శ్యామ్‌బాబు కనబడుతున్నా అరెస్టు చేయరా? | Ysrcp leader sridevi comments on Shambabu issue | Sakshi
Sakshi News home page

శ్యామ్‌బాబు కనబడుతున్నా అరెస్టు చేయరా?

Published Tue, Oct 31 2017 3:56 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

Ysrcp leader sridevi comments on Shambabu issue - Sakshi

హత్య కేసులో నిందితుడు ఇలా... సోమవారం కంబాలపాడులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహా కుటుంబ సభ్యులతో కలిసి గ్రూపు ఫొటో దిగిన కేఈ శ్యామ్‌బాబు(సర్కిల్‌లో). చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో నిందితుడైన శ్యామ్‌ ఇంత బహిరంగంగా, పోలీసుల ఎదుటే తిరుగుతున్నా అరెస్టు చేయకపోవడం గమనార్హం.

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో నిందితుడైన కేఈ శ్యామ్‌బాబు పోలీసుల ఎదుటే తిరుగుతున్నా అరెస్టు చేయకపోవడం దారుణమని పత్తికొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి ధ్వజమెత్తారు. సోమవారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడారు. కంబాలపాడులోని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్వగృహంలో సోమవారం జరిగిన గౌరీ నోములు కార్యక్రమంలో ఆయన కుమారుడు కేఈ శ్యామ్‌బాబు పాల్గొన్నట్లు తెలిపారు.

శ్యామ్‌బాబు ఉదయం నుంచి సాయంత్రం వరకు కంబాలపాడులోనే ఉన్నారని, అక్కడ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నా.. అరెస్టు చేయకపోవడం దారుణమని అన్నారు. కేఈ కృష్ణమూర్తి తన కొడుకు అరెస్టు కాకుండా చూస్తున్నారని చెప్పారు. తన భర్త చనిపోయి దాదాపు 5 నెలలు గడిచినా నిందితులను అరెస్టు చేయకపోవడం ఏమిటని శ్రీదేవి ప్రశ్నించారు. శ్యామ్‌బాబు కోసం పలు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్లు జిల్లా పోలీసులు చెబుతున్నా.. ఆయన మాత్రం పత్తికొండ నియోజకవర్గంలోనే యథేచ్ఛగా తిరుగుతున్నారని వెల్లడించారు. హత్య కేసులో 14వ నిందితుడు కేఈ శ్యామ్‌బాబు. 

ప్రతిపక్షమైతే ఇలా...
రోడ్డు పక్కన కారు ఆపినందుకు ఆదివారం వైఎస్సార్‌సీపీ నేత జక్కంపూడి రాజాపై దాడి చేస్తున్న ఎస్సై నాగరాజు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement