ఖమ్మం: ఇల్లందు పట్టణంలోని సాయిబాబా టెంపుల్ వద్ద సోమవారం తెల్లవారు జామున ఓ వ్యక్తి తన అన్నా, వదినలను కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇల్లందు పట్టణానికి చెందిన విజయ్‌కుమార్(38), సామ్యన్(34) అన్నదమ్ములు. వీరి తల్లి సింగరేణిలో ఉద్యోగి. సామ్యన్ నిరంతరం తాగుతూ గొడవపడుతూ ఉండేవాడు. తల్లి ఉద్యోగం తనకే ఇవ్వాలని గొడవ పడుతుండేవాడు. అన్నను చంపేస్తే ఉద్యోగం తనకే వస్తుందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పథకం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కత్తితో అన్నను, వదిన సులోచన(30)ను హతమార్చాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.