nascom
-
అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు
అమెరికా హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజు పెంపుపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసా ధరఖాస్తు రుసుముల పెంపుతో ఇండియన్ ఐటీ కంపెనీలు గణనీయమైన సవాళ్లు, వారి ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. భారత్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ అమెరికాలో కొరత ఉన్న కొన్ని ప్రత్యేకమైన విభాగాల్ని భర్తీ చేస్తేందుకు పలు ఐటీ కంపెనీలు అత్యంత నైపుణ్యం ఉన్న వేలాది మంది టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. అయితే ఈ తరుణంలో హెచ్-1బీ సహా కొన్ని కేటగిరీల అప్లికేషన్ ఫీజులను పెంచింది అమెరికా.రూ.లక్షా పదివేలకు చేరిన ఎల్-1 వీసా దరఖాస్తు ఫీజు తాజా నిర్ణయంతో హెచ్-1బీ వీసా దరఖాస్తు ధర ఒకేసారి రూ.38వేల నుంచి (460 డాలర్లు), రూ.64వేలకు (780 డాలర్లకు) పెంచింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను రూ.829 (నాడు 10 డాలర్ల) నుంచి రూ.17వేలకు (215 డాలర్లు) పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును రూ.38వేల ( 460 డాలర్ల) నుంచి రూ.లక్షా పదివేలకు (1,385 డాలర్లకు) పెంచారు.ఈబీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను రూ.3లక్షల నుంచి (3,675 డాలర్ల) నుంచి ఏకంగా రూ.9లక్షలకు ( 11,160 డాలర్లకు) పెంచినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్లో పేర్కొంది.వీసా దారుడిపై అదనపు భారంఫలితంగా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుడు ఉద్యోగం ఇచ్చినందుకు లేదా చేస్తున్న ఉద్యోగం కాలపరిమితి పెంచుతున్నందుకు అమెరికాకు అదనంగా 33వేల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని వీసా దారుడు అప్లయి చేసుకున్న ప్రతి సారి చెల్లించాల్సి ఉంటుంది. వీసా ఫీజులపై కోర్టులో వాదనలుదీనిపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు.. భారత్ ఐటీ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాన్ని మరింత ఖరీదైనదిగా చేసే ప్రయత్నం చేస్తోందని ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ సంస్థ వాస్డెన్ లా మేనేజింగ్ అటార్నీ జోనాథన్ వాస్డెన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో వీసా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీజుల పెంపును సవాలు చేస్తూ కోర్టులో వాదిస్తున్న వారిలో వాస్డెన్ ఒకరు. ఇది అమెరికాకే నష్టంఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ సైతం వీసా రుసుముల పెంపుపై భారత్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గణనీయమైన డిమాండ్-సప్లై గ్యాప్ ఉన్న సమయంలో ఫైలింగ్ ఫీజుల పెరుగుదల వ్యాపారంపై తీవ్రం ప్రభావాన్ని చూపుతోందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ అన్నారు. అదే సమయంలో వీసా ఫీజుల పెంపు అమెరికా ఆర్ధిక వ్యవస్థకు ప్రతికూలం ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. భిన్నాభిప్రాయలు వ్యక్తం ఫీజు పెంపుదల వల్ల కాలక్రమేణా హెచ్-1బీ వీసాల వినియోగం తగ్గుతుందని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ, మరికొందరు కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు అయ్యే ఖర్చులను భరిస్తూనే ఉంటాయని మరోలా స్పందిస్తున్నారు. -
భారతీయులకు గుడ్‌న్యూస్.. డేటా రక్షణకు కొత్త బిల్లు
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటా రక్షణకు సంబంధించి కొత్త బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నాటికి తీసుకొస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖా మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును లోక్‌సభ నుంచి బుధవారం ఉపసంహరించుకున్న నేపథ్యంలో మంత్రి వైష్ణవ్ దీనిపై మాట్లాడారు. ఈ బిల్లుపై పార్లమెంట్ సంయుక్త కమిటీ మంచి నివేదిక ఇచ్చినట్టు అశ్వని వైష్ణవ్ తెలిపారు. ‘‘బిల్లులోని 99 సెక్షన్లకు గాను 81 సవరణలను సూచించింది. అలాగే, కొత్తగా మరో 12 ముఖ్యమైన సిఫారసులు కూడా చేసింది. ఈ పరిస్థితుల్లో కొత్త బిల్లు తీసుకురావడం మినహా మారో మార్గం లేదు. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు, వ్యక్తిగత సమాచార గోప్యత విషయంలో రాజీ పడకుండా కొత్త చట్టాన్ని తయారు చేశాం. పార్లమెంటు ప్రక్రియ కూడా పూర్తి చేశాం. త్వరలోనే కొత్త చట్టాన్ని అనుమతి కోసం తీసుకొస్తాం. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి కొత్త బిల్లు ఆమోదం పొందొచ్చు’’ అని మంత్రి వివరించారు. ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సమగ్రమైన కార్యాచరణతో వస్తామని ప్రకటించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైన డేటా గోప్యత, అత్యాధునిక సాంకేతికతలు, డేటా గవర్నెన్స్ కార్యాచరణ ఇందులో ఉంటాయన్నారు. అంతర్జాతీయ చట్టాలను పరిశీలించాలి: నాస్కామ్ వ్యక్తిగత సమాచార రక్షణకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ముందు, అంతర్జాతీయంగా అమల్లో ఉన్న డేటా గోప్యత చట్టాలను అధ్యయనం చేయాలని సాఫ్ట్వేర్ కంపెనీల సమాఖ్య నాస్కామ్ సూచించింది. అలాగే, కిందటి బిల్లుపై వచ్చినన అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ప్రభుత్వం డేటా రక్షణకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించిన నేపథ్యంలో నాస్కామ్ కీలక సూచనలు చేయడం గమనార్హం. గత బిల్లులో దేశాల మధ్య డేటా బదిలీకి సంబంధించి కఠినమైన నిబంధనల పట్ల దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు గగ్గోలు పెట్టడం తెలిసిందే. డేటా ఆధారిత సేవలు సురక్షితంగా, విశ్వసనీయ మార్గంలో వృద్ధి చెందేలా అవకాశం కల్పించాలని నాస్కామ్ కోరింది. సంప్రదింపుల్లో భాగం కల్పించండి.. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును భారత్ వెనక్కి తీసుకోవడాన్ని అంతర్జాటీయ టెక్నాలజీ దిగ్గజాలు అభినందించాయి. కొత్త బిల్లుకు సంబంధించి చర్చల్లో తమకూ భాగస్వామ్యం కల్పించాలని అమెరికాకు చెందిన ఐటీఐ కోరింది. ఇందులో గూగుల్, మెటా, అమెజాన్ తదితర కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ‘డిజిటల్ ఎకోసిస్టమ్‌కు సంబంధించి సమగ్రమైన న్యాయ కార్యాచరణను (కొత్త చట్టం) తిరిగి పరిశీలించే విషయంలో బలమైన భాగస్వామ్యుల సంప్రదింపులకు అవకాశం కలి్పంచాలనే ప్రణాళికను ఐటీఐ స్వాగతిస్తోంది’అని ఐటీఐ కంట్రీ మేనేజర్ (భారత్) కుమార్‌దీప్ తెలిపారు. ఇది కూడా చదవండి: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్... -
ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేశా: పూనమ్ కౌర్
సాక్షి, చౌటుప్పల్: రైతులు, చేనేతలు.. దేశానికి వెన్నెముకలాంటివారని ప్రముఖ సినీనటి పూనమ్‌కౌర్ అన్నారు. కరోనాతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లోని 220 మంది చేనేత కార్మికులకు హైదరాబాద్‌లోని నాస్కామ్ ఫౌండేషన్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని ఎస్సీఎస్సీ సంస్థల సౌజన్యంతో సమకూర్చిన నిత్యావసర సరుకులను ఆదివారం చౌటుప్పల్‌లోని పద్మావతి ఫంక్షన్హాల్లో పంపిణీ చేసి మాట్లాడారు. ఈ రెండురగాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అవ్వేవని తెలిపారు. నేతన్నల కళా నైపుణ్యం ఎంతో గొప్పదని కొనియాడారు. పర్యావరణానికి అనుగుణంగా చేనేత వస్త్రాలు ఉంటాయన్నారు. మాట్లాడుతున్న ప్రముఖ సినీనటి పూనమ్‌కౌర్ తమ తండ్రి 30ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి చీరల వ్యాపారం ప్రారంభించారన్నారు. తాను సైతం ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేశానన్నారు. చేనేత కార్మికుల ఇండ్లకు వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నానని, మగ్గం సైతం నేసానని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వాలు చేనేత, వ్యవసాయ రంగాలకు చేయూతనివ్వాలని కోరారు. అనంతరం చేనేత సంఘంలోని వస్త్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక చేనేత సంఘం అధ్యక్షుడు కందగట్ల భిక్షపతి, యర్రమాద వెంకన్న, బడుగు మాణిక్యం, గోశిక స్వామి, గుర్రం నర్సింహ్మ, గోశిక ధనుంజయ, నల్ల నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు. -
నిషేధంతో మరింత బిజినెస్: నాస్కామ్
ఐటీ నిపుణులు అత్యధికంగా పొందే H1-Bసహా పలు వీసాలపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించడం ద్వారా దేశీ ఐటీ కంపెనీలకు మేలే జరగనున్నట్లు నాస్కామ్ తాజాగా అంచనా వేసింది. దీంతో ఆఫ్‌షోర్ సర్వీసులకు డిమాండ్ పెరగనున్నట్లు సాఫ్ట్వేర్, ఐటీ సర్వీసుల సమాఖ్య నాస్కామ్ అభిప్రాయపడింది. కోవిడ్-19 కారణంగా అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగానికి బ్రేక్ వేసే బాటలో ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ డిసెంబర్ వరకూ పలు వీసాలపై నిషేధం విధించిన విషయం విదితమే. అయితే యూఎస్‌లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత కారణంగా పలు గ్లోబల్ దిగ్గజాలు దేశీ కంపెనీల ద్వారా సర్వీసులను పొందేందుకు ఆసక్తి చూపుతాయని నాస్కామ్ పేర్కొంది. ఇది ఐటీ రంగంలో మరిన్ని ఆఫ్‌షోర్ కాంట్రాక్టులకు దారిచూపుతుందని నాస్కామ్ ఆశిస్తోంది. దిగ్గజాలు రెడీ కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో పలు విదేశీ కంపెనీలు ఆఫ్‌షోర్ సేవలపట్ల ఆసక్తి చూపుతున్నాయని.. దీంతో ఇటీవల దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు బిజినెస్ పెరిగినట్లు నాస్కామ్ పేర్కొంది. ఐటీ రంగంలో కీలక(క్రిటికల్) సర్వీసులకు ఆఫ్‌షోర్ విధానంపై ఆధారపడటం పెరిగిందని తెలియజేసింది. కోవిడ్ సంక్షోభం నుంచి రికవరీ సాధించే బాటలో ప్రతీ దేశం టెక్నాలజీపై మరింత ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని నాస్కామ్ చైర్మన్, ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో ఇది దేశీ ఐటీ పరిశ్రమకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. దీనికితోడు ట్రంప్ H1-B వీసాలపై నిషేధం విధించడంతో ఆఫ్‌షోర్ కాంట్రాక్టులు పెరగనున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఐటీ విశ్లేషకులు అమిత్ చంద్ర తెలియజేశారు. క్యాప్టివ్ సెంటర్స్ సొంత అవసరాల కోసం వినియోగించుకునేందుకు దేశీయంగా ఏర్పాటు చేసే క్యాప్టివ్ సెంటర్స్‌పై విదేశీ దిగ్గజాలు దృష్టి సారించనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు సైతం పెరగనున్నట్లు అంచనా వేస్తున్నాయి. పలు గ్లోబల్ దిగ్గజాలకు దేశీయంగా 1300 క్యాప్టివ్ సెంటర్లున్నట్లు తెలియజేశాయి. వీటి ద్వారా దాదాపు పది లక్షల మంది ఐటీ నిపుణులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. ఈ కేంద్రాల నుంచి సర్వీసులను పెంచుకునేందుకు మరింతమంది ఉద్యోగులను తీసుకునే వీలున్నట్లు ఏఎన్ఎస్ఆర్ కన్సల్టింగ్ సీఈవో లలిత్ ఆహుజా చెబుతున్నారు. కోవిడ్ కారణంగా 10-15 శాతం స్థాయిలో ఉద్యోగ కల్పనకు చాన్స్ ఉన్నట్లు అంచనా వేశారు. అంటే 2021కల్లా మొత్తం లక్షమంది వరకూ నైపుణ్యమున్న సిబ్బందిని పెంచుకోవలసి ఉంటుందని వివరించారు. నిజానికి గత కొంతకాలంగా వీసాలను పొందడంలో ఎదురవుతున్న సమస్యల కారణంగా కొన్ని కంపెనీలు ఆఫ్‌షోర్ సేవలకే ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇటీవల ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సాధిస్తున్న ఆదాయంలో ఆన్‌షోర్ వాటాను ఆఫ్‌షోర్ అధిగమిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. -
పన్ను మినహాయింపులు పొడిగించాలి
ఐటీ కంపెనీలు అత్యధికంగా ఉన్న సెజ్‌లకు సంబంధించి ఈ ఏడాది మార్చితో ముగిసిపోనున్న ఆదాయపు పన్ను మినహాయింపు వెసులుబాటును మరో అయిదేళ్ల పాటు పొడిగించాలంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్..కేంద్రాన్ని కోరింది. అలాగే, అత్యంత ప్రభావం చూపగలిగే వినూత్న టెక్నాలజీలను రూపొందించే డీప్ టెక్నాలజీ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రూ. 3,000 కోట్లతో అయిదేళ్ల కాలంలో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించిన ప్రీ–బడ్జెట్ కోర్కెల చిట్టాలో నాస్కామ్ ఈ అంశాలు పొందుపర్చింది. తయారీ రంగంలోని కొత్త స్టార్టప్స్ కోసం ప్రకటించిన 15 శాతం కార్పొరేట్ ట్యాక్స్ రేటును ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్) కొత్త సర్వీస్ కంపెనీలకు కూడా వర్తింపచేయాలని నాస్కామ్ కోరింది. దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయాల్లో దాదాపు 75 శాతం వాటా ఎగుమతుల నుంచే వస్తోంది. అయితే, ట్యాక్స్ రేట్లు తక్కువగా ఉన్న ఇతర వర్ధమాన దేశాల నుంచి పోటీ దేశీ కంపెనీలకు పోటీ తీవ్రమవుతోంది. భారత్‌లో కార్పొరేట్ ట్యాక్స్ రేటు 25 శాతంగా ఉండగా చైనాలో ఐటీ..టెక్నాలజీ రంగానికి ఇది 15 శాతంగానే ఉంది. శ్రీలంకలో 14 శాతం, వియత్నాంలో తొలి 15 ఏళ్ల పాటు 10 శాతం, ఫిలిప్పీన్స్‌లో తొలి నాలుగు నుంచి ఆరేళ్ల దాకా పూర్తి మినహాయింపు.. ఆ తర్వాత నుంచి 5 శాతంగా రేటు ఉంటోందని నాస్కామ్ పేర్కొంది. మందగమనం, అంతర్జాతీయంగా పోటీ తీవ్రమవుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో పన్ను మినహాయింపు వెసులుబాటును పొడిగించిన పక్షంలో సేవల రంగానికి గణనీయంగా తోడ్పాటు లభించగలదని నాస్కామ్ పబ్లిక్ పాలసీ విభాగం సీనియర్ డైరెక్టర్ ఆశిష్ అగర్వాల్ పేర్కొన్నారు. స్టార్టప్‌లకు ట్యాక్స్ ప్రోత్సాహకాలు..! ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించే దిశగా స్టార్టప్ సంస్థలకు పన్నుపరమైన ప్రోత్సాహకాలను బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పరిశ్రమలు.. అంతర్గాత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖకు పలు సిఫార్సులు చేసినట్లు సమాచారం. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఏర్పాటైన ఇన్క్యుబేటర్లకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ ఫీజులపై జీఎస్టీ తగ్గింపు, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్‌పై(ఎసాప్స్) పన్ను ప్రయోజనాలు మొదలైనవి వీటిలో ఉన్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో భారత్.. ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా ఎదగగలదని అధికారిక వర్గాలు తెలిపాయి. శైశవ దశలో ఉన్న స్టార్టప్‌లకు ఎసాప్స్ ఉత్తమమైన సాధనాలని, వీటిపై సాధ్యమైనంత తక్కువగా పన్నులు ఉండాలని టీ కేఫ్ చెయిన్ చాయోస్ వ్యవస్థాపకుడు నితిన్ సలూజా పేర్కొన్నారు. -
నాస్కామ్ చైర్మన్‌గా విప్రో రిషద్ ప్రేమ్‌జీ
ముంబై: నాస్కామ్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను చైర్మన్‌గా విప్రోకు చెందిన రిషద్ ప్రేమ్‌జీ నియమితులయ్యారు. అజిమ్ ప్రేమ్‌జీ కుమారుడైన రిషద్ ప్రేమ్‌జీ విప్రో కంపెనీకి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. రామన్ రాయ్ స్థానంలో రిషద్ ప్రేమ్‌జీ చైర్మన్‌గా వ్యవహరిస్తారని నేషనల్ ఆసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) తెలిపింది. ఇక నాస్కామ్ వైస్ చైర్మన్‌గా కేశవ్ మురుగేశ్ నియమితులయ్యారు. ముంబైకి చెందిన గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్‌కు ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. -
వీసాల వివాదం భారత్, అమెరికాకు ప్రతికూలమే: నాస్కామ్
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసాల వివాదం మరింతగా ముదిరితే భారత్, అమెరికా రెండు దేశాల ప్రయోజనాలకూ విఘాతం కలుగుతుందని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. అమెరికన్ ఉద్యోగాలను కాపాడే పేరుతో... విదేశీయుల హెచ్–1బీ వీసాల గడువు పొడిగించకుండా కొత్త నిబంధన చేర్చేందుకు అమెరికా కసరత్తు చేస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన పక్షంలో గ్రీన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న పది లక్షల మంది పైగా హెచ్–1బీ వీసా హోల్డర్లను కూడా (ఇందులో సింహభాగం భారతీయులే ఉన్నారు) వారి వారి స్వదేశాలకు పంపించేసే అవకాశం ఉంది. ‘ఇలాంటి పరిణామం కేవలం భారతీయ ఐటీ పరిశ్రమకే కాకుండా హెచ్–1బీ వీసాలనను ఉపయోగించే భారతీయులందరిపైనా ప్రభావం చూపుతుంది. అమెరికాలో అసలు సమస్యల్లా.. సుశిక్షితులైన నిపుణులు తగినంత మంది దొరక్కపోవడమే. ఈ పరిస్థితుల్లో వీసాలపరంగా ఏ ప్రతికూల నిర్ణయం తీసుకున్నా అది ఇటు భారత్, అటు అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది‘ అని చంద్రశేఖర్ చెప్పారు. వీసా నిబంధనల్లో మార్పులతో భారత ఐటీ కంపెనీల వ్యయాలు ఏటా 5–10 శాతం మేర పెరిగిపోయే అవకాశం ఉందని గ్రేహౌండ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, చీఫ్ అనలిస్ట్ సంచిత్ వీర్ గోగియా పేర్కొన్నారు. మరోవైపు, మహీంద్రా గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్రా మాత్రం వీసాల వివాద తీవ్రతను కాస్త తగ్గించే ప్రయత్నం చేశారు. వీసాల వివాదం కారణంగా తిరిగివచ్చే వారందరికీ తాను స్వాగతం పలుకుతానని, భారత వృద్ధికి తమ వంతు కృషి చేసేందుకు వారు సరైన సమయంలో తిరిగొచ్చినట్లు అవుతుందని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విటర్లో పేర్కొన్నారు. -
వచ్చే ఏడాది 2.5 లక్షల ఐటీ కొలువులు
2016లో పరిశ్రమ వృద్ధి 12-14% - హైసియా వార్షిక సమావేశంలో నాస్కామ్ అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది(2015-16) భారత సాఫ్ట్వేర్ రంగం 12 నుంచి 14 శాతం వృద్ధిని సాధిస్తుందని, దాదాపు 2.5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా పథకంతో దేశీయ సాఫ్ట్వేర్ వినియోగం పెరగనుందని, అయితే దీన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. గురువారమిక్కడ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా) వార్షిక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రూ.9 లక్షల కోట్ల సాఫ్ట్వేర్ రంగంలో దాదాపు రూ. 6 లక్షల కోట్లు ఎగుమతులదేనని, అయితే దేశీయ మార్కెట్ ఆదాయం రూ.2 లక్షల కోట్లు మించకపోవడం శుభసూచకం కాదని చెప్పారాయన. జీఎస్టీ వంటి సంక్లిష్ట పన్నుల విధానం అమలు చేయాలంటే టెక్నాలజీ ద్వారానే సాధ్యమని తెలియజేశారు. ‘‘దాదాపు అన్ని రంగాలూ డిజిటలైజేషన్‌కు వెళుతున్నాయి. కాబట్టి దీనికి కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అని ఆయన సూచించారు. దేశీయ ఐటీ అభివృద్ధిలో స్టార్టప్ కంపెనీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని వాటి ప్రోత్సాహకానికి నాస్కామ్ పలు చర్యలు చేపట్టిందని తెలియజేశారు. దేశంలో 2010 నుంచి దాదాపు రూ.14 వేల కోట్ల పెట్టుబడులతో దాదాపు 3,100 వరకు స్టార్టప్‌లు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఇంటర్నెట్ ఆధారిత వస్తువులు (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) విస్తృతమవుతున్న నేపథ్యంలో వాటిని ప్రోత్సహించేందుకు కేంద్రం, నాస్కామ్ సంయుక్తంగా ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ బలోపేతానికి నాస్కామ్.. ఒకటిరెండు నెలల్లో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుందని తెలిపారు. -
జేఎన్టీయూహెచ్తో నాస్కామ్ ఎంవోయూ
- ప్రభుత్వపక్షాన సమన్వయకర్త ‘టాస్క్’ - నైపుణ్యాల పెంపే ధ్యేయం - పైలట్ ప్రాజెక్టుగా 50 కళాశాలల్లో శిక్షణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం సమాయత్తమైంది. పరిశ్రమలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సుల రూపకల్పనతోపాటు కోర్సు పూర్తి అయిన విద్యార్థులను ఉద్యోగార్హత కలిగినవారిగా తయారు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా సచివాలయంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో నాస్కామ్, జేఎన్టీయూహెచ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) సంస్థలు మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇదీ ప్రయోజనం: రాబోయే ఐదు, పదేళ్లలో ఉద్యోగావకాశాలు అధికంగా లభించే కోర్సులపట్ల విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. బీటెక్ మూడు, చివరి సంవత్సరం విద్యార్థులకు పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం ద్వారా కళాశాల నుంచే నేరుగా పరిశ్రమల్లో ఉద్యోగాలకు వెళ్లేందుకు ఆయా కోర్సుల దోహదపడేలా కోర్సులను రూపొందిం చారు. వివిధ రంగాల్లో రాబోయే ఆపార అవకాశాలను ముందుగానే పసిగట్టి కోర్సులను డిజైన్ చేస్తారు. ఐటీ రంగంతో మొదలు: ప్రస్తుతానికి ఐటీ రంగంలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టాలని నిర్ణయించారు. సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనాలసిస్, డిజైన్ ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా వచ్చే అవకాశమున్నందున, వచ్చే రెండేళ్లలో సుమారు 15 వేల మంది ఐటీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి 50 కళాశాలలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. కోర్సుల డిజైనింగ్, అధ్యాపకుల శిక్షణ బాధ్యత నాస్కామ్, కాలేజీల్లో కోర్సుల పరిచయం బాధ్యతను జేఎన్టీయూహెచ్ చేప ట్టనుంది. జేఎన్టీయూహెచ్, నాస్కామ్‌ల మధ్య సమన్వయకర్తగా ప్రభుత్వం తరఫున టాస్క్ పనిచేయనుంది. నైపుణ్యాల పెంపునకే ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు నిలిపేశామని కేటీఆర్ తెలిపారు.