త్వరలో ‘నల్లవాగు’ పనులు
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టు పనులు ఏప్రిల్ తర్వాత ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం శాసనసభ దృష్టికి తెచ్చారు. 0.764 టీడీఎంసీ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టువల్ల 6 వేల ఎకరాలకు సాగునీరందుతుందని, రూ.19 కోట్లతో పనులు చేపట్టబోతున్నామని అన్నారు. ఏప్రిల్ నెలలో పనులకు అనుమతులు వస్తా యని, ఆ వెంటనే దాన్ని ఆధునీకరించే పనులు మొదలుపెడతామన్నారు. గత పాల కులు దాన్ని పట్టించుకోకపోవటంతో అది ఎందుకూ కొరగాకుండా పోయిందన్నారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రశ్నకు సమా ధానంగా ఆయన ఈ వివరాలు సభముందుం చారు. ఇటీవల బడ్జెట్‌లో కొత్తగా ప్రకటించిన కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు నిరుపేద గ్రామీణులకు ఎంతో ఉపయోగంగా ఉంటా యని అధికారపక్ష సభ్యులు రేఖానాయక్, రవీందర్‌కుమార్, మదన్‌లాల్‌లు పేర్కొ న్నారు. ఆ కిట్లలో ఏయే వస్తువులుంటాయో వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సభ దృష్టికి తెచ్చారు. శిశువులు, బాలింతలకు ఉప యోగపడేలా 19 రకాల వస్తువులుం టాయని, ఒక్కో కిట్ విలువ రూ.2 వేలు ఉంటుందని పేర్కొన్నారు. ఏదో నామ్‌కేవాస్తేలా కాకుండా అన్నీ నాణ్యమైన వస్తువులనే కిట్‌లో ఉంచుతామన్నారు. ఈ పథకం సరిగా అమలయ్యేలా ప్రత్యేకంగా ఓ అధికారిని పర్యవేక్షణ కోసం నియమిస్తామన్నారు.
వాయిదా తీర్మానాల తిరస్కరణ
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి, సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించినట్టు స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు.