navyandhra
-
మోసం కేసులో సినీ నిర్మాత అరెస్ట్
తిరుపతి క్రైమ్: సినీ అవకాశాల పేరుతో ఎంతో మందిని మోసంచేసిన కేసులో నవ్యాంధ్ర ఫిలిం చాంబర్ వ్యవస్థాపకుడు ఎస్వీఎన్ రావును అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచినట్లు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ శివప్రసాద్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఏడు నెలల కిందట ఎస్వీఎన్ రావు ఆర్థికంగా మోసం చేసినట్లు కేసు నమోదు అయినట్లు చెప్పా రు. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడు బుధవారం తిరుపతి మూడో అదనపు జిల్లా కోర్టుకు హాజరవుతున్న విషయం తెలుసుకుని, అక్కడే అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు. ఆయన కారును కూడా సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపారు. -
మంచి పుస్తకం.. మస్తక పోషకం
రాజమహేంద్రవరంలో ‘నవ్యాంధ్ర పుస్తక సంబరాలు ఆర్ట్స్ కాలేజీలో ఈ నెల 27 వరకూ నిర్వహణ 99 స్టాళ్లలో అందుబాటులో లక్షలాది పుస్తకాలు నీతికథల నుంచి ఆత్మకథల వరకూ లభ్యం కొనుగోళ్లపై 10 నుంచి 30 వరకూ రాయితీ పూలరేకుల్లోని వన్నెలకూ, అవి వెదజల్లే సుగంధాలకూ నేల పొరలలోని సారమే మూలం. తిండిగింజలలోని పోషక విలువలకూ, పండ్లలోని చవులూరించే మాధుర్యానికీ కూడా ఆ సారమే మూలం. మనుగడకు వివిధ దినుసులూ, కాయలూ, ఖనిజాలకు మూలం మట్టిలోని సారమైనట్టే.. గుహావాసాల దశ నుంచి గ్రహాంతరవాసాల ప్రతిపాదనల వరకూ మానవ ప్రస్థాన పురోగతికి జ్ఞానమే మూలం. సారాన్ని నిక్షిప్తం చేసుకున్న నేలపొరల్లాగే..జ్ఞానసారాన్ని తమలో పొదువుకున్న పుస్తకాలు కూడా. ప్రాణవాయువు నెత్తురును శుద్ధి చేసినట్టు పుస్తకాలు.. కలుషిత చిత్తాన్ని ప్రక్షాళన చేస్తాయి. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చిన సాధనాలతో ‘అచ్చు’ పుస్తకానికి కాలం చెల్లిందన్న అభిప్రాయం ఉంది. అయితే.. ఆ సాధనాల ఆవిష్కరణకు మూలం.. తరతరాల మానవులు పుటల నడుమ కూడబెట్టిన పెన్నిధేనన్నది ‘అక్షర’ సత్యం. రాజమహేంద్రవరంలో తొలిసారిగా నవ్యాంధ్ర పుస్తక సంబరాలు నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లోని నన్నయ్య ప్రాంగణంలో ఈ నెల 19న ప్రారంభమైన ఈ వేడుక ఈ నెల 27 వరకు కొనసాగనుంది. సాక్షి, రాజమహేంద్రవరం/ కల్చరల్ : ‘పుస్తకం హస్తభూషణం’ అన్నారు ఒకనాడు. ‘స్మార్ట్‌ఫోన్ లేని కరము కరమే కాదు’ అంటున్నారు నేడు. అయినా.. ఏనాడైనా పుస్తకం హస్తభూషణమే కాదు మస్తకానికి ఔషధం అన్నది ‘అచ్చులే భాషకు ప్రాణసమం’ అన్నంత పరమసత్యం. తెలుగు గడ్డకు సాంస్కృతిక రాజధానిగా, ఆదికావ్యం జాలువారిన గడ్డగా గణుతికెక్కిన రాజమహేంద్రవరంలో తొలిసారిగా భారీస్థాయిలో పుస్తకోత్సవం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగువారి ‘పుస్తక ప్రేమ’ను గురించి అలనాటి గురజాడ నుంచి నిన్నటి ముళ్ళపూడి వెంకట రమణ వరకు చేసిన వ్యాఖ్యలను సరదాగా గుర్తు చేసుకుందాం. శతాబ్దికి ముందే మహాకవి గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకానికి ముందుమాటలో ఇలా పేర్కొన్నారు.. 'తెలుగుదేశంలో గ్రంథకర్త అయినవాడు తన పుస్తకాలు తానే అచ్చొత్తించుకోవాలి. తానే అమ్ముకోవాలి'.. మరో యాభై ఏళ్ల తరువాత జయంతి çపబ్లికేషన్స్ ఆధ్వర్యంలో ప్రచురించిన గురజాడ ‘కన్యాశుల్కం’ మలిముద్రణలలో మహాకవి శ్రీశ్రీ తన ముందుమాటలో ' ఆ నాటి మహాకవి అన్నమాట ఈ నాటికీ యథార్థంగానే ఉంది' అన్నారు. శ్రీశ్రీ వ్యాఖ్యలు నాడే కాదు, నేటికీ ఆ మాట ప్రాధాన్యతను కోల్పోలేదు. కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులు పుస్తకాలు కొనడానికి ఒక్క దమ్మిడీ ఇవ్వనని చెబుతూనే 'నేను వేదం యాభైరెండు పన్నాలూ ఒహ దమ్మిడీ ఖర్చు లేకుండా చదువుకున్నాను' అని ఖండితంగా చెపుతాడు. ముళ్ళపూడి వెంకట రమణ ‘గిరీశం లెక్చర్ల’లో గిరీశం ఇలా అంటాడు..‘పుస్తకాలు కొనడమా! బార్బేరియస్, వర్స్ దేన్ సెల్లింగ్ గర్ల్స్’. అవన్నీ అలా ఉంటే.. ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో–దాని జేబుల్లో డబ్బులుంటే మంచి పుస్తకం కొనుక్కో’ అన్న వజ్రపు తునకలాంటి పలుకూ ఉంది. ప్రముఖ ప్రచురణ సంస్థల భాగస్వామ్యం పాఠకులకు తమకు కావలసిన పుస్తకం ఎక్కడ లభ్యమవుతుందో తెలిపే వ్యవస్థ, ప్రచురణ కర్తకు తాను ముద్రించే పుస్తకాన్ని కొనుగోలు చేసే పాఠకులెవరో తెలిపే వ్యవస్థ నేటికీ రూపు దిద్దుకోలేదు. ఈ నేపథ్యంలో అడపాతడపా జరిగే పుస్తక ప్రదర్శనలు విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజమహేంద్రవరంలో జరుగుతున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాలలో 99 స్టాళ్లు ఏర్పాటు చేశారు. అన్ని ప్రముఖ ప్రచురణ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. విశాలాంధ్ర, ప్రజాశక్తి, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ వంటి సంస్థలు లక్షలాది పుస్తకాలను అందుబాటులో ఉంచాయి. సాహిత్యం, నీతి కథలు, బొమ్మల కథలు, యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనా రాణి, మాదిరెడ్డి సులోచనారాణి, షేక్స్పియర్ వంటి ప్రముఖులు రచించిన తెలుగు, ఇంగ్లిష్ నవలలు, అలనాటి సాహితీ వేత్తల ఆత్మకథలు, రాజకీయపరమైన పుస్తకాలు, ప్రముఖ జర్నలిస్టులు, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తల ఆత్మకథలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. కొనుగోలుదారులకు అన్ని రకాల పుస్తకాలపై 10 శాతం రాయితీ ఇస్తున్నారు. ఎంపిక చేసిన కొన్ని పుస్తకాలకు 30 శాతం రాయితీ కల్పించారు. పిల్లలు స్కెచ్ పెన్నులతో సులువుగా బొమ్మలు వేసేందుకు అవసరమైన బ్లోపెన్, మేజిక్ మిర్రర్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. క్రాఫ్ట్ బజార్లు, ఇంట్లోనే కంప్యూటర్ నేర్చుకునేందుకు అవసరమైన సీడీల స్టాళ్లు ఏర్పాటు చేశారు. పుస్తకాల పైనా పెద్దనోట్ల రద్దు నీడ.. పాత రూ.వెయ్యి, రూ. 500 నోట్ల రద్దు ప్రభావం పుస్తక ప్రదర్శనపై కూడా పడింది. రాజమహేంద్రవరంలో మొదటిసారి పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినా గత మూడు రోజులుగా స్టాళ్ల యజమానులు ఆశించిన మేర అమ్మకాలు జరగలేదు. అదేవిధంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటుపై ప్రచార లేమి కూడాకొనుగోళ్లు తగ్గిపోవడానికి ఓ కారణం. పిల్లల కోసం పుస్తకాలు కొన్నా.. పిల్లలను తీర్చిదిద్దడానికి పుస్తకాలు ఎంతో అవసరం. స్కూళ్లో పాఠాలతోపాటు నీతి కథలు చెబితే వారికి సమాజంపై అవగాహన ఉంటుంది. అందుకే వారికి అవసరమైన పుస్తకాలనే ఎక్కువగా కొన్నాను. – పోసమ్మ, క్రాఫ్ట్ టీచర్, తంటికొండ ఒకే చోట దొరకడం సౌలభ్యం ఇంటర్నెట్లో సమస్త సమాచారం ఉన్నా పుస్తక పఠనం ఎంతో అవసరం. ఏదైనా పుస్తకం కావాలంటే అనేక దుకాణాలు తిరగాలి. ఇలాంటి ప్రదర్శన వల్ల అన్ని పుస్తకాలు ఒకే చోట లభించడం సౌలభ్యంగా ఉంది. – పద్మలత, టీచర్, రాజమహేంద్రవరం లక్కీ డ్రా విజేతలకు బహుమతులు ప్రదర్శనలో కొనుగోలుదారులకు లక్కీ డ్రా ద్వారా ప్రత్యేక గిఫ్ట్‌లు ఇస్తున్నాం. ఇద్దరికి రూ.2000, మరో ముగ్గురికి రూ.1000, ఐదుగురికి రూ. 500 చొప్పన విలువైన పుస్తకాలిస్తాం. వారికి నచ్చిన పుస్తకాలు ఎంపిక చేసుకోవచ్చు. – అనిరుథ్, ఎమెస్కో బుక్స్ ప్రతినిధి -
బాబు భూదాహానికి ఉళ్ళకు ఉళ్ళు బలి
-
నవ్యాంధ్ర మహానగర్
అక్షర తూణీరం ఓ యువతి చక్కని నవ్వుతో పచ్చని శాలువతో నన్ను సత్కరించింది. చంద్రబాబు పనితనాన్ని అరవైఆరోసారి మెచ్చుకుంటూ గడప దిగాను. ఒక్కసారి సన్మాన శాలువలో నన్ను నేను చూసుకోవాలనిపించింది. తీరా చూద్దును కదా, శాలువా లేదు. సన్మానం కేవలం నా భ్రమ. శాలువా హుళక్కి! వర్చుయల్ రియాలిటీ అంటే ఇదేట! అందరికీ తెలుసు చంద్ర బాబు అంటే హైటెక్, హైటెక్ అంటే చంద్ర బాబు అని. ఇప్పు డాయన ఆలోచలన్నీ సిం గపూర్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇతరేతర కారణాల వల్ల ఇంతకు ముందు కూడా సింగపూర్ లోనే తిరిగేవని గిట్టనివాళ్లు అంటుం టా రు. ప్రస్తుతం మంది మార్బలంతో సాక ల్యంగా సింగపూర్‌ని అధ్యయనం చేస్తు న్నారు. రెండోరోజు పర్యటనలో అక్కడ ఉన్నతాధికారి కొన్ని అత్యాధునిక సాంకే తిక విజ్ఞాన విశేషాలను వివరిస్తూ- ‘‘పున ర్వినియోగ ప్రక్రియ (రీసైకిల్) ద్వారా ఘన వ్యర్థాలను కనిష్ట స్థాయికి తగ్గించడా నికి ఒక పథకాన్ని రూపొందించాం!’’ అన్నారట. సాంతం మాట పూర్తి కాకుం డానే చంద్రబాబు అందుకుని ‘‘ఆ టెక్నా లజీ మాకు తెలుసండీ! కిందటి జనరల్ ఎలక్షన్ల ముందు ఈ ప్రక్రియని ప్రారం భించి కొన్నివేల మెట్రిక్ టన్నుల ఘనవ్య ర్థాలను దారికి తెచ్చాం. అయితే వాటికి చోటు కల్పించడం ఇప్పుడు పెద్ద సమ స్యగా ఉంది’’ అన్నారట నిట్టూర్పుగా. ప్రస్తుతం చంద్రబాబు ముందున్న సవాలు ‘స్టేట్ క్యాపిటల్’. మహా నిర్మా ణాలన్నిటికీ ముందు నమూనాలు నిర్మి స్తారు. ఇదిగో ఇప్పుడు మనం సమస్త హైటెక్ హంగు లతో తయారైన నవ్యాంధ్ర క్యాపిటల్ ముఖద్వారంలో ఉన్నాం. వెయ్యి రూపాయలతో టికెట్ కొనుక్కుని ప్రవేశించాం. రాష్ట్రానికి గుండెకాయ అసెంబ్లీహాలు. అరుపులూ కేకలతో సహ జ సుందరంగా అలరారుతోంది. నీట్ అం డ్ క్లీన్‌గా ఉంది. ఒక్క ఫైలు లేదు. కాగితం ముక్కయినా లేదు. టేబుల్స్ మీద సర్వార్థ సాధక కంప్యూటర్లు మాత్రమే వెలుగుతు న్నాయి. ఉద్యోగులు విశ్రాంతిగా కూర్చొని ఉన్నారు. కొందరు వాళ్లలో వాళ్లే మాట్లాడు కుంటున్నారు. ఇది హైటెక్ ఫోన్ విధా నంట. యాక్టివేటెడ్ స్పేస్ టెక్నాలజీలో ఊరికే మాట్లాడితే చాలు, కోరిన వారికి వినిపిస్తుంది. వాళ్ల మాటలు వీళ్ల చెవిన పడతాయి. అవతలి నెంబర్ని స్మరిస్తే చాలు తగులుకుంటుంది. విశాలమైన వీధులు, వీధుల వెంట నీటి చిమ్మెనలు. పక్కన లేతపచ్చికలు. మధ్యమధ్య వత్తుగా పసుపుపచ్చ గడ్డి పూలు. నాలుగడుగులు వేసి నలభై మెట్లె క్కితే హైకోర్టు భవనం. కళ్లకు గంతలతో న్యాయదేవత విగ్రహం. చాలా ప్రశాంతం గా ఉంది. అసలక్కడికి అడుగుపెడితే అం తా నిజమే చెబుతారు, అబద్ధం చెప్పరని పిస్తుంది. కాని లాయర్ ఇండస్ట్రీ దెబ్బతిం టుందేమో తెలియదు. ‘‘ఆహా! ఈ మయుని రచనా చమత్కృతి ఏమియో గాని...’’ అన్న ట్టుంది, నవ్యాంధ్ర క్యాపి టల్. ఇదిగో ఇక్కడ మన తెలుగు సంప్ర దాయం ఉట్టిపడుతోంది. వందలాది ఉట్లు. ఉట్టి ఉట్టికో తెలుగు వంటకం. అరి సెలు, పూతరేకులు, పాలతాళికలు, బొబ్బ ట్లు... మరి ఏమి లేవని చెప్పను? మనం చూస్తున్నది ‘అన్న ఆహారశాల’. తెలుగు కూరలు, అరవై నాలుగు రకాల పచ్చళ్లు, చిత్రాతిచిత్రమైన చిత్రాన్నాలు, మన చెట్ల కు పండిన పళ్లు, చివరన తాంబూలం. కుం కుమపువ్వు మాత్రం కాశ్మీరానిది. మనుచరిత్రలో పసరు మహిమ గల సిద్ధుడిలా క్యాపిటల్ అణువణువు అరక్ష ణంలో చూసి ఆనందించా. లంకలో హను మ సీత కోసం అన్వేషించినట్టు నేను లోపాల కోసం వెదికా! ఒక్కటీ దొరక లేదు. తెలుగువాడిగా పుట్టడం నా అదృ ష్టమని అరవైసార్లు అనుకున్నాను. తిరిగి వస్తుంటే అక్కడ ‘సింహద్వారం’ ఉంది. దాని రేటు సెపరే టన్నారు. వంద సమ ర్పించుకుని లోపలికి అడుగు పెట్టాను. ఆశ్చర్యం... సింహద్వారం మీద ఒక చెయ్యి ఆన్చి, మరో చేత జరీ ధోవతి కుచ్చె ళ్లను సుతారంగా పట్టు కుని ఠీవిగా నిల బడి ఉన్నారు ఎన్టిఆర్. ‘‘బాగున్నారా! పిల్లాపాపా, పాడీపంటా సుభిక్షమే కదా, శునకంగారూ!’’ అన్నారు. ఉలిక్కిపడి, నేను కనకారావండీ అన్నాను. ‘‘తమ బొం ద, ఓటర్ల జాబితాలో తమ పేరు శునకా రావే.. హె!’’ అన్నారు. ఔను. మా వార్డు మెంబరు నా మీద కక్ష కట్టి అక్షరం తప్పు వేయించాడు. ‘‘తమ ఖర్మ’’ అంటుండ గానే తెరపడింది. ఇంతలో ఓ యువతి చక్కని నవ్వుతో పచ్చని శాలువతో నన్ను సత్కరించింది. చంద్రబాబు పనితనాన్ని అరవైఆరోసారి మెచ్చుకుంటూ గడప ది గాను. ఒక్కసారి సన్మాన శాలువలో నన్ను నేను చూసుకోవాలనిపించింది. తీరా చూ ద్దును కదా, శాలువాలేదు. సన్మానం కేవ లం నా భ్రమ. శాలువా హుళక్కి! వర్చు యల్ రియాలిటీ అంటే ఇదేట! (వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత) -
రైల్వే జోన్‌కు లైన్ క్లియర్
రైల్వే ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష వీగిన ఒడిశా వాదన విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లు! అన్నీ విశాఖ జోన్లోనే.. విశాఖపట్నం సిటీ : విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు లైన్‌క్లియర్ అయింది. హైదరాబాద్‌లో గురువారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రైల్వే ఉన్నతాధికారుల సమీక్షలో రైల్వే జోన్ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. రైల్వే జోన్‌కు అవసరమైన అన్ని అర్హతలు విశాఖకే ఉన్నాయని గుర్తించారు. దీంతో కొత్త రైల్వే జోన్ల కోసం ఏర్పాటైన కమిటీ పని సులువైంది. ఇక జోన్ ప్రకటనే ఆలస్యం. ఈ నెల 15వ తేదీతో ప్రత్యేక రైల్వే జోన్ కమిటీ నివేదికను కేంద్రానికి ఇవ్వాల్సి ఉంది. దీంతో కమిటీ తన పనిని వేగవంతం చేస్తోంది. త్వరలోనే విశాఖను నవ్యాంధ్రకు రైల్వే జోన్‌గా ప్రకటించేందుకు మార్గం సుగమమయింది. ఫలించిన సుదీర్ఘ పోరాటం! : రాష్ట్ర పునర్విభజన బిల్లులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంతకు ముందు నుంచే దశాబ్దాల కాలంగా విశాఖ లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే ఆందోళనలు జరుగుతున్నాయి. పొరుగున ఉన్న ఒడిశా రైల్వే అధికారుల పెత్తనం కారణంగానే ఈ డిమాండ్ స్థానికుల్లో బలంగా నాటుకుపోయింది. విశాఖకు వచ్చే పలు రైళ్లను భువనేశ్వర్‌కు పొడిగించుకుపోవడంతో పాటు బెర్తుల్లో కోటాను ఆక్రమించేస్తుండడంతో విశాఖ వాసులు ఈ పోరాటాన్ని సుదీర్ఘకాలం నుంచి చేస్తున్నారు. కానీ రైల్వే జోన్ కోసం విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్లు పోటీపడ్డాయి. రాష్ట్ర రాజధాని ఉన్నచోటే రైల్వే జోన్ ఉండాలని ఆ ప్రాంతీయులు డిమాండ్ చేశారు. కానీ మొదటి నుంచి విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు బీజేపీ సుముఖంగా ఉంది. మొదటి నుంచి విశాఖలోనే రైల్వే జోన్ అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పదేపదే ప్రకటించారు. మొదట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయవాడ పేరునే ప్రకటించినా పాలన వికేంద్రీకరణ నేపథ్యంలో జోన్ విశాఖనే వరించనుంది. నాలుగు డివిజన్లు! : విశాఖ కేంద్రంగా ఏర్పడే నూతన రైల్వే జోన్లో నాలుగు డివిజన్లు ఉంటాయి. వాల్తేరు, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు రైల్వే డివిజన్లను కలిపి ఒకే జోన్‌గా ఏర్పాటు చేయనున్నారు. తూర్పు కోస్తా రైల్వేలో ఉన్న వాల్తేరు డి విజన్‌ను విడదీసి కొత్త జోన్లో విలీనం చేస్తారు. దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లకు ఇక విశాఖ కేంద్రం కానుంది. వాల్తేరు జోన్‌ను వదులుకోలేమంటూ ఇప్పటి వరకూ అడ్డుకున్న ఒడిశా రైల్వే ఉన్నతాధికారుల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. జోన్ కేంద్రానికి అవసరమైన రైల్వే స్థలాలు, క్రీడా మైదానాలు, ఆస్పత్రులు, కార్యాలయాలన్నీ విశాఖలోనే భారీగా ఉండడంతో కమిటీ విశాఖను ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొంది. -
కార్పొరేట్ కౌగిలిలో చంద్రబాబు బందీ
సీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఏమైంది మూడు నెలల్లో 14 వేల మంది ఉద్యోగులను తొలగించారు రుణమాఫీపై స్పష్టత లేదు సీమ సమస్యలపై జాతా నిర్వహిస్తాం పీలేరు: సామాన్య ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు కార్పొరేట్ కౌగిలిలో బందీ అయ్యారని సీపీఎం జాతీయ కమిటీ సభ్యుడు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ.గఫూర్ అన్నారు. ఆదివారం ఆయన పీలేరులో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ వెనుకబాటుతనాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం గతంలో సీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని, చంద్రబాబు ఆ విషయమై ఇప్పటివరకు కేంద్రంతో చర్చించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై స్పష్టమైన ప్రకటన చేయకుండానే కమిటీలతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టా రు. మూడు నెలలుగా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చంద్రబాబు నవ్యాంధ్ర సాధనకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వం మూడు నెలల్లోనే ప్రజా విశ్వా సం కోల్పోయే స్థాయికి చేరుకుందని అన్నారు. గత ప్రభుత్వం 27 వేల మంది డ్వాక్రా యానిమేటర్లకు నెలకు రూ.2 వేలు జీతం ఇస్తానని ప్రకటించిందని, ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నారని చెప్పారు. బాబువస్తాడు..జాబు వస్తుందని అందరూ ఓట్లువేసి అధికారాన్ని కట్టబెట్టారని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 14 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను విధుల నుంచి తొలగించి బాబు తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారని తెలిపారు. చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నారు. బాబు దొరబాబులను కలుస్తున్నారు తప్ప పేదల కష్టాల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంత్రులు డమ్మీలు కావడం వల్లే ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపిం చారు. బాబు రాయలసీమకు ద్రోహం చేస్తే చరిత్ర క్షమించదన్నారు. సీమ సమస్యలపై త్వరలోనే ప్రజల తో జాతా నిర్వహిస్తామన్నారు. తాము మొదటి నుంచీ రాష్ర్ట విభజనకు వ్యతిరేకమేనని, అనివార్య కారణాలతో విభజన జరిగిందని అన్నారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితమైతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు కందారపు మురళి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గంగరాజు, వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు.