
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ అభివృద్ధి నమూనాను ప్రజలు ఒక అపోహగా తిరస్కరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యకర్తలు సమర్థంగా పనిచేశారని, బీజేపీని ఘెరావ్ చేసినంత పనిచేశారని, తమ ప్రశ్నలకు బీజేపీ బదులివ్వలేకపోయిందని అన్నారు. తదుపరి ఎన్నికలు జరిగే 2022లో 135 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఆయన శనివారం రాష్ట్ర నాయకులతో సమావేశమై గుజరాత్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. తాజా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మనం ఈ ఎన్నికల్లో ఓడినా గెలిచినట్లే. ఎందుకంటే బీజేపీ డబ్బు, పారిశ్రామికవేత్తలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రచారంతో గెలిస్తే మనం సత్యంతో పోటీచేశాం’ అని రాహుల్ అన్నారు. అంతకుముందు, సోమ్‌నాథ్ ఆలయంలో పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment