High-tech
-
ఆటోవాలా హైలైట్
అరాచకాలు, అన్యాయాలు చేస్తూ మాఫియా డాన్‌గా మారిన వ్యక్తిని పోలీసులు చివరికి ఎలా అంతమొందించారు? అనే కథతో రూపొందుతోన్న చిత్రం ‘హైటెక్ కిల్లర్’. జాతీయ బాడీ బిల్డర్ బల్వాన్ హీరోగా, శ్రావణి హీరోయిన్గా నటించారు. ఎస్ఎంఎం ఖాజా దర్శకత్వంలో మజ్ను సాహెబ్ మూవీస్, సోహ్రాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకాలపై మజ్ను రెహాన్ బేగం నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేశాం. రెండు పాటలు మిగిలి ఉన్నాయి. వాటిని త్వరలోనే చిత్రీకరించనున్నాం. ఎస్కె మజ్ను అందించిన పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడిన ‘ఆటోవాలా...’ సాంగ్ హైలైట్ అయింది. ‘హైటెక్ కిల్లర్’కి సీక్వెల్‌గా ‘హీమాన్’ అనే పేరుతో మరో సినిమా తెరకెక్కిస్తున్నాం. దాన్ని రంజాన్ కానుకగా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యాదగిరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షేక్ మహ్మద్ , నిర్మాత: మజ్ను రెహాన్ బేగం. -
నిద్ర సమస్యలకు హైటెక్ కళ్లజోడు!
ఆరోగ్య పరిరక్షణలో టెక్నాలజీ వాడకం కొత్తేమీ కాదు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త, వినూత్న వైద్య పద్ధతులు అందుబాటులోకి వస్తూండటం విశేషం. అమెరికాలోని లాస్‌వేగస్‌లో ప్రస్తుతం జరుగుతున్న కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్ –2018)లో ఈ ఏడాది కనిపించిన టెక్నాలజీలే ఇందుకు తార్కాణం. ఒత్తిడిని తగ్గించే హెడ్‌బ్యాండ్, వయోవృద్ధులు మందులు సరిగా తీసుకుంటున్నారా? లేదా? అన్నది చెక్ చేసేందుకు కాలి సాక్స్‌లో దాగే సెన్సర్లు.. తుంటి ఎముకలకు రక్షణ కల్పించే వినూత్న బ్యాగ్ వంటివి మచ్చుకు కొన్నే.. ఒక్కోదాని వివరాలు చూసేద్దాం... నిద్ర సమస్యలకు హైటెక్ కళ్లజోడు! నిద్ర పట్టకపోయినా.. ఉదయాన్నే నిద్రలేవాలంటే బద్ధకంగా అనిపిస్తున్నా తెల్లవారకముందే మెలకువ వచ్చేస్తున్నా.. ఈ హైటెక్ కళ్లద్దాలు వాడేయమంటోంది పెగాసీ గ్లాస్ అనే సంస్థ. ఫ్రేమ్ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైట్ల కారణంగా సుఖనిద్రకు కావాల్సిన మెలటోనిన్‌ను నియంత్రించవచ్చునన్నది కంపెనీ అంచనా. తద్వారా మన శరీరాల్లోని గడియారం సహజస్థితికి చేరుతుందని.. నిద్ర సమస్యలన్నీ దూరమవుతాయని కంపెనీ అంటోంది. ఒక్కో కళ్లజోడు ఖరీదు రూ.12 వేల వరకూ ఉంటుంది! ఒత్తిడికి విరుగుడు ఈ హెడ్‌బ్యాండ్ కెనడాకు చెందిన స్టార్టప్ ఇంటరెక్సాన్ ‘మ్యూజ్’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ హెడ్‌బ్యాండ్ మన మెదడులోని నాడుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒత్తిడిని తగ్గిస్తుందట. ధాన్యం చేసేటప్పుడు ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించేందుకు, అథ్లెటిక్స్ పోటీల్లో ఒత్తిడిని జయించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. దక్షిణ కొరియాకు చెందిన లూక్సిడ్ ల్యాబ్స్ కూడా ఇలాంటి పరికరాన్నే ప్రదర్శించినప్పటికీ ప్రస్తుతం తాము పరిశోధన దశలోనే ఉన్నామని కంపెనీ ప్రకటించింది. వృద్ధుల స్థితిగతులపై కన్నేసేందుకు.. మతిమరపు లేదంటే అయిష్టత కారణంగా వయసు మీదపడిన వారు మందులు తీసుకునేందుకు అంతగా ఇష్టపడరు. ఈ సమస్యకు పరిష్కారంగా వాషింగ్టన్ స్టార్టప్ కంపెనీ సెన్సోరియా పేరుతో ఓ వినూత్నమైన గాడ్జెట్‌ను సిద్ధం చేసింది. వ్యాయామ సమయంలో శరీర కదలికలను గుర్తించి.. తప్పుఒప్పులను సరిచేసేందుకు కొన్నేళ్ల క్రితం సిద్ధం చేసిన ఓ గాడ్జెట్నే ప్రస్తుతం వృద్ధులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. మన దుస్తులకు గానీ, సాక్స్కుగానీ ఈ గాడ్జెట్‌ను తగిలించుకుంటే.. వ్యాయామం సరిగా చేస్తున్నారా లేదా?, మందులు సక్రమంగా తీసుకుంటున్నారా? వంటి అంశాలన్నింటినీ వారికి గుర్తు చేస్తూంటుంది ఇది. తుంటి ఎముకలకు రక్షణ కవచం.. వృద్ధులు పొరబాటున జారిపడితే తుంటి ఎముకలకు నష్టం జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వారి కోసమే ఫ్రాన్స్ కంపెనీ హెలైట్ తుంటిభాగానికి రక్షణ కల్పించే ఓ హైటెక్ సంచిని తయారు చేసింది. నడుముకు తగిలించుకుని వెళుతూంటే చాలు.. వాటిలోని మోషన్ సెన్సర్స్ మన కదలికలపై ఓ కన్నేసి ఉంచుతాయి. ప్రమాదవశాత్తూ పడిపోతే.. ఇవి వెంటనే స్పందిస్తాయి. గాలి బుడగలు విచ్చుకునేలా చేస్తాయి. ఫలితంగా సున్నితమైన తుంటి ఎముకలకు రక్షణ ఏర్పడుతుందన్నమాట. -
హైటెక్ దోపిడీ..!
-
ఆట నేర్పే బంతి
మీరు ఫుట్‌బాల్ నేర్చుకోవాలనుకుంటున్నారా? కోచ్ ఎవరూ లేరని బాధపడుతున్నారా? అయితే ఫొటోలో కనిపిస్తున్న బంతి మీ కోసమే! ఈ హైటెక్ బంతిలోనే ఓ కోచ్ ఉన్నాడు. బంతిలో రకరకాల సెన్సర్లు అమర్చారు. మీరు బంతిని తన్నినప్పుడు ఎంత గట్టిగా తన్నారు? ఎంత మేరకు బంతి గిరగిరా తిరుగుతోంది?, బంతి ఎంత దూరం వెళ్లింది? ఏ మార్గంలో వెళ్లింది? ఇలాంటి అన్ని వివరాలను ఈ సెన్సర్లు నమోదు చేసుకుంటాయి. వైఫై ద్వారా సమాచారాన్ని విశ్లేషించే ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ .. హెడ్‌ఫోన్ ద్వారా మీకు సూచనలిస్తుంది. ‘‘భలే కొట్టావు, బంతిని కుడివైపునకు తీసుకెళ్లు, సిసర్ కిక్ కొట్టు’’ అంటూ రకరకాల సూచనలు అందివ్వగలదు. వీటితోపాటు అప్లికేషన్లో పది షార్ట్ వీడియో కోచింగ్ మెటీరియల్‌ను పెట్టామని కంపెనీ చెబుతోంది. బాల క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, కోచ్‌లు అనేక మందితో మాట్లాడాక మూడేళ్లు శ్రమపడి తాము ఈ ఇన్సైడ్ కోచ్ బంతిని అభివృద్ది చేశామని తెలిపింది. ఈ సంవత్సరం చివరినాటికి ఈ అధునాతన బంతి మార్కెట్లోకి రానుంది. -
హైటెక్ రెస్టారెంట్లు
వినియోగదారులకు ఏం కావాలో ఆర్డర్ తీసుకోవడం, వాళ్లు అడిగింది వడ్డించి బిల్ తీసుకుని పంపేయడం... ఇది నిన్న మొన్నటి వరకు రెస్టారెంట్ల విధానం. అయితే ప్రస్తుతం ఆ విధానంలో మార్పు వస్తోంది. రెస్టారెంట్‌కి వచ్చే వినియోగదారులకు కావాల్సిన భోజనాన్ని అందించడంలో కాస్తంత వైవిధ్యాన్ని కనబరుస్తున్నారు. అందులో భాగంగానే రెస్టారెంట్లకు సరికొత్త హంగులను, హై‘టెక్’ సొబగులను అద్దుతున్నారు. టేబుల్ పై నుండే ఆర్డర్ ఇచ్చేలా అందుబాటులోకి వచ్చిన ‘ఈ-మెను’, టేబుల్ పైనే ఉండే ‘పొయ్యి’ ఇవన్నీ ఈ తరహాలోనివే. ఇంకేముంది రెస్టారెంట్లలోని మెనూతో పాటు ఈ నయా హంగులను నగరవాసులు ఆస్వాదించేస్తున్నారు. - సాక్షి, బెంగళూరు టేబుల్ పైనే ‘ఈ-మెను’ స్నేహితుడి పుట్టిన రోజు వేడుకనో, లేదంటే వివాహ వార్షికోత్సవమనో, అదీ కాకపోతే సరదాగా వీకెండ్ సమయాల్లోనో ఇలా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో కుటుంబంతో కలిసి లేదంటే స్నేహితులతోనో రెస్టారెంట్లకు వెళ్లడం నగరంలో సర్వసాధారణం. అయితే అక్కడ మెనూను అందించేటపుడు సర్వర్లు చేసే ఆలస్యంతో సంతోషం కాస్తా నీరుగారిపోతుంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే నగరంలో ప్రస్తుతం ‘ఈ-మెను’ను అందించే రెస్టారెంట్లు ప్రారంభమవుతున్నాయి. రెస్టారెంట్‌కు వచ్చిన వినియోగదారులు సర్వర్ తమ టేబుల్ దగ్గరికి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూసే అవసరం లేకుండా చేస్తుంది ఈ ‘ఈ-మెను’. రెస్టారెంట్‌లోని ప్రతి డైనింగ్ టేబుల్ పై ఎల్సీడీ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో రెస్టారెంట్లో అందుబాటులో ఉన్న మెనూ వివరాలతో పాటు కొన్ని గేమ్స్ కూడా పొందుపరచబడి ఉంటాయి. రెస్టారెంట్‌కు వచ్చిన వినియోగదారులు సర్వర్ల కోసం ఎదురుచూడకుండా ‘ఈ-మెను’ పద్దతిలో టేబుల్‌పైనే ఏర్పాటు చేసిన ఎల్సీడీ టచ్‌స్క్రీన్ ద్వారానే ఆర్డర్ ఇవ్వవచ్చు. అలా టేబుల్ నుండి ఆర్డర్ ఇవ్వగానే కిచెన్‌లో ఏర్పాటుచేసిన స్పీకర్ల ద్వారా సర్వర్లకు తెలిసిపోతుంది. ఇక మీరు ఆర్డర్ చేసిన భోజనం వచ్చే వరకు టైంపాస్ చేయడానికి మీ టేబుల్‌పైనే ఉండే టచ్ స్క్రీన్‌లో గేమ్స్ ఉండనే ఉన్నాయి. వినియోగదారుల టైంని సేవ్ చేయడంతో పాటు వాళ్లకి వినోదాన్ని కూడా పంచే ఈ విధానం నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తోందని ‘ఈ-మెను’ను నగరంలో మొట్టమొదటి సారిగా అందుబాటులోకి తెచ్చిన ‘పేజ్-1’ రెస్టారెంట్ మేనేజింగ్ డెరైక్టర్ వసంత్ చెప్పారు. టేబుల్ పైనే ‘వండి’ వడ్డిస్తారు కొంత కాలం వరకు సాధారణంగా రెస్టారెంట్లో మనం ఆర్డర్ ఇచ్చిన వంటకాలను కిచెన్‌లో వండి తీసుకొచ్చి వడ్డించేవారు. కానీ ప్రస్తుతం ఆ పద్ధతీ మారిపోయింది. నగరంలోని వివిధ రెస్టారెంట్లలో మనం ఆర్డర్ చేసిన స్టాటర్స్ను (భోజనానికి ముందు తీసుకొనే కొన్ని ఆహారపదార్ధాలు) మన టేబుల్‌పైనే వండి వడ్డించేస్తున్నారు. దీనినే ముద్దుగా ‘బార్బెక్యూ’ విధానంగా పిలుచుకుంటున్నారు. గ్రిల్డ్ విధానంలో తయారయ్యే స్టాటర్స్ను టేబుల్‌పైనే సిద్ధం చేసి వేడివేడిగా వడ్డించడమే ‘బార్బెక్యూ’ విధానం. ఇక ఇందులో డైనింగ్ టేబుల్ మధ్య భాగంలో ఒక పాత్రను ఉంచుతారు. అందులో నిప్పులను వేస్తారు. మనం ఆర్డర్ చేసిన స్టాటర్ రకాన్ని(చికెన్,మటన్, పనీర్ ఇలా ఏదైనా) పొడవాటి కడ్డీలకు గుచ్చి ఆ పాత్రపై ఉంచుతారు. కొద్ది నిమిషాల తర్వాత ఆ కడ్డీలకు గుచ్చిన ముక్కలను వేడివేడిగా ప్లేట్లో వడ్డించేస్తారు. వినియోగదారుల కళ్లముందే స్టాటర్స్ రెడీ అయిపోవడం, పొగలుకక్కుతూ ప్లేట్లోకి చేరిపోతుండడంతో ‘బార్బెక్యూ’ పద్ధతిని అందించే రెస్టారెంట్లపైన కూడా నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యేక థీమ్‌లతో దుమ్ములేపుతున్నారు వినియోగదారులను ఆకర్షించడానికి రెస్టారెంట్లు అనుసరిస్తున్న మరో సరికొత్త విధానం ‘థీమ్’. అవును రెస్టారెంట్ లోపలికి అడుగుపెట్టగానే వినియోగదారులు ఓ ప్రత్యేకమైన అనుభూతికి లోనయ్యేలా చేయడానికి రెస్టారెంట్లు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఒక వారం తమ రెస్టారెంట్‌ను అచ్చమైన పల్లెటూరిని తలపించేలా అలంకరిస్తే, మరో వారం ఆది మానవుల కాలం నాటి పరిస్థితులను తెలియజెప్పేలా, ఇంకోవారం దట్టమైన అడవిలా ఇలా విభిన్నంగా, వినూత్నంగా అలంకరించేస్తున్నారు. అంతేకాదండోయ్ రెస్టారెంట్లలోని సర్వర్లు కూడా థీమ్‌కు తగ్గట్టుగానే తమ డ్రస్‌కోడ్‌ని మార్చేసుకుంటున్నారు. అడవి థీమ్ అయితే గిరిజనుల్లా డ్రెస్ చేసుకోవడం, పల్లె థీమ్ అయితే పంచెకట్టులో ప్రత్యక్షం అవడం చేస్తూ వినియోగదారులను ఆకర్షించేస్తున్నారు. ఇలా ఎందుకు అంటే రెస్టారెంట్‌కు వచ్చే వినియోగదారులు ప్రస్తుతం టేస్టీ భోజనంతో పాటు మరికొంత ఆహ్లాదాన్ని కూడా కోరుకుంటున్నారని, అందుకే తాము ఈ పద్దతిని ఎంచుకుంటున్నామని చెబుతున్నారు రెస్టారెంట్ల నిర్వాహకులు. అంతేకాదు ఈ థీమ్‌ల ద్వారా ప్రస్తుత తరాలకు తెలియకుండా పోతున్న అనేక విషయాలను తెలియజెప్పడమే తమ లక్ష్యమని కూడా చెబుతున్నారు. అందుకే పల్లె సంస్కృతిని తెలియజెప్పేలా, పచ్చదనం ఆవశ్యతను తెలియజెప్పేలా వివిధ థీమ్స్‌ను పరిచయం చేస్తున్నామని చెబుతున్నారు. -
హైటెక్ కళాపోషణ
ప్రొఫెషనల్స్ సైతం విస్తుపోయేలా డ్యాన్స్. మోడల్స్‌కి దీటుగా ర్యాంప్‌వాక్. కనువిందు చేసే గెటప్స్. వన్స్‌మోర్ అనిపించే షాయరీలు. అన్నీ కలబోసిన ఈ కార్యక్రమాన్ని కండక్ ్టచేసింది సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ‘హైఫై లైఫ్‌స్టైల్.. టైమ్ దొరికితే కాఫీషాప్స్... వీకెండ్స్‌లో పబ్స్!’ తమ మీదున్న ఇలాంటి అభిప్రాయానికి చెక్ పెడుతూ వీలు చేసుకుని మరీ ఈ ఈవెంట్ ద్వారా సోషల్ సర్వీస్ బాట పట్టారు టెకీ లు. సేవే లక్ష్యంగా ఏర్పాటైన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసీ).. ఇంతకుముందు అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈ ఏడాది నిర్వహించిన ఈ కల్చరల్ ఈవెంట్ రొటీన్‌కు భిన్నమైనది. రోజంతా కంప్యూటర్లకు స్క్రీన్స్‌కు కళ్లప్పగించే టెకీలు.. తమలోని సృజనను తట్టిలేపారు. ఆటపాటలతో అందరికీ కనువిందు చేశారు. కాలేజీ రోజుల్లో ఫ్రెషర్స్, ఫేర్వెల్ డేస్ అప్పుడు చేసిన అల్లరికి.. కొంచెం హుందాతనం, ఇంకొంచెం ప్రొఫెషనలిజం జోడించి పర్ఫెక్ట్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇటీవల గంటన్నర పాటు జరిగిన యాన్యువల్లో ఏడాదంతా గుర్తుండిపోయే అభినయం చూపారు. అమెరికా కాన్సులేట్ (హైదరాబాద్) జనరల్ మైకేల్ ములిన్స్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఏడీపీ, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, డెలాయిట్, టీసీఎస్, ఐబీఎం... ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 200 కంపెనీలకు చెందిన ఉద్యోగులు పాలు పంచుకొన్నారు. ఎవరికి ప్రావీణ్యమున్న కళల్లో వాళ్లు తమ సత్తా చూపించారు. ఒక్కో థీమ్.. ఒక్కో తీరు.. ఒకరు శాస్త్రీయ సంగీతంలో ఓలలాడిస్తే... కొందరు కామెడీ స్కిట్స్ చేసి కడుపుబ్బా నవ్వించారు. డ్యాన్స్‌ల కోసం ప్రొఫెషనల్స్ తరహాలో కొరియోగ్రాఫర్స్ సహాయం తీసుకున్నారు. కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, మేకప్ ఏ విషయంలోనూ రాజీ పడలేదు. ఒకరు ఏంజల్, ఇంకొకరు వాల్ పెయింటింగ్, మరొకరు లగాన్ గెటప్.. ఇలా ఒక్కో థీమ్‌కు ఒక్కో తరహా డ్రెసింగ్‌తో అలరించారు. బాలీవుడ్, టాలీవుడ్ సాంగ్స్‌కి స్టెప్పులు వేశారు. ఇక ఏడీపీ ఉద్యోగులు 12 మంది మెడ్లీ సాంగ్‌పై పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి మన్ననలు అందుకున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో స్టేజ్ మీదికి ఎంట్రీ ఇచ్చిన టీమ్ సభ్యులు.. ముఖాలపై డ్రాగన్ స్పార్క్లింగ్స్తో సమ్‌థింగ్ స్పెషల్‌గా కనిపించారు. ఇక క్యాపిటల్ ఐక్యూ నుంచి గ్రూప్ డ్యాన్స్ వీక్షకులను సైతం కాలు కదిపేలా చేసింది. ఇక అమ్మాయిల క్యాట్‌వాక్‌తో హొయలు పోతే.. అబ్బాయిలు ర్యాంప్‌పై మోడల్స్‌లా గాంభీర్యం ప్రదర్శించారు. ఒంటినిండా టాటూస్, ఫంకీ హెయిర్‌స్టైల్స్‌తో, హాలీవుడ్ హీరోస్తో పోటీ పడ్డారు. ఇలా ఎక్కడో మరచిపోయిన తమలోని టాలెంట్‌ను మరోసారి వెలికి తీసి ఓ వెలుగు వెలిగారు. స్ట్రెస్ రిలీఫ్.. జాబ్ టెన్షన్స్‌కు చెక్ పెట్టడానికి టెకీలు ఈవెంట్స్‌ను ఓ మార్గంగా ఎంచుకుంటున్నారు. అందులో పార్టిసిపేట్ చేసి తమ సత్తా చాటుతున్నారు. వచ్చామా.. చేశామా అన్నట్టు కాకుండా.. ఇందుకోసం నిపుణుల దగ్గర కొన్ని రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. డిఫరెంట్ థీమ్స్ ఎంచుకోవడమే కాదు, రిహార్సల్స్‌లో చెమటోడ్చి.. వాటిని సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శిస్తున్నారు. డ్యాన్స్, ర్యాంప్వాక్లే కాదు.. కామెడీతో పాటు సామాజిక అంశాలపై స్కిట్స్ కూడా చేస్తున్నారు. - సిరి ఫండ్స్ ఫర్ రిలీఫ్: వందలాది కంపెనీలు ఎంతో ఉత్సాహంతో ఈ కాంపిటీషన్లో పాల్గొన్నాయి. ప్రోగ్రాం ఇంత విజయవంతం కావడం సంతోషాన్నిస్తోంది. వచ్చిన స్పాన్సర్ ఫండ్‌ను అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలకోసం ఉపయోగిస్తునాం. ఈ ఈవెంట్ ఓ కాజ్కు ఉపయోగపడేదే కాదు, ఐటీ ఉద్యోగులకు తమ టాలెంట్ ప్రదర్శించే అవ కాశాన్ని కూడా కల్పించింది. - రమేష్ లోకనాథన్, ప్రెసిడెంట్, హైసీ -
హైటెక్ మోసం
* బ్యాంక్ ఖాతా నుంచి రూ. 52 వేలు స్వాహా * హైదరాబాద్‌లో లావాదేవీలు * లబోదిబోమంటున్న బాధితుడు ముత్తారం :ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న మోసగాళ్లు రోజురోజుకూ హైటెక్ తరహా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ముత్తారం మండలం బుధవారంపేట(రామయ్యపల్లి)కి చెందిన కన్నూరి సదయ్య ఖాతా నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా రూ.52 వేలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడి కథనం.. మంథని ఆంధ్రాబ్యాంకులో 0843100008712 నంబరుతో ఖాతా ఉంది. దీనిపై 4688 1708 4305 9785 న ంబర్ గల ఏటీఎం కార్డు ఉంది. ఇటీవలే గ్రామంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేయగా దానికి సంబంధించిన వాయిదా కిస్తీ చెల్లించడం అప్పుగా తెచ్చుకున్న రూ. 61,500 బ్యాంకు ఖాతాలో జమచేశాడు. ఈనెల 2న సదయ్య మొబైల్‌కు ఫోన్ వచ్చింది. తాము ఏటీఎం కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు బ్యాంకు ఖాతా ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? ఏటీఎం తీసుకున్నారా? దాన్ని జాగ్రత్తగా వినియోగిస్తున్నారా? కార్డు నంబర్, పిన్ నంబర్ చెప్పండి అని అడిగారు. ఇదంతా నిజమేననుకున్నా సదయ్య అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాడు. జవాబులు చెప్పిన రోజే ఆయన ఖాతా నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు స్వాహా అయ్యాయి. అయితే భూమికి సంబంధించిన డబ్బులు చెల్లించే గడువు రావడంతో బ్యాంక్‌లోని డబ్బులు డ్రా చేయడం కోసం వెళ్లిన ఆయనకు అసలు నిజం తెలియడంతో లబోదిబోమన్నాడు. తాను డబ్బులు డ్రా చేయకుండా ఎలా ఖాతా నుంచి డ్రా అవుతాయని మేనేజర్ నిలదీయడంతో ఆయన చెప్పిన నిజాన్ని విని సదయ్య షాక్‌కు గురయ్యాడు. ఈ నెల 2 నుంచి 5 వరకు దాదాపు రూ.52 వేలు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డ్రా అయిన ట్లు మేనేజర్ వివరించారు. ఇట్టి డబ్బులు హైదరాబాద్‌లోని గచ్చీబౌలీ ప్రాంతంలో డ్రా అయినట్లు స్పష్టం చేశారు. ఆందోళన గురైన ఆయన ముత్తారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ విషయంపైన బ్రాంచీ మేనేజర్ సత్యనారాయణను ‘సాక్షి’ వివరణ కోరగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు స్వాహా అయ్యాయని, అయితే ఎవరు స్వాహా చేసిన విషయం తెలియదని చెప్పారు. హైటెక్ మోసంపై తాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
తెలంగాణకు హైటెక్కులు దిద్దింది నేనే
నా వల్లే రాష్ట్రంలో మిగులు బడ్జెట్: ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి తాను అడ్డుపడుతున్నానన్న టీఆర్ఎస్ నేతల విమర్శ లు అర్థరహితమని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో తాను అధికారం చేపట్టేనాటికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి హైటెక్ రాష్ట్రంగా తీర్చిదిద్దానని చెప్పారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన తరువాత తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉందంటే అందుకు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం అందించిన పాలనే కారణమన్నారు. తాను ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకూడదనే తాను ఢిల్లీలో కృషి చేసినట్టు తెలిపారు. ఒక్కో ఇటుక పేర్చాలి: ప్రస్తుతం ఏపీలో రాజధాని కూడా లేదని, ఒక్కో ఇటుక పేర్చుకుని వెళ్లాల్సి ఉందన్నారు. తెలంగాణ సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలను మాట్లాడ కుండా సస్పెన్షన్లు చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పెరిగిన టీడీపీ సభ్యత్వం: గతంలో కన్నా పార్టీ సభ్యత్వం పెరిగిందన్నారు. తెలంగాణలో 35 ఏళ్లుగా బుల్లెట్ లాంటి కార్యకర్తలు గలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని, 2019లో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు. ఖమ్మం జిల్లా టీడీపీ సభ్యత్వం లో మొదటి స్థానంలో ఉంటే వరంగల్, మహబూబ్‌నగర్‌లు 2,3 స్థానాల్లో ఉన్నాయన్నారు. అరచేతిలో వైకుంఠం: టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వెనక్కు వెళుతోందని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా కే సీఆర్‌కు పట్టడం లేదన్నారు. రోజుకో మాట చెపుతూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణకున్న కరెంటు కష్టాలు తెలిసీ, అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ కొనుగోలును పట్టించుకోకుండా పక్కరాష్ట్రాన్ని తూలనాడే దౌర్భాగ్యం టీఆర్‌ఎస్‌దన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, పార్టీ నేతలు సండ్ర వెంకటవీరయ్య, కృష్ణయాదవ్, మాగంటి గోపీనాథ్, గాంధీ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నవ్యాంధ్ర మహానగర్
అక్షర తూణీరం ఓ యువతి చక్కని నవ్వుతో పచ్చని శాలువతో నన్ను సత్కరించింది. చంద్రబాబు పనితనాన్ని అరవైఆరోసారి మెచ్చుకుంటూ గడప దిగాను. ఒక్కసారి సన్మాన శాలువలో నన్ను నేను చూసుకోవాలనిపించింది. తీరా చూద్దును కదా, శాలువా లేదు. సన్మానం కేవలం నా భ్రమ. శాలువా హుళక్కి! వర్చుయల్ రియాలిటీ అంటే ఇదేట! అందరికీ తెలుసు చంద్ర బాబు అంటే హైటెక్, హైటెక్ అంటే చంద్ర బాబు అని. ఇప్పు డాయన ఆలోచలన్నీ సిం గపూర్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇతరేతర కారణాల వల్ల ఇంతకు ముందు కూడా సింగపూర్ లోనే తిరిగేవని గిట్టనివాళ్లు అంటుం టా రు. ప్రస్తుతం మంది మార్బలంతో సాక ల్యంగా సింగపూర్‌ని అధ్యయనం చేస్తు న్నారు. రెండోరోజు పర్యటనలో అక్కడ ఉన్నతాధికారి కొన్ని అత్యాధునిక సాంకే తిక విజ్ఞాన విశేషాలను వివరిస్తూ- ‘‘పున ర్వినియోగ ప్రక్రియ (రీసైకిల్) ద్వారా ఘన వ్యర్థాలను కనిష్ట స్థాయికి తగ్గించడా నికి ఒక పథకాన్ని రూపొందించాం!’’ అన్నారట. సాంతం మాట పూర్తి కాకుం డానే చంద్రబాబు అందుకుని ‘‘ఆ టెక్నా లజీ మాకు తెలుసండీ! కిందటి జనరల్ ఎలక్షన్ల ముందు ఈ ప్రక్రియని ప్రారం భించి కొన్నివేల మెట్రిక్ టన్నుల ఘనవ్య ర్థాలను దారికి తెచ్చాం. అయితే వాటికి చోటు కల్పించడం ఇప్పుడు పెద్ద సమ స్యగా ఉంది’’ అన్నారట నిట్టూర్పుగా. ప్రస్తుతం చంద్రబాబు ముందున్న సవాలు ‘స్టేట్ క్యాపిటల్’. మహా నిర్మా ణాలన్నిటికీ ముందు నమూనాలు నిర్మి స్తారు. ఇదిగో ఇప్పుడు మనం సమస్త హైటెక్ హంగు లతో తయారైన నవ్యాంధ్ర క్యాపిటల్ ముఖద్వారంలో ఉన్నాం. వెయ్యి రూపాయలతో టికెట్ కొనుక్కుని ప్రవేశించాం. రాష్ట్రానికి గుండెకాయ అసెంబ్లీహాలు. అరుపులూ కేకలతో సహ జ సుందరంగా అలరారుతోంది. నీట్ అం డ్ క్లీన్‌గా ఉంది. ఒక్క ఫైలు లేదు. కాగితం ముక్కయినా లేదు. టేబుల్స్ మీద సర్వార్థ సాధక కంప్యూటర్లు మాత్రమే వెలుగుతు న్నాయి. ఉద్యోగులు విశ్రాంతిగా కూర్చొని ఉన్నారు. కొందరు వాళ్లలో వాళ్లే మాట్లాడు కుంటున్నారు. ఇది హైటెక్ ఫోన్ విధా నంట. యాక్టివేటెడ్ స్పేస్ టెక్నాలజీలో ఊరికే మాట్లాడితే చాలు, కోరిన వారికి వినిపిస్తుంది. వాళ్ల మాటలు వీళ్ల చెవిన పడతాయి. అవతలి నెంబర్ని స్మరిస్తే చాలు తగులుకుంటుంది. విశాలమైన వీధులు, వీధుల వెంట నీటి చిమ్మెనలు. పక్కన లేతపచ్చికలు. మధ్యమధ్య వత్తుగా పసుపుపచ్చ గడ్డి పూలు. నాలుగడుగులు వేసి నలభై మెట్లె క్కితే హైకోర్టు భవనం. కళ్లకు గంతలతో న్యాయదేవత విగ్రహం. చాలా ప్రశాంతం గా ఉంది. అసలక్కడికి అడుగుపెడితే అం తా నిజమే చెబుతారు, అబద్ధం చెప్పరని పిస్తుంది. కాని లాయర్ ఇండస్ట్రీ దెబ్బతిం టుందేమో తెలియదు. ‘‘ఆహా! ఈ మయుని రచనా చమత్కృతి ఏమియో గాని...’’ అన్న ట్టుంది, నవ్యాంధ్ర క్యాపి టల్. ఇదిగో ఇక్కడ మన తెలుగు సంప్ర దాయం ఉట్టిపడుతోంది. వందలాది ఉట్లు. ఉట్టి ఉట్టికో తెలుగు వంటకం. అరి సెలు, పూతరేకులు, పాలతాళికలు, బొబ్బ ట్లు... మరి ఏమి లేవని చెప్పను? మనం చూస్తున్నది ‘అన్న ఆహారశాల’. తెలుగు కూరలు, అరవై నాలుగు రకాల పచ్చళ్లు, చిత్రాతిచిత్రమైన చిత్రాన్నాలు, మన చెట్ల కు పండిన పళ్లు, చివరన తాంబూలం. కుం కుమపువ్వు మాత్రం కాశ్మీరానిది. మనుచరిత్రలో పసరు మహిమ గల సిద్ధుడిలా క్యాపిటల్ అణువణువు అరక్ష ణంలో చూసి ఆనందించా. లంకలో హను మ సీత కోసం అన్వేషించినట్టు నేను లోపాల కోసం వెదికా! ఒక్కటీ దొరక లేదు. తెలుగువాడిగా పుట్టడం నా అదృ ష్టమని అరవైసార్లు అనుకున్నాను. తిరిగి వస్తుంటే అక్కడ ‘సింహద్వారం’ ఉంది. దాని రేటు సెపరే టన్నారు. వంద సమ ర్పించుకుని లోపలికి అడుగు పెట్టాను. ఆశ్చర్యం... సింహద్వారం మీద ఒక చెయ్యి ఆన్చి, మరో చేత జరీ ధోవతి కుచ్చె ళ్లను సుతారంగా పట్టు కుని ఠీవిగా నిల బడి ఉన్నారు ఎన్టిఆర్. ‘‘బాగున్నారా! పిల్లాపాపా, పాడీపంటా సుభిక్షమే కదా, శునకంగారూ!’’ అన్నారు. ఉలిక్కిపడి, నేను కనకారావండీ అన్నాను. ‘‘తమ బొం ద, ఓటర్ల జాబితాలో తమ పేరు శునకా రావే.. హె!’’ అన్నారు. ఔను. మా వార్డు మెంబరు నా మీద కక్ష కట్టి అక్షరం తప్పు వేయించాడు. ‘‘తమ ఖర్మ’’ అంటుండ గానే తెరపడింది. ఇంతలో ఓ యువతి చక్కని నవ్వుతో పచ్చని శాలువతో నన్ను సత్కరించింది. చంద్రబాబు పనితనాన్ని అరవైఆరోసారి మెచ్చుకుంటూ గడప ది గాను. ఒక్కసారి సన్మాన శాలువలో నన్ను నేను చూసుకోవాలనిపించింది. తీరా చూ ద్దును కదా, శాలువాలేదు. సన్మానం కేవ లం నా భ్రమ. శాలువా హుళక్కి! వర్చు యల్ రియాలిటీ అంటే ఇదేట! (వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత)