Net Banking hacking
-
పేట్రేగిపోతున్న సైబర్‌నేరగాళ్లు..
సాక్షి, గచ్చిబౌలి: సైబర్ మోసగాళ్లు ఎక్కడో మాటువేసి లేరు. మన అరచేతిలో ఉండే సెల్ ఫోన్లోనే దాగి ఉన్నారు. అపరిచిత వ్యక్తులు పంపే క్యూ ఆర్ కోడ్, లింక్ ఓపెన్ చేస్తే ఇట్టే బ్యాంక్ అకౌంట్ వివరాలు మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి. ఆ వివరాలతో మన అకౌంట్లోని డబ్బు స్వాహా చేస్తారు. మొబైల్ ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు, లింకులు, వీడియో కాల్స్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఎన్నో రకాలుగా సైబర్ మోసగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో గత మార్చి 21 నుంచి ఐటీ కారిడార్‌లోని మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో అధికంగా సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఐటీ కారిడార్‌లో కేసులు ఇలా ... ► ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో నమోదైన సైబర్ క్రైమ్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. కేవలం 20 రోజుల వ్యవధిలోనే మూడు పీఎస్‌ల పరిధిలో 43 కేసులు నమోదయ్యాయి. అయితే, వాస్తవంగా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, సైబర్ మోసగాళ్ల బారినపడ్డ చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. మోసం చేసే తీరు ఇలా...... ► పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే కస్లమర్ కేర్ నంబర్ కోసం కొందరు గూగుల్‌లో సెర్చ్ చేశారు. ► అయితే, సదరు యాప్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు నిక్షిప్తం చేసిన నకిలీ నంబర్లు కనిపించడంలో వాటిని తీసుకున్నారు. ► ఆ నంబర్‌కు ఫోన్ చేయగానే ఐదు అంకెల ఓటీపీని పంపారు. ఆ ఓటీపీని రిటర్న్ పంపమని సైబర్ నేరగాళ్లు చెప్పారు. పంపగానే అకౌంట్లోని డబ్బులు మాయం కావడంతో బాధితులు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఒకరు రూ.38 వేలు, మరొకరు రూ.35 వేలు అకౌంట్ల నుంచి డెబిట్ అయ్యాయి. ఇలాంటివి నాలుగైదు కేసులు గచ్చిబౌలి పీఎస్‌లోనే నయోదయ్యాయి. ► గచ్చిబౌలి, రాయదుర్గం పీఎస్ పరిధిలో ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. ► ఓఎల్ఎక్స్లో పెట్టిన వస్తువులు నచ్చాయని అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి క్యూ ఆర్ కోడ్ పంపాడు. ఒక రూపాయి పంపమని అడగగానే బాధితులు పంపారు. దీంతో బ్యాంక్ ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్లకు తెలిసిపోవడంతో మరుక్షణమే అకౌంట్లోని డబ్బులు డెబిట్ అయ్యాయి. ఇలా నాలుగురైదుగురు బాధితులు ఫిర్యాదు చేశారు. ► అపరిచిత మహిళ ఫేస్బుక్ వీడియో కాల్ చేస్తే ఓ వ్యక్తి సరదాగా మాట్లాడాడు. మాటల్లో పెట్టి ఆ మహిళ తన ఒంటిపై ఉన్న దుస్తులను విప్పేసింది. మీరు కూడా దుస్తులు విప్పేయండి అని చెప్పడంతో అతను కూడా అలా చేశాడు. ఇద్దరి న్యూడ్ వీడియోను రికార్డ్ చేసింది. కాల్ కట్ అయిన వెంటనే అతడి వాట్సాప్‌కు ఇద్దరి న్యూడ్ వీడియోను పంపించింది. ► డబ్బులు పంపకుంటే ఇద్దరి న్యూడ్ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేస్తానని బెదిరించింది. దీంతో కంగుతిన్న అతగాడు చేసేది ఏమీ లేక రూ. 