narayana reddy murder case
-
ఖాజాగూడలో హత్య.. జిన్నారంలో కాల్చివేత
గచ్చిబౌలి: తమ అంతస్తుకు తగ్గట్లుగా ఆర్థికంగా లేడని కూతురు ప్రేమ వివాహన్ని జీర్ణించుకోలేక ఓ తండ్రి సుపారీ ఇచ్చి అల్లుడిని హత్య చేశాడని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమ వివాహం చేసుకున్న నారాయణరెడ్డి హత్య కేసు వివరాలను ఆమె వెల్లడించారు. పొదల కొండపల్లి గ్రామం, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లాకు చెందిన శనివారపు మెంకట నారాయణరెడ్డి(25) సాఫ్ట్వేర్ ఇంజనీర్. కేపీహెచ్బీలో నివాసం ఉంటున్నాడు. తన స్వగ్రామానికి చెందిన రవళిని సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకొని ఢిల్లీలో ఉంటున్నారు. రవళిని పంపిస్తే పెద్దల సమక్షంలో వివాహం జరిపిస్తామని రవళి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి నమ్మించి రప్పించారు. రవళిని ఇంటి వద్ద ఉంచుకొని వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న వెంకట నారాయణరెడ్డి తనతో భార్య కలిసి ఉన్న ఫొటోలను బందువులకు, తెలిసిన వారికి చూపించి పెళ్లి కాకుండా అడ్డుకుంటున్నాడు. ఈ క్రమంలో ద్వేషం పెంచుకున్న రవళి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి తన కూతురును ప్రేమ వివాహం చేసుకున్న వెంకట నారాయణరెడ్డిని అడ్డుతొలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన బందువైన చైతన్యపురిలో నివాసం ఉంటూ ఐస్‌క్రీం పార్లర్ నిర్వహించే గాజులపల్లి శ్రీనివాస్‌రెడ్డి(20)కి రూ.4.5 లక్షలకు సుపారీ ఇచ్చాడు. అడ్వాన్సుగా రూ.50 వేలు ఇవ్వగా శ్రీనివాస్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ కమలపాటి కాశి(20), షేక్ ఆషిక్(20)లు కలిసి నూజివీడు వెళ్లి కారు అద్దెకు తీసుకున్నారు. తిరిగి కారులో షేక్‌పేటకు వచ్చి లాడ్జిలో అద్దెకు ఉన్నారు. జూన్ 26న కేపీహెచ్‌బీలోని రెడ్ చిల్లీ రెస్టారెంట్‌కు వెంకట నారాయణరెడ్డిని రప్పించారు. కూల్‌డ్రింక్స్‌లో కొద్ది మోతాదులో మత్తు బిల్లలు కలిపి ఇచ్చారు. కొద్ది సేపటికే వెంకట నారాయణరెడ్డి తనకు పని ఉందని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. జూన్ 27న పార్టీ జరుపుకుందామని రాయదుర్గం రావాల్సిందిగా పిలిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ఖాజాగూడ చెరువు వద్ద కారులో ముందు సీట్లో కూర్చున్న వెంకటనారాయణ రెడ్డి మెడకు టవల్, చార్జర్ కేబుల్ బిగించి హతమార్చారు. చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌లో బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి జిన్నారం అటవీ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని కాల్చి వేశారు. అక్కడి నుంచి కర్నూల్‌కు వెళ్లాడు. తన బావమరిది వెంకట నారాయణ రెడ్డి కనిపించడం లేదని, సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉందని జూన్ 30న కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టి నిందితుడు కాశిని అరెస్ట్ చేశారు. కాశి అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, అషిక్లు కర్నూల్‌కు పారిపోయి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు అస్వస్థతకు గురికావడం గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న రవళి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల నుంచి రూ.7,160, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
కేఈ శ్యాంబాబు నిందితుడే
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుతోపాటు టీడీపీకి చెందిన ఆస్పరి మండల జెడ్పీటీసీ సభ్యురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్ది ఎస్ఐ నాగతులసీ ప్రసాద్‌లను డోన్ కోర్టు నిందితులుగా పేర్కొంది. ముగ్గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు డోన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆంజనేయులు శుక్రవారం తీర్పు వెలువరించారు. ‘‘నారాయణరెడ్డి హత్య ఘటనలో కేఈ శ్యాంబాబు, బొజ్జమ్మ, నాగతులసీ ప్రసాద్‌ల పాత్రపై ఆధారాలను బట్టి కచ్చితంగా కోర్టు విచారణ జరపాల్సిందే. అందువల్లే ఐపీసీ సెక్షన్ 147, 148, 149 (గుంపుగా మారణాయుధాలతో తిరగడం), 302(హత్య), 109(తప్పు చేసేందుకు సహకరించడం), మారణాయుధాల చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ 120(బీ)(కుట్ర చేయడం) కింద వీరిపై కేసులు నమోదు చేయాలి. ఇందుకు అనుగుణంగా ఈ ముగ్గురిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తున్నాం. తదుపరి విచారణను మార్చి 1వ తేదీన చేపడతాం’’అని న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశారు. -
శ్యామ్‌బాబు కనబడుతున్నా అరెస్టు చేయరా?
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో నిందితుడైన కేఈ శ్యామ్‌బాబు పోలీసుల ఎదుటే తిరుగుతున్నా అరెస్టు చేయకపోవడం దారుణమని పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి ధ్వజమెత్తారు. సోమవారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడారు. కంబాలపాడులోని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్వగృహంలో సోమవారం జరిగిన గౌరీ నోములు కార్యక్రమంలో ఆయన కుమారుడు కేఈ శ్యామ్‌బాబు పాల్గొన్నట్లు తెలిపారు. శ్యామ్‌బాబు ఉదయం నుంచి సాయంత్రం వరకు కంబాలపాడులోనే ఉన్నారని, అక్కడ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నా.. అరెస్టు చేయకపోవడం దారుణమని అన్నారు. కేఈ కృష్ణమూర్తి తన కొడుకు అరెస్టు కాకుండా చూస్తున్నారని చెప్పారు. తన భర్త చనిపోయి దాదాపు 5 నెలలు గడిచినా నిందితులను అరెస్టు చేయకపోవడం ఏమిటని శ్రీదేవి ప్రశ్నించారు. శ్యామ్‌బాబు కోసం పలు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్లు జిల్లా పోలీసులు చెబుతున్నా.. ఆయన మాత్రం పత్తికొండ నియోజకవర్గంలోనే యథేచ్ఛగా తిరుగుతున్నారని వెల్లడించారు. హత్య కేసులో 14వ నిందితుడు కేఈ శ్యామ్‌బాబు. ప్రతిపక్షమైతే ఇలా... రోడ్డు పక్కన కారు ఆపినందుకు ఆదివారం వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజాపై దాడి చేస్తున్న ఎస్సై నాగరాజు -
చంపుతారేమోనని చంపేశారు : డీఐజీ
-
చంపుతారేమోనని చంపేశారు : డీఐజీ
నారాయణరెడ్డి హత్య కేసులో 12 మంది అరెస్టు కర్నూలు: చెరుకులపాడు గ్రామానికి చెందిన పెద్ద బీసన్న కుమారుడు రామాంజనే యులు, కోతుల రామానాయుడులను చంపుతామని నారాయణరెడ్డి మనుషులు బెదిరించడం వల్లే పత్తికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి చెరుకులపాడు నారా యణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివుడులను ప్రత్యర్థులు హత్య చేసిన ట్లు పోలీసులు విచారణలో తేల్చారు. నారా యణరెడ్డి హత్య కేసులో 12 మంది నింది తులను డోన్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్ కాల్వబుగ్గ వద్ద అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన రెండు ట్రాక్టర్లు, వేటకొడవళ్లను స్వాధీనం చేసుకొని బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు. నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు. కాగా, ఈనెల 21వ తేదీన నారాయణరెడ్డి, బోయ సాంబశివుడు కృష్ణగిరి పొలిమేరల్లో హత్యకు గురయ్యారని గొళ్ల కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు కృష్ణగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ నేతృత్వంలో మూడు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నట్లు డీఐజీ వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో లేని మరో ఐదుగురి పేర్లు కూడా విచారణలో బైటకి వచ్చాయన్నారు. కేసు విచారణ ఫలితాన్ని బట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు. -
త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటాం: ఎస్పీ
కర్నూలు: పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రవికృష్ణ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ హత్య జరిగిన వెంటనే సీఐ, డీఎస్పీ, ఎస్ఐ ఘటనా స్థలికి చేరుకున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగానే నారాయణరెడ్డి వెపన్ డిపాజిట్ చేశారన్నారు. ఎన్నికల అనంతరం సమాచారం ఇచ్చినా వెపన్ తీసుకోలేదని ఎస్పీ పేర్కొన్నారు. రెన్యువల్ కాలేదని వెపన్ సీజ్ చేసిన సందర్భం గత అయిదేళ్లుగా జిల్లాలో ఒక్కటీ కూడా జరగలేదన్నారు. ప్రాణహాని ఉన్నవారు హఠాత్తుగానే ప్రయాణాలు చేయాలని తప్ప, ముందస్తుగా ఎవరికీ సమాచారం ఇవ్వకూడదని ఎస్పీ రవికృష్ణ అన్నారు. స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారంతోనే ప్రయాణాలు చేయాలని సూచించారు. ఫ్యాక్షన్ వల్ల జిల్లాతో పాటు పలు గ్రామాలు చాలా నష్టపోతున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశామని ఎస్పీ వెల్లడించారు.