National News Channels
-
రాజ్యసభ: పాత యూనీఫాంనే ఫాలో అయ్యారు!
న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్స్ కొత్త యూనిఫాంపై విమర్శలు లేవనెత్తడంతో.. సోమవారం తిరిగి పాత భారతీయ సంప్రదాయ వస్త్రధారణనే తిరిగి కొనసాగించారు. రాజ్యసభలో మార్షల్స్‌కు ఆర్మీ తరహా యూనీఫాంను ప్రవేశపెట్టడంపై పలు పార్టీలు, ఆర్మీ అధికారులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో మార్షల్స్ సరిగ్గా వారం రోజుల తర్వాత.. వివాదాస్పద యూనీఫాంను పక్కనబెట్టి మళ్లీ పాత సంప్రదాయిక దుస్తుల్లో కనిపించారు. అయితే ఈసారి గతానికి కాస్త భిన్నంగా తలపై ధరించే 'పగ్రి' లేకుండా.. ముదురు రంగు బంధ్గాల సూట్స్ ధరించి రాజ్యసభలో కనిపించారు. Copying and wearing of military uniforms by non military personnel is illegal and a security hazard. I hope @VPSecretariat, @RajyaSabha & @rajnathsingh ji will take early action. https://t.co/pBAA26vgcS — Vedmalik (@Vedmalik1) November 18, 2019 -
ఈనాటి ముఖ్యాంశాలు
-
పాకిస్థాన్‌తో టీవీ యాంకర్ల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన టెర్రరిస్ట్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్‌పై యుద్ధం చేయాల్సిందేనంటూ పలు ప్రాంతీయ టీవీలతోపాటు పలు జాతీయ టీవీ ఛానళ్ల యాంకర్లు తీర్మానించడమే కాదు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు భారత సైన్యానికి వెంటనే కదన రంగంలోకి దూకాల్సిందిగా శనివారం పదే పదే పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరు కూడా ఇదే కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. తెలుగు టీవీ యాంకర్ రష్మీ అవేశంతో ఊగిపోతూ పాకిస్థాన్‌పై రెండో సర్జికల్ స్ట్రైక్స్ చేయాలంటూ ‘తెర మాకీ....’ అంటూ రెచ్చిపోయారు. పాకిస్థాన్‌పై ఎలా బదులు తీర్చుకోవాలో తేల్చుకోవడానికి అఖిల పక్ష సమావేశాలతో ప్రధాని నరేంద్ర మోదీ తర్జనభర్జనలు పడుతుండగానే ‘పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలకు మోదీ సిద్ధంగా ఉన్నారు’ అంటూ ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేస్తూ వస్తున్నారు. ‘ప్రతీకారం కోరుకుంటున్న భారత్’ అన్న నినాదంతోనే ‘రిపబ్లిక్ టీవీ’ వార్తలను ప్రసారం చేసింది. సీనియర్ జర్నలిస్ట్, యాంకర్ అర్నాబ్ గోసామి మాట్లాడుతూ ‘పాక్‌తో యుద్ధం చేయడం మినహా మరో మార్గం ఉందా ? లేదు!’ అంటూ సెలవిచ్చారు. ‘పాకిస్థాన్ విషయంలో ఇక వెనక్కి తిరిగి వచ్చే పరిస్థితి లేదు’ అంటూ టైమ్స్ నౌ యాంకర్ నావికా కుమార్ వ్యాఖ్యానించారు. ‘ ఓ భారత ప్రధాని ప్రజలనుద్దేశించి ఇంత స్పష్టంగా మాట్లాడడం ఇదే మొదటి సారి. పాకిస్థాన్‌తో పరిమిత యుద్ధం కోసం అన్ని పర్యవసానాలను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు’ అని ఇండియా టుడే టీవీ యాంకర్ రాహుల్ కన్వల్ వ్యాఖ్యానించారు. ‘పాకిస్థాన్‌లోని అన్ని టెర్రరిస్టు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరపాలి’ అంటూ న్యూస్ 18 యాంకర్ భూపేంద్ర చౌబే పిలుపునిచ్చారు. యుద్ధానికి సమయం ఆసన్నమైందంటూ 2016లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులను ప్రస్తావిస్తూ ఏబీపీ న్యూస్ ఛానల్ అయితే ఇటీవల విడుదలైన ‘యురి’ బాలివుడ్ సినిమాలోని క్లిప్స్‌ను చూపించారు. యాంకర్ల పిలుపులపై ‘ఎన్డీటీవీ ఇండియా’ రవిష్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ‘మన సైనికులు మరణించినందుకు మనకు బాధగా ఉంటుంది. మనసు ప్రతీకారం కోరుకుంటుంది. ఇక్కడే కాస్త సంయమనం అవసరం. అరుపులు, కేకలు వినిపించడానికి ప్రతి సంఘటన ఓ సినిమా ప్లాట్ కాదు. రెచ్చగొట్టే భాష రాజకీయ ప్రయోజనాలను నెరవేరుస్తుంది. సమస్యను పరిష్కరించదు. ఈ సమయంలో మనం మౌనం పాటించడమే అమర వీరులకు నిజమైన నివాళి. మృధువుగా మాట్లాడుతాం. బాధిత కుటుంబాల మెదళ్లును తొలుస్తున్న విషయం గురించి ఆలోచిద్దాం. కశ్మీరు పరిస్థితి కంటే మీడియా పరిస్థితి దిగజారినందుకు బాధగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. కార్గిల్ వీరుడి అమూల్య సందేశం ‘జీ న్యూస్’ చర్చాగోష్టిలో పాల్గొన్న 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొని కుడి కాలును కోల్పోయిన యోధుడు మేజర్ నవదీప్ సింగ్ చాలా బాధ్యుతాయుతంగా స్పందించారు. ‘దేశ త్రివర్ణ పతాకానికి అండగా ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధంగానే ఉన్నారు. ఒకప్పుడు టెర్రరిస్టయిన నజీర్ వానిలాగా ఓ కశ్మీర్ యువకుడు ఎందుకు కావాలనుకుంటున్నాడో కూడా ఆలోచించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. యుద్ధం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రాణాలే కాదు, అవయవాలు కూడా పోతాయి. ఆ తర్వాత నష్ట పరిహారం కోసం కోర్టుల తలుపులు తట్టాలి. యుద్ధంలో సైనికుడు చనిపోవాలని మనం కోరుకుంటాం. ఆ తర్వాత ఆ సైనికుడి వితంతు భార్య పింఛను కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. యుద్ధంలో కొన్నిసార్లు మృతదేహం ఆనవాళ్లు కూడా దొరకవు. పింఛను కావాలంటే భర్త మతదేహాన్ని తీసుకరావాలని అధికార యంత్రాంగం ఆదేశిస్తుంది. యుద్ధంలో గాయపడితే అంగవైకల్య నష్టపరిహార పింఛను కోసం ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరగాలి. యుద్ధంలో కాలు కోల్పోయిన నేను పింఛను కోసం ఏడేళ్లు కోర్టుల చుట్టూ తిరిగాను. సైనిక పింఛను విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్పీళ్లను ఉపసంహరించుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు స్వయంగా ఆదేశించినప్పటికీ ఇప్పటికీ వెయ్యి కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రాణాలతో పరాచకాలొద్దు. అన్యాయంగా సైనికుల ప్రాణాలను బలిపెట్టవద్దు. భారత సైన్యానికి ఎప్పుడు ఎలా స్పందించాలో తెలుసు. ఎం చేయాలో వారికి మనం సూచించాల్సిన అవసరం లేదు. సముచిత సమయంలో సముచిత చర్య తీసుకోవడం వారికి తెలుసు. ముందుగా పాకిస్థాన్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రపంచం ప్రకంటించేలా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకరావాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందిగదా అంటూ ఆవేశంతో మాట్లాడడం సముచితం కాదు’ అని ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అయినా ‘సార్! మీరు పుల్వామా దాడి చిత్రాలను చూసినట్లు లేదు. ప్రతీకారం ఒక్కటే పరిష్కారమని మీరు భావించకపోవడానికి అదే కారణం అనుకుంటా’ అని జీన్యూస్ యాంకర్ వ్యాఖ్యానించడం కొసమెరపు. -
చీర కట్టుకుని ఆఫీస్‌కు వెళితే ఇబ్బందా?
భారతదేశంలోనే కాక దేశ, విదేశాలలో కూడా భారత సాంప్రదాయాల్ని పాటించే ఎందరో స్త్రీలు భారతీయ స్త్రీకి చీరే అందమంటారు. చీరకట్టుకు మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఎన్ని రకాల మోడ్రన్ డ్రెస్సులున్నా చీర అందం చీరదే. విదేశీ మహిళలు కూడా చీర కట్టుకోవడాన్ని చాలా ఇష్టంగా భావిస్తుంటారు. అయితే తాజాగా ‘చీరలోని చెడ్డదనం తెలుసుకో’ అంటూ ఓ జాతీయ న్యూస్ ఛానెల్ పేర్కొంది. చీర కట్టుకుంటే సవాలక్ష ఇబ్బందులు వస్తాయంటూ ఓ వీడియోను కూడా పోస్టు చేసింది. అయితే చీర వీడియోను చూసి నెటిజన్లు మాత్రం భగ్గుమంటున్నారు. మొన్నటిదాకా బాణాసంచాపై పడ్డారు, ఇప్పుడు మీ కళ్లు చీరలపై కూడా పడ్డాయా అని నిప్పులు చెరిగారు. చీర కట్టుకుంటే చాలా ఇబ్బందట. చీర ధరించి ఆఫీసుకు వెళ్తే నరకమేనంటూ... ఒక ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఒక మహిళ చీర కట్టుకొని ఆఫీసుకు వస్తే ఎన్ని రకాల అవస్థలు ఎదురవుతాయన్నది ఆ వీడియో సారాంశం. అయితే ఆ కంటెంటే ఇప్పుడు వివాదానికి కారణమైంది. మహిళలు చీర కట్టుకొని ఆఫీసుకు వెళ్లే సరిగా నడవలేరట. అందరూ పెళ్లయిందా అని అడుగుతారట. పైగా ఆంటీ అని పిలుస్తారట. పురుష ఉద్యోగులైతే గుచ్చి గుచ్చి చూస్తారంటూ ఆ వీడియోలో ఇష్టం వచ్చినట్లు చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా చీర కట్టుకుంటే టాయ్‌లెట్‌కు వెళ్లడం కూడా కష్టమంటూ తెగ ఇదైపోయారు. ఈ వీడియో ఇంటర్నెట్లో వివాదం రేపింది. జనాల నుంచి సానుకూల స్పందన వస్తుందని వీడియో రూపొందించినవాళ్లు ఆశిస్తే, తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సెన్సేషనలిజం కోసం ఇలాంటి చీప్ ట్రిక్‌లు ప్లే చేస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. ఈ వీడియో చీర కట్టుకునే ప్రతి మహిళ మనోభావాన్ని దెబ్బతీసిందని కొందరు విమర్శిస్తే, ఒక ప్రముఖ మీడియా సంస్థ ఇలాంటి వాంతులొచ్చే వీడియోలకు దిగజారిపోయిందా అని మరికొందరు దుయ్యబట్టారు. ఇంకొందరు నెటిజన్లు తిట్టిపోయడంతోనే సరిపెట్టకుండా చీర విశిష్టత గురించి ఫోటోలు పెట్టి క్లాసులు పీకారు. ఝాన్సీ లక్ష్మీబాయి చీర కట్టి మరీ యుద్ధరంగంలోనే చెలరేగిపోయింది, అంతకంటే కష్టమా..? అని ఒకరు ప్రశ్నిస్తే, చీరల్లో ఆఫీసుకి వెళ్లి ఇస్రో సైంటిస్టులు మార్స్ మిషన్ పూర్తి చేశారు. టాలెంట్, పనితనం ముఖ్యం. చీర అంటే అందమైన తెలివి అని అభివర్ణించారు. ఇంకొందరు ఇది హిందూ సంస్కృతిపై దాడిగా అభివర్ణించారు. మొన్న దీపావళి టపాసులు, ఇవాళ చీర, ఇక రేపు అగరుబత్తీలను కూడా టార్గెట్ చేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ వీడియోను మెచ్చుకున్న వారి కంటే తిట్టిన వారే ఎక్కువ. అయితే ఛానెల్ నిర్వాహకులు మాత్రం నెటిజన్ల విమర్శలతో తలబొప్పికట్టి నోరు మెదపడం లేదు. -
జాతీయ, అంతర్జాతీయ మీడియా ఆసక్తి.. వై.ఎస్. జగన్ విడుదలపై ప్రసారం
-
జాతీయ, అంతర్జాతీయ మీడియా ఆసక్తి.. వై.ఎస్. జగన్ విడుదలపై ప్రసారం
జగన్ బయటకు వచ్చిన దృశ్యాలను విస్తృతంగా ప్రసారం చేసిన చానళ్లు న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి మంగళవారం బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన దృశ్యాలను రాష్ట్రంలోని తెలుగు వార్తా చానళ్లతోపాటు జాతీయ వార్తా చానళ్లు కూడా విస్తృతంగా ప్రసారం చేశాయి. హెడ్‌లైన్స్ టుడే, టైమ్స్ నౌ, ఎన్డీటీవీ, జీ న్యూస్, డీడీ న్యూస్, ఆజ్‌తక్ చానళ్లు ప్రతి 10 నిమిషాలకు ఓసారి జగన్మోహన్రెడ్డి ర్యాలీగా ఇంటికి చేరే దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించాయి. దీనికి రిపోర్టర్ల వ్యాఖ్యానాలను కూడా జత చేశాయి. హెడ్‌లైన్స్ టుడే అయితే ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులు...జగన్మోహన్రెడ్డి బయటకొచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల భవిష్యత్తుపై రాజకీయ విశ్లేషకులతో అరగంటపాటు ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. పలు మరాఠీ, కన్నడ వార్తాచానళ్లు కూడా జగన్ ర్యాలీ దృశ్యాలను ప్రసారం చేశాయి. ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్ బిజినెస్ స్టాండర్డ్, లైవ్ మింట్, ఫస్ట్ పోస్ట్ వంటి జాతీయ ఆంగ్ల దినపత్రికలు, ద వీక్ వంటి వారపత్రికలు సైతం తమ వెబ్సైట్లలో జగన్ విడుదల వార్తను ప్రముఖంగా ప్రస్తావించాయి. ‘జగన్మోహన్రెడ్డి వాక్స్ అవుట్ ఆఫ్ జైల్ ఆఫ్టర్ 16 మంత్స్...’, ‘జగన్ రెడ్డి వాక్స్ అవుట్ ఆఫ్ జైల్ టు రైజింగ్ రిసెప్షన్...’ అంటూ శీర్షికలు పెట్టాయి. ఆయా వెబ్సైట్లలో ఈ వార్తను చదివిన నెటిజన్లు దీనిపై హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తూ వారి అభిప్రాయాలను పొందుపరచడం కూడా కనిపించింది. కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకొని జగన్ విడుదల కావడం సంతోషంగా ఉందంటూ ఎక్కువ మంది నెటిజన్లు పేర్కొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ బీబీసీ సైతం జగన్మోహన్రెడ్డి బెయిల్‌పై విడుదల వార్తను తన వెబ్సైట్లో పొందుపరిచింది. ద లయన్ ఈజ్ బ్యాక్: జగన్ బెయిల్‌పై విడుదలైన వెంటనే ఫేస్బుక్, ట్విట్టర్లలో వేలకొద్దీ పోస్టులు, ట్వీట్లు దర్శనమిచ్చాయి. జగన్ ర్యాలీ దృశ్యాల షేరింగులు, లైకులు కూడా పెద్ద సంఖ్యలో కనిపించాయి. ‘హీ ఈజ్ ద రూలర్...’, ‘ద లయన్ ఈజ్ బ్యాక్...’, ‘ద కింగ్ ఆఫ్ ఆంధ్ర వైఎస్ జగన్ ఈజ్ బ్యాక్...’, ‘జగన్ బెయిల్‌పై విడుదలైన కొద్దిసేపటికే ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీ పాలకులకు వెన్నులో వణుకు మొదలవుతుందనేందుకు ఇది సంకేతం’, ‘మైకేల్ జాక్సన్ తర్వాత ఈ రోజు జగన్‌ను చూసేందుకు వెల్లువలా వచ్చిన ప్రజాభిమానాన్ని చూశా...’, ‘భారీ జనసందోహం...ఎప్పుడూ అంత మం దిని చూడలేదు..’, ‘ఇక రాజకీయాలన్నీ మారిపోతాయి..’, ‘రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కా రం దొరికినట్లే..’ వంటి ట్వీట్లు, పోస్టులతో నెటిజన్లు, అభిమానులు హోరెత్తించారు. ‘కింగ్ ఈజ్ కింగ్.. ఎవర్ అండ్ ఎవర్’, ‘ఓన్లీ ఒన్’, ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు’ వంటి పోస్టులు ఫేస్బుక్లో ప్రత్యక్షమయ్యాయి. వీటికి క్షణాల్లో లక్షల సంఖ్యలో లైకులు, షేరింగ్‌లు వచ్చాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఫేస్బుక్లో ఏ పేజీ క్లిక్చేసినా జనంలోకి జగన్ వచ్చాడనే వార్తే హైలెట్ అయ్యింది. ఉదయం నుంచే ‘ఈ రోజు అన్న బయటకు వస్తాడు’ అంటూ మొదలైన హడావుడి సాయంత్రమయ్యే సరికి పతాకస్థాయికి చేరుకుంది. మంగళవారం రాత్రికి లోటస్‌పాండ్‌కు చేరుకున్న జగన్ కాన్వాయ్ ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. అభిమానులు వీటికి లక్షల సంఖ్యలో లైకులు, షేరింగ్ చేసి తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ‘ఫేస్బుక్లో మేము ఈరోజు షేర్ చేసుకున్న స్వీటెస్ట్ న్యూస్ ఇదే’ అని ఉద్విగ్నతకు లోనైనవారు లెక్కలేనంత మంది ఉన్నారు. ‘కంగ్రాట్స్ జగన్ సర్’ అని శుభాభినందనలను పంచుకున్న వారెందరో. ఓ నెటిజెన్ అయితే జగన్ అదృష్ట సంఖ్యను ఏడుగా లెక్కగట్టాడు. జగన్ జైలులో గడిపిన 484 రోజులను 4+8+4=16 అని, 16 నెలలు అంటే 1+6=7 అని, జగన్ దాఖలు చేసుకున్న ఏడో బెయిల్ పిటిషన్‌కే వచ్చిందని గుర్తుచేశాడు.