needed
-
జమిలి ఎన్నికలపై కేంద్రం కసరత్తు.. రాజ్యాంగ సవాళ్లు ఇవే..
ఢిల్లీ:జమిలి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్రం కమిటీని నియమించింది. దానికితోడు ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఒకే దేశం- ఒకే ఎన్నికల బిల్లు చర్చకు రానుందని రాజకీయ వర్గాల సమాచారం. బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే జమిలి ఎన్నికలకు సిద్ధపడిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడానికి సరిపడా పోలింగ్ సామాగ్రి మన వద్ద లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలు జరపడానికి రాజ్యాంగ పరంగా కూడా చిక్కులు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సవరణలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ‘One Nation One Election’ possible, Constitutional amendment needed: say experts Read @ANI Story | https://t.co/QkRUL3m1Vf#OneNationOneElection #ParliamentSpecialSession pic.twitter.com/AwHG1QF3Gq — ANI Digital (@ani_digital) September 1, 2023 ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే చేయాల్సిన రాజ్యాంగ సవరణలు.. జమిలీ ఎన్నికలకు అనుగుణంగా ఈ ఆరు ఆర్టికల్లలో విధివిధానాలను సవరించాల్సి ఉంటుంది. ► ఆర్టికల్ 83(2): ఈ ఆర్టికల్ ప్రకారం లోక్‌సభ గడువు ఐదేళ్లు. ముందుగా కూడా రద్దు చేయవచ్చు. ► ఆర్టికల్ 85: లోక్‌సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. ప్రస్తుత సభ రద్దు అయిన వెంటనే సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త సభ ఆరంభం అవుతుంది. ► ఆర్టికల్ 172(1): రాష్ట్ర అసెంబ్లీ రద్దు కానంతరవరకు ఐదేళ్ల పాటు గడువు ఉంటుంది. ► ఆర్టికల్ 174(2): కేబినేట్ సూచన మేరకు అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. మెజారిటీ సందిగ్ధంలో ఉన్నప్పుడు గవర్నర్ తన విచక్షణను వినియోగిస్తారు. ► ఆర్టికల్ 356: ఈ ఆర్టికల్ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. అవిశ్వాస తీర్మాణం విపక్షాలు నెగ్గినప్పుడు ప్రభుత్వం రద్దు అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో జమిలి ఎన్నికలకు అనుగుణంగా సవరణ చేయాల్సి ఉంటుంది. ► ఈ ఆర్టికల్‌ల సవరణ ఆమోదం పొందాలంటే పార్లమెంట్లో మూడొంతుల్లో రెండోంతుల సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తప్పనిసరి. పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత సగం రాష్ట్రాల అసెంబ్లీలు దానికి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. వనరుల కొరత.. లోక్‌సభ, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చేలా రాజ్యాంగాన్ని సవరించినా.. ఎన్నికల నిర్వహణకు భారీ వనరులు అవసరమవుతాయి. 25 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVM)లు, 25 లక్షల VVPATలు (ఓటర్-వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్) కావాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం వద్ద ప్రస్తుతం కేవలం 12 లక్షల ఈవీఎంలు మాత్రమే ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో సిబ్బంది కూడా అవసరమవుతారు. మొదట్లో జమిలీ ఎన్నికలే.. 1967 వరకు భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఈ విధంగానే జరిగాయి. 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేయబడిన తర్వాత ఈ పద్ధతి ఆగిపోయింది. లోక్‌సభ కూడా మొదటిసారిగా 1971లో షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దు చేయబడింది. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. విదేశాల్లో ఇలా.. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ కమిటీ దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చూపుతోంది. అక్కడ జాతీయ, స్థానిక స్థానాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. స్వీడన్లో కూడా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్ణీత తేదీల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. నేషనల్ లెజిస్లేచర్ (రిక్స్‌డాగ్), ప్రావిన్షియల్ లెజిస్లేచర్ (ల్యాండ్‌స్టింగ్), స్థానిక సంస్థలు/మునిసిపల్ అసెంబ్లీలకు సెప్టెంబర్ రెండో ఆదివారం ఎన్నికలు జరుగుతాయి. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
అన్నవాహిక క్యాన్సర్‌పై అవగాహన అవసరం
అన్న వాహిక (ఈసోఫేజియల్)క్యాన్సర్ కు గురైనవారు తినడానికి చాలా ఇబ్బంది పడతారు. గొంతు బొంగురుపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మాట్లాడలేకపోవడం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలతో మరింత వ్యథకు గురవుతుంటారు. అందుకే ఈ క్యాన్సర్ పట్ల అవగాహన అవసరం. దీన్ని ముందుగా గుర్తించడం, ఎవరెవరిలో ఈ క్యాన్సర్ తలెత్తే అవకాశం ఉందో తెలుసుకోవడమూ అవసరం. మరో సమస్యగా పొరబడే అవకాశాలెక్కువ... సాధారణంగా గొంతునొప్పి అనగానే థ్రోట్ ఇన్ఫెక్షన్ అని అనుకోవడం చాలా సాధారణం. అలాగే గొంతు బొంగురుగా మారితే పొరబోయిందని అనుకుంటారు. ఇక మింగడం కష్టంగా ఉంటే నీళ్లమార్పిడి, వాతావరణ మార్పిడి కారణంగా వేడిచేసిందేమోనని పొరబడే అవకాశమూ ఉంది. అలాగే... ఏదో సరిపడని ఆహారం తీసుకున్నామనీ, ప్రయాణంలో ఏదిబడితే అది తినడం వల్లనేమోనని భావించవచ్చు కూడా. ఇలా అనుకునే వారిని మనం చాలామందినే చూస్తుంటాం. ఇక్కడ పేర్కొన్న లక్షణాలు రెండు, మూడు రోజుల్లో తగ్గితే అంతగా భయపడాల్సిన పనిలేదు. కానీ తగ్గకుండా కొన్నిరోజుల పాటు అలాగే కొనసాగితే మాత్రం ఆలోచించాల్సిందే. ఈసోఫేజియల్ క్యాన్సర్ లక్షణాలు మింగడానికి కష్టంగానూ, నొప్పిగానూ ఉండటం ,ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోగలగడం ,ఆకలి, బరువు తగ్గడం ఆగని దగ్గు, దగ్గులో రక్తం కనిపించడం గుండెల్లో మంట జ్వరం... వంటి లక్షణాలు చాలాకాలం పాటు కొనసాగితే సొంతవైద్యం మానుకొని డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య కాలేయానికీ, ఊపిరితిత్తులకూ వ్యాపించే ప్రమాదమూ ఉంటుంది. అసలేమిటీ అన్నవాహిక క్యాన్సర్? అన్నవాహిక మెడ కింది నుంచి పొట్ట పైభాగం వరకు ఒక పైప్‌లా దాదాపు 25 సెం.మీ పొడవు ఉంటుంది. అన్నవాహిక క్యాన్సర్‌ను ఉపరిభాగంలో, మధ్యభాగంలో, కిందిభాగంలో వచ్చేవి అంటూ మూడు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఉపరిభాగంలో వచ్చే క్యాన్సర్‌కు సాధారణంగా కీమో, రేడియేషన్ థెరపీ మాత్రమే ఇస్తుంటారు. స్వరపేటికకు దగ్గరగా ఉండటం వల్ల సర్జరీ చేయడం కష్టం. మిగతా రెండు భాగాలకు సర్జరీ చేసేందుకు అనువుగా ఉంటాయి. కణితి బాగా పెద్దదిగా ఉన్నప్పుడు ముందు కీమో, రేడియేషన్ ఇచ్చి... తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. కణితి పెద్దదిగా ఉండి, ఎలాంటి ఆహారమూ తీసుకోలేని పరిస్థితుల్లో స్టెంట్ అమర్చడం కూడా జరుగుతుంది. అన్నవాహికలో కణితి ఉన్న భాగాన్ని సర్జరీ ద్వారా తీసివేయడాన్ని ‘ఈసోఫేగక్టమీ’ అంటారు. ఈ సర్జరీలో అన్నవాహికలో కొంతభాగాన్ని తీసివేసి, పొట్టలోని కొంతభాగాన్ని అన్నవాహికకు కలపడం జరుగుతుంది. స్త్రీలలో కన్నా పురుషుల్లో మూడురెట్లు ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించకపోతే జీవితకాలం పెంపొందించడం చాలా కష్టమని చెప్పాలి. కణితి కొంచెం పెద్దదయినప్పుడు మాత్రమే లక్షణాలు కనిపించడం వల్ల ఈ క్యాన్సర్‌ను లేటుదశలోనే సాధారణంగా గుర్తించడం జరుగుతుంటుంది. అప్పుడు వారి ఇబ్బందులను కొంత తగ్గించడానికి స్టెంట్స్ వంటివి అమర్చి పాలియేటివ్ కేర్ అందించడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎవరిలో ఎక్కువ అన్న విషయాన్ని అందరూ తెలుసుకొని, ముందుగా గుర్తించడానికి ప్రయత్నించడమే మనం చేయాల్సిన ప్రధానమైన పని. ఎవరిలో ఈ క్యాన్సర్ ముప్పు ఎక్కువంటే... ఈసోఫేజియల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్ ఫ్యాక్టర్లు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. అవి... ∙60 ఏళ్లకు పైబడ్డ పురుషులు ∙పొగాకు లేదా పొగాకు ఉత్పత్తులు వాడేవారు, ఆల్కహాల్ అలవాట్లు ఉన్నవారు ∙గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ (జీఈఆర్డీ) సమస్య ఏళ్ల తరబడి ఉన్నవారిలో ∙హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) కు గురైనవారు ∙యాసిడ్స్ కారణంగా అన్నవాహికకు తీవ్ర గాయాలైనవారు ∙హెడ్ అండ్ నెక్ క్యాన్సర్‌కు గురైనవారు ∙గొంతుభాగంలో రేడియేషన్ తీసుకున్నవారు ∙థైలోసిస్, సీలియాక్ వంటి సమస్యలున్నవారు ∙కొన్ని రకాల రసాయన కర్మాగారాల్లో పనిచేసే వారికి ఈసోఫేజియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే కొంతవరకు వంశపారంపర్యంగా కూడా ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంటుంది. నివారణ / చికిత్స దురలవాట్లకు దూరంగా ఉంటూ చక్కటి జీవనశైలితో జీవనాన్ని గడిపేవారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. ఇక పైన చెప్పిన లక్షణాలు కనిపించినప్పుడు, అందునా మరీ ముఖ్యంగా ఇక్కడ పేర్కొన్న రిస్క్గ్రూపునకు చెందినవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ సలహా మేరకు ఎండోస్కోపీ, బయాప్సీ, అవసరమైతే సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్‌స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. వ్యాధినిర్ధారణ ప్రక్రియలో అది ఏ రకానికి చెందిన క్యాన్సర్, ఏయే భాగాలకు వ్యాపించింది లాంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి ఈ పరీక్షలు అవసరం. ఒకసారి వ్యాధి నిర్ధారణ జరిగాక... సర్జరీ, కీమో, రేడియేషన్, లేజర్ థెరపీ లేదా రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వంటి ప్రక్రియల్లో ఏది అవసరమో, దాన్ని ఎంతకాలం తీసుకోవాలో అన్న విషయాలపై వైద్యులు ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు. అయితే వ్యాధి వచ్చాక బాధపడటం కంటే ముందే నివారించుకోవడం ఎంతో మేలు చేసే అంశం. -
అంతరిక్ష పరిశోధనపై చైతన్యం అవసరం
ఇస్రో ఎస్ఎస్ఎంఈ అధ్యక్షుడు మాధుర్ గైట్‌లో ముగిసిన అవగాహన సదస్సు రాజానగరం : భారతీయ అంతరిక్ష పరిశోధనపై దేశ యువతలో చైతన్యం నింపేందుకు ఇస్రో కృషి చేస్తున్నదని (ఎస్ఎస్ఎంఈ) అధ్యక్షుడు ఏసీ మాధుర్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇస్రో నమూనా ఉపగ్రహాల ప్రదర్శనలను ఉచితంగా ఏర్పాటు చేయడంతోపాటు అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో సదస్సులు నిర్వహించి అంతరిక్ష విజ్ఞానం గురించి తెలియజేస్తుందన్నారు. గైట్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, అహ్మదాబాద్‌లోని స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఇస్రో సహకారంతో ‘అంతరిక్ష సాంకేతికరంగంలో మెకానికల్ ఇంజనీరింగ్ సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహించిన అవగాహన సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఎస్ఎంఈని 1977లో ప్రారంభించామని, దీనిలో 340 మంది జీవిత సభ్యులున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన వారు రూ.250 చెల్లించి సభ్యత్వాన్ని పొందవచ్చన్నారు. డీఈసీయూ మాజీ డైరెక్టర్ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ భారతదేశ ప్రగతికి అవసరమైన బహుముఖ అంశాలు, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధిపై ఇస్రో ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా విద్యా విధానం, టెలీమెడిసిన్లపై డీఈసీయూ దృష్టి సారించిందన్నారు. దేశంలోని 26 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 వేల మంది విద్యార్థులకు దూరవిద్యా విధానం అమలుచేస్తున్నామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎనిమిది వేలమంది విద్యార్థులు ప్రయోజనం పొందుతుండగా హర్యానాలో 10 వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఎస్ఏసీ మాజీ హెడ్ ఎస్జి వైష్టక్ మాట్లాడుతూ కొత్త విషయాలను తెలుసుకునేందుకు వీలుగా ఉపగ్రహ నమూనాలతో ప్రదర్శనలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. విఎస్ఎస్సీ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ భానుపంత్ మాట్లాడుతూ అంతరిక్ష నౌకలో వివిధ విడిభాగాలను 253 నుంచి రెండు వేల సెంటిగ్రేడ్ తట్టుకునే విధంగా తయారుచేసేందుకు లోహాలను, లోహమిశ్రమాలను వినియోగిస్తారన్నారు. వాటి తయారీ విధానం, ఏఏభాగాలలో ఏ విధంగా ఉపయోగిస్తారో తెలియజేశారు. సభ్యత్వం పొందిన గైట్ ఎస్ఎస్ఎంఈలో కార్పొరేట్ సభ్యత్వాన్ని తీసుకుంటూ గైట్ కళాశాల ఎండీ కె.శశికిరణ్‌వర్మ సంబంధిత పత్రాన్ని సంస్థ అధ్యక్షుడు ఏసీ మాధుర్‌కు అందజేశారు. రానున్న కాలంలో తమ కళాశాల విద్యార్థులకు ఇస్రోలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు. అతిధులను కళాశాల ఎండీ దుశ్శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. అతిరా కన్సల్టెంట్ ఎల్ఎం కేపీ భల్సా«ద్, ఎస్ఎస్ఎంఈ ఏవీ ఆప్టే, గైట్ కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.లక్ష్మీ శశికిరణ్, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి, డీన్ డాక్టర్ ఎం.వరప్రసాదరావు, హెచ్ఓడీ డాక్టర్ టి.జయానంద్‌కుమార్, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో అగ్నిమాపక కేంద్రాల కొరత!
న్యూఢిల్లీః భారత నగరాలు, గ్రామీణ ప్రాంతాలు అగ్నిమాపక కేంద్రాల కొరత తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని లోక్ సభ తెలిపింది. దేశంలో సుమారు ఎనిమిది వేల ఐదు వందలకు పైగా ఉండాల్సిన కేంద్రాలు.. కేవలం మూడు వేల పైచిలుకు ఉన్నాయని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి రిజిజు వెల్లడించారు. దేశంలోని నగరాలు, గ్రామీణ ప్రాంతాలను అగ్నిమాపక కేంద్రాల కొరత వేధిస్తోందని లోక్ సభ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 8,559 ఫైర్ స్టేషన్ల అవసరం ఉండగా, కేవలం 2,987 కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, దీంతో అగ్నిమాపక సేవల్లో 65 శాతం లోటు కనిపిస్తోందని హోం శాఖ సహాయ మంత్రి రిజిజు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అవసరానికి అనుగుణంగా అర్బన్ ఏరియాలకు 5 నుంచి 7 నిమిషాల్లోనూ, గ్రామీణ ప్రాంతాలకు 20 నమిషాల్లోపు వెళ్ళేలా అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలంటే... అవసరమైనన్ని అగ్నిమాపక కేంద్రాలుండాలని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కలిగిన స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక సేవలను పురపాలక కేంద్రాలు నిర్వహించడమే కాక, అగ్ని ప్రమాదాలను అధిగమించాలంటే కేంద్రం కూడ నిధులతోపాటు, తగినంత సహకారం అందించి, సిబ్బందికి అత్యవసర సేవల్లో నాణ్యత పెరిగేలా శిక్షణ కూడ అందించాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 2012 లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అందించిన మార్గ దర్శకాలకు అనుగుణంగా సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఆధునీకరణను అమల్లోకి తెచ్చి, తగిన పరికరాలను అందుబాటులో ఉంచడం ఎంతైనా అవసరమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అర్బన్ ఏరియాల్లో పెరుగుతున్న పారిశ్రామికీకరణను దృష్టిలో ఉంచుకొని నాగపూర్ లోని నేషనల్ ఫైర్స్ సర్వీస్ కాలేజ్ ఫైర్ ఆఫీసర్స్ కు ప్రత్యేక ట్రైనింగ్ అందిస్తోందని, అగ్ని ప్రమాదాల సమయంలో ఆధునిక పద్ధతుల వాడకం, సందర్భాను సారం స్పందించేందుకు కావలసిన పద్ధతులను నేర్పిస్తోందని రిజుజు ఓ రాత ప్రతిలో తెలిపారు.