nallavagu project
-
త్వరలో ‘నల్లవాగు’ పనులు
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టు పనులు ఏప్రిల్ తర్వాత ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం శాసనసభ దృష్టికి తెచ్చారు. 0.764 టీడీఎంసీ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టువల్ల 6 వేల ఎకరాలకు సాగునీరందుతుందని, రూ.19 కోట్లతో పనులు చేపట్టబోతున్నామని అన్నారు. ఏప్రిల్ నెలలో పనులకు అనుమతులు వస్తా యని, ఆ వెంటనే దాన్ని ఆధునీకరించే పనులు మొదలుపెడతామన్నారు. గత పాల కులు దాన్ని పట్టించుకోకపోవటంతో అది ఎందుకూ కొరగాకుండా పోయిందన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రశ్నకు సమా ధానంగా ఆయన ఈ వివరాలు సభముందుం చారు. ఇటీవల బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు నిరుపేద గ్రామీణులకు ఎంతో ఉపయోగంగా ఉంటా యని అధికారపక్ష సభ్యులు రేఖానాయక్, రవీందర్‌కుమార్, మదన్‌లాల్‌లు పేర్కొ న్నారు. ఆ కిట్లలో ఏయే వస్తువులుంటాయో వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సభ దృష్టికి తెచ్చారు. శిశువులు, బాలింతలకు ఉప యోగపడేలా 19 రకాల వస్తువులుం టాయని, ఒక్కో కిట్ విలువ రూ.2 వేలు ఉంటుందని పేర్కొన్నారు. ఏదో నామ్కేవాస్తేలా కాకుండా అన్నీ నాణ్యమైన వస్తువులనే కిట్‌లో ఉంచుతామన్నారు. ఈ పథకం సరిగా అమలయ్యేలా ప్రత్యేకంగా ఓ అధికారిని పర్యవేక్షణ కోసం నియమిస్తామన్నారు. వాయిదా తీర్మానాల తిరస్కరణ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి, సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించినట్టు స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. -
ప్రమాదకరంగా నల్లవాగు కట్ట
విపరీతంగా పెరిగిన పిచ్చి మొక్కలు కల్హేర్: నల్లవాగు పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ప్రాజెక్టు కట్టపై తుమ్మ చెట్లు, వివిధ చెట్లు దట్టంగా పెరిగాయి. దీంతో ప్రాజెక్టు కట్టకు ప్రమాదం పొంచి ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క గండ్లు, బుంగలు పడి ప్రాజెక్టుకు సంబంధించిన కాల్వలు దెబ్బతినడంతో శిథిలవంతంగా తయారయ్యయి. తూములు, సైఫాన్లు, షట్టర్లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టు కింది భాగంలో ఎమార్జెన్సీ కెనాల్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. నల్లవాగు ప్రాజెక్టు పట్ల నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు బాగు గురించి పట్టించుకోకపోవడంతో కట్టపై చెట్లు పెరిగాయని చెపుతున్నారు. కల్హేర్ మండలంలోని సుల్తానాబాద్ వద్ద 1967లో రూ. 98లక్షలతో నల్లవాగు ప్రాజెక్టు నిర్మించారు.అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడి, నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిధ్ధారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. కుడి కాల్వ పరిధిలో సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్(కె), కష్ణాపూర్, ఇందిరానగర్, కల్హేర్ వరకు 4,100ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ పరిధిలో బోక్కస్‌గాం, అంతర్గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామల్లో 1,230 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. నల్లవాగు కాల్వలను ఆధునీకరించేందుకు 200910లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.14.19కోట్లు మంజూరు చేశారు. పనుల్లో నాణ్యత లోపంతో సిమెంట్ కట్టడాలు బీటలువారాయి. కాల్వల మధ్య పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. ఇటివలే రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించి నల్లవాగు ప్రాజెక్టు రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు. కట్టపై ఉన్న చెట్లను తోలగించాలని రైతన్నలు అధికారులను కోరుతున్నారు. ఈ విషయన్ని నీటి పారుదల శాఖ ఈఈ రాములుతో ప్రస్తవించగా కట్టపై పెరిగిన చెట్లను వెంటనే తోలగిస్తామని తెలిపారు. -
నల్లవాగు వృథా నీటిని మళ్లిస్తాం
రూ. 18 కోట్లతో కాలువల ఆధునీకరణకు ప్రతిపాదనలు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి.. ఆయకట్టుకు నీటి విడుదల కల్హేర్: జిల్లాలోని మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు నల్లవాగు వృథా నీటిని చెరువులకు మళ్లిస్తామని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. కాలువల ఆధునీకరణ కోసం రూ. 18 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. సోమవారం నల్లవాగు ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో తెప్పోత్సవం నిర్వహించారు. గంగమ్మ, కట్ట మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్లవాగు వృథా నీటిని మళ్లింపు పనుల కోసం రూ. 200 కోట్లతో ప్రతిపాదనలు రుపొంచినట్లు తెలిపారు. త్వరలో నిధులు మంజూరయ్య ేఅవకాశం ఉందన్నారు. వృథా నీటి మళ్లింపుతో మండలంలోని మీర్ఖాన్పేట, బాచేపల్లి, రాపర్తి, తదితర గ్రామాల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అదనంగా 3 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వం రైతుల బాగు కోసం మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించాలని చూస్తుంటే కాంగ్రెస్, టీడీపీ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మల్లన్నసాగర్ నిర్మాణం ఆగదన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయకట్టు రైతులకు సూచించారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈఈ రాములు, డీఈఈ జలంధర్, కంగ్టి ఎంపీపీ రామరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశం, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గుండు నరేందర్, టీఆర్ఎస్ కల్హేర్, మనూర్ మండలాల అధ్యక్షులు కృష్ణమూర్తి, పండరి యాదవ్, నాయకులు రాంసింగ్, గుండు మోహన్, బాసిత్, రాఘవరెడ్డి, సాయగౌడ్, మహిపాల్‌రెడ్డి, గుండు విటల్, సర్పంచ్‌లు మనష్ పాటిల్, రాములు, ఎంపీటీసీలు సంజీవరావు, రాజుకుమార్, ప్రకాశ్, నారాయణఖేడ్ ఉపసర్పంచ్ నజీబ్ పాల్గొన్నారు.