నేటి నుంచి జాతీయ సబ్ జూ. బాస్కెట్‌బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి జరిగే ఈ ఈవెం ట్‌కు నగరం ఆతిథ్యమివ్వనుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించేందుకు హైదరాబాద్ బాస్కెట్‌బాల్ సంఘం ఏర్పాట్లు చేసింది. బాలుర కేటగిరీలో 27 జట్లు, బాలికల విభాగంలో 24 జట్లు బరిలోకి దిగనున్నారుు. బాలుర జట్లను ఆరు గ్రూపులుగా విభజించారు. ఇందులో తెలంగాణ గ్రూప్-ఎఫ్‌లో, ఆంధ్రప్రదేశ్ గ్రూప్-ఎలో ఉన్నాయి. బాలికల జట్లను కూడా ఆరు గ్రూపులుగా విభజించగా... తెలంగాణ గ్రూప్-బిలో, ఏపీ గ్రూప్-ఎఫ్‌లో తలపడనున్నారుు. ఏడు రోజుల పాటు జరిగే ఈ పోటీలు 7న జరిగే ఫైనల్స్‌తో ముగుస్తాయి. శనివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో తెలంగాణ బాలుర జట్టు బీహార్‌తో... బాలికల జట్టు ఉత్తరప్రదేశ్‌తో తలపడతాయి.
బాలుర జట్లు
గ్రూప్-ఎ: మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఓడిశా, కేరళ; గ్రూప్-బి: చత్తీస్‌గఢ్, రాజస్తాన్, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక; గ్రూప్-సి: చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్; గ్రూప్-డి: పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్; గ్రూప్-ఇ: పంజాబ్, గోవా, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్; గ్రూప్-ఎఫ్: తెలంగాణ, బీహార్, ఢిల్లీ, తమిళనాడు.
బాలికల జట్లు
గ్రూప్-ఎ: చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హరియాణా, రాజస్తాన్; గ్రూప్-బి: తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ; గ్రూప్-సి: ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గ్రూప్-డి: పశ్చిమ బెంగాల్, గోవా, జమ్మూకశ్మీర్; గ్రూప్-ఇ: పంజాబ్, బీహార్, జార్ఖండ్; గ్రూప్-ఎఫ్: చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, ఓడిశా, ఉత్తరాఖండ్.