Nasir Hussain
-
అది జైస్వాల్ పెంపకంలోనే ఉంది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
India vs England, 3rd Test- Yashasvi Jaiswal: సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతూ రికార్డులు కొల్లగొడుతున్నాడు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్. బజ్‌బాల్ అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ జట్టుకు చెమటలు పట్టిస్తూ.. ప్రత్యర్థి వ్యూహాన్ని తిప్పికొడుతున్నాడు. వరుస డబుల్ సెంచరీలతో ‘బజ్‌బాల్’ పగిలి రీసౌండ్ వచ్చేలా బ్యాట్‌తో మోత మోగిస్తున్నాడు. హైదరాబాద్‌లో ‘జైస్బాల్’తో అలరించిన యశస్వి.. వైజాగ్ టెస్టు సందర్భంగా తన కెరీర్లో తొలి ద్విశతకం బాదాడు. రాజ్‌కోట్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ 214 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా జట్టు భారీ విజయంలో యశస్వి జైస్వాల్ కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ విధ్వంసకర సెంచరీ బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 151 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 153 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ప్రత్యర్థి జట్టు కూడా దూకుడుగా ఆడటం చూస్తుంటే.. అందులో మేమూ కొంత క్రెడిట్ తీసుకోవాల్సిందే అనిపిస్తుంది. టెస్టు క్రికెట్లో మా మాదిరిగానే వాళ్లూ ఆడుతున్నారు’’ అని డకెట్ పేర్కొన్నాడు. మండిపడ్డ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అయితే, డకెట్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ ఘాటు విమర్శలు చేశాడు. ‘‘జైస్వాల్ మమ్మల్ని చూసే అలా ఆడటం నేర్చుకున్నాడని అన్నట్లుగా ఆ కామెంట్ ఉంది. నిజానికి తను మీ నుంచి నేర్చుకునే స్థితిలో లేడు. కష్టపడటం అతడి పెంపకంలోనే ఉంది. బాల్యం నుంచే సవాళ్లు ఎదుర్కొని ఐపీఎల్ దాకా చేరుకున్నాడు. అక్కడ మరింతగా రాటుదేలాడు. గట్టిగా మాట్లాడితే.. నేను కూడా తన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్తాను. ఇదంతా చూస్తుంటే.. బజ్‌బాల్‌ను మీరే తక్కువ చేసి మాట్లాడినట్లు అనిపిస్తోంది. దూకుడైన ఆటలో ఇంగ్లండ్ మరింత మెరుగుపడాలనుకుంటే విమర్శలకు దూరంగా ఉంటే మంచిది. అదే విధంగా జైస్వాల్‌ను చూసి మీరు కూడా నేర్చుకోండి’’ నాసిర్ హుసేన్ డకెట్ తీరును విమర్శించాడు. స్కై స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 23 నుంచి నాలుగో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: IND vs ENG: నాలుగో టెస్టు.. భారత తుది జట్టు ఇదే! సెంచరీల వీరుడి అరంగేట్రం? -
అంత సిల్లీగా అవుటవుతారా? అవునా? ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు హర్మన్ కౌంటర్
ICC Womens T20 World Cup 2023- Harmanpreet Kaur: ‘‘అవునా...? ఆయన అలా అన్నాడా? పర్లేదు. నాకైతే ఆ విషయం తెలియదు. అయితే, అది ఆయన ఆలోచనా విధానానికి నిదర్శనం. అయినా కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పరుగులు తీసే క్రమంలో సింగిల్ పూర్తి చేసిన తర్వాత మరో పరుగుకు యత్నించినపుడు బ్యాట్ అలా అక్కడ స్టక్ అయిపోయింది. నిజంగా అదో దురదృష్టకర పరిణామం. మేము ఈ మ్యాచ్‌లో మరీ అంత చెత్తగా ఫీల్డింగ్ చేయలేదు. కొన్నిసార్లు బాగా బౌలింగ్ చేయకపోవచ్చు.. మరికొన్ని సార్లు సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవచ్చు. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణిస్తేనే మ్యాచ్ గెలవగలం. ఈరోజు మా ప్రదర్శన బాగానే ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఇలా జరిగిపోయింది. ఇక రనౌట్ విషయానికొస్తే.. ఆయనన్నట్లు అదేమీ స్కూల్ గర్ల్ మిస్టేక్ కాదు. మేము పరిణతి కలిగిన ఆటగాళ్లమే. నేను గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా. ఆయన అలా ఆలోచిస్తే నేనేమీ చేయలేను. అయితే, కచ్చితంగా అది స్కూల్ గర్ల్ మిస్టేక్ కాదని మాత్రం చెప్పగలను’’ అంటూ భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇంగ్లండ్ మాజీ సారథి, కామెంటేటర్ నాసిర్ హుస్సేన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. సెమీస్ భారత్ ఓటమి కాగా సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 మహిళా ప్రపంచకప్-2023 టోర్నీ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడ్డ సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆరంభంలోనే తడబడ్డా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జెమీమా రోడ్రిగ్స్, ఐదో స్థానంలో వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ గెలుపు ఆశలు చిగురింపజేశారు. అనూహ్య రీతిలో రనౌట్ జెమీమా 24 బంతుల్లో 43 పరుగులతో రాణించగా.. హర్మన్ 34 బంతుల్లో 52 పరుగులతో మెరిసింది. అయితే, 14.4 వోర్ వద్ద ఆసీస్ బౌలర్ వారెహాం బౌలింగ్‌లో హర్మన్ దురదృష్టకర రీతిలో రనౌట్ అయింది. సింగిల్ పూర్తి చేసిన మరో పరుగు తీసే క్రమంలో.. డైవ్ చేసి బంతిని ఆపిన గార్డ్నర్వికెట్ కీపర్ వైపు బాల్ విసిరింది. ఆ సమయంలో హర్మన్ సులువుగానే క్రీజులోకి చేరుకుంటుందన్నట్లు కనిపించినా బ్యాట్ స్టక్ అయిపోవడంతో.. అప్పటికే బంతిని అందుకున్న హేలీ బెయిల్స్‌ను పడగొట్టింది. దీంతో హర్మన్ రనౌట్‌గా వెనుదిరిగింది. ఇదే మ్యాచ్‌ను ఆసీస్ వైపు తిప్పింది. ఆఖరి వరకు పోరాడిన టీమిండియా 5 పరుగుల తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది. అతడికి కౌంటర్ ఇదిలా ఉంటే.. హర్మన్ రనౌట్‌పై కామెంటేటర్ నాసిర్ హుస్సేన్ స్పందిస్తూ.. కాస్తైనా పరిణతి లేకుండా చిన్న పిల్ల మాదిరి ఏంటిది అన్న అర్థంలో స్కూల్ గర్ల్ ఎర్రర్ అంటూ లైవ్‌లో వ్యాఖ్యానించాడు. ఇంత సిల్లీగా అవుటవుతారా అని కామెంట్ చేశాడు. ఈ విషయం గురించి మ్యాచ్ తర్వాత హర్మన్‌కు ప్రశ్న ఎదురుకాగా.. ఆమె పైవిధంగా స్పందిస్తూ అతడికి కౌంటర్ ఇచ్చింది. చదవండి: Ind Vs Aus: భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా నిందలు.. ఐసీసీ రేటింగ్ ఎలా ఉందంటే! Tim Southee: టిమ్ సౌథీ అరుదైన ఘనత.. సరికొత్త రికార్డు.. 700 వికెట్లతో.. View this post on Instagram A post shared by ICC (@icc) -
అగ్నిపథ్ వల్ల ఆర్మీ బలహీన పడుతుంది
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ వల్ల ఆర్మీ బలహీనపడుతుందని, 16 ఏళ్లు పనిచేసే ఆర్మీలో నాలుగేళ్ల విధానమేంటని ఏఐసీసీ అధికార ప్రతినిధి నాజర్ హుస్సేన్ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీతో కలిసి మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్‌పై యువత నిరసనలు చేపడుతున్నా, ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విధానం ద్వారా 14 లక్షల ఆర్మీ బలాన్ని 6 లక్షలకు కుదిస్తున్నారని తెలిపారు. పదవీ విరమణ పొందిన 5.70 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 15 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. రేవంత్ మాట్లాడుతూ మోదీ చదువుకోకపోవడం వల్ల ఆర్మీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ఆర్మీకి, బీఎస్ఎఫ్కు తేడా ఏంటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. -
ప్రేమలో ఉన్నప్పటికీ.. అందుకే పెళ్లి చేసుకోలేదు!
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటి, లెజెండరీ యాక్టర్ ఆశా పరేఖ్.. దర్శకుడు నాసిర్ హుస్సేన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పటికినీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవితం గడపడంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సహచర నటులలో చాలామంది తమ భార్యలను మోసం చేయడం, ఆ తర్వాత తమ భర్తలను క్షమించడం చూసిన తనకు వివాహ బంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పెళ్లికి దూరంగా ఉన్నారన్నారు. 1970లో కాటి పతంగ్, తీస్రీ మన్జిల్, దిల్ దేకే దేఖో, ఘున్‌ఘాట్, ఛయా వంటి హిట్ సినిమాల్లో నటించిన ఆశా పరేఖ్ మంచి నటిగా రాణించారు. అంతేకాకుండా, వివాహితుడైన నాసిర్ హుస్సేన్‌తో ప్రేమలో ఉన్నప్పటికీ.. అతని కుటుంబాన్ని నాశనం చేయకూడదని భావించినట్లు ఆమె తెలిపారు. 'నేను అతనిని (నాసిర్ హుస్సేన్) ఎంతగా ప్రేమిస్తున్నానో నాకు తెలుసు. నా సంతోషం కోసం.. అతని కుటుంబాన్ని విడదీసి.. పిల్లలను బాధపెట్టడం ఇష్టం లేదు. అందుకే ఇలా ఒంటరిగా.. జీవితాన్నిఆస్వాదిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. తన జీవితంలో చాలా ఎత్తుపళ్లాలు చవి చూశానన్నారు. కష్టకాలంలో తనకు స్నేహితులు వెన్నంటే ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోవడం కన్నా.. తన స్నేహితులు వహీదా రెహ్మాన్, హెలెన్లతో ప్రపంచాన్ని చుట్టిరావడం ఇష్టమన్నారు. View this post on Instagram A breathtaking unseen picture from #Helen's birthday of her with #AshaParekh #WaheedaRehman .. About last week, the women who rocked the #60s #70s in #HindiCinema🌹🤩🥰 #retro #queen #theoriginals #gurudutt #rajeshkhanna #amitabhbachchan #devanand #salimkhan #bollywood A post shared by THE BUZZ DIARY (@thebuzzdiary) on Nov 26, 2019 at 5:37pm PST -
బంగ్లాను గెలిపించిన నాసిర్
రెండో వన్డేలో భారత్ ‘ఎ’ ఓటమి బెంగళూరు : మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ నాసిర్ హుస్సేన్ (96 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్; 5/36) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు 65 పరుగుల తేడాతో భారత్ ‘ఎ’పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ (45), అనాముల్ హక్ (34), సౌమ్య సర్కార్ (24) ఓ మోస్తరుగా ఆడారు. ఆరంభంలో భారత పేసర్ల ధాటికి బంగ్లా 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే లిట్టన్ దాస్, నాసిర్‌లు ఆరో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో కోలుకుంది. రిషి ధావన్ 3, కర్ణ్ శర్మ 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 42.2 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ (75 బంతుల్లో 56; 7 ఫోర్లు) టాప్ స్కోరర్. మనీష్ పాండే (36), గురుకీరత్ సింగ్ (34), మయాంక్ అగర్వాల్ (24) కాసేపు పోరాడారు. భారత సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా (17) మరోసారి విఫలమయ్యాడు. ఓ దశలో 5 వికెట్లకు 146 పరుగులు చేసిన టీమిండియాను చివర్లో బంగ్లా బౌలర్లు ఘోరంగా దెబ్బతీశారు. 41 పరుగుల తేడాలో చివరి 5 వికెట్లు తీయడంతో ఓటమి తప్పలేదు. రూబెల్కు 4 వికెట్లు దక్కాయి. ఆదివారం ఇదే వేదికపై ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరుగుతుంది.