naascom
-
గ్రామీణ మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం కాల్‌సెంటర్
న్యూఢిల్లీ: గ్రామీణ మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం నాస్కామ్ ఫౌండేషన్, టెక్నాలజీ దిగ్గజం గూగుల్, స్వచ్ఛంద సంస్థ ఐఎస్ఏపీ కలిసి సంయుక్తంగా ’డిజివాణి కాల్‌సెంటర్’ ఏర్పాటు చేశాయి. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ తదితర ఆరు రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చినట్లు నాస్కామ్ ఫౌండేషన్ సీఈవో నిధి భాసిన్ తెలిపారు. ప్రాథమికంగా 20,000 మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు దీని ద్వారా సేవలు అందించాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. తమకు ఉపయోగపడే వివిధ పథకాలు, వ్యాపార వృద్ధికి సహాయపడే స్కీములు లేదా ఇతరత్రా సమాచారం మొదలైన వాటన్నింటి గురించి డిజివాణి ద్వారా తెలుసుకోవచ్చని భాసిన్ వివరించారు. దీనికి అవసరమైన నిధులను గూగుల్ సమకూరుస్తోందని, ఏడాది తర్వాత డిజివాణి సేవలను విస్తరించడంపై దృష్టి పెట్టనున్నామని పేర్కొన్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రిబిజినెస్ ప్రొఫెషనల్స్ (ఐఎస్ఏపీ)కి చెందిన ఢిల్లీ, లక్నో ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్లలో 19 మంది సిబ్బంది ఉన్నారు. -
మనం ఎవరి ఉద్యోగాలనూ లాగేసుకోవడం లేదు
సాక్షి, ముంబయి : భారత ఐటీ పరిశ్రమ ఏ ఒక్కరి ఉద్యోగాలను లాగేసుకోవడం లేదని నాస్కామ్కు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ దేవజని ఘోష్ అన్నారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత ఐటీ పరిశ్రమపై ఉన్న అపోహలను తొలగించడమే తన ముందున్నకర్తవ్యమని చెప్పారు. కృత్రిమ మేథ వంటి నూతన టెక్నాలజీలకు కంపెనీలను సిద్ధం చేసేలా నైపుణ్య కార్యక్రమాలకు పరిశ్రమ పెద్దలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. దేశీయ మార్కెట్లో సేవలందిచేందుకు పలు కంపెనీలకు ఎదురవుతున్న అవరోధాలను తాము తొలగిస్తామన్నారు. కృత్రిమ మేథ వంటి నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునేందకు తొలుత దేశంలో ప్రొడక్ట్ డెవలప్మెంట్ను ప్రోత్సహించడమే సరైన మార్గమని చెప్పారు. విద్యార్థులు వాణిజ్యవేత్తలుగా ఎదిగేలా విద్యావ్యవస్థలోనే బీజం పడేలా మార్పులు అవసరమన్నారు. దేశంలో నూతన ఉద్యోగాల రూపకల్పనపై నాస్కామ్ దృష్టిసారిస్తుందన్నారు. గతంలోనూ నూతన టెక్నాలజీల కారణంగా కొందరు ఉద్యోగాలు కోల్పోయినా, అదే సమయంలో కొత్త ఉద్యోగాలూ అందుబాటులోకి వచ్చాయన్నారు. కృత్రిమ మేథ, రోబోటిక్స్,డేటా అనలిటిక్స్ వంటి నూతన టెక్న్నాలజీల ద్వారా కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. -
టెకీలకు తీపికబురు
సాక్షి,న్యూఢిల్లీ: ఐటీ రంగంలో కొలువులపై కత్తి వేలాడుతున్న క్రమంలో టెకీలకు ఉపశమనం కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది దాదాపు 1000కిపైగా స్టార్టప్‌లు టెక్నాలజీ రంగంలో ప్రారంభమయ్యాయని నాస్కామ్ స్టార్టప్ నివేదిక వెల్లడించింది. ఆటోమేషన్ రాకతో వేలాది ఉద్యోగాలు ఊడుతున్న నేపథ్యంలో భారత్ ప్రపంచంలోనే మూడద అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా బలపడటం టెకీలకు ఊరట ఇస్తోంది. కొత్త యూనిట్లను కలుపుకుంటే దేశంలో టెక్నాలజీ స్టార్టప్‌ల సంఖ్య 5200కు చేరుకుందని ఈ నివేదిక వెల్లడించింది. 15,000 కోట్ల డాలర్లతో అతిపెద్ద ఉపాధి రంగంగా ఉన్న భారత ఐటీ రంగం ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీల రాకతో నియామకాల ప్ర్రక్రియలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. నూతన టెక్నాలజీలతో పెద్ద ఎత్తున ఈ రంగంలో ఉద్యోగాలకు కోతపడుతున్నది. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహింద్రాల్లో సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గింది.ఇక స్టార్టప్‌ల హవా పెరగడం, అమెరికాలో ఐటీ వ్యయాలు క్రమంగా పుంజుకోనుండటంతో టెకీల నియామకం క్రమంగా ఊపందుకుంటుందని నాస్కామ్ అంచనా వేస్తోంది. -
ఐటీ ఇండస్ట్రీకి నాస్కామ్ గుడ్ న్యూస్
దేశీయ ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ గుడ్ న్యూస్ అందించింది. ఫిబ్రవరిలో గైడెన్సు ప్రకటించడాన్ని వాయిదావేసిన నాస్కామ్, నేడు 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ గైడెన్స్ లను ప్రకటించింది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఐటీ గ్రోత్ గైడెన్స్ ఆశాజనకంగా ఉంటుందని తెలిపింది. దేశీయంగా ఐటీ సర్వీసులు రెవెన్యూ వృద్ధి 10-11 శాతం ఉంటుందని నాస్కామ్ అంచనావేసింది. అదేవిధంగా ఎగుమతుల రెవెన్యూలు గ్రోత్ 7-8శాతం పెరుగుతుందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండస్ట్రీ 1.3 లక్షల నుంచి 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తుందని నాస్కామ్ సభ్యులు చెప్పారు. ఇది ఐటీ ఇండస్ట్రీకి సానుకూలంగా నిలిచింది. దీంతో ఐటీ కంపెనీ షేర్లు కూడా జోరుగా లాభాలు పండిస్తున్నాయి. 2.35 శాతం పైకి ఎగిసిన ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు ప్రస్తుతం 1.35 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, టీసీఎస్,హెచ్‌సీఎల్ లు కూడా లాభాలు పండిస్తున్నాయి. 2017లో ఇండస్ట్రీ ఆదాయం 11 బిలియన్ డాలర్లకుపైగా పెరిగినట్టు కూడా పేర్కొంది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఇండస్ట్రీ రీస్కిలింగ్, అకాడమిక్ భాగస్వామ్యంపై ఫోకస్ చేయడం కొనసాగిస్తుందని నాస్కామ్ చెప్పింది. ఎస్ఏఏఎస్ అప్లికేషన్స్, క్లౌడ్ ప్లాట్ ఫామ్స్, బీఐలు గ్లోబల్ గ్రోత్ ఏరియాలుగా నాస్కామ్ తెలిపింది. నాస్కామ్ నేడు ప్రకటించిన గైడెన్స్ ఫలితాలు అనిశ్చిత పరిస్థితుల్లో కొనసాగుతున్న ఐటీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ గా మారాయి. కాగ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మరో నాలుగు రోజుల్లో మోదీ భేటీ కాబోతున్నారు.