8 వేలు పంపాడు. మళ్లీ వీడియో కాల్ చేసి రూ.30 వేలు డిమాండ్ చేయడంతో గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఫేస్బుక్ ఖాతాను బ్లాక్ చేసి కేసు నమోదు చేశారు. ► ‘నేను ఆర్మీ ఆఫీసర్ని, నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది. మాజిక్ బ్రిక్స్ డాట్ కామ్, 99 ఎకరాస్ డాట్ కామ్‌లో అద్దెకు ఉంచిన ఇళ్లు నచ్చింది’అని ఇంటి యజమానికి ఓ అపరచితుడు ఫోన్ చేశాడు. రూ.10 వేలు అడ్వాన్స్ పంపిస్తానని చెప్పి లింక్ పంపాడు. ఆ లింక్‌ను ► ఓపెన్ చేసిన కొద్ది సేపటికే యజమాని అకౌంట్లోని రూ.70 వేలు డెబిట్ అయ్యాయి. దీంతో బాధితుడు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ► ఉత్తరాఖండ్‌లో ఆర్మీ అధికారిగా పని చేస్తున్నానని రూ.18 వేలకు బుల్లెట్ అమ్ముతానని అపరిచిత వ్యక్తి ఫొటోలు పెట్టాడు. ఓ వ్యక్తి అతడిని సంప్రదించి ట్రాన్స్పోర్ట్ చార్జీల కోసం ఆరు వేలు పంపాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి ట్రాన్స్పోర్ట్ రిసీప్ట్ పంపి సెక్యూరిటీ డిపాజిట్ కోసం మళ్లీ డబ్బు కావాలని అడిగాడు. ఇలా రూ.40 వేలు సమర్పించుకొని చివరికి మోసపోయానని గ్రహించిన బాధితుడు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు ► క్యూర్ కోడ్ పంపి అకౌంట్లలోని క్యాష్ డెబిట్ అయిన కేసులు మాదాపూర్ పీఎస్ లోనూ నమోదయ్యాయి. -
పది మందిని కొల్లగొట్టారు!
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ కస్టమర్ కేర్, నెట్ బ్యాంకింగ్ హ్యాకింగ్, బోగస్ మెయిల్‌తో ఎర... బహుమతులు పంపుతున్నానంటూ టోకరా... ఇలా వివిధ పంథాలను అనుసరించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన పది మంది నుంచి రూ.19.91 లక్షలు కాజేశారు. వీరంతా గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గరానికి చెందిన పవన్ తల్లికి ఇటీవల ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. లండన్‌కు చెందిన ఓ క్రిస్టియన్ మిషనరీ సంస్థ నిర్వాహకుడిగా అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. (రికార్డు: 24 గంటల్లో 20,903 కేసులు) ఈమె యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారారు. కోవిడ్ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన క్రిస్టియన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెసేజ్ పంపిన అతను వారి కోసం ఓ గిఫ్ట్ పంపుతున్నట్లు ఎర వేశాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారుల పేరుతో కాల్ వచ్చింది. దీంతో ఫోన్‌ను ఆమె పవన్‌కు ఇచ్చింది. లండన్ నుంచి 30 వేల పౌండ్లు, ఇతర బహుమతులతో కూడిన పార్శిల్ మీ పేరుతో వచ్చిదంటూ చెప్పిన వారు విదేశీ కరెన్సీ ఉండటంతో కేసు నమోదు చేస్తామని బెదిరించి పలు దఫాలుగా రకరకాల పన్నుల పేరుతో రూ.11.6 లక్షలు కాజేశారు. (‘కరోనా వ్యాక్సిన్‌కు రెండున్నర ఏళ్లు పడుతుంది’ ) ► ఆర్టిలరీ సెంటర్లో జవాన్‌గా పని చేసే అమోల్ యాదవ్ ఇటీవల గూగుల్ పేలో కొంత నగదు బదిలీ చేశాడు. ఆ మొత్తం చేరాల్సిన వారికి చేరకపోవడంతో గూగుల్ పే కాల్ సెంటర్‌ను సంప్రదించాలని భావించాడు. గూగుల్‌లో సెర్చ్ చేసిన అతగాడు అందులో కనిపించిన నకిలీ కాల్ సెంటర్ నంబర్‌కు కాల్ చేశాడు. అవతలి వ్యక్తులు చెప్పినట్లే చేసి రూ.54 వేలు పోగొట్టుకున్నాడు. ► నగరవాసి పవన్ కుమార్ బ్యాంకు ఖాతా నుంచి రూ.1.27 లక్షలు అతడి ప్రమేయం లేకుండానే బదిలీ అయ్యాయి. నెట్ బ్యాకింగ్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఈ పని చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ►బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన వ్యాపారి విద్యా రమణన్‌కు ఉత్తరాదిలో గోల్డీ అనే క్లైంట్ ఉన్నాడు. అతడి మాదిరిగా మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లు కొంత డబ్బు అవసరమటూ తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు. ఇది గోల్డీ నుంచి వచ్చిన మెయిల్‌గా భావించిన రమణన్ రెండు దఫాల్లో రూ.1.5 లక్షలు బదిలీ చేసి మోసపోయాడు. ►వెస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన గోపీ కృష్ణ ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్‌లో ఓ బైక్ ఖరీదు చేయాలనే ఉద్దేశంతో అందులో ఉన్న నంబర్‌ను సంప్రదించి రూ.75 వేలు మోసపోయాడు. ►ఇదే తరహాలో సునీల్ అనే ఓ వ్యక్తి ఓఎల్ఎక్స్లో కనిపించిన సెకండ్ హ్యాండ్ బైక్ అమ్మకం ప్రకటనను చూశాడు. దాన్ని కొనాలనే ఉద్దేశంతో అందులో ఉన్న నంబర్‌కు సంప్రదించాడు. దీంతో ఈయన నుంచి సైబర్ నేరగాళ్లు అడ్వాన్సుల పేరుతో రూ.49 వేలు కాజేశారు. ►గోల్కొండ ఎక్స్ రోడ్స్‌లో నివసించే కుమార్ అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా ఓ సందేశం వచ్చింది. తన సోదరుడి డిస్ప్లే పిక్చర్ వినియోగించిన ఖాతా నుంచి ఈ సందేశం పంపిన సైబర్ నేరగాళ్లు నగదు అవసరం అంటూ కోరారు. కుమార్ ఆ నంబర్లో సంప్రదించడానికి ప్రయత్నించినా కలవలేదు. దీంతో మూడు దఫాల్లో రూ.2 లక్షలు చెల్లించాడు. మరికొంత కావాలంటూ వారు కోరడంతో అనుమానం వచ్చి సోదరుడిని సంప్రదించగా అది మోసమని తెలిసింది. ►సైదాబాద్‌కు చెందిన రమావత్ శ్రీను ఓఎల్ఎక్స్ ద్వారా సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనం ఖరీదు చేయాలని భావించారు. ఓ ప్రకటన చూసి స్పందించిన ఈయన వారితో సంప్రదించారు. చివరకు అడ్వాన్సుల పేరుతో రూ.56 వేలు చెల్లించి మోసపోయారు. ►ఓల్డ్ మలక్‌పేట ప్రాంతానికి చెందిన వాసు డెబిట్ కార్డును కొందరు సైబర్ నేరగాళ్లు క్లోన్ చేశారు. దీని ద్వారా బెంగళూరులోని ఓ ఏటీఎం నుంచి రూ.50 వేలు విత్‌డ్రా చేశారు. ►బోయిన్‌పల్లికి చెందిన రాజశేఖర్‌కు కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతా కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలని ఎర వేశారు. దాని కోసమంటూ ఖాతా వివరాలతో పాటు ఓటీపీలు సంగ్రహించి రూ.70 వేలు కాజేశారు. -
‘కీలాగే’స్తారు!
