Nalo Okkadu
-
రెండు కోణాలున్న పాత్ర ఇది : సిద్ధార్థ్
‘‘ఇప్పటివరకు నేను పాతిక చిత్రాలు చేస్తే, వాటిలో పన్నెండు తెలుగు సినిమాలున్నాయి. ఆ విధంగా తెలుగు పరిశ్రమతో నాది విడదీయరాని అనుబంధం. వచ్చే ఏడాది తెలుగులో రెండు చిత్రాలు చేయనున్నా. ‘నాలో ఒక్కడు’ సినిమా ఒక వినూత్న ప్రయత్నం. ఇందులో రెండు కోణాలున్న పాత్రలో కనిపిస్తా’’ అని హీరో సిద్ధార్థ్ అన్నారు. ప్రసాద్ రామర్ దర్శకత్వంలో ఆయన నటించిన తమిళ చిత్రం ‘ఎనక్కుళ్ ఒరువన్’ తెలుగులో ‘నాలో ఒక్కడు’ పేరిట అనువాదమైంది. కోనేరు కల్పన సారథ్యంలో ఈ చిత్రాన్ని ప్రకృతి విడుదల చేస్తున్నారు. సంతోష్ నారాయణ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నాని ఆవిష్కరించి, సందీప్కిషన్కి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని సి. కల్యాణ్ విడుదల చేశారు. -
కలలో ఏం జరిగింది?
కలలో జరిగిందే నిజం అనుకునే వ్యక్తి చుట్టూ తిరిగే కథాంశమే ‘నాలో ఒకడు’. ప్రసాద్ రమర్ దర్శకత్వంలో సిద్ధార్ధ్ , దీపసన్నిధి జంటగా సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఎనకుల్ ఒరువన్’. ఈ చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం తమిళంలో విడుదలై అన్ని చోట్లా మంచి టాక్ తెచ్చుకుంది. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ మూడో వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం. మా సంస్థ నుంచి గతంలో వచ్చిన ‘పిశాచి’ చిత్రం కన్నా ఇది ఘన విజయం సాధిస్తుంది’’ అని తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: ఎస్.వి.రావు.