N T Rama Rao
-
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జూ.ఎన్టీఆర్ నివాళి
-
ఆయన అంతలా ఏడుస్తుంటే ఎంతమంది కమ్మవాళ్ళు చెప్పుతో కొడతామన్నారు ?
-
ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు : కొడాలి నాని
-
NTR ఫైల్స్
-
మనదేశం సినిమాతో ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ప్రారంభం
-
వెన్నుపోటు: నాడు చంద్రబాబు, నేడు అఖిలేశ్!
కేరాఫ్ సైకిల్ సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు.. 1995లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ స్థాపకుడు ఎన్టీ రామారావును ఆయన సొంత అల్లుడు చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడిచిన ఉదంతాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ వ్యవహారంలో మరో సారూప్యమేమింటంటే ఇటు టీడీపీ, అటు ఎస్పీ గుర్తులు సైకిల్ కావడం. అయితే. అప్పుడు వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ సీఎం కాగా, ఇప్పుడు తండ్రి ములాయంపై తిరుగుబాటు లేవనెత్తిన అఖిలేశ్ సీఎం. 1995 ఆగస్టులో తొమ్మిదిరోజులపాటు నాటకీయంగా జరిగిన పరిణామాల అనంతరం టీడీపీ అధ్యక్ష పదవి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి ఎన్టీఆర్‌ను చంద్రబాబు కూలదోశారు. టీడీపీకి చెందిన 216 మంది ఎమ్మెల్యేలలో 198 మంది ఎమ్మెల్యేలు అండగా నిలువడంతో ఐదు రోజుల తర్వాత చంద్రబాబు సీఎం పగ్గాలు చేపట్టారు. కేవలం 18మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్టీఆర్‌కు విశ్వాసపాత్రులుగా నిలబడ్డారు. ఈ పరిణామంతో గుండెపగిలిన ఎన్టీఆర్ తీవ్ర విషణ్న వదనంతో పదవీచ్యుతుడై హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన ఇంటికి తిరుగుముఖం పట్టారు. అనంతరకాలంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా ఉన్న 18మంది ఎమ్మెల్యేలలో చాలామంది చంద్రబాబు పక్షాన చేరిపోయారు. సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ 1982 మార్చ్ 29న తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని స్థాపించి.. తన నాయకత్వంలో మూడుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా వెన్నుపోటుకు ముందు 1994 డిసెంబర్ ఎన్నికల్లో టీడీపీ బంఫర్ మెజారిటీ సాధించింది. ఉమ్మడి ఏపీలోని 294 స్థానాలలో 216 సీట్లు గెలుచుకుంది. 1992లో ఎన్టీఆర్‌కు గుండెపోటు రావడం, ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడం, ఎన్టీఆర్ భాగస్వామి లక్ష్మీపార్వతి ప్రమేయం బాగా పెరిగిపోతున్నదని చంద్రబాబు క్యాంపు ప్రచారం చేయడం ఎన్టీఆర్‌ను బలహీన పరిచిందని అప్పటి రాజకీయ నిపుణులు గుర్తుచేసుకుంటారు. మొదటి భార్య చనిపోవడంతో ఆ తర్వాత లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సొంత అల్లుడే తనను వెన్నుపోటు పొడవడంతో దిగ్భ్రాంతి చెందిన ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబును వెన్నుపోటుదారుడు, ఔరంగజేబు అంటూ తీవ్ర విమర్శించిన విషయాన్ని రాజకీయ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. అప్పట్లో ఈ ఉదంతంలో ఎన్టీఆర్ కుటుంబం మొత్తం చంద్రబాబుకు అండగా నిలిచింది. కానీ, ఆ తర్వాత చంద్రబాబు తీరు నచ్చక చాలావరకు ఎన్టీఆర్ కుటుంబం దూరం జరిగింది. ఇప్పటికీ ఎన్టీఆర్-చంద్రబాబు కుటుంబాల మధ్య నివురుగప్పిన నిప్పులా ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఉన్నట్టు కనిపిస్తుందని పరిశీలకులు చెప్తారు. అప్పుడు ఏపీలో, ఇప్పుడు యూపీలో జరిగిన పరిణామాలకు పలువిధాలుగా వ్యత్యాసం ఉన్నా.. రెండింటి మధ్య దగ్గరి సారూప్యం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్టీఆర్ వల్లే తెలంగాణ దివాళా
ధారూరు: దివంగత ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు అధికారంలోకి వచ్చినపుడే తెలంగాణలోని ఐటీ రంగం బెంగళూర్‌కు తరలివెళ్లిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలో 705 గ్రామ పంచాయతీలు ఉండగా ఎంపీ ధారూరు మండలంలోని నాగసమందర్ గ్రామాన్ని సంసాద్ ఆదర్శ దత్తత గ్రామంగా ఎంపిక చేసుకున్నారు. శనివారం ఎంపీ గ్రామానికి చేరుకుని సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్టీఆర్ పాలన వల్ల తెలంగాణ దివాళా తీసిందని, ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందిందని విమర్శించారు. కిలో రూ. 2ల బియ్యం పంపిణీ వల్ల ఆంధ్రకే మేలు జరిగిందన్నారు. ప్లానింగ్ లేకుం డా మద్యపాన నిషేధం అమలు చేయడంతో రాష్ట్ర ఆదాయానికి గండి పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వేరుపడిన చరిత్ర, జియోగ్రఫీని మర్చి పక్క రాష్ట్ర దివంగత నేత పేరిట శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్‌కు ఎన్టీఆర్ టెర్మినల్‌గా పేరు పెట్టడం సరి కాదన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన దిగంగత ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు పేరును పెడితే తమకు అభ్యంతరం లేదన్నారు. విజయవాడకు ఎన్టీఆర్ పేరును ఖరారు చేస్తే మంచిదని ఆయన ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సూచించారు. ఎన్టీఆర్ పేరును తొలగించకపోతే తాను పార్లమెంట్లో నిలదీస్తానని హెచ్చరించారు. తాను దత్తత తీసుకున్న నాగసమందర్ గ్రామానికి నెలకోసారి వస్తానని, 3 నెలల్లో అనుకున్న విధంగా అభివృద్ధి జరిగితే మరో రెండు గ్రామాలను దత్తత తీసుకుంటానని పేర్కొన్నారు. గ్రామానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించి అందులో గ్రామస్థుల పూర్తి వివరాలను నమోదు చేయిస్తానని చెప్పారు. ఇక్కడ రూపే కార్డును అందరికీ అందజేస్తామని, దీనితో 6 నెలల పాటు లావాదేవీలు జరిపితే ప్రభుత్వ పరంగా వారి ఖాతాలో రూ. 