NAB
-
హైదరాబాద్ పబ్బుల్లో దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్లలో పోలీసులు దాడులచేశారు. టీజీనాబ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట వరకు పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. రంగరెడ్డి జిల్లాలో బార్లలో మరో ముగ్గురు వ్యక్తులు పాజిటివ్‌గా తేలారు. మొదటిసారి తనిఖీల్లో డ్రగ్ డీటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను టీజీనాబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు కేసుల్లో జీ 40లో ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరా పబ్బులో ఒకరికి, క్లబ్ రొగ్లో ఒకరికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చినట్లు అధికారుల తెలిపారు. -
2 నెలల్లో రూ.26 కోట్ల డ్రగ్స్ సీజ్
సాక్షి, హైదరాబాద్: నిషా ముక్త్ తెలంగాణ లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) అద్భుత ఫలితాలు సాధిస్తోందని న్యాబ్ డైరెక్టర్, నగర కొత్వాల్ సీవీ ఆనంద్ వెల్లడించారు. జూన్–జూలై నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చేసిన దాడుల్లో టీఎస్ న్యాబ్ అధికారులు 196 కేసులు నమోదు చేసినట్లు గురువా రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాగా 196 కేసుల్లో 175 గంజాయి దందాకు సంబంధించినవే. ఈ కేసుల్లో అధికారులు 353 మందిని అరెస్టు చేశారు. మరోపక్క 21 డ్రగ్స్ సంబంధిత కేసుల్లో 46 మందిని కటకటాల్లోకి పంపారు. వీరి వద్ద నుంచి స్వాదీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ రూ.26,01,34,650గా నిర్థారించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు జూన్‌లో మూడు రోజుల పాటు మిషన్ పరివర్తన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. డ్రగ్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ఇతర రాష్ట్రాల, కేంద్ర ఏజెన్సీల సహకారం తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన కీలక సమావేశం గత నెల 5న నిర్వహించారు. డ్రగ్స్ దందాకు చెక్ చెప్పడానికి డార్క్‌వెబ్ సహా ఆన్లైన్లో జరిగే అక్రమ లావాదేవీలు నిరోధించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని నిర్ణయించారు. -
జాతీయ జెండాతో ‘కీకీ’ చాలెంజ్..
-
జాతీయ జెండాతో ‘కీకీ’ చాలెంజ్.. వివాదంలో ఎయిర్‌లైన్స్
కీకీ చాలెంజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న సరికొత్త చాలెంజ్. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ చాలెంజ్ వల్ల ఇబ్బందుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కూడా ఈ జాబితాలో చేరింది. అసలేం జరిగిందంటే.. పోలాండ్‌కు చెందిన టూరిస్ట్ ఇవా బయాంక జుబెక్ ప్రస్తుతం పాకిస్తాన్లో పర్యటిస్తోంది. అయితే పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పీఐఏ ఆమెతో ఓ ప్రమోషనల్ వీడియోను రూపొందించింది. పాక్ జాతీయ జెండాను ఒంటిపై కప్పుకున్న ఇవా బయాంక.. ఆగి ఉన్న విమానంలో డాన్స్ చేస్తూ కీకీ చాలెంజ్ విసిరింది. ఇందుకు సంబంధించిన వీడియోను పీఐఏ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘ప్రపంచాన్నంతటినీ చుట్టి వస్తోన్న గ్లోబల్ సిటిజన్ ఇవా జుబెక్ హృదయం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. పీఐఏలో ప్రయాణిస్తూ ఆమె సరికొత్త అనుభవాన్నిఆస్వాదిస్తున్నారు. ఇంతకు ముందెన్నడు, ఎవరూ సెలబ్రేట్ చేసుకోని విధంగా ఆమె పాక్ స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుతున్నారంటూ’ ట్వీట్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. చర్యలు తప్పవు.. ఇవా బయాంక చర్యను తీవ్రంగా తప్పు పట్టిన పాక్ నేషనల్ అకౌంటబిలిటి బ్యూరో(ఎన్ఏబీ) ఆమెపై, పీఐఏపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఎన్ఏబీ అధికారి మాట్లాడుతూ.. ‘ అసలు ఆమెను ఆగి ఉన్న విమానంలోకి వచ్చేందుకు, డ్యాన్స్ చేసేందుకు అనుమతించింది ఎవరో కనుక్కునే పనిలో ఉన్నాం. జాతీయ జెండాను అవమానించినందుకు ఆమెకు నోటీసులు జారీ చేశాం. ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా పీఐఏకి లెటర్ కూడా పంపించామని’ పేర్కొన్నారు. Eva zu Beck from Poland/England is a Global Citizen travelling around the world, but now her heart is set on Pakistan! She has been exploring Pakistan flying #PIA. She will be celebrating Independence Day in a style never before attempted in the world! Stay tuned for updates. pic.twitter.com/jrwezOJBzw — PIA (@Official_PIA) August 12, 2018 -
రూ.2వేల నోటుతో అంధులకు చిక్కు..
ముంబై: ఆర్బీఐ కొత్తగా విడుదల చేసిన రూ.2వేల నోటును గుర్తించటంలో అంధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రద్దయిన రూ.500, రూ1,000 నోట్లపై ఎంబోజింగ్, ఎన్గ్రేవింగ్ అక్షరాలు ఉండటంతో అంధులు తేలిగ్గా గుర్తు పట్టే వీలుండేది. గత నవంబరులో వీటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వీటి స్థానంలో రూ.2,000 నోటును కొత్త ఫీచర్లతో విడుదల చేసింది. ఈ నోటుపై ఎంబోజింగ్, ఎన్గ్రేవింగ్ అక్షరాలేవీ లేకపోవటంతో చేతి వేళ్లతో తాకి గుర్తు పట్టటం కష్టంగా మారింది. ఇదే విషయాన్ని తాము కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పామని ముంబైకి చెందిన నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్(ఎన్ఏబీ) చెబుతోంది. నోట్ల రద్దు విషయం తెలిసిన సమయంలో తమ సంఘం తరఫున కేంద్ర అధికారులను కలిసి ఎంబోజింగ్, ఎన్గ్రేవింగ్ విధానంతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 80 లక్షల మంది అంధులకు లాభిస్తుందని తెలిపామని సంఘం జాతీయ కార్యదర్శి జోక్విం రాపోస్ తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. ప్రయాణ సమయంలో ముఖ్యంగా ఆటోలు, ట్యాక్సీల్లో వెళ్లేటప్పుడు తమ వద్ద ఉన్న రూ.2వేల నోటును ఎలా ఇవ్వాలో తెలియక ఇబ్బంది ఎదురవుతోందని అన్నారు. -
రేపిస్టును పట్టిచ్చిన ఏడేళ్ల బాలుడు
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ఏడేళ్ల బాలుడి అద్భుతమైన జ్ఞాపకశక్తి పోలీసులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆరేళ్ళ పసిపాపపై అత్యాచారం చేసిన వ్యక్తిని పట్టివ్వడంలో కీలకమైన సమాచారాన్ని, నిందితుడికి సంబంధించిన స్పష్టమైన పోలికలను చెప్పి విజయ్ (పేరు మార్చారు) సీనియర్ అధికారుల ప్రశంసలందుకున్నాడు. వివరాల్లోకి వెళితే బాధిత బాలికతో కలిసి విజయ్, అతని చెల్లెలు గత శుక్రవారం తిలక్ నగర్ ప్రాంతంలో ఒక పార్క్ లో ఆడుకుంటున్న సమయంలో జిషాన్(22) విజయ్‌ని అతని సోదరిని పక్కకు తీసుకెళ్లి రూ .10 ఇచ్చి మభ్యపెట్టి అక్కడినుంచి పంపేశాడు. అనంతరం ఆరేళ్ల చిన్నారిని ఒక ఏకాంతమైన ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి క్లూ దొరకక ఇబ్బందిపడుతున్న పోలీసులకు విజయ్ సహాయపడ్డాడు. చివరికి ఆ బాలుడి సమాచారం ఆధారంగానే సోమవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏడేళ్ళ విజయ్ ఫొటోగ్రాఫిక్ మెమరీ పవర్ ను పోలీసులు ఇప్పుడు కొనియాడుతున్నారు. విజయ్ ఇచ్చిన సమాచారం మూలంగానే కేవలం 48 గంటల్లో నిందితుడిని పట్టుకోగలిగామని వారు తెలిపారు. స్పాట్‌కు తీసుకెళ్లడంతో పాటు, నిందితుడికి సంబంధించిన వివరాలను చాలా తెలివిగా, అద్భుతంగా అందించాడంటూ చెప్పారు. విజయ్ ను సన్మానించడంతోపాటు అతనికి సహకారాన్ని అందించాలని భావిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి దీపేంద్ర పాఠక్ చెప్పారు. నిందితుడిపై పోస్కో(POCSO) సంబంధిత సెక్షన్ల కింద నమోదు చేశామన్నారు. తిలక్ నగర్ లో సర్వోదయ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న విజయ్ తండ్రి ఒక స్క్రాప్ కార్మికుడు. తండ్రికి నెలకు వచ్చే రూ. ఆరువేల ఆదాయమే అతని కుటుంబానికి ఆధారం. తన కొడుక్కి బాగా చదువుకోవాలనే కోరిక వుందని.. కానీ తమకు స్థోమత లేకున్నా అతని కల నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తల్లి చెప్పింది. . -
అన్నా,వదినలను హత్యచేసిన తమ్ముడు
-
అన్నా, వదినలను చంపిన తమ్ముడు
ఖమ్మం: ఇల్లందు పట్టణంలోని సాయిబాబా టెంపుల్ వద్ద సోమవారం తెల్లవారు జామున ఓ వ్యక్తి తన అన్నా, వదినలను కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇల్లందు పట్టణానికి చెందిన విజయ్‌కుమార్(38), సామ్యన్(34) అన్నదమ్ములు. వీరి తల్లి సింగరేణిలో ఉద్యోగి. సామ్యన్ నిరంతరం తాగుతూ గొడవపడుతూ ఉండేవాడు. తల్లి ఉద్యోగం తనకే ఇవ్వాలని గొడవ పడుతుండేవాడు. అన్నను చంపేస్తే ఉద్యోగం తనకే వస్తుందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పథకం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కత్తితో అన్నను, వదిన సులోచన(30)ను హతమార్చాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.