నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
- రూ. 18 కోట్లతో కాలువల ఆధునీకరణకు ప్రతిపాదనలు
- ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి.. ఆయకట్టుకు నీటి విడుదల
కల్హేర్: జిల్లాలోని మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు నల్లవాగు వృథా నీటిని చెరువులకు మళ్లిస్తామని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. కాలువల ఆధునీకరణ కోసం రూ. 18 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. సోమవారం నల్లవాగు ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో తెప్పోత్సవం నిర్వహించారు. గంగమ్మ, కట్ట మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్లవాగు వృథా నీటిని మళ్లింపు పనుల కోసం రూ. 200 కోట్లతో ప్రతిపాదనలు రుపొంచినట్లు తెలిపారు. త్వరలో నిధులు మంజూరయ్య ేఅవకాశం ఉందన్నారు. వృథా నీటి మళ్లింపుతో మండలంలోని మీర్ఖాన్‌పేట, బాచేపల్లి, రాపర్తి, తదితర గ్రామాల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అదనంగా 3 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వం రైతుల బాగు కోసం మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మించాలని చూస్తుంటే కాంగ్రెస్, టీడీపీ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా మల్లన్నసాగర్ నిర్మాణం ఆగదన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయకట్టు రైతులకు సూచించారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈఈ రాములు, డీఈఈ జలంధర్, కంగ్టి ఎంపీపీ రామరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశం, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గుండు నరేందర్, టీఆర్‌ఎస్ కల్హేర్, మనూర్ మండలాల అధ్యక్షులు కృష్ణమూర్తి, పండరి యాదవ్, నాయకులు రాంసింగ్, గుండు మోహన్, బాసిత్, రాఘవరెడ్డి, సాయగౌడ్, మహిపాల్‌రెడ్డి, గుండు విటల్, సర్పంచ్‌లు మనష్ పాటిల్, రాములు, ఎంపీటీసీలు సంజీవరావు, రాజుకుమార్, ప్రకాశ్, నారాయణఖేడ్ ఉపసర్పంచ్ నజీబ్ పాల్గొన్నారు.