సంగీత దర్శకుడు మణిశర్మపై చార్జ్‌షీట్
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మపై చెన్నై పోలీసులు చార్జ్‌షీట్ నమోదు చేశారు. మణిశర్మకు చెన్నై నీలాంగరై సమీపంలోని కానత్తూర్లో కొంత స్థలం ఉంది. ఆయన తన స్థలం పక్కనున్న 73 సెంట్ల స్థలాన్ని ఆక్రమించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మణిశర్మ ఆక్రమించుకున్న స్థలం యజమాని సేలంకుప్పన్ నీలాంగరై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఈ కేసును నేర పరిశోధన శాఖకు అప్పగించారు. క్రైం బ్రాంచ్ పోలీసులు సంగీత దర్శకుడు మణిశర్మ స్థలం వద్దకు వెళ్లి పరిశీలించగా ఆయన ఆక్రమణకు పాల్పడినట్లు రుజువయింది. దీంతో మణిశర్మపై స్థలాక్రమణ కేసును నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కాగా, మణిశర్మ కోర్టులో ముందస్తు బెయిల్ పొందారు.