ప్రేమలో ఉన్నప్పటికీ.. అందుకే పెళ్లి చేసుకోలేదు! | Asha Parekh Opens Up About Why She Remain Single | Sakshi
Sakshi News home page

ప్రేమలో ఉన్నప్పటికీ.. అందుకే పెళ్లి చేసుకోలేదు!

Published Wed, Dec 4 2019 2:00 PM | Last Updated on Wed, Dec 4 2019 2:08 PM

Asha Parekh Opens Up About Why She Remain Single - Sakshi

ముంబై: బాలీవుడ్‌ సీనియర్‌ నటి, లెజెండరీ యాక్టర్‌ ఆశా పరేఖ్.. దర్శకుడు నాసిర్ హుస్సేన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పటికినీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవితం గడపడంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సహచర నటులలో చాలామంది తమ భార్యలను మోసం చేయడం, ఆ తర్వాత  తమ భర్తలను క్షమించడం చూసిన తనకు వివాహ బంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పెళ్లికి దూరంగా ఉన్నారన్నారు. 1970లో కాటి పతంగ్, తీస్రీ మన్‌జిల్‌, దిల్ దేకే దేఖో, ఘున్‌ఘాట్, ఛయా వంటి హిట్‌ సినిమాల్లో నటించిన ఆశా పరేఖ్‌ మంచి నటిగా రాణించారు.

అంతేకాకుండా, వివాహితుడైన నాసిర్ హుస్సేన్‌తో ప్రేమలో ఉన్నప్పటికీ.. అతని కుటుంబాన్ని నాశనం చేయకూడదని భావించినట్లు ఆమె తెలిపారు. 'నేను అతనిని (నాసిర్ హుస్సేన్) ఎంతగా ప్రేమిస్తున్నానో నాకు తెలుసు. నా సంతోషం కోసం.. అతని కుటుంబాన్ని విడదీసి.. పిల్లలను బాధపెట్టడం ఇష్టం లేదు. అందుకే ఇలా ఒంటరిగా.. జీవితాన్నిఆస్వాదిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. తన జీవితంలో చాలా ఎత్తుపళ్లాలు చవి చూశానన్నారు. కష్టకాలంలో తనకు స్నేహితులు వెన్నంటే ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోవడం కన్నా.. తన స్నేహితులు వహీదా రెహ్మాన్, హెలెన్‌లతో  ప్రపంచాన్ని చుట్టిరావడం ఇష్టమన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement