Nandan
-
పాపం 'నందన్'
తోటి చిన్నారులతో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసు ఆ బాలుడిది. చక్కగా స్కూల్‌కి వెళ్లి చదువుకోవాల్సిన సమయంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నాడు. బాధ కలిగినప్పుడు ఏడవడం తప్ప.. తనకున్న జబ్బుఏంటో కూడా తెలియదు. నెల్లూరు, కలిగిరి: మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ కందులవారిపాళెం గ్రామానికి చెందిన మార్తుల సుధాకర్‌రెడ్డి, అనూష దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు హసిక్ నందన్ కుమార్‌రెడ్డి (9) ఉన్నాడు. వీరు వ్యవసాయ కూలీగా చేస్తుంటారు. నందన్ పుట్టుకతోనే దివ్యాంగుడు. ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయింది. మరో కిడ్నీలో రాళ్లు ఉండి ఇన్ఫెక్షన్ చేరింది. ప్రత్యేక పైపు ఏర్పాటు చేస్తేనే మూత్రం వస్తుంది. వెన్నునొప్పి ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. నందన్‌కు 6 నెలల వయసు నుంచే హైదరాబాద్, చెన్నై, తిరుపతి, గుంటూరుల్లోని పలు వైద్యశాలల్లో చికిత్స చేయించారు. ఇప్పటివరకు సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. అయితే పరిస్థితిలో మార్పురాలేదు. తల్లిదండ్రులతో నందన్ పింఛన్ ఇవ్వాలంటూ.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నందన్ పరిస్థితి చూసి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి చలించిపోయారు. స్వయంగా కలెక్టర్ వద్దకు ఆ బాలుడిని, అతని తల్లిదండ్రులను తీసుకువెళ్లి కలిశారు. పేద కుటుంబానికి చెందిన నందన్‌కు డయాలసిస్ చేయించేందుకు పింఛన్ మంజూరు చేయించాలని సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే సూచనల మేరకు కలెక్టర్ నందన్ వైద్యానికి కొంత నిధులు అందించారు. డయాలసిస్ పింఛన్ అందించడానికి సహకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం నందన్‌కు దివ్యాంగుల పింఛన్ అందుతోంది. అప్పులు చేసి.. తలకు మించిన భారమైనా సుధాకర్‌రెడ్డి, అనూష అప్పులు చేసి కొడుక్కి వైద్యం చేయిస్తున్నారు. మూత్రం పోసుకోవడానికి ఇంటి వద్దే తల్లిదండ్రులు బ్యాగ్‌లు మారుస్తున్నారు. కిడ్నీ మార్చాలంటే ముందు మూత్ర సంబంధిత సమస్యను పరిష్కరించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వెన్నుపూస సమస్య ఉండటంతో ఎక్కువసేపు కూర్చున్నా, పడుకున్నా నొప్పులతో బాధపడుతున్నాడు. నందన్ వైద్యానికి సుమారు రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు అవుతుందని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. కూలి పనులు చేసుకునే నందన్ తల్లిదండ్రులు అంత ఖర్చుపెట్టి వైద్యం చేయించే స్తోమత లేక ఒక్కగానొక్క కుమారుడి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమ బిడ్డ వైద్యానికి సహకరించాలని కోరుతున్నారు. సాయం కోరుతాం జగనన్న పాదయాత్ర సమయంలోమా గ్రామానికి వచ్చినప్పుడు కలిసి మా పరిస్థితి వివరించాం. త్వరలో ఆయన్ని కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించి సాయం కోరుతాం. – మార్తుల అనూష,నందన్ తల్లి నందన్ తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు పేరు: మార్తుల అనూష బ్యాంక్: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సిద్ధనకొండూరు అకౌంట్ నంబర్: 91073257658 ఐఎఫ్ఎస్ కోడ్: APGB0004016 సెల్ నంబర్: 94932 06631 -
స్వీయ నిర్బంధంలో నటి కుమారుడు
-
స్వీయ నిర్బంధంలో మణిరత్నం కుమారుడు
చెన్నై : ప్రముఖ దర్శకుడు మణిరత్నం, సీనియర్ నటి సుహాసినిల కుమారుడు నందన్ మణిరత్నం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కొద్దిరోజుల క్రితం లండన్ నుంచి వచ్చిన ఆయన కరోనా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షలో కరోనా నెగిటివ్ వచ్చినప్పటికి బాధ్యతగా వ్యవహరించి తనకు తాను స్వీయ నిర్బంధం విధించుకున్నారు. తమ ఇంట్లోని ఓ ప్రత్యేక గదిలో ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సినీ నటి ఖుస్భూ ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో స్వీయ నిర్బంధంలో ఉన్న నందన్‌తో తల్లి సుహాసిని గ్లాస్ విండో ద్వారా మాట్లాడిన దృశ్యాలు ఉన్నాయి. ‘ బాధ్యత కలిగిన వ్యక్తులు చేసే పనిది. సుహాసిని, నందన్‌మణిరత్నాలకు నా అభినందనలు. వీరి నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉంది. నీ స్వీయ నిర్బంధం చక్కగా గడవాలని కోరుకుంటాన్నా’నని ఖుస్భూ పేర్కొన్నారు. కాగా, తమిళనాడులో ఇప్పటి వరకు 9.. దేశ వ్యాప్తంగా 415 కరోనా కేసులు నమోదవ్వగా 8 మంది మృత్యువాత పడ్డారు. -
చిన్నారి ఆ‘నందన్’..
ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం సంగతి ఎలా ఉన్నా సామాజిక మాధ్యమాల పుణ్యమా అని చిన్నారుల ఆకాంక్షలు కూడా అత్యంత సులభంగా తీరిపోతున్నాయనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ. రాహుల్ గాంధీ.. తను పోటీకి దిగిన కేరళలోని వయనాడ్‌లో గత మూడు రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన బుధవారం కేరళలోని కన్నూర్ జిల్లాకు వచ్చారు. కన్నూర్ జిల్లా ఆడిటోరియంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తొమ్మిది గంటలకు సభ మొదలు కావాల్సి ఉంది. అయితే ఒకసారి రాహుల్ గాంధీని చూడాలన్న కోరికతో ఏడేళ్ల నందన్ అనే బాలుడు తన తల్లిదండ్రులతో సహా ఉదయం ఐదు గంటలకే సభా ప్రాంగణానికి చేరుకున్నాడు. రాహుల్‌ను అభిమానించే నందన్‌కు దాదాపు ఐదు గంటలు ఎదురు చూసినా రాహుల్ దర్శనం దక్కలేదు. భద్రతా ఏర్పాట్ల రీత్యా అతడిని లోనికి అనుమతించకపోవడంతో నందన్ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని నందన్ తండ్రి ఫేస్బుక్లో పెట్టడంతో విషయం రాహుల్ దృష్టికి చేరింది. ఫోన్ చేసి పలకరించిన రాహుల్ ఇదిలా ఉండగా హఠాత్తుగా రాహుల్ గాంధీ తన వీరాభిమాని అయిన ఆ బాలుడు తల్లికి ఫోన్ చేసి ‘నేను రాహుల్ గాంధీని మాట్లాడుతున్నాను. నేను మీ అబ్బాయితో మాట్లాడొచ్చా’’ అని ప్రశ్నించడంతో ఉబ్బితబ్బిబ్బయిన ఆ తల్లి తన కుమారుడి చేతికి ఫోన్ ఇచ్చి మురిసిపోయిందట. చొక్కా జేబుకు రాహుల్ ఫొటో పెట్టుకుని, జేబులో తనకి అత్యంత ఇష్టుడైన రాహుల్ గాంధీని కలవాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతూ, ఎప్పటికైనా రాహుల్ గాంధీని కలుస్తానంటూ ఓ లేఖ రాసుకుని వచ్చిన బుడతడి గురించి నందన్ తండ్రి ఫేస్బుక్లో పెట్టాడు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ దివ్యస్పందన గురువారం ఈ కథనాన్ని పోస్ట్ చేసింది. దాంతో పాటు రాహుల్‌తో మాట్లాడాలన్న నందన్ కోరిక తీరనుందని కూడా వ్యాఖ్యానించింది. ట్విట్టర్ వ్యాఖ్యలకు అనుగుణంగానే రాహుల్ నందన్‌తో మాట్లాడటం అందరినీ ఆనందంలో ముంచెత్తింది. -
నా కొడుకుకు సాయం చేయండి ప్లీజ్
తమిళసినిమా: నా కొడుకుకు ఎవరైనా సాయం చేయండి ప్లీజ్ అంటూ నటి సుహాసిని మణిరత్నం వేడుకున్నారు. అదేమిటీ ఆమెకలాంటి దుస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తవచ్చు. పరిస్థితుల ప్రభావం ఆమెనలా విజ్ఞప్తి చేసేలా చేసింది. దర్శకుడు మణిరత్నం, సుహాసిని దంపతులకు నందన్ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. అతనికి వారి తల్లిదండ్రుల మాదిరిగా సినిమాల్లో రాణించాలన్న ఆసక్తి లేదట. ఈ విషయాన్ని నటి సుహాసినే ఒక భేటీలో తెలిపారు. తన కొడుకుకు రాజకీయాల్లో రాణించాలన్న ఆసక్తి ఉందని చెప్పారు. కాగా నందన్ ఇటలీలో పాలిటిక్స్‌కు సంబంధించిన విద్య అభ్యసిస్తున్నాడు. ఇతడు కాంటర్స్ ఆఫ్ లెనినిజమ్ పేరుతో లెనిన్ గురించి 15 పేజీలతో కూడిన పుస్తకాన్ని తన 15వ ఏటనే రాశాడన్నది గమనార్హం. ఆదివారం నందన్ ఇటలీ దేశంలోని వెనిస్ నగరానికి వెళుతుండగా మార్గమధ్యలో వెలనో అనే ప్రాంతంలో తస్కరణకు గురయ్యాడు. తన వద్ద ఉన్న డబ్బు, ఇతర వస్తువులు దొంగతనానికి గురవడంతో ఏం చేయాలో పాలు పోక ఇక్కట్ల పాలయ్యాడు. ఈ సంఘటన గురించి తెలిసిన నటి సుహాసిని వెంటనే తన కొడుకుకు ఎవరైనా సాయపడగలరా అంటూ అతని ఫోన్ నంబరును పొందుపరస్తూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సాయం చేయగలిగిన వారే ఆ నంబరుకు ఫోన్ చేయాలని, అలా చేయనివారు ఫోన్ చేయవద్దని పేర్కొన్నారు. అందరూ ఫోన్ చేసి చార్జింగ్ అవ్వచేయవద్దనీ మనవి చేశారు. ఈ విజ్ఞప్తికి కొన్ని గంటల వ్యవధిలోనే మంచి స్పందన వచ్చిందట. నందన్‌కు సాయం అందిందట. వెంటనే నటి సుహాసిని ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
ఈ యముడు చాలా డిఫరెంట్
‘‘యమధర్మరాజు పాత్రలో తారకరత్న అద్భుతంగా నటించారు. అచ్చం పెద్దాయన ఎన్టీఆర్ పరకాయప్రవేశం చేసినట్టుగా అనిపించింది. ఇప్పటి వరకూ తెలుగు తెరపై రాని, కనీ వినీ ఎరుగని కథాంశమిది’’ అని నిర్మాత పి.ఎన్.ఎస్.గౌడ్ తెలిపారు. నందమూరి తారకరత్న యమధర్మరాజుగా నటించిన సోషియో - ఫ్యాంటసీ చిత్రం ‘వీడు చాలా వరస్ట్’. నందన్, నీరజ్, కృష్ణ, స్వప్న ఇందులో ముఖ్య తారలు. వెంకట్ పంపన దర్శకుడు. ఎస్.ఎల్.ఎన్.ఎస్. ఫిలిమ్స్ పతాకంపై పి.ఎన్.ఎస్. గౌడ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ పంపన మాట్లాడుతూ -‘‘ఇదొక విభిన్న తరహా సోషియో-ఫ్యాంటసీ చిత్రం. మనిషి అంతర్ముఖాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. ఇప్పటివరకూ వచ్చిన యమ నేపథ్య చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నరకానికి వచ్చిన హీరోని యమధర్మరాజే స్వయంగా మళ్లీ భూలోకానికి పంపిస్తాడు. అది ఎందుకనేది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇందులో 28 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉన్నాయి. యముడిపై తీసిన పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వర్, సంగీతం: పార్థసారథి, సమర్పణ: లక్ష్మీ మల్లాగౌడ్, సహ నిర్మాత: నరేష్ గౌడ్. -
మణిరత్నం ఇంట్లో కార్ల్ మార్క్స్
అనంతరం: ప్రతి కొడుకూ తన తండ్రిని హీరోగా భావిస్తాడు. ఆయన అడుగుల్లో అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆయన మార్గంలో తానూ పయనించాలనుకుంటాడు. కానీ నందన్ అలా అనుకోలేదు. తండ్రి దేశం గర్వించదగ్గ దర్శకుడు. అయినా కూడా సినిమావైపు కన్నెత్తి చూడలేదు నందన్. పోనీ తల్లిలా మేకప్ వేసుకున్నాడా అంటే అదీ లేదు. తనదైన మార్గం ఎంచుకున్నాడు. తనకు నచ్చిన పంథాలో సాగిపోవాలని అనుకుంటున్నాడు. తను నమ్మిదాన్నే ఆచరిస్తానంటున్నాడు. ఇంతకీ సుహాసిని, మణిరత్నంల కొడుకు నందన్ ఏ దారిలో ఉన్నాడు? సినిమా తప్ప మరో మాటే వినిపించని కుటుంబంలో పుట్టినా, ఆ మూడక్షరాలూ నందన్ని ప్రభావితం చేయలేకపోయాయి. జాతీయ అవార్డుల్ని అలవోకగా తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకునే తల్లి లాలనలో పెరిగాడు. దర్శకుడు అనగానే అందరి మనసుల్లోనూ మెదిలేంత ప్రతిభావంతుడైన తండ్రి చేయి పట్టుకుని ఎదిగాడు. అయినా వారి ప్రభావం నందన్ మీద లేదు. వారి దగ్గర నడక నేర్చుకున్నాడే తప్ప, వారు వెళ్లిన దారిలో నడవాలనుకోలేదు. వాళ్లున్న రంగాన్ని గౌరవించాడే తప్ప, అటు వెళ్లిపోవాలని ఆశించలేదు. అలా అనుకుని ఉంటే... నందన్ గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు. వయసును మించిన మేధస్సు... రంగుల ప్రపంచం మధ్యలో పెరిగిన నందన్ని ఆ రంగుల కంటే అక్షరాలు ఎక్కువ ఆకర్షించాయి. అందుకే సినిమాలు చూస్తూ కాక, పుస్తకాలు చదువుతూ పెరిగాడు. పుస్తకం కనిపిస్తే పూర్తిగా చదివేదాకా నిద్రపోయేవాడు కాదు. పసితనపు ఛాయలు పోకముందే మార్క్సిజాన్ని అవగాహన చేసుకున్నాడు. యుక్త వయసు వచ్చేనాటికి లెనినిజాన్ని ఔపోసన పట్టాడు. పదిహేడేళ్లు వచ్చేప్పటికి మార్కిస్ట్-లెనినిస్టు ఐడియాలజీని ఒంటబట్టించుకుని, ‘ద కాంటూర్స్ ఆఫ్ లెనినిజం’ పేరుతో ఇరవయ్యేడు పేజీల పాంప్లెట్ను రూపొందించాడు. ‘తత్వ శాస్త్రానికి, రాజకీయ సంస్కరణ, ఆచరణలకు అతి మెరుగైన, సర్వకాల రూపమే మార్క్సిజం’ అంటూ ఓ అనుభవ జ్ఞుడైన ప్రొఫెసర్లా లోతుగా ఉన్న అతడి భావాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అప్పుడే తొలిసారి అతడు మణిరత్నం కొడుకుగా కాక, ఓ జీనియస్‌గా, అభ్యుదయ భావాలు కల యువకుడిగా ప్రపంచానికి పరిచమయ్యాడు. ఊహించని అడుగు... చిన్న వయసులోనే ఎవరూ ఊహించని అడుగులు వేశాడు నందన్. ఎప్పుడైతే సీపీఐ(ఎం) తరుఫున వాలంటీరుగా పనిచేయడం మొదలెట్టాడో... అప్పుడే అతడి మనసు రాజకీయాల వైపు లాగుతోందని అర్థమైంది తల్లిదండ్రులకి. వాళ్లెప్పుడూ కొడుకుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోలేదు. అతడేం చేసినా తోడుగా నిలవాలనుకున్నారు. ‘నందన్‌కి పాలిటిక్స్ అంటే ఇష్టం. తన ఇష్టాన్ని గౌరవించడం మాకిష్టం. అందుకే తన నిర్ణయాన్ని మేం ప్రోత్సహించాం’ అన్నారందుకే సుహాసిని ఓ ఇంటర్వ్యూలో. కానీ సుహాసినికి చిన్నాన్న, నందన్‌కి చినతాత అయిన నటుడు కమల్ హాసన్... నందన్ సినిమా రంగం వైపు రావాలని ఆశిస్తున్నారు. తనని ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో కలిసి పనిచేసే విధంగా ప్రోత్సహించారని, నందన్ కూడా అందుకు అంగీకరించాడని తెలుస్తోంది. అయితే రాజకీయాల మీద మనసు ఉన్న నందన్, సినిమా రంగంవైపు వెళ్లగలడా! పెద్దవాళ్ల మాటను కాదనలేక వెళ్లినా మనసు లేని చోట ఇమడగలడా! అతడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు... వేచి చూడాల్సిందే! - సమీర నేలపూడి