⇒ కీ లాగర్స్ సాఫ్ట్వేర్ ప్రయోగిస్తున్న సైబర్ క్రిమినల్స్ ⇒ ‘నెట్ బ్యాంకింగ్ హ్యాకింగ్’ ⇒ ఈ పంథాలోనే దేశ వ్యాప్తంగా నేరాలు చేసిన ఘరానా గ్యాంగ్ సిటీబ్యూరో: కంప్యూటర్ ఆధారంగా చేసే సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ కోవలోనిదే ‘కీ లాగర్స్’. ఎదుటి వ్యక్తుల డేటాను చోరీ చేయ డం దీని ప్రత్యేకత. ఈ పంథాలో నగరానికి చెందిన ఓ బాధితుడి నుంచి రూ.8 లక్షలు స్వాహా చేసిన ముఠాను సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు గత నెల లో ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన విషయం విదిత మే. దేశ వ్యాప్తంగా మోసాలు చేసిన ఈ ముఠాకు చెంది న మరో నలుగురి కోసం పోలీసులు వేటాడుతున్నారు. ఏమిటీ కీ లాగర్స్? ఇంటర్నెట్లో విరివిగా లభిస్తున్నదే ఈ కీ లాగర్స్ సాఫ్ట్వేర్. సైబర్ నేరగాడు దీన్ని డౌన్లోడ్ చేసుకుని తాను కోరుకున్న కంప్యూటర్లో నేరుగా ఇన్‌స్టల్ చేస్తాడు. పరి చయస్తుల పర్సనల్ కంప్యూటర్ను ఒకసారి విని యోగించుకోవడానికి తీసుకుని అదును చూసి దీన్ని ఇన్‌స్టల్ చేస్తాడు. అలాగే, ఎవరికైనా జోక్స్, బొమ్మలు, ఉద్యోగావకాశాలంటూ ఈ-మెయిల్ పంపడం ద్వారా నూ అవతలి వ్యక్తి కంప్యూటర్లో ఇన్‌స్టల్ అయ్యేలా చేస్తాడు. ఆవిషయం మెయిల్‌ను క్లిక్ చేసిన వ్యక్తికి కూడా తెలీదు. ఒకసారి కీ లాగర్స్ కంప్యూటర్లో ఇన్‌స్టల్ అయితే... ఆ కంప్యూటర్ను వినియోగించే వ్యక్తి చేసిన ప్రతి కార్యకలాపం సైబర్ నేరగాడి ఈ-మెయిల్ ఐడీకి చేరిపోతుం ది. చివరకు కీ బోర్డులో ఒక్క బటన్ నొక్కినా ఆ వివరాలు పూర్తిగా సైబర్ నేరగాడికి ఈ-మెయిల్ రూపంలో చేరిపోతాయి. వీటి ద్వారా వ్యక్తిగత సమాచారమైన ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్, యూజర్ నేమ్స్ తదితరాలు నేరగాళ్లకు అందుతాయి. వీటిని విని యోగించి సైబర్ నేరగాళ్లు అవతలి వ్యక్తి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారు. అంతేకాకుండా వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజడంతో పాటు దుశ్చర్యలకు పాల్పడతారు. అప్రమత్తత అవసరం... ఇంటర్నెట్లో కీ లాగర్స్ తరహా సాఫ్ట్వేర్లు అనేకం అందుబాటులో ఉన్నాయి. వీటి బారి న పడకుండా ఉండాలంటే వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అపరిచిత చిరునామాల నుంచి వచ్చే ఈ-మెయిల్స్‌ను వెంటనే డిలీట్ చేయాలి. మొబైల్ ఫోన్‌కు వచ్చే అన్ని ఎస్‌ఎమ్మెస్‌లకు సైతం స్పందించకూడదు. సైబ ర్ కేఫ్‌ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్నెట్ బ్యాం కింగ్ వంటి కీలక లావాదేవీలు చేయరాదు. పర్సనల్ కంప్యూటర్స్‌లో అత్యాధునికమైన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నమ్మకస్తులైన వారికి మాత్రమే పర్సనల్ కంప్యూటర్ వినియోగించేందుకు అనుమతి ఇవ్వాలి. సైబర్ కేఫ్‌ల యజమానులు ఎప్పటికప్పుడు తమ కేఫ్‌లోని సిస్టమ్స్ల్లోని సాఫ్ట్‌వేర్స్‌ను పరీక్షిస్తుండాలి. ఈ తరహా సైబర్ నేరగాళ్లలో విద్యాధికులే ఎక్కువగా ఉంటున్నారు. వీరు పట్టుబడటం కూడా చాలా కష్టం. ‘నీలం’ రంగులో ఉంటాయి సాధారణంగా మెయిల్లో వచ్చే కీలాగర్స్ లింకులు నీలం రంగులో ఉంటాయి. అపరిచిత ఈ-మెయిల్స్ లో ఇలాంటి లింక్స్ ఉంటే వాటి జోలికి పోకపోవడం ఉత్తమం. ఆ లింకును కాపీ చేసి యూఆర్ఎల్ బార్లో పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే ఈ-మెయిల్ అసలుదా? నకిలీదా తెలుసుకునే అవకాశం ఉంటుంది. - వీపీ తివారీ, సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్