అక్షర తూణీరం
ఓ యువతి చక్కని నవ్వుతో పచ్చని శాలువతో నన్ను సత్కరించింది. చంద్రబాబు పనితనాన్ని అరవైఆరోసారి మెచ్చుకుంటూ గడప దిగాను. ఒక్కసారి సన్మాన శాలువలో నన్ను నేను చూసుకోవాలనిపించింది. తీరా చూద్దును కదా, శాలువా లేదు. సన్మానం కేవలం నా భ్రమ. శాలువా హుళక్కి! వర్చుయల్ రియాలిటీ అంటే ఇదేట!
అందరికీ తెలుసు చంద్ర బాబు అంటే హైటెక్, హైటెక్ అంటే చంద్ర బాబు అని. ఇప్పు డాయన ఆలోచలన్నీ సిం గపూర్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇతరేతర కారణాల వల్ల ఇంతకు ముందు కూడా సింగపూర్ లోనే తిరిగేవని గిట్టనివాళ్లు అంటుం టా రు. ప్రస్తుతం మంది మార్బలంతో సాక ల్యంగా సింగపూర్‌ని అధ్యయనం చేస్తు న్నారు. రెండోరోజు పర్యటనలో అక్కడ ఉన్నతాధికారి కొన్ని అత్యాధునిక సాంకే తిక విజ్ఞాన విశేషాలను వివరిస్తూ- ‘‘పున ర్వినియోగ ప్రక్రియ (రీసైకిల్) ద్వారా ఘన వ్యర్థాలను కనిష్ట స్థాయికి తగ్గించడా నికి ఒక పథకాన్ని రూపొందించాం!’’ అన్నారట. సాంతం మాట పూర్తి కాకుం డానే చంద్రబాబు అందుకుని ‘‘ఆ టెక్నా లజీ మాకు తెలుసండీ! కిందటి జనరల్ ఎలక్షన్ల ముందు ఈ ప్రక్రియని ప్రారం భించి కొన్నివేల మెట్రిక్ టన్నుల ఘనవ్య ర్థాలను దారికి తెచ్చాం. అయితే వాటికి చోటు కల్పించడం ఇప్పుడు పెద్ద సమ స్యగా ఉంది’’ అన్నారట నిట్టూర్పుగా.
ప్రస్తుతం చంద్రబాబు ముందున్న సవాలు ‘స్టేట్ క్యాపిటల్’. మహా నిర్మా ణాలన్నిటికీ ముందు నమూనాలు నిర్మి స్తారు. ఇదిగో ఇప్పుడు మనం సమస్త హైటెక్ హంగు లతో తయారైన నవ్యాంధ్ర క్యాపిటల్ ముఖద్వారంలో ఉన్నాం. వెయ్యి రూపాయలతో టికెట్ కొనుక్కుని ప్రవేశించాం. రాష్ట్రానికి గుండెకాయ అసెంబ్లీహాలు. అరుపులూ కేకలతో సహ జ సుందరంగా అలరారుతోంది. నీట్ అం డ్ క్లీన్‌గా ఉంది. ఒక్క ఫైలు లేదు. కాగితం ముక్కయినా లేదు. టేబుల్స్ మీద సర్వార్థ సాధక కంప్యూటర్లు మాత్రమే వెలుగుతు న్నాయి. ఉద్యోగులు విశ్రాంతిగా కూర్చొని ఉన్నారు. కొందరు వాళ్లలో వాళ్లే మాట్లాడు కుంటున్నారు. ఇది హైటెక్ ఫోన్ విధా నంట. యాక్టివేటెడ్ స్పేస్ టెక్నాలజీలో ఊరికే మాట్లాడితే చాలు, కోరిన వారికి వినిపిస్తుంది. వాళ్ల మాటలు వీళ్ల చెవిన పడతాయి. అవతలి నెంబర్ని స్మరిస్తే చాలు తగులుకుంటుంది.
విశాలమైన వీధులు, వీధుల వెంట నీటి చిమ్మెనలు. పక్కన లేతపచ్చికలు. మధ్యమధ్య వత్తుగా పసుపుపచ్చ గడ్డి పూలు. నాలుగడుగులు వేసి నలభై మెట్లె క్కితే హైకోర్టు భవనం. కళ్లకు గంతలతో న్యాయదేవత విగ్రహం. చాలా ప్రశాంతం గా ఉంది. అసలక్కడికి అడుగుపెడితే అం తా నిజమే చెబుతారు, అబద్ధం చెప్పరని పిస్తుంది. కాని లాయర్ ఇండస్ట్రీ దెబ్బతిం టుందేమో తెలియదు. ‘‘ఆహా! ఈ మయుని రచనా చమత్కృతి ఏమియో గాని...’’ అన్న ట్టుంది, నవ్యాంధ్ర క్యాపి టల్. ఇదిగో ఇక్కడ మన తెలుగు సంప్ర దాయం ఉట్టిపడుతోంది. వందలాది ఉట్లు. ఉట్టి ఉట్టికో తెలుగు వంటకం. అరి సెలు, పూతరేకులు, పాలతాళికలు, బొబ్బ ట్లు... మరి ఏమి లేవని చెప్పను? మనం చూస్తున్నది ‘అన్న ఆహారశాల’. తెలుగు కూరలు, అరవై నాలుగు రకాల పచ్చళ్లు, చిత్రాతిచిత్రమైన చిత్రాన్నాలు, మన చెట్ల కు పండిన పళ్లు, చివరన తాంబూలం. కుం కుమపువ్వు మాత్రం కాశ్మీరానిది.
మనుచరిత్రలో పసరు మహిమ గల సిద్ధుడిలా క్యాపిటల్ అణువణువు అరక్ష ణంలో చూసి ఆనందించా. లంకలో హను మ సీత కోసం అన్వేషించినట్టు నేను లోపాల కోసం వెదికా! ఒక్కటీ దొరక లేదు. తెలుగువాడిగా పుట్టడం నా అదృ ష్టమని అరవైసార్లు అనుకున్నాను. తిరిగి వస్తుంటే అక్కడ ‘సింహద్వారం’ ఉంది. దాని రేటు సెపరే టన్నారు. వంద సమ ర్పించుకుని లోపలికి అడుగు పెట్టాను. ఆశ్చర్యం... సింహద్వారం మీద ఒక చెయ్యి ఆన్చి, మరో చేత జరీ ధోవతి కుచ్చె ళ్లను సుతారంగా పట్టు కుని ఠీవిగా నిల బడి ఉన్నారు ఎన్‌టిఆర్. ‘‘బాగున్నారా! పిల్లాపాపా, పాడీపంటా సుభిక్షమే కదా, శునకంగారూ!’’ అన్నారు. ఉలిక్కిపడి, నేను కనకారావండీ అన్నాను. ‘‘తమ బొం ద, ఓటర్ల జాబితాలో తమ పేరు శునకా రావే.. హె!’’ అన్నారు. ఔను. మా వార్డు మెంబరు నా మీద కక్ష కట్టి అక్షరం తప్పు వేయించాడు. ‘‘తమ ఖర్మ’’ అంటుండ గానే తెరపడింది. ఇంతలో ఓ యువతి చక్కని నవ్వుతో పచ్చని శాలువతో నన్ను సత్కరించింది. చంద్రబాబు పనితనాన్ని అరవైఆరోసారి మెచ్చుకుంటూ గడప ది గాను. ఒక్కసారి సన్మాన శాలువలో నన్ను నేను చూసుకోవాలనిపించింది. తీరా చూ ద్దును కదా, శాలువాలేదు. సన్మానం కేవ లం నా భ్రమ. శాలువా హుళక్కి! వర్చు యల్ రియాలిటీ అంటే ఇదేట!
(వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత)
నవ్యాంధ్ర మహానగర్
Published Sat, Nov 15 2014 12:14 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement