
మొబైల్ ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్ రాదు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందున్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా ఉంది. అయితే, ఇది అపోహ మాత్రమేనని, ఎంతమాత్రం నిజం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్‌కు, బ్రెయిన్ క్యాన్సర్‌కు మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నాయి. ఈ అంశంపై జరిగిన 5 వేలకుపైగా అధ్యయనాలను ఆ్రస్టేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్, న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ(అర్పాన్సా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిశితంగా సమీక్షించింది. ఇందులో 63 అధ్యయనాల వివరాలు 1994 నుంచి 2022 వరకు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వైర్లెస్ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగింది. కానీ, బ్రెయిన్ క్యాన్సర్ కేసులు మాత్రం పెరగలేదని పరిశోధకులు గుర్తించారు. అధ్యయనాల్లో తేలిన ఫలితాల ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇది తగిన సాక్ష్యాధారాల ఆధారంగా జరిగిన చాలా సమగ్రమైన విశ్లేషణ అని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచనతో జరిగిన ఈ విశ్లేషణ వివరాలను ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ పత్రికలో ప్రచురించారు. ఫోన్ వాడకంతో తలకు, మెడకు సైతం క్యాన్సర్ సోకుతున్నట్లు ఆధారాలు లేవని వెల్లడించారు. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్‌ను పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందని చెప్పలేమని స్పష్టంచేశారు. సాధారణంగా ఫోన్ల నుంచి రేడియో తరంగాలు వెలువడుతాయన్న సంగతి తెలిసిందే. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటాం కాబట్టి బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందన్న ప్రచారం దశాబ్దాల క్రితమే మొదలైంది. దీనిపై ప్రజల్లో రకరకాల భయాందోళనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఫోన్ల నుంచి వెలువడే రేడియో తరంగాల వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందంటూ కొన్ని అధ్యయనాలు సైతం చెప్పాయి. 2011లో డబ్ల్యూహెచ్ఓ అనుబంధ విభాగమైన ఇంటర్నేషన్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(ఐఏఆర్సీ) సైతం ఇదే విషయం వెల్లడించింది. అయితే, ఈ సంస్థ చాలా పరిమితమైన సమాచారంపై ఆధారపడి ఈ నిర్ధారణకు వచ్చిందని, సమగ్రమై అధ్యయనం చేయలేదని అంతర్జాతీయ పరిశోధకులు తాజాగా తేలి్చచెప్పారు. ఫోన్లతో క్యాన్సర్లు వస్తాయన్న ఆపోహ వీడాలని సూచించారు. -
రక్తదానం చేయడం మంచిదేనా? ఏడాదికి ఎన్నిసార్లు చెయ్యొచ్చు..
చంద్రమండలంలో అడుగుపెట్టే మేధా శక్తి ఉన్న మనిషి సృష్టించలేనిది.. అరచేతిలోనే ప్రపంచాన్ని అందిపుచ్చుకునే సాంకేతికత ఉన్నా కూడా తయారు చేయలేని పదార్థం. ఎన్ని కొంగొత్త ఆవిష్కరణలు చేసినా.. కృత్రిమంగా తయారు చేయడానికి వీలుపడనిది...'రక్తం'. నిరంతరం వ్యాధులతో పోరాడే వారికి..రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులకు అత్యవసరమైనది.. 'రక్తమే'. ఈ నేపథ్యంలోనే రక్తదానాన్ని ప్రోత్సహించడం కీలకమన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్ 14న నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రక్తదానంపై ఉన్న అపోహలు, సురక్షితమైన రక్తానికి ఉన్న డిమాండ్ గురించి సవివరంగా తెలుసుకుందాం.ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. జూన్ 14నే ఎందుకంటే.. నోబెల్ గ్రహిత శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టైనర్ పుట్టినరోజున జరుపుకుంటున్నాం. ఆయన ఏబీఓ బ్లడ్ గ్రూప్ కనుగొన్నందువల్లే రక్తమార్పిడి గురించి ప్రపంచానికి తెలిసింది. అందువల్లే కార్ల్ ల్యాండ్‌స్టైనర్ గౌరవార్థం ఇలా ఆయన జయంతి రోజున రక్తదాతల దినోత్సవం పేరుతో రక్త దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.ఈ రోజున మనమిచ్చే రక్తంతో ఎన్ని ప్రాణాలు నిలబడతాయో శిబిరాలు నిర్వహించి మరీ తెలియజేస్తారు అధికారులు. అయితే చాలామందిలో రక్తదానం విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. మనం గనుక ఇప్పుడు దానం చేస్తే ఏమైనా.. అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. ఒక్కసారి రక్తదానం చేశాక మళ్లీ తొందరగా కోలుకుంటామా అనే భయం కూడా ఉంటుంది చాలమందిలో. అయితే వైద్యులు అవన్నీ అపోహలే అని కొట్టిపారేస్తున్నారు. పైగా రక్తదానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు..రక్తదానం చేసిన 48 గంటల్లోనే ఒక వ్యక్తి రక్త పరిమాణం సాధారణ స్థితికి వస్తుందని చెబుతున్నారు వైద్యులు. వృద్ధులు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా రక్తదానం చేయవచ్చని చెబుతున్నారుమందులు వాడుతున్నావారు కూడా రక్తదానం చెయ్యొచని చెబుతున్నారు. రక్తదానం కేంద్రంలో వారే వాడే మందులు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా నిర్ణయిస్తారు. కొన్ని సమయాల్లో కొన్ని రోజుల పాటు ఆయా మందులను నిరోధించమని చెప్పి..తర్వాత దాత నుంచి రక్తాన్ని తీసుకుంటారని వైద్యులు చెబుతున్నారు.అలాగే రక్తదానం చేసే ప్రక్రియ సాధారణంగా 15 నిమిషాలకు మించి సమయం పట్టదు. జీవితాలను నిలబట్టే మహత్తర కార్యం ఇది అని చెబుతున్నారు. రక్తదానం చేస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడతాం అనుకుంటారు. ఇది కూడా అపోహ అని తేల్చి చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే రక్తదాన కేంద్రాలు అంటువ్యాధులను నివారించడానికి కఠినమైన భద్రతా ప్రోటాకాల్లను పాటిస్తాయి. పైగా దానం చేసిన రక్తాన్ని ఉపయోగించే ముందు అంటువ్యాధుల కోసం క్షణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఇది నొప్పి లేకుండా దాతనుంచి సునాయాసంగా చిన్న పాటి సుదితో రక్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. దానం చేసే వ్యక్తి, వయసు, ఆరోగ్య చరిత్ర ఆధారంగా ఏడాదికి చాలాసార్లు రక్తదానం చెయ్యొచ్చని చెబుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి 2 నెలలు లేదా 56 రోజులకు ఒకసారి రక్తదానం చేయొచ్చు సురక్షితమైన రక్తానికి ఉన్న డిమాండ్..భారతదేశంలోని ఆస్పత్రుల్లో దాదాపు 14.6 మిలియన్ల యూనిట్ల రక్తం డిమాండ్ ఉన్నట్లు అంచనా వేశాయి. అయితే ఈ డిమాండ్ తగ్గట్టు కేవలం 96% మాత్రమే రక్తం అందుబాటులో ఉందని, దాదాపు ఒక మిలియన్ యూనిట్ వరకు చాలా సెంటర్లలో కొరత ఉందని పేర్కొంది నివేదిక. అందువల్లే స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకు వచ్చేలా ప్రజల్లో చైత్యం తీసుకువచ్చేలా అవగాహన కార్యక్రమాలు వంటివి ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రక్తం కోసం డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. 2017లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 మిలియన్ల యూనిట్ల రక్తం కొరతను ఉందని, ఏకంగా 119 దేశాల్లో బ్లడ్ సెంటర్లలో రక్తం అందుబాటుల్లో లేదని వెల్లడించాయి నివేదికలు.దీన్ని పరిష్కరించేందుకు స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలి. రక్త నిర్వహణ పద్ధతులను మెరుగుపరచాలి, రక్తమార్పిడి వ్యవస్థలను బలోపేతం చేయాలి. రక్త మార్పిడి ఎలాంటప్పుడంటే..ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు తక్షణమే రక్తం అవసరం. సురక్షితమైన రక్తం అందుబాటుల్లో ఉండే ప్రాణాలను రక్షించగలుగుతాం. వైద్య విధానాలు: శస్త్ర చికిత్సలు, కేన్సర్ చికిత్సలు, అవయవ మార్పిడి, ప్రసవం తదితర వాటికి రక్తమార్పిడి అవసరం అవుతుంది. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హిమోఫిలియా వంటి పరిస్థితుల్లో బాధపడుఉన్న రోగులకు వారి ఆరోగ్యాన్ని నిర్వహించడానికి క్రమం తప్పకుండా రక్తమార్పిడి అవసరం. రక్తహీనత: ఐరన్ లోపం లేదా ఇతర కారణాల వచ్చే రక్తహీనత, ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్ స్థాయిలను పునరుద్ధరించడానికి రక్తమార్పిడి అవసరంబ్లడ్ డిజార్డర్స్: లుకేమియా, లింఫోమా, రక్త సంబంధిత రుగ్మతల చికిత్స కోసం రక్తమార్పిడి కీలకం. ప్రసూతి మరణలను నివారించడానికి, గర్భధారణ, ప్రసవ సమయంలో సురక్షితమై రక్త మార్పిడి చాలా కీలకం.తదితర వాటిలో సురక్షితమైన రక్తం అవసరమవుతుంది. అందువల్ల ఈ దినోత్సవం రోజున ప్రజలు స్వచ్ఛందంగా రక్తం దానం చేసేందుకు ముందుకు వచ్చేలా చేస్తే సురక్షితమైన రక్తం కొరతను నివారించగలుగుతాం. ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతాం. అంతేగాదు రక్తం ఇవ్వడం అంటే ప్రాణం ఇచ్చినట్లే అని అందరూ గ్రహించాలి. ఈ మహాత్తర నిస్వార్థ కార్యక్రమంలో మనమందరం పాలుపంచుకుని ఈ సమస్యను నివారిద్దాం.(చదవండి: రక్తం కాదు.. ప్రాణం ఇచ్చినట్టే!) -
వందల ఏళ్ల మూఢనమ్మకాన్ని చెరిపేసిన సీఎం
మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా తన స్వగ్రామమైన ఉజ్జయిని సందర్శించారు. నగరవాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే ఇక్కడే ఒక విచిత్రం చోటుచేసుకుంది. సాధారణంగా నేతలెవరూ రాత్రి వేళ ఉజ్జయినిలో బస చేయరు. దీనివెనుక వందల ఏళ్లుగా అనేక మూఢనమ్మకాలు స్థానికులలో నాటుకుపోయాయి. అయితే వీటన్నింటినీ కాదని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో రాత్రి గడిపారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో రాత్రిపూట ఉండటం ద్వారా వందల సంవత్సరాల నాటి మూఢనమ్మకాన్ని బద్దలు కొట్టారు. ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లోని ఒక ధార్మిక నగరం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరం ఇక్కడే ఉంది. మహాకాళేశ్వరుడు ఉజ్జయినికి రాజు అని స్థానికులు నమ్ముతారు. మహాకాళేశ్వరుడు తప్ప మరే నాయకుడు లేదా మంత్రి ఇక్కడ రాత్రివేళ ఇక్కడ ఉండకూడదని చెబుతారు. ఈ నమ్మకాన్ని కాదని ఎవరైనా ప్రవర్తిసే వారికి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందని స్థానికులు అంటారు. నేటికీ ఉజ్జయినిలో ఏ నాయకుడు గానీ, మంత్రిగానీ బస చేయకపోవడానికి ఇదే ప్రధాన కారణం. కాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో రాత్రి బస చేయడం గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అతను ఈ నగర నివాసి అని, పైగా మహాకాళీశ్వరుని భక్తుడైనందున అతను ఇక్కడ సాధారణ వ్యక్తిగా పరిగణలోకి వస్తారని స్థానిక పండితులు అంటున్నారు. ఈ నియమం నగరవాసులకు వర్తించదని, అందుకే ముఖ్యమంత్రి యాదవ్ తన స్వస్థలమైన ఉజ్జయినిలో ఎటువంటి సంకోచం లేకుండా రాత్రి బస చేయవచ్చని వారంటున్నారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ఉజ్జయినికి రాజు మహాకాళీశ్వరుడు మాత్రమేనని, తాను అతని సేవకుడినని, తాను ఇక్కడ రాజుగా కాకుండా మహాకాళీశ్వరుని భక్తునిగా కొనసాగుతానన్నారు. ఇది కూడా చదవండి: సోలార్ కంపెనీలో భారీ పేలుడు.. తొమ్మిదిమంది మృతి! -
Taj Mahal: వట్టి మాటకు గట్టి ప్రచారం!
తాజ్‌మహల్ నిర్మాణం వెనుక గొప్ప కళాచాతుర్యం ఉన్నట్లే కొన్ని పేలవమైన కల్పనలూ ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అపురూపమైన నిర్మాణం జరగకుండా తాజ్‌మహల్‌ను నిర్మించిన వారి చేతులను షాజహాన్ నరికించాడన్నది మనం వింటూ వస్తున్న ఒక కల్పన. గత డిసెంబరులో ప్రధాని మోదీ వారణాసిలో కాశీ విశ్వనాథ ధామ్‌ను ప్రారంభించిన సందర్భంగా పారిశుధ్య కార్మికులపై పూలజల్లు కురిపించినప్పుడు... ‘నాటి రాజు షాజహాన్ కార్మికుల చేతులను నరికిస్తే.. నేటి రాజు నరేంద్ర మోదీ కార్మికులపై పూలవర్షం కురిపించారు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. అలా ఒక అవాస్తవానికి మళ్లీ పిలకలు బయల్దేరాయి. తాజ్‌మహల్ నిర్మాణం ఎలా సాగిందనేది చేతిరాతతో అరబిక్ లిపిలో పొందుపరిచి ఉన్న సమాచారం ఆధారంగా అర్థమౌతుందని యునెస్కో పేర్కొంది. తాజ్ గోపుర సమాధి, లోపలి వెలుపలి భాగాలను నిర్మించడానికి తాపీ పనివాళ్లను, రాళ్లు చెక్కేవారిని, మణులను పొదిగేవారిని, చిత్రకారులను, శిల్పకళా నిపుణులను ఆ కాలంలోనే షాజహన్ తన మొత్తం సామ్రాజ్యం నుండి, ఇంకా.. మధ్య ఆసియా, ఇరాన్ నుండి రప్పించారు. తాజ్ మహల్ ఇండో–ఇస్లామిక్ నిర్మాణ శైలికి గొప్ప తార్కాణమని యునెస్కో కీర్తించింది. తాజ్ నిర్మాణ కార్మికులకు, కళాకారులకు ఇచ్చిన జీతభత్యాలు, నెలసరి వేతనాలలో షాజహాన్ గొప్ప ఉదారతను ప్రదర్శించినట్లు కూడా నాటి జమాఖర్చుల పుస్తకాలను బట్టి తెలుస్తోంది. ఉదా: రాళ్లను చెక్కే అటా ముహమ్మద్ అనే నిపుణుడికి నెలకు రూ.500 చెల్లించారు. ఉజ్బెకిస్థాన్‌లోని బుఖారా నుంచి వచ్చిన షాకీర్ ముహమ్మద్ అనే కట్టుబడి మేస్త్రి నెలకు రూ.400 అందుకున్నాడు. ముల్తాన్‌కు చెందిన తాపీ కార్మికుడు ముహమ్మద్ సజ్జాద్ నెలకు రూ. 590, లాహోర్ నుంచి వచ్చిన ముఖద్వార నిర్మాణ కార్మికుడు చిరంజీలాల్కు నెలకు రూ.800 ఇచ్చారు. వాళ్లకు ఇచ్చిన ఈ భారీ మొత్తాలను బట్టి వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కో నిర్దిష్టమైన పనికి బాధ్యత వహించేవాళ్లనుకోవచ్చు. చెప్పి చేయించేవాళ్ల చేతులను కానీ, చెప్పింది చేసేవాళ్ల చేతులను కానీ షాజహాన్ నరికించారు అనడంలో ఆధారాల మాట అటుంచి, అసలు అర్థమే లేదు. (చదవండి: రాజ్యాంగ పీఠిక ఓ ప్రకటన!) మేస్త్రీలు కాకుండా.. వాస్తుశిల్పులు, చేతిరాత నిపుణులు, నిర్వాహకులు కూడా నిర్మాణంలో పాల్పంచుకున్నారు. వాళ్ల గురించిన వివరాలూ రికార్డులలో ఉన్నాయి. ఇరాన్‌లోని షిరాజ్ ప్రాంతం నుంచి తన పెద్ద సోదరుడు అఫ్జల్‌ఖాన్‌తో కలిసి మొఘల్ ఆస్థానానికి వచ్చిన కాలిగ్రాఫర్ అమానత్ ఖాన్ ప్రత్యేక గౌరవ మర్యాదల్ని పొందారు. తాజ్ కుడ్యాలపై ఖురాన్ శాసనాలను అందంగా లిఖించే మహద్భాగ్యం అతడికి లభించింది. ముంతాజ్ సమాధిపై అతడు చెక్కిన అక్షర నగిషీలకు షాజహాన్ ముగ్ధుడై అతడికి ‘మాన్సాబ్’ అనే బిరుదును ప్రదానం చేశారు. భూమిపై హక్కులు సంక్రమింపజేసే అధికారిగా అది ప్రభువులిచ్చే బిరుదు. అమానత్ ఖాన్ తాజ్‌మహల్‌పై ఆరేళ్లు పనిచేశారు. సమాధి నగీషీ రాత 1638లో పూర్తయింది. ఆ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పనిలో ఉన్నప్పుడే అతడి వ్యక్తిగత జీవితాన్ని విషాదం స్పృశించింది. లాహోర్‌లో ఉంటున్న అతడి సోదరుడు అఫ్జల్ ఖాన్ మరణించాడు. అమానత్ ఖాన్ తను సంపాదించినదంతా వెచ్చించి అఫ్జల్‌కు స్మారక చిహ్నం నిర్మించుకున్నారు. సోదరుడి మరణం తర్వాత కూడా అమానత్ తిరిగి ఇరాన్ వెళ్లలేదనీ, తాజ్‌మహల్ ప్రధాన వాస్తుశిల్పి, తన ఆప్తమిత్రుడు అయిన ఉస్తాద్ఖాన్ అభ్యర్థన మేరకు ఇక్కడే ఉండిపోయారనీ డబ్లు్య.ఇ. బెగ్లే అనే చరిత్రకారుడు రాశారు. (క్లిక్: పుష్కరం కిందే యుద్ధ బీజాలు) మొఘల్ చరిత్రలో అనేకమంది రూపకర్తలు, వాస్తుశిల్పులు ఎంతో ప్రాముఖ్యం పొందారు. వారిలో కొందరు తాజ్‌మహల్ నిర్మాణానికి పని చేశారు. ఇస్మాయిల్ అఫాండి టర్కీలోని ఒట్టోమన్ల కోసం గోపురాలను రూపొందించిన ఘనత కలవారు. ఖాజిమ్ఖాన్ లాహోర్‌కు చెందిన ఒక స్వర్ణకారుడు. తాజ్ సమాధి గోపురానికి కాంతులీనే తాపడం చేసినవారు. తాజ్‌మహల్ నిర్మాణంలో హస్తకళాకారులు, కార్మికులతో పాటు.. మేధాపరంగా వాస్తుశిల్పులు, సృజనశీలురు అందరూ కూడా షాజహాన్ అభిరుచికి, దార్శనికతకు తగ్గట్టుగా పని చేసి ఆయన నుంచి సత్కారాలు, బహుమానాలు పొందారే తప్ప చేతులు పోగొట్టుకోలేదు. ఎలాగో పుట్టి, ఎలాగో కొట్టుకు వస్తున్న వదంతి మాత్రమే అది. వదంతిని పునరావృతం చేయడం అంటే అజ్ఞానాన్నీ, చరిత్రపై అవగాహన లేమినీ ప్రదర్శించుకోవడమే. – ఎం.సలీమ్ బేగ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (జేకే) ముఖ్యాధికారి -
ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు కాదు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సౌకర్యం ప్రాథమిక హక్కు అనే అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలిపింది. ఇంటర్నెట్ హక్కుతోపాటు దేశ భద్రతా చాలా ముఖ్యమైన విషయమేనని గుర్తించాలంది. కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, న్యాయశాఖల మంత్రి రవిశంకర్ గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. ‘ఇంటర్నెట్ ద్వారా భావాలు, అభిప్రాయాలను తెలుసుకోవడం భావవ్యక్తీకరణ హక్కులో ఒక భాగం. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. కశ్మీర్లో హింస, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు పాక్ ఇంటర్నెట్ను దుర్వినియోగం చేస్తోందంటూ ఆయన.. ఇంటర్నెట్తోపాటు దేశ భద్రత ముఖ్యమైందేనని అందరూ గుర్తించాలన్నారు. దీనిపై రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ నేత గులామ్ నబీ ఆజాద్ అనుబంధ ప్రశ్నకు సమాధానంగా మంత్రి..‘కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన మీరు ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ దుర్వినియోగం అవుతోందని మీకూ తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్పై విధించిన ఆంక్షలను సమీక్షించి సడలించేందుకు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కమిటీలు పనిచేస్తున్నాయని వివరించారు. కశ్మీర్లో, లడాఖ్‌ల్లో ప్రభుత్వం, బ్యాంకింగ్, పర్యాటకం, ఈ కామర్స్, రవాణా, విద్య తదితర రంగాలకు సంబంధించిన 783 వెబ్సైట్లపై ఎటువంటి నియంత్రణలు లేవన్నారు. ‘నెట్’దుర్వినియోగానికి ఆయా సంస్థలదే బాధ్యత ఇతరుల గౌరవమర్యాదలకు భంగం కలిగించేలా అశ్లీల వీడియాలు, చిత్రాలను ఉంచడం, పుకార్లు వ్యాపింప జేయడం, హింసను ప్రేరేపించడం వంటి వాటికి యూట్యూబ్, గూగుల్, వాట్సాప్ తదితర సామాజిక వేదికలను వాడుకోవడం ఆందోళన కలిగిస్తోందని రవిశంకర్ అన్నారు. ఇందుకు గాను ఆయా సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వాట్సాప్‌కు సంబంధించి.. అందులోని సమాచారం మూలాలను తెలుసుకోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. యూట్యూట్‌లో ఇతరులపై కక్ష తీర్చుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ఉంచే అశ్లీల చిత్రాలు, వీడియోలకు సంబంధించి ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. -
అర్థం అంతరార్థం
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం గృహే దీపం నమోస్తుతే ‘‘ గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మలలో చేసిన పాపాలు భగవంతుని కరుణాకటాక్షాలతో దూరం అవ్వడమే దీపావళి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస ప్రారంభంలో దేవీ నవరాత్రులు, నరక చతుర్దశి, దీపావళి పండుగలు రావడం విశేషం. త్రయోదశి రోజు రాత్రి అపమృత్యు నివారణ కోసం దీపాలు వెలిగించి ఇంటిముందు ఉంచాలి. నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం చేయాలి. నరకం వలన భయం లేకుండా నరక చతుర్దశి నాడు స్నానం చెయ్యాలని నరక చతుర్దశి గురించి యమధర్మరాజుని ఉద్దేశించి చెప్పినట్లు భవిష్య పురాణం చెబుతోంది. దీపావళి అంటే దీపముల వరుస. చీకటి నుంచి వెలుగులోకి రావడం అనేది అంతరార్థం. శ్రీరాముడు ఆశ్వయుజ మాసంలో విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. మహావిష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించాడు. అయినప్పటికీ బలి శ్రీహరినే ధ్యానించాడు. దానికి సంతోషించిన శ్రీహరి ‘నీవు దీపావళి రోజున పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ ఒక్కరోజు పరిపాలన చెయ్యి’ అన్నాడు. ఆ రోజు వెలిగించే దీపాలకే బలిదీపం అని పేరు. వరాహావతారంలో విష్ణుమూర్తికి, భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. బ్రహ్మ వల్ల వరాలు పొంది దేవతల్ని బాధపెట్టాడు. దేవతలందరూ దేవేంద్రుని వద్దకు వెళ్లి తమ బాధ చెప్పుకోగా దేవేంద్రుడు దేవతలందరితో కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ప్రార్థించగా శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకుడిని వధించారు. భూదేవి కూడా నరకుడి మరణానికి బాధపడలేదు. ఆమె అతనొక్కడికే తల్లి కాదు, భూమి మీద జీవించే ప్రతివారికి తల్లే కదా. పుత్ర శోకాన్ని మరచి నరకుని పేరు మీద పండుగగా ప్రజలు జరుపుకోవాలని శ్రీమహావిష్ణువుని ప్రార్థించింది. అదే నరక చతుర్దశి. ఆ తర్వాత రోజే ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి పండుగ. – డా. గొర్తి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి -
గర్భిణీ స్త్రీలు పండ్లు తింటే ప్రమాదమా?
గర్భిణీ స్త్రీలు తినాల్సిన పండ్ల గురించి తెలియజేయగలరు. ఏ పండ్లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి? కొన్ని రకాల పండ్లు తినడం వల్ల కడుపులో బిడ్డకు ప్రమాదమని నా ఫ్రెండ్ చెప్పింది. ఇది నిజమేనా? – బి. సుజాత, విజయనగరం. ప్రెగ్నెన్సీ సమయం లో అన్ని రకాల పండ్లు తినవచ్చు. ఇందులో ముఖ్యంగా ఆపిల్, దానిమ్మ, నారింజ, ద్రాక్ష, పుచ్చకాయ, కివి వంటివి అందరూ తీసుకోవచ్చు. అధిక బరువు ఉండేవాళ్లు, ఫ్యామిలీలో షుగర్ వ్యాధి ఉంటే కొంచెం తియ్యగా ఉండే అరటిపండు, సపోటా, మామిడి పండ్లు వంటివి తక్కువగా, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడం మంచిది. వీరిలో ఇవి రోజువారిగా తీసుకోవడం వల్ల కొందరిలో బరువు ఎక్కువగా పెరగడం, ప్రెగ్నెన్సీలో షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కొందరు ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి పండు తినకూడదు, దాని వల్ల అబార్షన్ అవుతుంది అని అనుకుంటారు. ఇది అపోహ మటుకే! బాగా పండిన బొప్పాయి పండులో విటమిన్ సీ, ఈ, ఫోలిక్ యాసిడ్, పీచు వంటివి ఉంటాయి. దీనివల్ల మలబద్ధకం లేకుండా ఉంటుంది. కొంతమంది పైనాపిల్ తినకూడదనే అపోహలో ఉంటారు. పైనాపిల్‌లో ఐరన్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్ సీ, బీ, మెగ్నీషియమ్, మ్యాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది మరీ ఎక్కువగా కాకుండా మామూలుగా తీసుకోవచ్చు. పండ్లలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి ప్రెగ్నెన్సీలో అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు. పండ్లను బాగా కడిగిన తర్వాత తాజాగా తీసుకోవాలి. ముక్కలు కోసిన వెంటనే తినాలి. నాకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. ఫిట్స్ వ్యాధి ఉన్నవాళ్లు గర్భం దాల్చడం ప్రమాదమని ఒకరిద్దరు అన్నారు. ఒకరేమో గర్భం దాల్చిన తరువాత ఫిట్స్ తగ్గుతాయని అంటున్నారు. ఏది నిజం? నేను బిడ్డను కనవచ్చా? – డి.శ్రీదేవి, రంగంపేట. ఫిట్స్ వ్యాధి ఉన్నవాళ్లు గర్భం దాల్చిన తర్వాత, మామూలు వాళ్ల కంటే కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత కొంతమందిలో ఫిట్స్ మళ్లీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో రాకపోవచ్చు. అది ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, హార్మోన్స్‌ని బట్టి మానసిక, శారీరక ఒత్తిడి, ఫిట్స్‌కు వాడే మందులు, వాటి మోతాదు, అవి శరీరంలో ఇమిడే దాన్ని బట్టి ఉంటుంది. ఫిట్స్‌కు వాడే మందుల వల్ల 4–6 శాతం వరకు పుట్టబోయే పిల్లల్లో అవయవ లోపాలు ఉండే అవకాశాలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా వెన్నుపూస, గుండె, గ్రహణం మొర్రి, చెయ్యి, కాళ్ల వేళ్లకు సంబంధించిన లోపాలు ఎక్కువగా ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత, వికారం, వాంతులు వంటి ఇబ్బందుల వల్ల ఫిట్స్ మందులు శరీరంలోకి ఇమడకుండా బయటకు వచ్చెయ్యడం వల్ల కూడా ఫిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గర్భం దాల్చిన తర్వాత తరచుగా ఫిట్స్ రావడం వల్ల, బిడ్డకు ఆ కొద్దిసేపు ఆక్సీజన్ సరఫరా లేకపోవడం, బిడ్డ మెదడుపై ప్రభావం చూపడం, బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపాలు, బరువు ఎక్కువగా పెరిగిపోవడం, నెలలు నిండకుండానే కాన్పు అవ్వడం, బీపీ పెరగడం, మాయ విడిపోవడం, కాన్పు సమయంలో, తర్వాత రక్తస్రావం అధికంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నువ్వు గర్భం దాల్చక ముందే ఫిజీషియన్ డాక్టర్‌ను సంప్రదించి వారి పర్యవేక్షణలో బిడ్డలో దుష్ప్రభావాలు అతి తక్కువగా కలిగించే ఫిట్స్ మందులను సరైన మోతాదులో వాడుకుంటూ, గర్భం కోసం ప్రయత్నించడం మంచిది. అలాగే ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున వాడుకోవాలి. గర్భం దాల్చిన తర్వాత, క్రమం తప్పకుండా చెకప్‌లు చెయ్యించుకుంటూ, మందులు సరిగా వాడుకోవాలి. మూడవ నెలలో ఎన్టీ స్కాన్, ఐదవ నెలలో ఒఫా స్కాన్, ఫీటల్ ఎకో స్కాన్ వంటివి చెయ్యించుకోవడం వల్ల బిడ్డలో అవయవలోపాలు ఏమైనా ఉంటే ముందుగా తెలుసుకోవచ్చు. ఈ సమయంలో మానసిక ఒత్తిడి లేకుండా డాక్టర్ సలహాలు పాటిస్తూ ఉంటే 90 శాతంపైనే పండంటి బిడ్డకు జన్మనివ్వచ్చు. నేను ప్రెగ్నెంట్. పుట్టబోయే బిడ్డపై గ్రహణాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని విన్నాను. మొన్నటి చంద్రగ్రహణం ప్రభావం వల్ల కడుపులో బిడ్డకు చెడు జరిగే అవకాశం ఉందా? నేను ఉపవాసాలు చేస్తాను. ఈ సమయంలో చేయడం వల్ల ఏదైనా నష్టం జరుగుతుందా? – పి.విశాలక్షి, సంగారెడ్డి. గ్రహణాల వల్ల బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుంది అనేదానికి ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు. అది కేవలం అపోహ మటుకే! చంద్రగ్రహణంలో సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వచ్చి, చంద్రుడిని మూసేస్తుంది. సూర్య గ్రహణంలో భూమికి , సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చి సూర్యుడిని కప్పేస్తుంది. దానివల్ల బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదు. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్లు చెప్పే మాటలకు అడ్డు చెప్పకుండా, ఆరోజు బయటకు వెళ్లకుండా, ఇంట్లో అందరితో కాలక్షేపం చెయ్యవచ్చు. అలా అని కదలకుండా బోర్లా పడుకునే ఉండాలి, ఏమీ తినకూడదు, తాగకూడదు, అనే నియమాలు ఏమీ లేవు. రోజంతా ఏమీ తినకుండా, తాగకుండా ఉపవాసం చెయ్యడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గిపోయి, బీపీ తగ్గిపోయి బిడ్డకి, తల్లికి బాగా ఇబ్బంది కలుగుతుంది. ఆరోజు నేరుగా కళ్లతో ఆకాశంలోకి చూడకుండా, బయట తిరగకుండా ఉంటే సరిపోతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం ఒకేసారిగా కాకుండా, కొద్దికొద్దిగా 3–4 గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉండాలి. అలాంటిది రోజంతా ఉపవాసం ఉండి ఎప్పుడో రాత్రికి తినడం బిడ్డకి, తల్లికి మంచిది కాదు. తల్లిలో అసిడిటీ, అజీర్ణంతో పాటు షుగర్ లెవెల్స్, బీపీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే బిడ్డకు కూడా సమయానికి పోషకాలు వెళ్లకపోవడం వల్ల బిడ్డకు కూడా ఇబ్బంది ఎదురవుతుంది. ఉపవాసాలు ఉండటం వల్ల దేవుడు కరుణించడు. మంచి మనసుతో, ఇతరుల మనసు నొప్పించకుండా ఉంటే మంచి కలుగుతుంది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
బంధించేదీ... విముక్తి కలిగించేదీ..!
ఒకసారి ఇద్దరు స్నేహితులు రోడ్డుమీద వెళుతున్నారు. దారిలో ఒకచోట భాగవత పురాణ కాలక్షేపం జరుగుతోంది. వాళ్లలో ఒకడు ‘‘ఒరేయ్! పురాణం విందాం రారా’’ అని లోపలకి వెళ్లి కూర్చున్నాడు. రెండవవాడు మాత్రం లోపలికి తొంగి చూసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. వాడు నేరుగా ఒక జూదగృహం వద్దకెళ్లాడు. కాని అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాడు. ఆ పరిసరాలు, వాళ్ల ప్రవర్తన అతనికి ఎబ్బెట్టుగా తోచాయి.‘ఛీ! ఎంత సిగ్గుచేటు, నా స్నేహితుడు పవిత్రమైన పురాణాన్ని వింటూ, సత్కాలక్షేపం చేస్తుంటే, నేనేమో ఇక్కడికొచ్చి చేరాను’ అని పశ్చాత్తాప పడ్డాడు. ఇక రెండవ వాడేమో, పురాణం వింటున్నాడు కానీ, కాసేపటికి మనసులో ఏదో పురుగు తొలిచింది. అతని దృష్టి కాస్తా పురాణం మీదినుంచి స్నేహితుడిమీద, అతను వెళ్లిన ప్రదేశం మీదా మళ్లింది. ‘నేనెంతో బుద్ధిహీనుణ్ణి. ఎప్పుడో జరిగిపోయిన పాత కథలను వింటూ ఇక్కడ కూర్చుండిపోయాను. వాడు ఏ వ్యభిచార గృహంలోనో, జూదగృహంలోనో హాయిగా కాలక్షేపం చేస్తున్నట్టున్నాడు’ అని వాపోయాడు. కాలం తీరి వాళ్లిద్దరూ మరణించారు.యమభటులు వచ్చి భాగవతం విన్నవాడి జీవాన్ని నరకానికి ఈడ్చుకుంటూ పోతే, జూదగృహానికి వెళ్లిన వాడి జీవాన్ని విష్ణుభటులు సగౌరవంగా స్వర్గానికి తీసుకెళ్లారు. భగవంతుడు మనిషిలో చూసేది అతనిలోని పవిత్రమైన భావాలను, నిర్మలమైన భక్తిని మాత్రమే. మనల్ని బంధించేదీ, విముక్తి కలిగించేదీ కూడా మనస్సే. మనసును అదుపులో పెట్టుకోగలిగితే చాలు... అంతా సౌఖ్యమే, ఆనందమే. -
మోదీ నమూనా ఒక అపోహ
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ అభివృద్ధి నమూనాను ప్రజలు ఒక అపోహగా తిరస్కరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యకర్తలు సమర్థంగా పనిచేశారని, బీజేపీని ఘెరావ్ చేసినంత పనిచేశారని, తమ ప్రశ్నలకు బీజేపీ బదులివ్వలేకపోయిందని అన్నారు. తదుపరి ఎన్నికలు జరిగే 2022లో 135 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం రాష్ట్ర నాయకులతో సమావేశమై గుజరాత్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. తాజా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మనం ఈ ఎన్నికల్లో ఓడినా గెలిచినట్లే. ఎందుకంటే బీజేపీ డబ్బు, పారిశ్రామికవేత్తలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రచారంతో గెలిస్తే మనం సత్యంతో పోటీచేశాం’ అని రాహుల్ అన్నారు. అంతకుముందు, సోమ్‌నాథ్ ఆలయంలో పూజలు చేశారు. -
మంచి నిద్ర కోసం చేయాల్సినవి...
ఈఎన్టీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్ సమస్య ఉంది. ఇటీవల నాకు గురక వస్తోంది. ఇది నా సైనస్ సమస్యల వల్లనే అని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. మన ముఖంలోని ఖాళీ ప్రదేశాల్లో ఉండే సైనస్ గదులలో ఎక్కువ ప్రతిధ్వనులు జరగడం వల్లనే గురక సౌండ్ కూడా పెరుగుతోందని అంటున్నారు. ఇది వాస్తవమేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. - ఆర్. సుభాష్, మంచిర్యాల మీరు చెప్పిన అంశాలను బట్టి మీకు దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు, మీ ఫ్రెండ్స్ అనుకుంటున్నట్లుగానే సైనస్ ఇన్ఫెక్షన్ పట్ల మనలో చాలా అపోహలు ఉన్నాయి. వాటి గురించి ఉన్న కొన్ని అపోహలూ, వాస్తవాల గురించి ఒక సంక్షిప్త పట్టిక ఇది... అపోహ : సైనసైటిస్‌తో పాటు తలనొప్పి తప్పక వస్తుంటుంది. వాస్తవం : నిజానికి చాలా తక్కువ సందర్భాల్లోనే సైనసైటిస్‌తో పాటు తలనొప్పి వస్తుంటుంది. అయితే చాలామంది సైనసైటిస్ ఉన్నవారికి మైగ్రేన్ తలనొప్పి తప్పక వస్తుందనుకుంటారు. నిజానికి మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి ఈ రెండూ వేరు. సైనస్ సమస్య ఉన్నవారికి తప్పక మైగ్రేన్ వస్తుందనేది ఒక తప్పుడు అభిప్రాయమే. సైనస్ లేకపోయినా మైగ్రేన్ లేదా టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పులు కనిపించవచ్చు. అపోహ : సైనస్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాస్తవం : నిజానికి సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి కలిగే జలుబు వంటి కండిషన్ వల్ల ఈ అపోహ ఏర్పడి ఉండవచ్చు. కానీ సైనస్ ఇన్ఫెక్షన్ ఎంతమాత్రమూ సాంక్రమిక వ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అయితే సాధారణ జలుబు (కామన్ కోల్డ్) వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. అపోహ : సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతివారూ తప్పక యాంటీబయాటిక్స్ వాడాలి. వాస్తవం: సైనస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ బ్యాక్టీరియా వల్ల కాకపోవచ్చు. కేవలం సైనస్లలో బ్యాక్టీరియా చేరినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ ఉపకరిస్తాయి. ఒకవేళ సైనస్లలో వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, వాటికి యాంటీబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి సైనస్ ఇన్ఫెక్షన్ ఏ రకానికి చెందినది అన్న అంశాన్ని బట్టే మందులూ వాడాల్సి ఉంటుంది. వైద్యపరమైన అంశాలలో మీరు మీ ఫ్రెండ్స్ మాటలను విశ్వసించకండి. నిపుణులను కలిసి, మీది నిర్దిష్టంగా ఏ సమస్య అన్నది కనుగొని, దానికి తగినట్లుగా మందులు తీసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ శ్రీనివాస్ కిశోర్ ఎస్., సీనియర్ ఈఎన్టీ వైద్య నిపుణులు, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ స్లీప్ కౌన్సెలింగ్ నాకు రాత్రివేళ బాగా నిద్రపట్టడం లేదు. మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్ర పడుతోంది. అంత నిద్ర సరిపోవడం లేదని నాకు అనిపిస్తోంది. నిజానికి ఏ వయసు వాళ్లకు ఎంత నిద్ర కావాల్సి ఉంటుంది? రాత్రిపూట బాగా నిద్రపట్టాలంటే ఏం చేయాలి? సలహా ఇవ్వండి. - మహేశ్, విశాఖపట్నం ఫలానా వయసు వారు ఇంతే నిద్రపోవాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం అనే అంశంపై నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకటించిన వివరాలివి... అప్పుడే పుట్టిన పిల్లలు (0-3 నెలలు) ... 14- 17 గంటలు పసిపిల్లలు (4-11 నెలల పిల్లలు) ... 12 - 15 గంటలు నిలబడే పిల్లలు (1- 2 ఏళ్లు) ...11 - 14 గంటలు ప్రీస్కూల్ పిల్లలు (3-5 ఏళ్లు) ... 10 - 13 గంటలు స్కూల్‌కు వెళ్లే పిల్లలు (6-13 ఏళ్లు) ... 9 - 11 గంటలు కౌమార బాలలు (14 - 17 ఏళ్లు) ... 8 - 10 గంటలు యుక్తవయసు వారు (18-25 ఏళ్లు) ... 7- 9 గంటలు పెద్దవారు (26 - 64 ఏళ్లు) ... 7 - 9 గంటలు 65 ఏళ్లు పైబడ్డవారు ... 7 - 8 గంటలు నిద్ర పోయే వ్యవధి పైన చెప్పిన దానికంటే కాస్త ఎక్కువ తక్కువ అయినా పరవాలేదు. అంతకు మించి మరీ ఎక్కువ నిద్రపోతున్నా లేదా మరీ తక్కువ నిద్రపోతున్నా, వారిలో ఏదైనా సమస్య ఉందా అన్న అంశాన్ని డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, రాత్రి మిగతావారి కంటే కాస్త నిద్ర తగ్గినా మర్నాడు పగటి వేళంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీరు దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే మంచి నిద్ర కోసం ఈ కింది సూచనలు పాటిస్తే ప్రయోజనం ఉంటుంది. అవి... పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి. బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి సాయుంత్రం తర్వాత కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ తీసుకోకండి ప్రతీ రోజూ ఒకే వేళకి నిద్రపొండి పగలు చిన్నకునుకు (పవర్ న్యాప్) చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు. రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది. నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం, టీవీ చూడడం వంటివి చేయువద్దు. నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకుఎనిమిదేళ్లు. వాడికి నోట్లో పొక్కులు వస్తున్నాయి. పరిష్కారం చెప్పండి. - సుమ, ఖమ్మం మీ బాబుకు ఉన్న కండిషన్‌ను యాఫ్తస్ అల్సర్స్ లేదా యాఫ్తస్ స్టొమటైటిస్ అని అంటారు. ఈ పొక్కులు ముఖ్యంగా నోట్లో, పెదవులు, గొంతుపై భాగం (అప్పర్ థ్రోట్) లో ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇవి రావడానికి ఫలానా అంశమే కారణమని నిర్దిష్టంగా చెప్పడానికి ఉండదు. కాని నిమ్మజాతి (సిట్రస్) ఫ్రూట్స్, పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు, బాగా కారంగా ఎక్కువ మసాలాలతో ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఇవి రావచ్చు. కొందరిలో ఇవి విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ లోపాలతోనూ రావచ్చు. ఎక్కువ సాంద్రత ఉన్న టూత్‌పేస్టులు వాడేవారిలో, ఎక్కువ మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇవి కనిపిస్తాయి. కొందరిలో ఇవి బాగా అలసిపోయిన సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మరికొందరిలో జబ్బుపడ్డప్పుడు కనిపిస్తాయి. కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల, జీర్ణకోశవ్యాధులు ఉన్న సందర్భాల్లోనూ ఇవి కనిపించవచ్చు. ఇవి రాకుండా నివారించడానికి కొన్ని చర్యలు... నోటికి బాధ కలిగించే పదార్థాలు తీసుకోకపోవడం బాగా పుల్లగా ఉండే పదార్థాలు అవాయిడ్ చేయడం. నోరు ఒరుసుకుపోయే ఆహారపదార్థాలు (అబ్రేసివ్ ఫుడ్స్) తీసకోకపోవడం. నోటి పరిశుభ్రత పాటించడం వంటివి చేయాలి. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు లోకల్ అనస్థిటిక్ జెల్స్‌తో పాటు కార్టికోస్టెరాయిడ్స్, సిల్వర్ నైట్రేట్ వాడటంతో పాటు కొన్ని సందర్భాల్లో ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. సమస్య పదేపదే వస్తున్నట్లయితే నాన్ ఆల్కహాలిక్ మౌత్‌వాష్, తక్కువ (లో) కాన్సన్ట్రేటెడ్ మౌత్ వాష్ వంటివి ఉపయోగిస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఇక మీ బాబు విషయానికి వస్తే నోటి పరిశుభ్రత పాటించడంతో పాటు విటమిన్ బి12, జింక్ సప్లిమెంట్స్ ఇవ్వండి. లోకల్ అనస్థిటిక్ జెల్స్ కూడా వాడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మీ పిల్లల వైద్యనిపుణుడిని కలిసి చికిత్స తీసుకోండి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్ విజయనగర్ కాలనీ హైదరాబాద్ -
ప్రపంచానికి తెలియని మరో తాజ్..
సాక్షి: ఆగ్రాలో ఉన్న అందమైన తాజ్‌మహల్ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి. ఈ అద్భుత కట్టడం గురించి అందరికీ తెలిసిందే. అయితే మన దేశంలో చాలా మందికి తెలియని మరో తాజ్‌మహల్ కూడా ఉంది. అదే భోపాల్ తాజ్‌మహల్. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజప్రాసాదంగా పేరుగాంచిన ఈ చారిత్రక కట్టడం విశేషాలు మీ కోసం! ఎవరు నిర్మించారు? భోపాల్ రాజ్యాన్ని పాలించిన 11వ పరిపాలకురాలు నవాబ్ షాజహాన్ బేగమ్ ఎన్నో అందమైన కట్టడాలను నిర్మించారు. 1868 నుంచి 1901 వరకు ఆమె భోపాల్‌ను పరిపాలించారు. ఈ సమయంలో నిర్మించిన కట్టడాల్లో తాజ్‌మహల్ కూడా ఒకటి. ఇది భోపాల్‌లోని అతిపెద్ద మసీదు తాజ్ ఉల్ మజీద్ పక్కన ఉంది. ఎందుకు నిర్మించారు? షాజహాన్ తన ప్రియురాలి కోసం ఆగ్రాలో తాజ్‌మహల్‌ను కట్టించాడు. కానీ భోపాల్ తాజ్‌మహల్ బేగమ్ నివాసంగా రూపుదిద్దుకుంది. ఆ కాలంలో దీన్ని నిర్మాణానికి రూ.70 లక్షలు ఖర్చు చేశారు. 1871 నుంచి 1884 వరకు 13 ఏళ్లపాటు ఈ నిర్మాణం కొనసాగింది. ఆ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజప్రాసాదంగా దీన్ని నిర్మించడం విశేషం. మొదట దీన్ని 'రాజ్‌మహల్' అని పిలిచేవారు. తర్వాత భోపాల్‌లో నివసించిన బ్రిటిష్ పాలకులకు దీని నిర్మాణ పనితనం నచ్చి దీన్ని కూడా తాజ్‌మహల్‌గా పిలవడం మొదలు పెట్టారు. చారిత్రక వారసత్వ సంపదగా.. 1947లో స్వాతంత్య్రం వచ్చి పాకిస్తాన్ నుంచి దేశం విడిపోయిన తర్వాత నవాబ్ హమీదుల్లా ఖాన్ సింధీ కాందిశీకులను ఈ ప్యాలెస్‌లో నివసించేందుకు ఏర్పాట్లు చేశారు. వారు నాలుగేళ్లపాటు ఇందులో నివసించారు. ఆ సమయంలో ఈ రాజప్రాసాదం కొంత మేర దెబ్బతింది. 2008లో ఈ రాజ్మహల్లోని పలు భవనాలు కూలిపోయాయి. 2005లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని రాష్ట్ర చారిత్రక వారసత్వ సంపదగా ప్రకటించింది. పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా.. దీనిపై పరిశోధనలు చేసిన హుస్సేన్ అనే చరిత్రకారుడు ‘ది రాయల్ జర్నీ ఆఫ్ భోపాల్’ అనే పుస్తకాన్ని రాశారు. అందులో భోపాల్‌లోనే అతిపెద్ద ప్యాలెస్‌గా దీన్ని అభివర్ణించారు.ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఏటా దేశవిదేశాలకు చెందిన వేలాది మంది ఈ అద్భుత కట్టడాన్ని సందర్శిస్తున్నారు. ప్రత్యేకతలు.. భోపాల్ తాజ్‌మహల్‌ను చాలా మంది శిల్పులు వారి శిల్పకళాపనితనంతో అందంగా తీర్చిదిద్దారు. బ్రిటిష్, ఫ్రెంచ్, మొఘల్, అరబిక్, హిందూ వాస్తు నిర్మాణ పద్ధతుల్లో దీన్ని నిర్మించారు. ఇందులో 120 గదులున్నాయి. వీటిలో శీష్ మహల్ (అద్దాల ప్యాలెస్), అతిపెద్దదైన సావన్ బడో పెవిలియన్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధాన ద్వారం వద్ద నిర్మించిన ఏడు అంతస్తుల భవనం చూడదగింది. -
ఆహారంపై 10 అపోహలు... వాస్తవాలు
మనం రోజూ తినే ఆహారం గురించి మనకు తెలిసిన విషయాలు తక్కువ. పైగా అందులోనే బోలెడన్ని అపోహలూ, తప్పుడు అభిప్రాయాలు. మనం రోజూ తినే ఆహారంపై ఉన్న అపోహలు తొలగించుకొని, వాస్తవాలు తెలుసుకుందాం. అపోహ: బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుంది. వాస్తవం: బాగా పక్వానికి వచ్చిన బొప్పాయి పండును తినడం గర్భవతులకు మేలు చేస్తుంది. కానీ పూర్తిగా పండని, లేదా బాగా పచ్చిగా ఉన్న బొప్పాయిలో ‘పపాయిన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ గర్భసంచిని ముడుచుకుపోయేలా ప్రేరేపించి కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీసేలా చేయవచ్చు. అందుకే గర్భవతులు పచ్చికాయ తినకూడదు. అపోహ: గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ తప్పదా? వాస్తవం: పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉండే మాట వాస్తవమే. ఒక గుడ్డులో 211 మి.గ్రా. ఉంటుంది. కొలెస్ట్రాల్ మోతాదులు ఎంతగానో మించితేనే అప్పుడవి రక్తప్రవాహానికి అడ్డుపడతాయి. అంతేగానీ ఒక గుడ్డులో ఉన్న పచ్చసొనకు రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పరిచేంత కొవ్వు ఉండదంటున్నారు పెన్స్ స్టేట్ యూనివర్సిటీ నిపుణులు. అపోహ: నిమ్మజాతి పండ్లు అయిన నిమ్మ, నారింజ, బత్తాయితో పాటు జామ పండు తింటే జలుబు చేస్తుంది. వాస్తవం: నిమ్మజాతి పండ్లలో విటమిన్-సి పాళ్లు ఎక్కువ. జలుబు చేయడం అన్నది వైరస్ వల్ల జరిగే పరిణామం. దీన్ని మన వ్యాధి నిరోధకశక్తి ఎదుర్కొని అదుపు చేస్తుంది. అలా ‘విటమిన్-సి’ని సమకూర్చి ఇమ్యూనిటీ పెంచే గుణం నిమ్మజాతిపండ్లతో పాటు జామకూ ఉంది. అపోహ: గర్భవతులు పాలు తాగడం వల్ల బిడ్డ తెల్లగా పుడతాడు. కాఫీ లేదా టీ తాగితే బిడ్డ మేనిచాయ ఒకింత తగ్గవచ్చు. వాస్తవం: ఇది పూర్తిగా తప్పు. బిడ్డ రంగును కేవలం జన్యు వులు నిర్ణయిస్తాయి. గర్భవతులు పాలు తాగడం వారి ఆరోగ్యానికి మేలు చేసే విషయం కాబట్టి పాలు తాగడం మంచిదే. కాఫీ, టీ తీసుకున్నా బిడ్డ రంగు మారడు. అపోహ: కాకరకాయ తింటే డయాబెటిస్ తగ్గుతుంది. వాస్తవం: కాకరలోని పోషకాలైన కరాటిన్, మమోర్డిసిన్ అనే పదార్థాలకు రక్తంలోని చక్కెరపాళ్లను తగ్గించే సామర్థ్యం ఉంది. వాటి గింజలలో పాలీపెప్టైడ్-పీ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్థం ఉంటుంది. అయితే కేవలం కాకర తినడం వల్ల చక్కెర అదుపులో ఉండదు. డయాబెటిస్ రోగులు చక్కెరను నియంత్రించే మందులు వాడాల్సిందే. అపోహ: పాలకూర, టమాట కలిపి తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. వాస్తవం: కిడ్నీల్లో ఏర్పడే రాళ్లలో అనేక రకాలు ఉంటాయి. వాళ్లు చాక్లెట్లు వంటివీ తినకూడదు. జన్యుకారణాల వల్ల ఇలా కొన్ని పదార్థాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నవారు మినహా, మిగతా వాళ్లంతా మంచి ఆరోగ్యం కోసం పాలకూర, టమాట నిర్భయంగా, నిశ్చింతగా తినవచ్చు. అపోహ: బ్రేక్‌ఫాస్ట్‌గా టిఫిన్ కంటే పండ్లు తినడమే మేలు. వాస్తవం: రాత్రి భోజనం పూర్తయ్యాక సుదీర్ఘమైన వ్యవధి తర్వాత మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తింటాం. ఇంత వ్యవధి తర్వాత తినే ఆహారం కేవలం పండ్లూ, ఫలాలకు బదులుగా బలవర్థకమైన ఆహారం అయితే మంచిది. పైగా ఉదయం తినే ఆహారం కొంత ఘనంగా ఉండటం వల్ల రోజంతా చేసే పనులకు తగిన శక్తి వస్తుంది. అపోహ: రాత్రివేళ పెరుగు తినడం వల్ల ఉదయం విరేచనం సుఖంగా జరగదు. వాస్తవం: నిజానికి పెరుగు అనేది కడుపులోకి వెళ్లకముందునుంచే జీర్ణమవుతుండే ఆహారం. ఈ కారణం వల్ల పెరుగు ప్రీ-డెజెస్టైడ్ ఆహారం కాబట్టి రాత్రి తిన్నతర్వాత మరింత తేలిగ్గా జీర్ణమవుతూ ఉంటుంది. కాబట్టి పెరుగు తినడం వల్ల ఉదయం మలబద్దకం రాదు. అపోహ: గర్భవతులు ఎక్కువగా ద్రాక్ష తినడం మంచిది. వాస్తవం: గర్భవతులు ద్రాక్షపండ్లను తినడం అంత మంచిది కాదు. ద్రాక్ష కాస్త ఆమ్లగుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ‘హార్ట్ బర్న్’ ఎక్కువగా కనిపిస్తుంది. ద్రాక్షలో రెస్వెరట్రాల్ అనే పోషకాలు గర్భవతుల్లో హార్మోన్ల అసమతౌల్యతకు దారితీసి వారికి హాని చేయవచ్చు. అందుకే ద్రాక్ష తక్కువగా తినడం మేలు. అపోహ: ఏదైనా శస్త్రచికిత్స తర్వాత శనగపప్పు తింటే చీము పడుతుంది. వాస్తవం: శనగపప్పుకూ, చీము పట్టడానికీ ఎలాంటి సం బంధం లేదు. చీము పట్టడం గాయాలను మాన్పేందుకు తెల్లరక్తకణాలు, హానికారక బ్యాక్టీరియాతో పోరాడటం వల్ల జరిగేదే తప్ప... శనగపప్పు వల్ల కాదు. పప్పులు తినడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. -
విజయానికి రామాయణం
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... పందిళ్లు... పెళ్లి వేడుకలతో ఊరూ, వాడా కళకళలాడే రోజు శ్రీరామనవమి. ఎంతో సందడిగా ఉండే ఈ రోజు దేవుడి కల్యాణంగా మాత్రమే ఎందుకు మిగిలిపోవాలి?! మనిషిగా పుట్టి మనిషిగా ఎదిగి.. సకల జనులకు ఆదర్శప్రాయుడైన రాముడి గాథను రేపటి తరానికి పరిచయం చేస్తే! అయితే ఎందుకు ఆలశ్యం.. జీవితంలోని సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఈ వయసు వారికి ఈ రోజే తెలియజేయండి. రాముడు సకల గుణాభిరాముడుగా మనందరికీ తెలుసు. గౌరవం, ప్రేమ, దయ, ధైర్యం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం.. ఇలా ఎన్నో విశేషాలు ఆయనను కోటాను కోట్ల మందిలో ఉన్నతంగా నిలిపింది. యుగాలు గడిచినా నాటి కథనం ఇంకా ఇంకా అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటుంది. విధి నిర్వహణే ప్రధానం... బాల్యంలో తండ్రి దశరథమహారాజు, తల్లి కౌసల్య, పిన తల్లులైన సుమిత్ర, కైకల చెంత రాజసౌధంలో రాముడు ఎంతో గారాబంగా పెరిగాడు. ఏది కోరినా క్షణాల్లో అతని చెంత తెచ్చిపెట్టేందుకు బోలెడంత పరివారం చుట్టూతా ఉంది. అలాంటి చోట నుంచి ఓ రోజు గురువు విశ్వామిత్రుని ఆదేశం ప్రకారం అరణ్యాలకు పయనం కావల్సి వచ్చింది. అదీ పన్నెండేళ్ల వయసులో. అరణ్యంలో రాక్షసులను ఎదుర్కొని, రుషులు చేసే యజ్ఞానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యతను రాముడి మీద పెట్టారు గురువు. అంత చిన్నవయసులో అంత పెద్ద పని... అయినా రాముడు భయపడలేదు. తనకు గురువు అప్పజెప్పిన పనిని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరో ఆలోచనకు తావివ్వకుండా ఏకచిత్తంతో కార్యసాధనకు పూనుకున్నాడు. తన విధికి ఆటంకం కలిగించే రాక్షసులను సంహరించి, యజ్ఞం సవ్యంగా జరిగేలా చూశాడు. గురువు తనకు చెప్పిన బాధ్యతను కాద నకుండా నిర్వర్తించాడు. అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. భయం అనేది దరిచేరకుండా చూసుకుంటే చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ఈ సందర్భం మనకు తెలియపరుస్తుంది. అంతేనా, గురువు మాటలకు ఎదురుచెప్పకుండా అరణ్యంలో ఉంటూ కఠిన విద్యను అభ్యసించారు రాముడు, ఆయన తమ్ముడు లక్ష్మణుడు. శ్రమ, నేర్చుకోవాలనే తపన మనిషిని ఎంత మెరుగు పరుస్తుందో వారి బాల్యాన్ని ఉదాహరణగా తీసుకొని చెబితే పిల్లలు ఆసక్తిగా వింటారు. సమస్యను అర్థం చేసుకునే నేర్పు... రాముడికి పెళ్లైంది. వనవాసంలో అతని భార్య అయిన సీతను ఎవరో దుండగుడు ఎత్తుకెళ్లిపోయాడు. చాలా పెద్ద సమస్య!! ఎవరిని అడగాలి? పెద్ద అడవిలో... ఆమె ఎక్కడ ఉందో తెలియదు. ఎలాంటి స్థితిలో ఉందో తెలియదు. మనకో సమస్య వచ్చినప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అప్పుడు ఎవరిని సాయం అడగాలో తెలియదు. ఎదుటపడినవారి నుంచి ఎలాంటి సాయం పొందాలో తెలియదు. సీతను వెతుకుతూ వెళ్లే దారిలో రామునికి ఎంతో మంది కలిశారు. ముఖ్యంగా వానరసైన్యం గల సుగ్రీవుడు. అతనికీ ఓ సమస్య ఉంది. సుగ్రీవుడి సోదరుడు వాలి దౌర్జన్యంగా అతని రాజ్యాన్ని లాక్కున్నాడు. విషయం తెలుసుకున్న రాముడు సుగ్రీవుడికి సాయంగా నిలిచాడు. వాలితో యుద్ధం చేసి, రాజ్యం సుగ్రీవుడికి తిరిగి దక్కేలా చేశాడు. ‘మనమే సమస్యలో ఉన్నాం, అలాంటప్పుడు ఇంకొకరికి ఎలా సాయం చేస్తాం..?!’ అనేది మనలో చాలా మందికి కలిగే ఆలోచన. అలాంటప్పుడు ఇంకొకరి సమస్య మనకు పట్టదు. కానీ, ఎవరు సాయం చే యగలరని రాముడిక్కడ డీలా పడలేదు. ఎలా ఈ సమస్యను పరిష్కరించాలా అని ఆలోచించాడు. సుగ్రీవుడికి స్నేహితుడయ్యాడు. అతని కష్టాన్ని తీర్చి, అతని రాజ్యాన్ని అతనికి ఇప్పించాడు. సుగ్రీవుని వానర సాయంతోనే సముద్రంపై వంతెన కట్టించాడు. లంకను చేరుకొని, రావణాసురుడితో యుద్ధం చేసి తన భార్యను తిరిగి తెచ్చుకున్నాడు. అంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడటానికి ఎలాంటి వారి సాయం పొందాలో, కష్టంలో ఎదుటివారికి ఎలా సాయ పడాలో ఈ సందర్భం మనకు తెలియజేస్తుందన్నమాట. సమస్యల పర్వతం... రామరావణాసుర యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు అతన్ని మేల్కొల్పడానికి హనుమంతుడికి ఒక పనిని అప్పజెప్పాడు రాముడు. సంజీవనీ అనే మొక్కను తీసుకురమ్మని. అది కూడా చాలా త్వరగా తెమ్మని చెప్పాడు. హనుమంతుడు వెనకాముందు చూసుకోలేదు. మొక్కను తీసుకురావడానికి వెళ్లిపోయాడు. రాముడు చెప్పిన పర్వతం చేరుకున్నాక, హనుమకు సందేహం వచ్చింది. సంజీవని మొక్క ఎలా ఉంటుంది? పర్వతమంతా వెతికాడు. ఎన్నో చెట్లు.. మొక్కలు.. పెద్ద పెద్ద రాళ్లు.. ఆ మొక్క ఎలా ఉంటుందో తెలియనప్పుడు వాటి మధ్య ఉన్న దానిని ఎలా తీసుకురావడం?! అందుకే పర్వతాన్నే పెకిలించి, మోసుకొచ్చేశాడు. మనలో ప్రతి ఒక్కరికీ సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యకు భయపడితే పర్వతం కన్నా పెద్దదిగా కనిపిస్తుంది. భయపడకుండా చూస్తే అదే సమస్య చాలా చిన్నగా కనిపిస్తుంది. అప్పుడే ధైర్యం, సాధించగలననే నమ్మకం మనలో కలుగుతాయి. రాముడి జీవితమంతా సమస్యలే. కానీ, ఆ సమస్యల్ని ఎదుర్కొన్న విధమే ఆయనకా ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. అంతేకాదు, రామాయణంలోని ప్రతి సన్నివేశం, ప్రతి పాత్రా కౌమారంలో ఉన్న పిల్లలకే కాదు పెద్దలకూ జీవితపాఠాలు నేర్పిస్తుంది. రామనవమి నాడు రామ జీవితకథను పాఠ్యాంశంగా పిల్లలకు పరిచయం చేస్తే వారి జీవనరాదారిలో వచ్చే ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే నేర్పును పంచినవారవుతారు. పురాణాలు, ఇతిహాసాలు చెప్పేటప్పుడు పిల్లలకు అభూతకల్పనలతో కాకుండా సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో సూచించేలా కథనాలు ఎంచుకోవాలి. నేను దశావతరాలను కథ లుగా చెప్పేటప్పుడు చిన్న చిన్న పద్యాలు కూడా పరిచయం చేస్తాను. పిల్లల్లో ఊహాత్మక శక్తిని, ఆలోచనా విధానాన్ని పెంచేవి ఈ కథనాలే! - దీపాకిరణ్, స్టోరీ టెల్లర్