National-level player
-
జాతీయ స్థాయి క్రీడాకారిణి ఆత్మహత్య
పాటియాలా: రియో ఒలింపిక్స్ లో మహిళలు పతకాలు సాధిస్తూ దేశానికి గర్వంగా నిలుస్తున్న వేళ ఓ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పంజాబ్ లోని పాటియాలాలో శనివారం చోటు చేసుకుంది. పాటియాలా లోని ఖల్సా కళాశాలలో పూజ (20) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె గతేడాది కళాశాలలో అడ్మీషన్ తీసుకుంది. కాలేజీలోచేరే సమయంలో ఉచితంగా హాస్టల్ సౌకర్యం కల్పిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చారు. ఆమె ఇంటినుంచి కాలేజీకి రావడానికి రోజూ రూ.120 ఖర్చు అవుతుంది.కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించే తండ్రి ఖర్చులు భరించలేనని చదువు మానేయాల్సిందిగా పూజాకు సూచించాడు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్రమోదీగారూ నాలాంటి పేద విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్సించడి అని రాసింది. కళాశాల లో హాస్టల్ వసతి ఇవ్వనందుకే బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. కేసును నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు. -
దోపిడీ, కిడ్నాప్ కేసులో జాతీయ మాజీ ఆటగాడు అరెస్ట్
న్యూఢిల్లీ: జాతీయ బాస్కెట్ బాల్ మాజీ ఆటగాడు అమృత్ సింగ్ దోపిడీ, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఓ జంట నుంచి విలువైన వస్తువులు దోచుకోవడంతో పాటు మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినట్టు అమృత్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పవన్ కుమార్ ఎదుట సింగ్‌ను హాజరు పరచగా.. విచారణ కోసం ఓ రోజు పోలీస్ కస్టడీకి ఆదేశించారు. నిందితుడి నుంచి దోపిడీకి గురైన వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమృత్ సింగ్ గుర్గావ్లోని ఓ పాఠశాలలో వ్యాయామ విద్య శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. దక్షిణ ఢిల్లీలోని లజ్‌పతి నగర్ ప్రాంతంలో ఆఫ్ఘాన్ జంట మందులు తీసుకోవడానికి వెళ్తుండగా వారిపై దాడి చేసి విదేశీ కరెన్సీ, నగదు దోచుకున్నాడు. మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు, బాధితుల ఫిర్యాదు మేరకు ఆదివారం సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.