5 వేలు జమ చేయిస్తామని పేర్కొన్నారు. టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేస్తాం జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టుగా ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయిస్తామని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. నాగసమందర్ గ్రామంలోని సమస్యలను తెలుకునేందుకు శనివారం ఎంపీ గ్రామంలో పాదయాత్ర చేసి ప్రజలతో మాట్లాడారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రాంతంలో టూరిజంను ఏర్పాటు చేస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల నుంచి కొంత మొత్తంలో రుసుమును వసూలు చేసి ఆ డబ్బులను ఈ గ్రామంలోనే ఖర్చు పెడతామని అన్నారు. ఐటీ కంపెనీలు, ఎన్ఆర్ఐలతో మాట్లాడి గ్రామంలో అభివృద్ధి చేసేందుకు వారి సహకారాన్ని కోరుతామని అన్నారు. ఎమ్మెల్యే బి. సంజీవరావు మాట్లాడుతూ నాగసమందర్ గ్రామాన్ని పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని, గ్రామంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. దారూరు పీఏసీఎస్ చెర్మైన్ హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ పత్తి రైతులకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5 వేలు వచ్చేలా పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి రైతులకు న్యాయం చేయాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ఉమాపార్వతి, ఎంపీటీసీ సభ్యుడు బాలప్ప, సర్పంచ్ శ్రీనివాస్, ధారూరు పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, డెరైక్టర్ బస్వరాజ్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు వరద మల్లికార్జున్, రాజునాయక్‌లు, మండల టీఆర్ఎస్ కన్వీనర్ కుమ్మరి శ్రీనివాస్, రాష్ట్ర టీఆర్ఎస్ కార్యదర్శి కనకయ్య, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి శుభప్రదపటేల్, జిల్లా కార్మిక విభా గం అధ్యక్షుడు కృష్ణయ్య, రైతు విబాగం అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, తహసీల్దార్ విజయ, ఇన్చార్జీ ఎంపీడీఓ కాలుసింగ్, ఎబ్బనూర్ సర్పంచ్ రాజేం దర్‌రెడ్డి, జిల్లా, మండల టీఆర్ఎస్ నాయకులు రవీందర్‌రెడ్డి, రాజారత్నం, శాంతకుమార్, సర్వేశం, శేఖర్, ప్రశాంత్, రామచంద్రయ్య, మల్లారెడ్డి, సంతోష్‌కుమార్, రాములు, రాంరెడ్డి, దస్తయ్య, రామస్వామి, రుద్రారం వెంకటయ్య, కావలి అంజయ్య, విజయకుమార్, నందు తదితరులు పాల్గొన్నారు. -
‘రాజు - పేద’కు 60 ఏళ్లు
తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన తొలి బాలనటునిగా మాస్టర్ సుధాకర్ చరిత్రలో నిలిచిపోయాడు. కన్నతల్లి, దేవదాసు, నిరుపేదలు తదితర చిత్రాల్లో నటించిన సుధాకర్ ఆ తర్వాత రంగస్థలంపై స్థిరపడిపోయాడు. అనకాపల్లిలో ఓ నాటక ప్రదర్శనకు వెళ్లి మిస్టరీగా చనిపోయాడు. అప్పటికి అతనికి పాతికేళ్ల వయసు ఉంటుందేమో. అందగాడైన ఎన్టీఆర్‌తో నెగటివ్ ఛాయలున్న డీ గ్లామరైజ్డ్ పాత్ర చేయించాలని ఎవరైనా అనుకుంటారా? అస్సలు అనుకోరు. ‘రాజు-పేద’లో ఎన్టీఆర్‌ని చూస్తే షాకవుతారు. ఆయన గెటప్, పాత్ర తీరు తెన్నులే కాదు, కథాంశమూ షాకింగ్‌గానే ఉంటుంది. 1954 జూన్ 25న విడుదలైన ఈ చిత్రానికి నేడు వజ్రోత్సవం. ఒక తమాషా ఆలోచన. అచ్చం సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పోలికలతోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడనుకుందాం. అతనో ఆటో డ్రైవర్ అనుకుందాం. హీరో ప్లేస్‌లోకి ఆటో డ్రైవర్, ఈ ఆటోడ్రైవర్ ప్లేస్‌లోకి ఆ హీరో చేరితే ఎలా ఉంటుంది? ఫన్‌కి ఫన్. డ్రామాకి డ్రామా. థ్రిల్‌కి థ్రిల్. ఇలాంటి చిత్రమైన కాన్సెప్టులు మన ఫిలిం మేకర్ల బుర్రలో బోలెడన్ని ఉంటాయి. అసలు దీనికి మూలం ఎక్కడ ఉందో తెలుసా? అయితే మనం ఒకసారి 1881 ప్రాంతంలోకి వెళ్లాలి. అవును మరి... ఈ కాన్సెప్ట్ అప్పుడే పుట్టింది. మార్క్ ట్వెయిన్ అనే రచయిత ‘ది ప్రిన్స్ అండ్ ది పాపర్’ పేరుతో ఓ హిస్టారికల్ ఫిక్షన్ నవల రాశాడు. రాసిన ముహూర్తం బావుందో, లేక కాన్సెప్ట్‌లో గమ్మత్తుందో కానీ ఆనాటి నుంచీ ఈనాటి వరకూ ఈ దారాన్ని ఉపయోగించుకుని బోలెడంత మంది మాలలల్లారు. కామిక్ బుక్స్, యానిమేషన్ కార్టూన్ సీరియల్స్, సెలైంట్ మూవీ, టాకీలు... అనేకం వచ్చాయి. ఈ నవలను బేస్ చేసుకుని 1920లో ఓ సెలైంట్ మూవీ వచ్చింది. 1937లో హాలీవుడ్లో ఓ టాకీ వచ్చింది. ఈ నవలకున్న ప్రజాదరణ, ఈ కాన్సెప్ట్‌లోని కొత్తదనం బి.ఎ. సుబ్బారావును ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ మొదలుపెట్టి, దర్శక నిర్మాతగా ఎదిగినవాడాయన. ఎన్టీఆర్, ఏయన్నార్‌తో ఫస్ట్ టైమ్ ‘పల్లెటూరి పిల్ల’ తీశాడు. పేరుకి పేరు, డబ్బుకి డబ్బు. రెండో సినిమాను కూడా అదే రీతిలో అదరగొట్టాలనుకున్నాడు. అందుకే గొప్ప కథ కోసం చూస్తుంటే ‘ది ప్రిన్స్ అండ్ ది పాపర్’ గుర్తుకొచ్చింది. దాన్ని తెలుగు నేటివిటీకనుగుణంగా మార్చి, మాటల రచయిత పినిశెట్టి రామ్మూర్తి చేతుల్లో పెట్టాడు. చిన్న కథలాగానే అనిపిస్తుంది కానీ, కథలో మెలికలూ, మెరుపులూ చాలానే ఉన్నాయి. ఒకే రోజు అటు రాజుగారింట్లోనూ, ఇటు ఓ దొంగ ఇంట్లోనూ మగపిల్లలు పుడతారు. ఇద్దరూ ఒకేలా ఉంటారు. ట్విన్స్‌లా అన్నమాట. దొంగ ఇంట్లో పుట్టిన కుర్రాడు తండ్రి బాధలు పడలేక దూరంగా పారిపోతూ అనుకోకుండా యువరాజు కంటబడతాడు. ఓ చిన్న ట్విస్ట్‌తో యువరాజు దొంగ ఇంటికి వెళతాడు. దొంగ కొడుకు, యువరాజుగా వెలుగొందుతాడు. చివరివరకూ బోలెడంత టెన్షన్. ఫైనల్‌గా ఈ ‘రాజు - పేద’ తమ కథల్ని సుఖాంతం చేసుకుంటారు. ఈ సినిమా అంతా యువరాజు, దొంగ కొడుకు మీదే నడుస్తుంది కాబట్టి మంచి బాలనటుడు కావాలి. ‘దీక్ష’లో నటించిన మాస్టర్ సుధాకర్ గురించి ఎవరో గొప్పగా చెప్పారు. ఫైనల్‌గా అతణ్ణే ఖరారు చేశారు. ఈ చిత్రంలో పోలిగాడు పాత్ర ఒకటుంది. అతనో దొంగ. మామూలుగా అయితే ఏ హీరో కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోడు. కానీ ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. అంతా షాక్. ఎందుకంటే, అది చాలా డీ గ్లామరైజ్డ్ రోల్. మొహం అంతా మసి పూసుకుని, గోనె గుడ్డలు ధరించాలి. దానికి తోడు నెగటివ్ ఛాయలు. అయినా కూడా ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. బిఏ సుబ్బారావంటే ఆయనకు విపరీతమైన గౌరవం. ‘పల్లెటూరి పిల్ల’తో తనను తొలిసారిగా హీరోని చేశారన్న కృతజ్ఞత. ఆర్టిస్టు అన్నాక అప్పుడప్పుడూ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయాలన్న కసి మరోవైపు. అప్పటికే ఎన్టీఆర్ స్టార్. పాతాళ భైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు లాంటి సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. అయినా రిస్క్‌కి సిద్ధమయ్యారు. ‘విజయా’ చక్రపాణి కూడా ఇందులో ఎన్టీఆర్ గెటప్ చూసి ఆశ్చర్యపోయారు. ‘‘ఏంది సుబ్బారావ్! రొమాంటిక్ హీరోను తీసుకెళ్లి మసి పూసావ్’’ అనడిగారు. అందరూ ఫలితం కోసం వెయిటింగ్. ఫైనల్‌గా ఎన్టీఆర్ చేసిన రిస్క్ ఫలించింది. ‘రాజు-పేద’ను ప్రేక్షకులు బాగా ఆదరించారు. సినిమా అంటే ఇలానే ఉండాలి, హీరో అంటే ఇలాగే చేయాలి లాంటి పడికట్టు నిబంధనల్ని ఈడ్చి ఆవతల పడేసిందీ సినిమా. ఈ కథలోని దమ్ము, ఎన్టీఆర్ రిస్క్... ఈ రెండే ఈ చిత్రాన్ని ఇప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. ఎస్వీఆర్ చేసిన మహారాజు పాత్ర, రేలంగి పోషించిన సుధీర్‌కుమార్ పాత్రలైతే ఎక్స్లెంట్. లక్ష్మీరాజ్యం, ఆర్. నాగేశ్వరరావులు కూడా మెరుపులు మెరిపించారు.ఈ చిత్రానికి మరో హీరో అంటే ఆది.ఎమ్. ఇరానీ పేరు చెప్పాలి. తొలి భారతీయ టాకీ ‘ఆలం ఆరా’కి ఛాయాగ్రాహకుడాయన. ‘రాజు-పేద’లో డ్యూయల్ రోల్ షాట్స్‌ను బాగా డీల్ చేశారు. పిల్లలిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఒకరి వెనుక ఇంకొకరు వెళ్లే షాట్ ఉంది. అది తీయడానికి అప్పటి పరిస్థితులకు చాలా కష్టం. ఇరానీ చాలా ఈజీగా ఆ షాట్లు చిత్రీకరించారు. సాలూరు రాజేశ్వరరావు మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్. హీరోయిన్ జయచిత్ర తల్లి అమ్మాజీకి ఇదే తొలి సినిమా. ఎడిటర్ కె.ఎ. మార్తాండ్క్కూడా ఇదే ఫస్ట్ ఫిల్మ్. బీఏ సుబ్బారావుకు ఆయన స్వయానా మేనల్లుడు.ఇదే చిత్రాన్ని ఎల్వీ ప్రసాద్ హిందీలో ‘రాజా అవుర్ రంక్’ (1968) పేరుతో రీమేక్ చేశారు. ఎన్టీఆర్ పాత్రను అజిత్, రేలంగి పాత్రను సంజీవ్ కుమార్, టైటిల్ రోల్స్‌ను మాస్టర్ మహేశ్ కొఠారి చేశారు. అక్కడా ఈ సినిమా హిట్టయ్యింది.- పులగం చిన్నారాయణ -
కత్తెర చేతికి చిక్కని వేటూరి చమక్కు
కొత్త పుస్తకం సినిమాకు పబ్లిసిటీ ఆరో ప్రాణం... కానీ, దాని వెనక శ్రమ మాత్రం అన్ని ప్రాణాలూ తోడేసేంత. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చు కొని పబ్లిసిటీ నుంచి ప్రొడక్షన్ దాకా 40 ఏళ్ళలో 300 చిత్రాలకు శ్రమించిన సినీజీవి ప్రమోద్ కుమార్. ఆయన జ్ఞాపకాల నుంచి మచ్చుకు రెండు... గోపాలకృష్ణ ప్రొడక్షన్సు హేమాంబరధరరావు దర్శకత్వంలో కె. గోపాలకృష్ణ నిర్మించిన ‘కథానాయకుడు’. తరువాత కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు, తమిళనాడుకు ముఖ్యమంత్రులైన ఎన్.టి. రామారావు, జయలలితలు ఆ చిత్ర నాయకుడు, నాయికలు. ఓ సోషల్ సెటైర్‌గా రూపొందిన చిత్రం అది. కొద్ది ప్యాచ్‌వర్క్ మినహా చిత్రీకరణ పూర్తయింది. 1969 ఫిబ్రవరి 3 నుండి 6 వరకూ ఫినిషింగ్ కాల్షీట్లిచ్చారు, ఎన్.టి.ఆర్, జయలలితలు. కానీ, హఠాత్తుగా ఓ పిడుగులాంటి వార్త. అప్పటికే అనారోగ్యంతో స్టాన్లీ హాస్పిటల్లో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ‘అన్నాదురై’ కన్నుమూశారు. ఒక్కమాటలో చెప్పాలంటే తమిళనాడు స్తంభించిపోయింది. నాటి రాజకీయాల్లో జయలలిత కూడా క్రియాశీలకమై ఉన్నారు. ఆ పరిస్థితులలో ‘కథానాయకుడు’ ఫినిషింగ్ పాచ్వర్క్ జరపటం అసాధ్యం. కానీ పిక్చర్‌కు రిలీజ్ డేటు ఇచ్చేశారు. ఆనాటి విషాదంతో జయలలిత కూడా సినిమా కార్యక్రమాలలో పాల్గొనే పరిస్థితి లేదు. అయితే ఎన్.టి.ఆర్. కాల్షీట్లు 6వ తారీఖు వరకే ఉన్నాయి. అది తప్పితే ఆరు నెలల వరకు కాల్షీట్లు లేవు. దర్శక నిర్మాతలకు ఏమీ పాలుపోని పరిస్థితి. అన్నాదురై అంతిమ వీడ్కోలు. రాజాజీ హాలులో పార్థివ దేహాన్నుంచారు. లక్షలాది ప్రజలు అశ్రుతర్పణం చేశారు. మర్నాడు అంతిమ సంస్కారం. తరువాత శరవేగంగా బీచ్‌లో సమాధి నిర్మాణం వెంటవెంటనే జరిగాయి. ఫిబ్రవరి 6న తమిళనాట ఉన్న సినీ రాజకీయ ప్రముఖులతోపాటు ప్రజలంతా కాలినడకన అన్నాదురై సమాధికి అంజలి ఘటించే కార్యక్రమం. జయలలిత టి.నగర్‌నుండి బీచ్ వరకూ నడిచే వెళ్ళారు. ఇక్కడ దర్శక నిర్మాతల టెన్షన్. గంట గంటకూ ఎన్.టి.ఆర్. ఫోను! ఆయన కూడా నిస్సహాయులే! అయితే మధ్యాహ్నం 3 గంటలకు జయలలిత ప్రసాద్ స్టూడియోకి వచ్చారు. ఎంతో శ్రమదమాదులకోర్చిన పిమ్మట షూటింగ్‌కు హాజరవటం ఆమె కమిట్మెంట్. తీయవలసినవి 52 బిట్లు. నిర్మాతకు చెమట్లు! కెమెరామెన్ స్వామికి ఎన్.టి.ఆర్.తో ఇదే తొలి సినిమా. గోపాలకృష్ణ కెమెరామెన్ వి.ఎస్.ఆర్. స్వామి మీదనే భారం వేసి రాత్రి 12 గంటలకు పూర్తి చేయవలసినదిగా అభ్యర్థిస్తూ ఆయనకు ఓ ఫియట్ కారు బహుమతిగా ఇస్తానన్నారు. ఇహ చూసుకోండి. సహజంగానే స్వామి చాలా స్పీడు - ఓ పక్కన రోప్ మీద నుండి జారుతూ (క్రేన్ ఉపయోగించే టైమ్ లేదు) మరో పక్క ట్రాలీలు, క్లోజ్ షాట్స్! అన్నింటిని కచ్చితంగా రాత్రి 12 గంటలకు పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టి స్థిమిత పడ్డారు. అనుకొన్నట్లే ఫిబ్రవరి 27న సినిమా రిలీజైంది. హిట్టయింది. ఆ తరువాత పదేళ్ళకు రోజా మూవీస్ పతాకంపై రూపొందిన ‘వేటగాడు’ ఓ సంచలనం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్.కు జోడీగా శ్రీదేవి నటించారు. మద్రాసులోని ఏ.వి.యం. 5వ ఫ్లోరులో రెయిన్ సాంగ్ చిత్రీకరణ. వాటర్ (టాప్) స్పింక్లర్స్తో పాటు చిన్న పాండ్ సెట్. హుషార్‌గా షూటింగ్ జరిగింది. ‘‘ఆకుచాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే’’ మూడు రోజులు ఈ రెయిన్ సాంగ్ అత్యద్భుతంగా రూపొందింది. ప్రజాదరణ విశేషంగా పొందిన ఈ ‘వేటగాడు’ చిత్రంలో ఈ రెయిన్ సాంగ్ ఓ ప్రత్యేక ఆకర్షణ. అప్పట్లో సెన్సార్‌వాళ్లు చూచి ఆనందిస్తూనే, కొర్రీలు వేయకపోతే ‘‘తప్పవుతుందన్న’’ ఉద్దేశంతో తమ ప్రతాపం చూపెట్టారు. ‘‘ఆకుచాటు పిందె తడిసె కోకమాటు పిల్ల తడిసె’’ అన్న మాటలకు సౌండ్ కట్ చేయాలి లేదా మరో మాటతో సౌండ్ రిప్లేస్ చేయమన్నారు. రాఘవేంద్రరావుగారు నా వంక చూసి ‘‘పట్టుకో, వేటూరిని పట్టుకో... పట్టుకురా.. ఆల్టర్నేటివ్ మేటరు, అర్థం మారగూడదు’’ అన్నారు. వేటూరి గారు ఎక్కడున్నారని వెదికితే ట్రస్టుపురంలో ఏడిద నాగేశ్వరరావు ఆఫీసులో ‘శంకరాభరణం’ చిత్రానికి పాటలు రాస్తున్నారు. వేటూరికి విషయం చెప్పాను. ‘ఏవండీ ఈ సెన్సారు వాళ్లు నా పాటలో, జయమాలిని ఆటలో కట్లు చెప్పకుండా ఉండర’ని నవ్వుకున్నారు. ఆ బిట్ ప్లేస్‌లో ‘కొమ్మచాటు పువ్వు తడిసె’ అని మార్చి రాసి, అయిదే నిమిషాల్లో ఇచ్చి పంపారు సరస్వతీ తనయుడు వేటూరి. ఆ బిట్‌తో చక్రవర్తి రికార్డ్ చేశారు. సెన్సార్‌వారికి కట్స్ ఇచ్చేశా. సెన్సార్ సర్టిఫికెట్ నేనే తెచ్చా. 1979 జూలై 5న ‘వేటగాడు’ విడుదలై స్వైర విహారం చేసింది. -
అపురూపం: స్టార్ డైరెక్టర్స్...
యాక్షన్... చెప్పింది చేయడం! డెరైక్షన్... చెప్పి చేయించుకోవడం!! కొందరికి యాక్షన్ ఈజీ! ఇంకొందరికి డెరైక్షన్ ఈజీ! చాలా కొద్దిమందికే రెండూ ఈజీ! ఎన్టీఆర్, భానుమతి, సావిత్రి, ఎస్.వి.రంగారావు... నటులుగా ఈ నలుగురూ ఆ రోజుల్లో అద్భుతాలు చేసినవారే! అటు దర్శకులుగా కూడా విజయాలు చవిచూసినవారే! ఈ తరానికి ఈ సంగతి అంతగా తెలీకపోవచ్చు. పెద్ద స్టార్ దర్శకత్వం వహించడమన్నది భానుమతితోనే ప్రారంభం! 1953లో ‘చండీరాణి’ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి దర్శకత్వం వహించి సంచలనం రేపారు. ఆ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ స్టిల్ ఇది. దాదాపు 20 ఏళ్ల తరువాత మళ్లీ ‘అంతా మనమంచికే’, ‘విచిత్ర వివాహం’, ‘అసాధ్యురాలు’... వంటి 8 చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ఎన్.టి.రామారావు ‘సీతారామకళ్యాణం’ చిత్రం తో మొదలుపెట్టి, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘వరకట్నం’, ‘దానవీర శూరకర్ణ’ వంటి 15 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాను నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘దానవీర శూరకర్ణ’ చిత్రంలో అభిమన్యుడి పాత్రధారి అయిన తనయుడు బాలకృష్ణకు తనకు కావలసిన విధంగా మేకప్‌ను సరిదిద్దుతున్న స్టిల్ ఇది. ఇక 1967, 68 - ఈ రెండు సంవత్సరాలలో ‘చదరంగం’, ‘బాంధవ్యాలు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఎస్.వి.రంగారావు. ‘బాంధవ్యాలు’ చిత్రం షూటింగ్లో కెమెరా యాంగిల్‌ను చూసుకుంటున్న ఎస్.వి.రంగారావు. మహానటి సావిత్రి 1968-72... ఈ ఐదేళ్ల కాలంలో ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘చిన్నారి పాపలు’, ‘చిరంజీవి’, ‘మాతృదేవత’, ‘వింత సంసారం’... ఈ నాలుగు తెలుగు చిత్రాలకు, ‘కుళందై ఉళ్ళం’, ‘ప్రాప్తం’ అనే రెండు తమిళ చిత్రాలనూ దర్శకత్వం వహించారు. ‘చిరంజీవి’ చిత్రం సెట్‌పై నటులు ప్రభాకరరెడ్డి, చలంలకు సూచనలు ఇస్తున్న సావిత్రి! ఆ రోజుల్లో క్షణం తీరిక లేని స్టార్స్ వీరు! అయినా... దర్శకత్వం వహించారు. కారణం... దర్శకత్వంపై ఉన్న ఇష్టం! అసలు ‘సినిమా’ అంటేనే వారికి ఇష్టం. అందుకే... నటించారు... నిర్మించారు... దర్శకత్వం వహించారు... వెళ్లిపోయారు! ‘సినిమా’ అనే కారణం కోసం పుట్టారు! కారణం పూర్తవగానే వెళ్లిపోయారు! కారణజన్ములు వాళ్లు! - నిర్వహణ: సంజయ్ కిషోర్ sanjjaykkishor@gmail.com -
అపురూపం: చేయూత...
సినిమాని ఆదరించేది... ఆడించేదీ ప్రజలు! సినిమావాళ్లని ప్రేమించేదీ... కొలిచేదీ ప్రజలే!! ఆ ప్రజలు కరువులు, యుద్ధాలు, ఉప్పెనల వంటి ఇబ్బందులెదుర్కొన్నప్పుడు వారికి అండగా సినీ పరిశ్రమ చేయూతనందివ్వడానికి ముందుకు రావడం ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. అలనాటి ప్రముఖ తారలు ఈ విషయంలో ఎప్పుడూ ముందుండేవారు. విపత్తు సమయాలలో ఊరూరా తిరిగి, తమ వినోద ప్రదర్శనలతో విరాళాలను సేకరించి కొన్నిసార్లు, వ్యక్తిగతంగా కొన్నిసార్లు విరాళాలను ఇచ్చి ఆదుకునేవారు. 1977లో కృష్ణా జిల్లాలోని దివిసీమ ఉప్పెన వల్ల కనీవినీ ఎరుగని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఆ సందర్భంగా నాటి అగ్ర హీరోలు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తమ బృందంతో ఊరూరా తిరిగి, విరాళాలను సేకరించారు. దాదాపు పదిహేను లక్షల రూపాయలను ఈ సందర్భంగా సేకరించి, వారు ప్రభుత్వానికి అందించడం జరిగింది. 1965లో పాకిస్తాన్లో యుద్ధం వచ్చినప్పుడు దేశరక్షణ నిధి కోసం విరాళాల సేకరణ నిమిత్తం చెన్నై వచ్చిన నాటి దేశ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రికి సినీ ప్రముఖులు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలను తమ ప్రదర్శనల ద్వారా సేకరించి అందించారు. వ్యక్తిగతంగానూ విరాళాలిచ్చారు కొందరు తారలు. ఆ సందర్భంగా మహానటి సావిత్రి తన ఒంటిపైనున్న బంగారు నగలన్నింటినీ తీసి విరాళంగా ఇచ్చారు. లాల్‌బహదూర్‌శాస్త్రి (కుడిచివర), సావిత్రి తదితరులు ఈ విధంగా 1971లో మళ్లీ ఇండో-పాక్ యుద్ధం జరిగినప్పుడు అనేక మంది అగ్రతారలు నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి హైదరాబాద్‌లో తమ విరాళాలను అందజేశారు. తన వంతు విరాళాన్ని ఊర్వశి శారద అందించారు. ఇందిరాగాంధీ, ఊర్వశి శారద ఇలా కష్టసమయాల్లో తమ వంతు చేయూతనందించి, తమ సామాజిక బాధ్యతను నెరవేర్చేవారు మన తారలు! ఇలా తారలు - ప్రజలు... ఒకరి కోసం ఒకరుండటం ఒకరికి అండగా ఒకరుండటం... అభినందనీయం... మానవీయం! - సంజయ్ కిషోర్