ముంబై: నాస్కామ్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను చైర్మన్‌గా విప్రోకు చెందిన రిషద్ ప్రేమ్‌జీ నియమితులయ్యారు. అజిమ్ ప్రేమ్‌జీ కుమారుడైన రిషద్ ప్రేమ్‌జీ విప్రో కంపెనీకి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. రామన్ రాయ్ స్థానంలో రిషద్ ప్రేమ్‌జీ చైర్మన్‌గా వ్యవహరిస్తారని నేషనల్ ఆసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) తెలిపింది. ఇక నాస్కామ్ వైస్ చైర్మన్‌గా కేశవ్ మురుగేశ్ నియమితులయ్యారు. ముంబైకి చెందిన గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కంపెనీ డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్‌కు ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment