neuro surgery
-
మెదడులోని గడ్డలు మళ్లీ మళ్లీ వస్తాయా?
నా వయసు 40 ఏళ్లు. విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాను. హాస్పిటల్లో చూపించుకుంటే టెస్ట్‌లన్నీ చేసి, మెదడులో గడ్డ ఏర్పడినట్టు గుర్తించారు. బ్రెయిన్ ట్యూమర్లకు సర్జరీ చేయించుకున్నా అవి పూర్తిగా పోవని విన్నాను. నిజమేనా? ఈ గడ్డలను నిర్మూలించడం సాధ్యం కాదా? దయచేసి వివరంగా తెలియజేయండి. మీరు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ గురించి ఈ రోజుల్లో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలతో ట్యూమర్ శస్త్రచికిత్స చాలా సురక్షితమే. మెదడులోని గడ్డలను సమూలంగా తొలగించవచ్చు. మెదడులో ట్యూమర్లు రెండు రకాలుగా ఉంటాయి. అవి బినైన్ ట్యూమర్లు, మెలిగ్నెంట్ ట్యూమర్లు. ఇవి కేంద్ర నాడీమండలం (సీఎన్ఎస్)లోని పలురకాల కణాల నుంచి ఏర్పడతాయి. మెదడు గడ్డల్లో బినైన్ ట్యూమర్లు మెదడులో లోతుగా పాతుకుపోయి ఉండవు. ఈ రకమైన ట్యూమర్లు క్యాన్సర్ కారకమైనవి కావు. అందువల్ల బినైన్ ట్యూమర్లు ఉన్న ప్రాంతంలో శస్త్రచికిత్స చేయడం సులువు. పైగా వీలైతే వీటిని తేలిగ్గా పూర్తిగా తొలగించి వేయగలగడం సాధ్యమే. అయితే ఒక్కోసారి వీటిని సర్జరీ చేసి తీసివేసినా మళ్లీ అవి తిరిగి పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది. ఈ గడ్డలు చురుకైనవి కావు. అందువల్ల మెదడులోని ఇతర భాగాలలోని కణజాలానికి విస్తరించే అవకాశం ఏమీ ఉండదు. కానీ ఈ బ్రెయిన్ ట్యూమర్లు శరీరంపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించేవిగా, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారగలవు. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతలను నిర్వర్తిస్తూ, శరీరంలోని భిన్న అవయవాలను నియంత్రిస్తుంటాయి. అందువల్ల ట్యూమర్ ఏర్పడిన భాగం మెదడు తన విధులను నిర్వహించడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. అందువల్ల మెదడులో గడ్డ ఏర్పడిన ప్రదేశాన్నిబట్టి, ఆ ట్యూమర్ రకాన్ని బట్టి దాని ప్రభావం శరీరంలోని వివిధ భాగాలపై (అంటే అది నియంత్రించే భాగంపైన) కనిపిస్తూ ఉంటుంది. మెదడులో గడ్డలను బట్టి కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. కొందరిలో అది వినికిడి శక్తిని ప్రభావితం చేస్తే, మరికొందరిలో కంటి చూపును దెబ్బతీయవచ్చు. ఈ విధంగా జరిగినప్పుడు మెదడులో ఒకవైపు ఏర్పడిన బినైన్ ట్యూమర్లను తొలగిస్తే మళ్లీ మరోవైపు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే గత దశాబ్ద కాలంలో ట్యూమర్ల చికిత్స అభివృద్ధి చెందింది. గడ్డ ఏర్పడిన మెదడు భాగానికి ఏమాత్రం నష్టం కలిగించకుండా, ఫలితంగా మెదడులోని ఆ భాగం అదుపు చేసే అవయవాల పనితీరు దెబ్బతినకుండా ట్యూమర్‌ను తొలగించివేయగల వైద్యసాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న 3 టెస్లా ఇంట్రా ఆపరేటివ్ మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ (3 టీ ఎమ్మారై) మెదడులో గడ్డల తొలగింపు ఆపరేషన్‌లో గణనీయమైన మార్పు తెచ్చింది. అప్పటి రోజుల్లో ఎక్స్–రే, ఆ తర్వాత అల్ట్రాసౌండ్, ఆపైన ఎమ్మారై... ఇప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ వైద్యసాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల కారణంగా శరీరం లోపలి భాగాల్లో అతి చిన్న మార్పునూ పసిగట్టి చూపగల నిర్ధారణ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటిదే తాజాగా అందుబాటులోకి వచ్చిన ఐఎమ్మారై (ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారై). అది మరో అడుగు ముందుకు వేసి ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే శరీరంలోపలి అవయవాల స్పష్టమైన చిత్రాలను తీస్తుంది. దీని సహాయంతో న్యూరో వైద్య నిపుణులు మెదడులోని గడ్డలను తొలగించే విషయంలో చాలా నైపుణ్యాన్ని, కచ్చితత్వాన్ని సాధించగలిగారు. ఈ సాంకేతికతల కారణంగా ఇప్పుడు గడ్డలన్నింటిని దాదాపుగా కూకటివేళ్లతో సహా తొలగించడానికి వీలవుతోంది. అలాగే పార్కిన్సన్స్ డిసీజ్, వణుకుడు (ఎసెన్షియల్ ట్రెమర్స్) వ్యాధులకు సంబంధించిన సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం మెదడులోని ఆరోగ్యకరమైన కణజాలానికి ఏమాత్రం నష్టం జరగకుండా అత్యంత సురక్షితంగా చేయడానికి వీలవుతోంది. అందువల్ల మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా మీ డాక్టర్ సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకోండి. పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? మా పెద్దన్న వయసు 63 ఏళ్లు. ఇటీవల ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. చేతులు, కాళ్లు, తల తరచూ వణుకుతున్నాయి. మాట్లాడేటప్పుడు వణుకు వస్తోంది. ఇదివరకు ఎప్పుడూ చిరునవ్వుతో సంతోషంగా ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉంటున్నాడు. తిండి కూడా సయించడం లేదు. ఏం పెట్టినా రుచీపచీ లేని తిండి పెడుతున్నారంటూ చిరాకు పడుతున్నాడు. డాక్టర్‌కు చూపిస్తే పార్కిన్సన్స్ వ్యాధిగా నిర్ధారణ చేశారు. పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? ఇది ప్రమాదకరమా? ఎందుకు వస్తుంది? చికిత్స ఏమిటి? దయచేసి వివరించండి. మీరు చెబుతున్న మీ అన్నగారి లక్షణాలను బట్టి అది పార్కిన్సన్స్ (వణుకుడు) వ్యాధిగానే అనిపిస్తోంది. పార్కిన్సన్స్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీకణాలు దెబ్బతినడం, క్షీణించడం కారణంగా ఇది వస్తుంది. డోపమైన్ మెదడులోని వివిధ భాగాలకూ... శరీరంలోని నాడీవ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి (కమ్యూనికేషన్)కి తోడ్పడే కీలకమైన రసాయనం. దీనికి తయారుచేసే కణాలు క్షీణించడం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది. దాంతో శరీరభాగాలు ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల వణుకుతుంటాయి. శరీరంలోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. మాట్లాడే విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. వ్యక్తి బలహీనంగా తయారవుతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సాధారణంగా అరవై ఏళ్లకు పైబడ్డవారే ఎక్కువగా పార్కిన్సన్స్ వ్యాధికి గురవుతుంటారు. కొన్ని కుటుంబాల్లో మాత్రం ఇది వంశపారంపర్యంగా వస్తూ, చిన్న వయసులోని వారిలోనూ కనిపిస్తుంటుంది. మన దేశంలో దాదాపు కోటికి పైగా మంది దీనితో బాధపడుతున్నారు. సరైన సమయంలో డాక్టర్‌ను సంప్రదించి ఆధునిక సౌకర్యాలు ఉన్న పెద్ద ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం ద్వారా దీన్ని అదుపు చేయడానికి వీలుంటుంది. పార్కిన్సన్స్ వ్యాధి చికిత్స ఇటీవల సమూలంగా మారిపోయింది. ఈ వ్యాధిగ్రస్తులు తమను వేధిస్తున్న లక్షణాలను అదుపు చేసుకొని, సాధారణ జీవితం గడిపేందుకు ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో వైద్యపరమైన ఔషధాలు, సర్జికల్ చికిత్సలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. పార్కిన్సన్స్ వ్యాధి మధ్యస్థాయిలో ఉండి శరీరక పరిమితులు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో వ్యాధి లక్షణాలను అదుపు చేయటంతో పాటు వాడుతున్న మందుల నుంచి గరిష్ఠప్రయోజనం పొందేందుకు ఇప్పుడున్న ఆధునిక చికిత్సలు తోడ్పడుతున్నాయి. చికిత్సవ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్యపరిస్థితి, శరీరతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చికిత్స చికిత్స వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు మందులు, ఫిజియోథెరపీ, అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స ఉపయోగపడతాయి. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట కనిపెట్టిన ‘ఎల్ డోపా’ అనే ఔషధం వణుకుడు వ్యాధికి సమర్థంగా పనిచేస్తున్నది. శక్తిమంతమైన ఈ మందును డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మోతాదులో ఏవైనా లోటుపాట్లు జరిగితే మొత్తంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది మెదడులోని ముఖ్యమైన నాడీకణాలకు సహాయపడుతూ డోపమైన ఉత్పత్తి జరిగేట్లు చేస్తుంది. దాంతో అవయవాలు బిగుసుకుపోవడం, వణుకుడు తగ్గుతుంది. పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సకు సంబంధించి మరో శక్తిమంతమైన చికిత్స డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్). ఈ శస్త్రచికిత్స వ్యాధి పెరుగుదలను నియంత్రిస్తుంది. గుండె పనితీరును మెరుగుపనిచేందుకు పేస్ మేరక్ అమర్చినట్లుగానే ఈ సర్జరీ ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చుతారు. మెదడులోని కొన్ని కణాలను తొలగించడం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా వ్యాధి ముదరకుండా చేయగలుగుతారు. డోపమైన తయారీ పునరుద్ధరించగలగడం సాధ్యమవుతుంది. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
‘ఐఓఎన్ఎమ్’ అంటే ఏమిటి?
మా మనవడి వయసు 9 ఏళ్లు. చిన్నతనం నుంచి తరచూ ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లో పెద్దహాస్పిటల్లో చూపించాం. ‘బ్రెయిన్ ట్యూమర్’ అని చెప్పారు. చూపు, వినికిడి ఎఫెక్ట్ అయ్యేలా ట్యూమర్ ఉందన్నారు. అయితే ఇటీవల బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలో కొత్తగా ‘ఐఓఎన్ఎమ్’ పద్ధతిలో ట్యూమర్ తొలగించారని పేపర్లలో చదివాం. మా బాబు చాలా చిన్నవాడు. ట్యూమర్ కారణంగా వాడి చూపుకు, వినికిడికి లేదా ఏదైనా ముఖ్య అవయవానికి లోపం జరిగితే వాడికి జీవితాంతం శాశ్వతమైన ఇబ్బంది ఏర్పడుతుందనే ఆందోళన ఉంది. దయచేసి మాకు ఐఓఎన్ఎమ్ పద్ధతి అంటే ఏమిటో విపులంగా వివరించి, మా మనవడి గురించి సలహా ఇవ్వండి. మీ మనవడి ట్యూమర్ మెదడులో ‘చూపు, వినికిడి’ నియంత్రించే భాగానికి ఆనుకొని ఉన్నట్లు తెలిపారు. మీరు ఆందోళన చెందకండి. ఇలాంటి సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీలకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి న్యూరో సర్జరీలు, స్పైన్ సర్జరీలు ఇప్పుడు ఐఓఎన్ఎమ్ సర్జరీ ప్రక్రియతో విజయవంతమవుతున్నాయి.ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అనే మాటలకు సంక్షిప్త రూపమే ఐఓఎన్ఎమ్. మెదడు ఆపరేషన్లలో కొన్ని చాలా సంక్లిష్టంగా ఉంటాయి. మెదడులోని మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, స్పర్శ... వంటి ముఖ్యమైన జ్ఞానేంద్రియాలూ, అవయవాలకు సంబంధించిన ప్రాంతాల్లోని గడ్డలను/ట్యూమర్లను తొలగించడం చాలా రిస్క్‌తో కూడికున్న పని. ఎందుకంటే గడ్డలను తొలగించే ప్రయత్నంలో ఆయా ప్రాంతాలకు దెబ్బ తగిలితే, సంబంధిత అవయవం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే అత్యాధునికమైన ఇమేజ్ గైడెన్స్, ఇంట్రా 3టీ ఎమ్మారైతో కూడిన ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ (ఐఓఎన్‌ఎం) విధానం... సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సురక్షితంగా చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మిగతా మెదడు కణజాలం దెబ్బతినకుండా కేవలం ట్యూమర్ వరకు మాత్రమే తొలగించడానికి ఈ ప్రక్రియ దోహదం చేస్తుంది. ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే డాక్టర్లు మొత్తం నాడీ వ్యవస్థను నిరంతరం పరిశీలిస్తూ, మిగతా భాగాలకు ఎలాంటి హానీ జరగకుండా పర్యవేక్షిస్తుంటారు. ఐఓఎన్ఎమ్ పద్ధతిలో సర్జరీ నిర్వహించే సమయంలో ఆపరేషన్ చేసేటప్పుడు ట్యూమర్‌ను పూర్తిగా తొలగించామా, లేదా అనే విషయాన్ని ఆపరేషన్ థియేటర్లోనే నిర్ధారణ చేసుకొని, విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయవచ్చు. అందువల్ల మన జీవితంలో ఎంతో కీలకమైన... మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, స్పర్శ... వంటి ప్రధాన కార్యకలాపాలు దెబ్బతినకుండా, కోల్పోకుండా రోగికి సంపూర్ణ చికిత్స అందించవచ్చు. ఫలితంగా చాలా సందర్భాల్లో బ్రెయిన్ సర్జరీల్లో రీ–డూ (మళ్లీ మళ్లీ చేయాల్సిన ఆపరేషన్లు) చేయాల్సి అవసరం రాకుండానే విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయవచ్చు. మొత్తం గడ్డను/ ట్యూమర్‌ను ఒకేసారి తొలగించవచ్చు. కాబట్టి మీ మనవడి విషయంలో మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా... ఆ సౌకర్యాలు ఉన్న పెద్ద హాస్పిటల్స్‌లో ఒకసారి సంప్రదించండి. నడుముకు శస్త్రచికిత్స అంటున్నారు... ఆందోళనగా ఉంది నా వయసు 40 ఏళ్లు. నాకు ఇద్దరు పిల్లలు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లడానికీ, అక్కడ్నుంచి రావడానికి అంటూ దాదాపు 60 కి.మీ. పైనే బైక్ మీద తిరుగుతుంటాను. ఈమధ్య నడుము నొప్పి చాలా ఎక్కువగా వస్తోంది. డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన నడుముకు శస్త్రచికిత్స చేయాలన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. ఈమధ్య కాలంలో చాలా మందిని ఈ సమస్య పట్టి పీడిస్తోంది. వివిధ రకాల ఒత్తిడి, జీవన విధానంలో మార్పులు, అధిక బరువులెత్తడం చాలాసేపు ఒకే భంగిమలో ఉండటం, ముందుకు ఒంగి పనిచేయడం, రోజూ చాలా దూరం బైక్‌పై ప్రయాణం చేయడం వంటి కారణాలతో వెన్నెముక మీద ఒత్తిడి ఏర్పడి ఈ సమస్య తలెత్తుతోంది. మీరు ఇటు ఇంట్లో పని చేసుకుంటూ ఆపై ఆఫీసుకు బండి మీద వెళ్లి అక్కడ కూడా శ్రమపడుతున్నారు. అంటే మీరు శారీరక ఒత్తిడికి అధికంగా లోనవుతున్నట్లు అర్థమతువోతంది. మీరు వెన్ను ఎమ్మారై తీయించారా? ఆ పరీక్ష ఫలితాలను చూసి డాక్టర్ మీకు సర్జరీ చేయించమని సలహా ఇచ్చినట్లయితే మీరు ‘స్పాండిలోలిస్తెసిస్’ అనే సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నట్లు నిర్ధారణ చేయవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో కొంతమందికి మందులతోనే నయమైతే, మరికొందరికి నడు కింది భాగంలో బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి వైద్యులు వాకింగ్, యోగా లాంటి వ్యాయామాలు సూచిస్తారు. అప్పటికీ తగ్గకపోతే శస్త్రచికిత్స నిర్వహించి, వెన్నుపూసలోని నరాలపై ఎక్కడ ఒత్తిడి పడుతోందో గుర్తించి, వెన్నుపూస లోపల జారిపోయిన ఎముకను సాధారణ స్థితికి తీసుకువచ్చి స్క్రూస్, రాడ్స్ బిగించి, నరాలు ఒత్తిడికి గురికాకుండా చేస్తారు. ఈ విషయంలో మీరు ఆందోళనపడాల్సిందేమీ లేదు. వెన్నుకు ఆపరేషన్ చేసే విధానాలలో సురక్షితమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వెన్నెముక సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని, మిగతా భాగాలు దెబ్బతినకుండా మినిమల్లీ ఇన్వేసివ్ విధానంలో తక్కువ కోతతో ఆపరేషన్ నిర్వహించగలుగుతారు. ఈ విధానంలో వెన్నుపాముకి ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఒక చిన్న రంధ్రం పెడతారు. దీన్నే కీ–హోల్ అంటారు. శరీరంపై చిన్న కోత మాత్రమే ఉంటుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది. శస్త్రచికిత్స నిర్వహించిన రోజున లేదా మర్నాడే రోగిని ఇంటికి పంపించేస్తారు. మొదట మీరు మీ ఎమ్మారై, ఇతర రిపోర్టులతో న్యూరోసర్జన్‌ను సంప్రదించండి. వారు ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్యవిజ్ఞానంతో మిగతా భాగాలకు ఎలాంటి లోపం/వైకల్యం రాకుండా శస్త్రచికిత్స చేయగలరు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చంటి పాపాయిలను ఘనాహారం వైపు మళ్లించడం ఎలా? తల్లి పాలు తాగుతూ ఉండే చిన్నారులకు నాలుగో నెల రాగానే అన్నప్రాశన చేసి, వారు మెల్లగా ఘనాహారం తీసుకునేలా అలవాటు చేస్తుంటారు. ఇలా పిల్లలను క్రమంగా ఘనాహారం వైపు మళ్లించడాన్ని ‘వీనింగ్’ అంటారు. ఇలా వీనింగ్ తర్వాత పిల్లల వికాసం కోసం వాళ్లలో కణజాలం, టిష్యూల అభివృద్ధి కోసం మెుదటి ఏడాదిలో ఇవ్వాల్సిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నాలుగు నుంచి ఆరు నెలల వయసప్పుడు క్రవుంగా చిన్నారులను ఘనాహారం అలవాటు చేయాలి. వీనింగ్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి వీనింగ్ ప్రక్రియలో కొన్ని ఆహారాపు అలవాట్లను అవాయిడ్ చేయాలి. ►గిన్నెలో ఉన్నది పూర్తికావడం కోసం వాళ్లు వద్దంటున్నా బలవంతంగా పెట్టకండి. ►వాళ్ల దినచర్యకూ, వాళ్లు తీసుకుంటున్న ఆహారానికి వుధ్య సవుతౌల్యం (బ్యాలెన్స్) ఉండేలా చూసుకోండి. ►వాళ్లకు ఏదైనా బహువూనంగా ఇవ్వదలచుకుంటే అది ఆహారపదార్థాలై ఉండకుండా జాగ్రత్తపడండి. (కొందరు అదేపనిగా ఫలానాది చేస్తే చాక్లెట్లను బహువూనంగా ఆశపెడుతుంటారు. ఈ అలవాటు మంచిది కాదు). పిల్లలను వురీ ఎక్కువ తియ్యగా ఉండే మిఠాయిలకూ, ఉప్పగా ఉండే చిప్స్ వంటి పదార్థాలకు అలవాటు చేయకండి. మంచి స్వాభావికమైన ఆహారపదార్థాలైన కూరగాయలు, ఆకుకూరలు, పళ్లను పిల్లలకు అలవాటయ్యేలా చూడండి. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కరుణించని ఎమ్యెల్యే.. వ్యక్తి మృతి
తిరుపతి తుడా : ఎమ్మెల్యే నిర్లక్ష్యం ఓ నిడు ప్రాణాన్ని బలితీసుకుంది. సీఎం సహాయ నిధి కోసం ఏడాదిన్నరగా అర్థించి అలసిపోయిన ఓ రోగి చివరకు తనువు చాలించాడు. తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీలోని లింగేశ్వరనగర్‌కు చెందిన కరణప్రసాద్ (70) కొన్నేళ్లుగా నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. సమస్య తీవ్రం కావడంతో ఏడాదిన్నర క్రితం అప్పుచేసి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. 7నెలల క్రితం మళ్లీ సమస్య తలెత్తడంతో రెండోసారి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. చికిత్స నిమిత్తం రూ.6 లక్షలు వ్యయమైనట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో వడ్డీలు కట్టలేక కరణప్రసాద్ ఏడాదిన్నరగా సీఎం సహాయనిధి కోసం ఎమ్మెల్యే సుగుణమ్మను వేడుకుంటున్నాడు. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో మరింత వేదనకు గురయ్యాడు. తాజాగా 4 రోజుల క్రితం మళ్లీ ఎమ్మెల్యేను కలిస్తే గురువారం రావాలని సూచించారు. దీంతో ఆయన గురువారం ఎమ్మెల్యే ఇంటికి చేరుకునాడు. ఎంతోసేపు నిరీక్షించిన కరుణప్రసాద్ నీరసంతో ఎమ్మెల్యే ఇంటి గుమ్మం ముందే కుప్పకూలిపోయాడు. అతన్ని 108 సిబ్బంది రుయా ఆస్పత్రికి తరలిచంగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
న్యూరో సర్జరీ కౌన్సెలింగ్స్
ట్యూమర్‌కు స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ చేయాలన్నారు. అంటే ఏమిటి? మా నాన్నగారి వయసు 65 ఏళ్లు. గత పదేళ్లుగా ఆయనకు డయాబెటిస్ ఉంది. ఈమధ్య ఆయనను డాక్టర్‌కు చూపించాం. వారు పరీక్షలు చేసి మెదడులో గడ్డ పెరుగుతున్నట్లు గుర్తించారు. మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత అది హానికరం కాని బినైన్ గడ్డ అని, క్యాన్సర్ గడ్డ కాదని చెప్పారు. అయితే దీనికి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ చేయాలన్నారు. ఈ సర్జరీ అంటే ఏమిటి? దీనివల్ల మెదడుపైన ఏదైనా దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుందా? దయచేసి వివరంగా చెప్పండి. – కె. వీరరాఘవులు, నెల్లూరు మెదడులో గడ్డలను తొలగించడానికి ప్రస్తుతం రేడియో సర్జరీ వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. రేడియో సర్జరీలలో స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అత్యాధునికమైనది. చాలా కీలకమైనది కూడా. క్యాన్సర్‌తో సంబంధం లేని, నిరపాయకరమైన 3 సెం.మీ. లోపు బినైన్ బ్రెయిన్ ట్యూమర్లను తొలగించడానికే కాకుండా, శరీరంలోని ఇతర భాగాల్లో ఏర్పడ్డ క్యాన్సర్ మెదడుకు విస్తరించడం వల్ల ఏర్పడే మెటాస్టాటిక్ బ్రెయిడ్ డిసీజ్‌కు ఇది అత్యంత ప్రభావవంతమైన శస్త్రచికిత్సగా చెప్పవచ్చు. స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీలో పేషెంట్ల శరీరంపై ఎలాంటి కోతలు ఉండవు. పుర్రెకు కోత పెట్టకుండా మెదడుకు శస్త్రచికిత్స చేయగలగడం వల్ల ఏమాత్రం రక్తస్రావం లేకుండానే సర్జరీ జరుగుతుంది. కంప్యూటర్ సహాయంతో పనిచేసే ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తూ మెదడులోని గడ్డను కచ్చితమైన లక్ష్యంగా చేసుకొని ఈ శస్త్రచికిత్స చేస్తారు. మెదడులోని గడ్డ పరిమాణాన్ని బట్టి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీని ఒకటి నుంచి ఐదుసార్లు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ చికిత్స చేయించుకున్న రోజునే పేషెంటు ఇంటికి వెళ్లిపోవచ్చు. కొన్ని మెదడు వ్యాధులకు సంప్రదాయ శస్త్రచికిత్సలతో వైద్యం చేయడం సాధ్యం కావడం లేదు. రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలలో అసాధారణ పరిస్థితి, నాడీకణాలకు నష్టం వాటిల్లే పరిస్థితి లేదా ఇతరత్రా కారణాల వల్ల మెదడులో గడ్డ ఏర్పడ్డ స్థానానికి స్కాల్పెల్ (శస్త్రచికిత్సకు ఉపయోగించే కత్తి) వంటి శస్త్రచికిత్స పరికరాలను చేర్చడం సాధ్యం కాదు. అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని పేషెంట్లు శస్త్రచికిత్సను తట్టుకోవడం కష్టం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేడియో సర్జరీ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తున్నది. మీ డాక్టర్ సూచించిన స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ చాలా సురక్షితమైనది. మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మీ నాన్నగారికి వారు సూచించిన చికిత్స చేయించండి. పిట్యూటరీ కార్సినోమా కావచ్చు అంటున్నారు... నా వయసు 38 ఏళ్లు. ఒక నిర్మాణ సంస్థ తాలూకు సైట్లో పనిచేస్తుంటాను. ఏడాదికాలంలో నా కంటి చూపు క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. దాంతో ఇదివరకటిలా రంగులు స్పష్టంగా కనిపించడం లేదు. ఒక్కోసారి పూర్తిగా చీకటిగా కూడా అనిపిస్తోంది. ముఖం మొద్దుబారినట్లయి, మైకం కమ్ముతోంది. దాంతో ఉద్యోగంలో బాగా ఇబ్బందిగా అనిపించి, కళ్ల డాక్టరుకు చూపించాను. సైట్ ఏమీ లేదని చెప్పి, హైదరాబాద్‌లోని పెద్ద ఆసుపత్రిలో చూపించమన్నారు. అక్కడికి వెళ్లి చూపించాను. వాళ్లు పిట్యూటరీ కార్సినోమా కావచ్చని అంటున్నారు. అంటే నా కళ్లకు క్యాన్సర్ వచ్చినట్లా. పిట్యూటరీ కార్సినోమా అంటే ఏమిటి? దయచేసి వివరంగా తెలపండి. – ఆర్. డేవిడ్, జనగామ పిట్యూటరీ కార్సినోమా అన్నది కళ్లకు సంబంధించిన వ్యాధి కాదు. కళ్ల క్యాన్సర్ కాదు. పిట్యూటరీ కార్సినోమా అన్నది పిట్యూటరీ గ్రంథికి సంబంధించిన క్యాన్సర్ గడ్డ. పిట్యూటరీ గ్రంథి మెదడులో భాగమైన హైపోథాలమస్ దిగువ భాగం నుంచి పొడుచుకువచ్చినట్లుగా బఠాణీగింజ అంత పరిమాణంలో ఉంటుంది. శరీరంలోని ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నింటినీ అదుపు చేయగలది కావడం వల్ల దీనికి మాస్టర్గ్లాండ్ అని పేరు. పిట్యూటరీ గ్రంథి గడ్డలు మనదేశంలో సాధారణంగా కనిపించేవే. ఈ గడ్డల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు కానటువంటి సాధారణ గడ్డ (పిట్యుటరీ ఎడినోమా)లు. ఇక రెండో రకానికి చెందినవి పిట్యూటరీ కార్సినోమా (క్యాన్సర్) గడ్డలు. ఎండోక్రైన్ ట్యూమర్స్ అని పేర్కొనే ఈ క్యాన్సర్ గడ్డలు అరుదుగా కనిపిస్తాయి. వీటి నుంచి క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించగలదు. దీనివల్ల పిట్యూటరీ గ్రంథి పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల మీలో కనిపిస్తున్న లక్షణాలే కాకుండా తీవ్రమైన తలనొప్పి, స్పృహతప్పడం, హైపోథైరాయిడిజం, సెక్స్ (పురుషుల్లో టెస్టోస్టెరాన్, స్త్రీలలో ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్) హార్మోన్ల ఉత్పత్తి మందగించడం, ఎడ్రినల్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. పిట్యూటరీ గడ్డలు ఏర్పడటానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వాతావరణ ప్రభావంగానీ, జీవనళైలి గానీ వీటికి దారితీస్తున్నట్లుగా కూడా ఆధారాలు లేవు. హఠాత్తుగా ఏర్పడే ఈ గడ్డలు వంశపారంపర్యంగా కూడా రావడం లేదు. అయితే ప్రమాదకర స్థాయిలో రేడియేషన్‌కు గురికావడం, క్యాన్సర్ కారక రసాయనాల ప్రభావం వల్ల వ్యక్తి శరీరకణాల్లోని జన్యువులు ఉత్పరివర్తనానికి (మ్యూటేషన్స్‌కు) గురికావడం వంటి కారణాల వల్ల పిట్యూటరీ గడ్డలు ఏర్పడుతుండవచ్చునని పరిశోధకులు ఊహిస్తున్నారు. శరీరంలో హార్మోన్నల హెచ్చుతగ్గుల ఆధారంగా పిట్యూటరీ గ్రంథి గడ్డలను అనుమానించినప్పుడు, దాన్ని నిర్ధారణ చేసేందుకు ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే అవి క్యాన్సర్ గడ్డలు అవునా, కాదా అని నిర్ధారణ చేయడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో పిట్యూటరీ కార్సినోమా వల్ల క్యాన్సర ఇతర భాగాలకు వ్యాపించిన తర్వాతగా గానీ వాటిని గుర్తించడం సాధ్యపడటం లేదు. ఇది మెదడులోని ఇతర ప్రాంతాలకు, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించడం కూడా జరుగుతుంది. మీరు మీ దగ్గర ఉన్న పెద్ద మెడికల్ సెంటర్లో సంప్రదించగలరు. బ్రెయిన్ ట్యూమర్లతో వినికిడి దెబ్బతిన్నది... ఏం చేయాలి? నా వయసు 40 ఏళ్లు. దాదాపు పదేళ్ల కిందట మెదడులో గడ్డ ఏర్పడిందని గుర్తించి శస్త్రచికిత్స చేశారు. ఆ ట్యూమర్ (గడ్డ) తొలగించాక ఒక చెవి వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయింది. పైగా ఆ చెవిలో ఇప్పుడు నిరంతరం శబ్దం వస్తోంది. ఆ తర్వాత మరో ఎనిమిదేళ్లకు మరో గడ్డను గుర్తించి రేడియేషన్ ఇచ్చారు. ఇప్పుడు రెండో చెవిలోనూ శబ్దాలు వస్తున్నాయి. సరిగా వినిపించడం లేదు. తలలో ట్యూమర్లు పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని విన్నాను. నిజమేనా? చెవిలో హోరు తగ్గేదెలా? నా వినికిడి శక్తి మెరుగుపడటానికి మార్గం ఉందా? దయచేసి తగిన విధంగా నన్ను గైడ్ చేయండి. – డి. రామభూపాల్‌రెడ్డి, కర్నూలు మెదడులో ట్యూమర్లు... మెదడు, కేంద్రనాడీ మండలంలోని వివిధ రకాల కణాల నుంచి ఏర్పడతాయి. బినైన్, మాలిగ్నెంట్ అని వీటిలో రెండు రకాలు ఉంటాయి. బినైన్ ట్యూమర్లు మెదడులో లోతుగా పాతుకొని ఉండవు. అందువల్ల అవి ఉన్న ప్రాంతంలో శస్త్రచికిత్స చేయడానికి వీలైతే, వీటిని సులభంగా తొలగించి వేయడం సాధ్యమవుతుంది. ఈ రకమైన ట్యూమర్లు క్యాన్సర్ కారకాలు కావు. అయితే ఒకసారి సర్జరీ చేసి తీసివేసినా... ఇవి మళ్లీ తిరిగి పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది. మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ మెదడులో ఏర్పడినవి బినైన్ ప్రైమరీ ట్యూమర్లు కావచ్చు. అందువల్ల ఒకవైపు తొలగిస్తే మళ్లీ మరోవైపు ఏర్పడ్డాయి. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతలను నిర్వహిస్తూ, శరీరంలోని వేర్వేరు అవయవాలను/భాగాలను నియంత్రిస్తూ ఉంటాయి. అందువల్ల ట్యూమర్ ఏర్పడిన భాగంలో మెదడు తన విధిలను నిర్వహంచడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. అందువల్ల మెదడులో గడ్డ ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి, శరీరంలోని వివిధ భాగాల్లో / అవయవాల పనితీరులో దాని ప్రభావం కనిపిస్తుంది. పదకొండేళ్ల కిందట మీరు శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీతో పోలిస్తే... మెదడు ట్యూమర్ల చికిత్సలో ఇప్పుడు అసాధారణమైన ఠమెదడులో ఏర్పడిన ట్యూమర్లను ఇప్పుడు సమూలంగా తొలగించడంతో పాటు, వారు సాధారణ జీవితం గడిపేందుకు సిద్ధం చేయడం కూడా ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో భాగంగా రూపొందింది. గడ్డ ఏర్పడిన మెదడు భాగానికి ఏమాత్రం నష్టం చేయకుండా, మెదడులోని ఆ భాగం అదుపు చేసే అవయవాల పనితీరు దెబ్బతినకుండా ట్యూమరును తొలగించివేయగల వైద్యసాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందువల్ల మీరు మరోసారి మీ డాక్టర్‌ను సంప్రదించి, ప్రత్యామ్నాయ శస్త్రచికిత్సల గురించి అడిగి తెలుసుకోండి. వారు మీ ఆరోగ్యపరిస్థితిని, అవసరాలను దృష్టిలో ఉంచుకొని, సరైన విధానాన్ని మీకు సూచించగలుగుతారు. ఇక మీ వినికిడి శక్తిని పునరుద్ధరించే విషయంలో ఈఎన్టీ వైద్యనిపుణుడి సాయం అవసరమా అని నిర్ధారణ చేస్తారు. - డాక్టర్ రవి సుమన్ రెడ్డి, సీనియర్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
న్యూరో సర్జరీ కౌన్సెలింగ్స్
ఆ మిగిలిన గడ్డను ఇప్పుడు తీసేయవచ్చా? మా నాన్నగారి వయసు 65 ఏళ్లు. విపరీతమైన తలనొప్పి వస్తుంటే ఒక పెద్ద ఆసుపత్రిలో చూపించాం. మెదడులో ట్యూమర్ ఉందని చెప్పి, గతేడాది ఆగష్టులో ఆపరేషన్ చేశారు. కానీ గడచిన పదిహేను రోజులుగా మళ్లీ నొప్పి వస్తుండటంతో ఆ ఆసుపత్రిలోని డాక్టర్లను కలిశాం. మళ్లీ పరీక్షలు చేయించి, ట్యూమర్‌లోని కొంతభాగం మిగిలిపోయినట్లు గుర్తించారు. 3టీ ఐఎంఆర్ఐతో గడ్డను ఇప్పుడు సమూలంగా తొలగిస్తామని అంటున్నారు. ఈ 3టీ ఐఎంఆర్‌ఐ ఏమిటి? కిందటిసారి అలా జరగడంతో ఇప్పుడు మాకు ఆందోళనగా ఉంది. దయచేసి వివరించండి. – ఆర్. కృపారాణి, సంగారెడ్డి ఇటీవలి కాలంలో మెదడులోని గడ్డల తొలగింపు ఆపరేషన్‌ను చాలా ఎక్కువగా ప్రభావితం చేసిన అత్యాధునిక ఉపకరణమే 3 టెస్లా ఇంట్రా ఆపరేటివ్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్. దీన్ని సంక్షిప్తంగా 3టీ ఐఎంఆర్‌ఐ అంటారు. మొదట్లో వైద్య పరీక్షలకు ఎక్స్‌రే, తర్వాత అల్ట్రాసౌండ్, ఆపైన ఎమ్మారైలపై ఆధారపడిన విషయం తెలిసిందే. ఇది తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ఐఎంఆర్‌ఐ (ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారై)తో ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే శరీరం అంతర్భాగంలోని అవయవాలకు సంబంధించిన స్పష్టమైన చిత్రాలను ఇది అందిస్తుంది. దీని సహాయంతో నాడీవైద్యనిపుణులు గతంలో కంటే మెరుగ్గా ఇప్పుడు మెదడులోని గడ్డలను తొలగించగలుగుతున్నారు. ఈ ఉపకరణం అందుబాటులోకి వచ్చాక బ్రెయిన్ సర్జరీల విషయంలో మునుపటి కంటే ఎక్కువ కచ్చితత్వంతో, సునిశితత్వంతో ఫలితాలు సాధించడానికి అవకాశం వచ్చింది. ఈ ఇంట్రా ఆపరేటివ్ ఎమ్మారైతో మెదడులో ఉన్న గడ్డలు, పార్కిన్సన్స్ డిసీజ్, వణుకుడు (ఎసెన్షియల్ ట్రెమర్స్) వంటి వ్యాధులకు కూడా సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను మెదడులోని ఇతర ఆరోగ్యకరమైన కణజాలానికి ఎలాంటి నష్టం జరగకుండా నిర్వహించేందుకు వీలుంది. అందువల్ల మీరు ఎలాంటి అనుమానాలూ పెట్టుకోకుండా మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించవచ్చు. అకస్మాత్తుగా బలహీనపడ్డ కాలూ–చేయి... ఎందుకిలా? నా వయసు 29 ఏళ్లు. సివిల్ ఇంజనీర్‌ను. రోజూ ఈతకు వెళ్తా. ఇటీవల ఒక రోజు ఈతకు వెళ్లి వస్తుండగా, దారిలో బలహీనంగా అనిపించింది. ఎడమ కాలు, చేయి కదిలించడం కష్టమైంది. డాక్టర్‌ను కలిస్తే ఎమ్మారై చేయించారు. మెదడులో ఒకచోట క్లాట్ ఏర్పడినట్లు తెలిసింది. ఎందుకిలా జరిగింది? పరిష్కారం ఏమిటి? వివరంగా చెప్పండి. – మనోహర్ ప్రసాద్, హనుమకొండ మీ సమస్యకు ఈత కారణం కాదు. చాలా రకాల కారణాలతో మెదడులో రక్తనాళాలు చిట్లిపోతుంటాయి. తలకు గాయం కావడం వల్ల, రక్తపోటు పెరగడం వల్ల, వంశపారంపర్య కారణాల వల్ల అవి చిట్లడం జరగవచ్చు. మీరు ఈదే సమయంలో మీకు తెలియకుండానే ఎప్పుడో తలకు గాయం అయి ఉండవచ్చు లేదా వంశపారంపర్యంగా వచ్చే బలహీన రక్తనాళాల వ్యాధి (ఆర్టిరోవీనస్ మాల్ ఫంక్షన్) కారణంగా ఇది జరిగి ఉండవచ్చు. ఎడమకాలు, చేయి కదిలించడం సాధ్యం కాని స్థితి అనికాకుండా, బలహీనంగా అనిపించిందని చెబుతున్నందున మీ మెదడులో పెద్దవైన ధమనులు కాకుండా రక్తకేశనాళికల్లో ఈ క్లాట్ ఏర్పడి ఉండవచ్చు. ప్రధానంగా మెదడుకు రక్తం సరఫరాచేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి రక్తం అందకపోవడం (ఇస్కిమిక్) లేదా మెదడులోని భాగాలకు వెళ్లే సన్నని రక్తకేశనాళికలు చిట్లిపోవడం (హేమరేజిక్) కారణాల వల్ల మెదడులో క్లాట్స్ ఏర్పడతాయి. కొన్నిసార్లు శరీరంలోని వేరే ప్రాంతంలో ఏర్పడిన క్లాట్స్ రక్తప్రవాహంలో వెళ్లి మెదడులోని సన్నని ధమనుల్లో చిక్కుకుపోతాయి. ఈ స్థితిని సెరిబ్రోవాస్క్యులార్ యాక్సిడెంట్ అంటారు. మెదడులో క్లాట్ ఏవిధంగా ఏర్పడనప్పటికీ దాని పరిణామాలు మాత్రం ఒకేవిధంగా ఉంటాయి. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతను నిర్వహిస్తూ శరీరంలోని వేర్వేరు అవయవాలను నియంత్రిస్తుంటాయి. అందువల్ల క్లాట్స్ ఏర్పడిన భాగం తాలూకు మెదడు తన విధులను నిర్వహించడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. మెదడులోని కొన్ని భాగాలకు రక్తం సరఫరా నిలిచిపోయి అక్కడి కణాలు పనిచేయడం నిలిచిపోతుంది. అందువల్ల మెదడులో ఆ భాగాలు శరీరంలో నియంత్రించే అంగాలు చచ్చుబడతాయి. నాడుల పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. మెదడు క్లాట్ ఏర్పడిన ప్రదేశం, ఆ క్లాట్ పరిమాణాన్ని బట్టి శరీరంలో వివిధ భాగాల్లో ఆ ప్రభావ లక్షణాలు వ్యక్తం అవుతుంటాయి. హఠాత్తుగా పక్షవాత లక్షణాలు కనిపించవచ్చు. అవికూడా శరీరంలో ఒకవైపునే ఏర్పడతాయి. మెదడులోని కుడిభాగం... శరీరంలోని ఎడమభాగాన్నీ, మెదడులోని ఎడమభాగం... శరీరంలోని కుడి భాగాన్ని నియంత్రిస్తుంటుంది. మీ ఎడమ కాలు, చేయి అదుపుతప్పాయని అంటున్నారు కాబట్టి మీ మెదడులో కుడిభాగంలో క్లాట్ ఏర్పడి ఉండవచ్చు. మీరు వెంటనే చికిత్స చేయించుకోవాలి. మెదడుక్లాట్స్కు ఇప్పుడు చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. మీరు చెప్పినదాన్నిబట్టి మీ క్లాట్ చిన్నదిగానే అనిపిస్తోంది. మందులతోనే దాన్ని కరిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. రక్తపోటు వల్లనో, వంశపారంపర్య కారణాల వల్లనో మీకు ఇది జరిగి ఉంటే భవిష్యత్తులో మెదడులోని ధమనులు హఠాత్తుగా చిట్లిపోయి, మెదడు కణజాలంలోకి రక్తస్రావం అయి, మెదడులోని ఆ భాగం పనిచేయడం నిలిచిపోయి పక్షవాతానికి దారితీసే ప్రమాదమూ పొంచి ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండి, జాగ్రత్త వహించండి. ఆ ట్యూమర్లతో నా వినికిడి శక్తి దెబ్బ తిన్నది... పరిష్కారం చెప్పండి నా వయసు 38 ఏళ్లు. మెదడులో గడ్డ ఏర్పడిందని గుర్తించి పదకొండేళ్ల కిందట శస్త్రచికిత్స చేశారు. ఆ ట్యూమర్ (గడ్డ) తొలగించాక ఒక చెవి వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయింది. పైగా ఆ చెవిలో ఇప్పుడు నిరంతరం శబ్దం వస్తోంది. మరో ఎనిమిదేళ్లకు ఇంకో గడ్డను గుర్తించి రేడియేషన్ ఇచ్చారు. ఇప్పుడు రెండో చెవిలోనూ శబ్దాలు వస్తున్నాయి. సరిగా వినిపించడం లేదు. చెవిలో హోరు తగ్గేదెలా? నా వినికిడి శక్తి మెరుగుపడటానికి మార్గం ఉందా? దయచేసి తెలియజేయండి. – కె. దయాకర్, వరంగల్ మెదడులో ట్యూమర్లు... మెదడు, కేంద్రనాడీ మండలంలోని వివిధ రకాల కణాల నుంచి ఏర్పడతాయి. బినైన్, మాలిగ్నెంట్ అని వీటిలో రెండు రకాలు ఉంటాయి. బినైన్ ట్యూమర్లు మెదడులో లోతుగా పాతుకొని ఉండవు. అందువల్ల అవి ఉన్న ప్రాంతంలో శస్త్రచికిత్స చేయడానికి వీలైతే, వీటిని సులభంగా తొలగించి వేయడం సాధ్యమవుతుంది. ఈ రకమైన ట్యూమర్లు క్యాన్సర్ కారకాలు కావు. అయితే ఒకసారి సర్జరీ చేసి తీసివేసినా... ఇవి మళ్లీ తిరిగి పెరిగే అవకాశం మాత్రం ఉంటుంది. మీరు తెలిపిన వివరాల ప్రకారం మీ మెదడులో ఏర్పడినవి బినైన్ ప్రైమరీ ట్యూమర్లు కావచ్చు. ఒకవైపు తొలగిస్తే మళ్లీ మరోవైపు ఏర్పడ్డాయి. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతలను నిర్వహిస్తూ, శరీరంలోని వేర్వేరు అవయవాలను/భాగాలను నియంత్రిస్తూ ఉంటాయి. అందువల్ల ట్యూమర్ ఏర్పడిన భాగంలో మెదడు తన విధులను నిర్వహంచడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. అందువల్ల మెదడులో గడ్డ ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి, శరీరంలోని వివిధ భాగాల్లో / అవయవాల పనితీరులో దాని ప్రభావం కనిపిస్తుంది. పదకొండేళ్ల కిందట మీరు శస్త్రచికిత్స చేయించుకున్నప్పటితో పోలిస్తే... మెదడు ట్యూమర్ల చికిత్సలో ఇప్పుడు అసాధారణమైన మార్పులు వచ్చాయి. మెదడులో ఏర్పడిన ట్యూమర్లను ఇప్పుడు సమూలంగా తొలగించడంతో పాటు, వారు సాధారణ జీవితం గడిపేందుకు సిద్ధం చేయడం కూడా ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో భాగంగా రూపొందింది. గడ్డ ఏర్పడిన మెదడు భాగానికి ఏమాత్రం నష్టం చేయకుండా, మెదడులోని ఆ భాగం అదుపు చేసే అవయవాల పనితీరు దెబ్బతినకుండా ట్యూమరును తొలగించివేయగల ఆధునిక వైద్య పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందువల్ల మీరు మరోసారి డాక్టర్‌ను సంప్రదించి, ప్రత్యామ్నాయ శస్త్రచికిత్సల గురించి అడిగి తెలుసుకోండి. వారు మీ ఆరోగ్యపరిస్థితిని, అవసరాలను దృష్టిలో ఉంచుకొని, సరైన విధానాన్ని మీకు సూచించగలుగుతారు. ఇక మీ వినికిడి శక్తిని పునరుద్ధరించే విషయంలో ఈఎన్టీ వైద్యనిపుణుడి సాయం అవసరమా అని కూడా నిర్ధారణ చేస్తారు. - డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణియం సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
చిన్నారి కంటిపై దిగిన చువ్వ తొలగింపు
విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన ఉస్మానియా వైద్యులు హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మరో అరుదైన ఆపరేషన్ చేశారు. పాతబస్తీ జహనుమా ప్రాంతానికి చెందిన పన్నెండేళ్ల చిన్నారి మహ్మద్ బాబా ఖురేషి కంటి భాగంలో ప్రమాదవశాత్తు గుచ్చుకున్న ఇనుప చువ్వను విజయవంతంగా బయటకు తీశారు. ఈ నెల 6న వారి మటన్ దుకాణంలో ఆడుకొంటుండగా మాంసాన్ని వేలాడదీసే పొడవాటి ఇనుప చువ్వ బాబా ఎడమవైపు కంటి పై భాగంలోకి దిగింది. తల భాగంలో మెదడుకు దగ్గరగా చొచ్చుకుపోయింది. వెంటనే అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సకు ఉపక్రమించారు. న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్జిత్రాయ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వేణుగోపాల్ ఈ నెల 7న బాబాకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. మెదడుకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇనుప చువ్వను బయటకు తీశారు. చిన్నారి కోలుకోవడంతో శుక్రవారం డిశ్చార్జి చేశారు. బాబా పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉస్మానియాలో ఉచితంగా చేశామన్నారు. -
‘ఓపీ’క ఉంటే రండి!
నిమ్స్‌లో ఓపీ సేవలకు గ్రహణం రోజుల తరబడి రోగుల పడిగాపులు సమయానికి రాని వైద్యులు సాక్షి, సిటీబ్యూరో: వైద్యం కోసం అవుట్ పేషెంట్ విభాగానికి వచ్చే రోగులకు నిమ్స్ వైద్యులు చుక్కలు చూపిస్తున్నారు. మెరుగైన వైద్యం సంగతి దేవుడెరుగు... కనీసం ఓపీ సేవలూ సక్రమంగా అందడం లేదు. రాజకీయ పలుకుబడి ఉన్న ‘పెద్ద ల’కు, బడా వ్యక్తులకు ఎర్రతివాచీ పరుస్తున్న వైద్యులు సుదూర ప్రాంతాల నుంచి ఓపీకి చేరుకునే సాధారణ, మధ్య తరగతి రోగులను కనీసం పట్టించుకోవడం లేదు. నిజానికి అవుట్ పేషెంట్ విభాగానికి ఉదయం 8.30 గంటలకు చేరుకుంటే... వైద్యుడు రాసిన పరీక్షలన్నీ చేయించుకుని, సాయంత్రానికల్లా మందులు తీసుకొని ఇంటికి చేరుకోవాల్సిన రోగులు రెండు రోజుల పాటు ఓపీలోనే పడిగాపులుకాయాల్సి వస్తోంది. సకాలంలో వైద్యులు రాకపోవడం, ఒకవేళ వచ్చినా మెడికల్ రిపోర్టులు సమయానికి అందకపోవడం వ ంటి కారణాలతో సేవలు జాప్యమవుతున్నాయి. తప్పని నిరీక్షణ సుమారు వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగానికి నిత్యం 1500 మంది రోగులు వస్తుంటారు. వీరిలో రోజుకు సగటున 100-150 మంది అడ్మిట్ అవుతుంటారు. మిగతా విభాగాలతో పోలిస్తే, ఆర్థో, న్యూరో సర్జరీ, యూరాలజీ, గుండె జబ్బుల విభాగాలకు రోగుల తాకిడి ఎక్కువ. తలకు బలమైన గాయాలై ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రులు, పక్షవాతంతో బాధ పడుతున ్న రోగులకు ఆస్పత్రిలో అడ్మిషన్ కూడా దొరకడం లేదు. న్యూరో సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న ఆరోగ్యశ్రీ రోగులను ప్రైవేటు ఆస్పత్రులు చేర్చుకోకపోవడంతో వీరంతా నిమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వైద్యం చేయించుకోవాలంటే 15నుంచి నెల రోజుల పాటు ఎదురు చూడాల్సి వ స్తోంది. ఇలా ఇప్పటికే 300 మందికిపైగా సర్జరీల కోసం ఎదురు చూస్తున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. దీంతో కొత్తగా ఎవరైనా వస్తే చేర్చుకోవడం లేదు. ఇక దెబ్బతిన్న వెన్నుపూస జాయింట్లను సరిచేయాలంటే సియరమ్ అనే వైద ్య పరికరం అవసరం. ఆస్పత్రిలోని ఈ పరికరం నెలరోజుల క్రితం పాడైంది. మరమ్మతుల విషయమై సంబంధిత విభాగం వైద్యులు పట్టించుకోవడం లేదు. గుండెను పిండేస్తున్న నిర్లక్ష్యం కార్డియాలజీ విభాగంలో శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన వైద్య పరికరం తమ వద్ద లేదని చెబుతూ రోగులను చేర్చుకోకుండా తిప్పి పంపుతున్నారు. అడపా దడపా చేర్చుకున్నా సకాలంలో శస్త్ర చికిత్స చేయకపోవడంతో హృద్రోగంతో బాధ పడుతున్న వారు ఆస్పత్రిలోనే మృత్యువాత పడుతున్నారు. ఇక యూరాలజీ విభాగంలో రోగుల సంఖ్యకు సరిపడే వైద్యులు లేకపోవడంతో చికిత్సల్లో తీవ్ర జాప్యం తప్పడం లేదు. దాదాపు ప్రతి విభాగంలోనూ ఏదో సమస్య ఎదురవుతుండడంతో ఓపీకి వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు.