nadigara sangham
-
తమిళనాడు: ఆ ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయి?
దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఇప్పుడైనా పరిష్కారం లభిస్తుందా? అన్న చర్చ కోలీవుడ్లో జరుగుతోంది. పలు వివాదాల మధ్య 2019 జూన్లో దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో నటుడు విశాల్ జట్టుకు నిర్మాత ఐసరి గణేష్ జట్టుకు మధ్య జరిగిన ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు వెలువడలేదు. తాజాగా రాష్ట్రంలో డీఎంకే అధిక స్థానాలు గెలుపొందాయి. దీంతో ఆ పార్టీ నేత స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. తొలిసారి ఎన్నికల్లో గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టనున్న నటుడు ఉదయనిధి స్టాలిన్కు విశాల్ మంచి మిత్రుడు. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ దక్షిణ భారత నటీనటుల సంఘం సమస్యకు పరిష్కారం చూపుతారనే ఆశ చిత్ర పరిశ్రమలో చిగురిస్తోంది. చదవండి: వాణీ విశ్వనాథ్ నట వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ -
లింగా నష్టాలకు రజనీ బాధ్యత లేదు
లింగా సినిమా కొనుగోలు వల్ల వచ్చిన నష్టాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ను బాధ్యుడిని చేయడం తగదని నడిగర సంఘం చెప్పింది. సినిమా నష్టాల విషయంలో నిర్మాతను అడగాల్సింది పోయి హీరోను అడగడం సరికాదని సంఘ నాయకులు అన్నారు. కేవలం సూపర్ స్టార్ దృష్టిని ఆకర్షించాలనే డిస్ట్రిబ్యూటర్లు నిరాహార దీక్షలకు దిగుతున్నారని ఆరోపించారు. ఏ సినిమా విజయమైనా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని, ఇతర వ్యాపారాల్లో లాగే.. దీంట్లోకూడా లాభాలు, నష్టాలు ఉంటాయని చెప్పారు. లింగా సినిమా చాలా బాగా ఆడుతుందనే అందరూ అనుకున్నారని, కానీ నష్టాలు వచ్చాయని హీరోను తప్పుబట్టడం సరికాదని నడిగర సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. నష్టపరిహారం కావాలంటే వెళ్లి నిర్మాతను అడగాలని, తదుపరి ప్రాజెక్టులో ఏవైనా సర్దుబాట్లు చేసుకోవాలని, అంతేతప్ప హీరోను తప్పుపడితే ఏమొస్తుందని అన్నారు. తాము పెట్టిన డబ్బులో దాదాపు 70 శాతం వరకు నష్టపోయినట్లు డిస్ట్రిబ్యూటర్లు అంటున్న విషయం తెలిసిందే. -
ఐదుగురు హీరోలతో ఓ సినిమా!
ఇద్దరు హీరోలు కలిసి నటిస్తేనే మల్టీ స్టారర్ అంటాం. అదికూడా ఒక సీనియర్ హీరో, ఒక కుర్రహీరో కలిసి చేయడం ఇన్నాళ్లూ జరుగుతోంది. కానీ ఒకేసారి ఐదుగురు కుర్ర హీరోలు కలిసి ఓ సినిమా చేయడం సాధ్యమేనా? తమకు సాధ్యమంటున్నారు కోలీవుడ్ హీరోలు. అది కూడా పూర్తి ఉచితంగా చేస్తున్నారు!! విశాల్, ఆర్య, కార్తీ, జీవా, జయం రవి.. వీళ్లు ఐదుగురూ కలిసి ఓ తమిళ సినిమాను ఉచితంగా చేస్తున్నారు. ఈ సినిమాకు వచ్చిన లాభాలను దక్షిణ భారత సినీ కళాకారుల సంఘం (సిఫా).. అదే, నడిగర సంఘం భవన నిర్మాణానికి ఉపయోగిస్తారు. తామంతా కలిసి ఈ సినిమా చేస్తున్నట్లు విశాల్ మీడియాకు తెలిపాడు. వాస్తవానికి కొన్నేళ్ల క్రితమే నడిగర సంఘానికి కొత్త భవనం కట్టించాలనుకున్నా, మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడంతో అది ఆగిపోయింది. సంఘం ప్రాంగణాన్నిఓ మల్టీప్లెక్సుకు అద్దెకు ఇస్తున్నారంటూ ఫిర్యాదులు రావడమే ఇందుకు కారణం. అయితే, నడిగర సంఘానికి శాశ్వత భవనం ఉండాలనే తామంతా భావించామని, ఇటీవలే సర్వసభ్య సమావేశంలో ఈ ఆలోచన గురించి చర్చించామని విశాల్ చెప్పాడు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. విశాల్ ప్రస్తుతం సుందర్ దర్శకత్వంలో వస్తున్న 'అంబాలా'లో నటిస్తున్నాడు. దీపావళికి అతడు నటించిన 'పూజ' చిత్రం విడుదల కానుంది.