neurologist
-
పిల్లలపైనా మైగ్రేన్ దాడి
సాక్షి, విశాఖపట్నం: పిల్లల్లోనూ పార్శ్వపు (మైగ్రేన్ హెడేక్) తలనొప్పి విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని యూఎస్‌కు చెందిన అంతర్జాతీయ న్యూరో నిపుణురాలు డాక్టర్ డెబోరా ఫ్రెడిమాన్ అన్నారు. విశాఖలో జరుగుతున్న ఇండియన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ (ఐయాన్‌కాన్)–2024 సదస్సులో కీలకోపన్యాసం చేసేందుకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో మైగ్రేన్‌కు సంబంధించిన పరిశోధనలు, చికిత్సలపై ఆదివారం మాట్లాడారు. ఆమె ఏం చెప్పారంటే...ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి..15 నుంచి 40 ఏళ్లలోపు వారిలో మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సమస్యలతో వచ్చే వంద మందిలో 40 మంది మైగ్రేన్ అని చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారు. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు, ప్రతి 10 మంది పురుషుల్లో ఒకరికి మైగ్రేన్ ఉంది. గడచిన పదేళ్లలో మైగ్రేన్‌తో బాధపడే వారి సంఖ్య దాదాపు 80 శాతం పెరిగింది. ఇది కలవరపాటుకు గురిచేసే అంశం.‘ఆరా’ రావడం వల్లే..ప్రపంచ జనాభాలో 10 శాతం మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. వీరిలో 4 శాతం మందికి తలనొప్పి వచ్చే ముందు ‘ఆరా’ అనే అనుభవం ఉంటోంది. కళ్లముందు మెరుపులు వచ్చినట్టు.. చుట్టూ బైర్లు కమ్మినట్లు, శరీరమంతా మొద్దుబారిన భావనకు గురవుతున్నారు. దీన్నే ఆరా అని పిలుస్తున్నాం. ఈ ఆరా ద్వారానే మైగ్రేన్‌కు మంచి చికిత్సల్ని తీసుకురాగలుగుతున్నాం. దాదాపు 20 ఏళ్లుగా మైగ్రేన్‌పై పరిశోధనలు చేస్తున్నాను. మెదడులో ఉండే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ఎఫ్) అనే ద్రవం అలల మాదిరిగా కదులుతూ మెదడులోని మలినాల్ని శుభ్రం చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ సీఎస్ఎఫ్లోకి సమస్యాత్మక ప్రోటీన్స్ వచ్చినప్పుడు ఆరా మొదలై.. మైగ్రేన్ అనుభవం ఏర్పడుతుంది. ఈ ఆరాకు కారణమవుతున్న ప్రోటీన్లను అడ్డుకునేలా మందులు కనిపెట్టాం. ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నాం.ఒత్తిడికి దూరంగా ఉండాలిమైగ్రేన్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా కనిపించడం లేదు. 25 శాతం మంది మాత్రమే మైగ్రేన్ని ముందస్తుగా గుర్తించగలుగుతున్నారు. మైగ్రేన్ వచ్చినప్పుడు ప్రారంభంలోనే గుర్తించి వైద్యుల్ని సంప్రదిస్తే.. దానికి తగినట్లుగా మందులు వాడుతుంటే.. క్రమంగా నివారించగలం. మైగ్రేన్‌కు సరైన చికిత్స లేదు. కానీ.. ఇటీవల కాలంలో సీజీఆర్‌పీ వంటి కొత్త చికిత్సలతో పాటు లాస్మిడిటన్, ట్రిప్టాన్స్ వంటి మందులు అందుబాటులోకి రావడంతో మైగ్రేన్ అటాక్స్‌ని తగ్గించగలుగుతున్నాం. అయితే.. జీవనశైలిలో మార్పులు రావాలి. సమయానికి నిద్ర,మంచి ఆహారం, నీరు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి లేకుండా చూసుకోవడం ద్వారానే మైగ్రేన్ని నియంత్రించగలం.చిన్నారులూ బాధితులేమరో బాధాకరమైన విషయమేమిటంటే.. మైగ్రేన్‌కు చిన్నారులూ బాధితులుగా మారుతున్నారు. ప్రతి 100 మంది చిన్నారుల్లో 20 మంది దీనిబారిన పడుతున్నారు. బాలికలతో పోలిస్తే బాలురులో ఎక్కువగా ఇది కనిపిస్తోంది. తమకు తలనొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పినా.. వాళ్లు నమ్మడం లేదు. స్కూల్ ఎగ్గొట్టేందుకు చెబుతున్న కుంటిసాకులుగానే తీసుకుంటున్నారు. ఇదే ప్రమాదకరంగా మారుతోంది. తేలిగ్గా తీసుకుంటే మైగ్రేన్ ముప్పుగా మారుతుందన్న విషయం తల్లిదండ్రులు గుర్తించాలి. యుక్తవయసులో మాత్రం ఇది అమ్మాయిల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. -
నిద్రలేమి ముప్పు : హైదరాబాద్ న్యూరాలజిస్ట్ కీలక పోస్ట్ వైరల్
మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే నిద్ర అవసరం. రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నా, మరుసటి రోజుగా చురుగా పనులు చేసుకోవాలన్నా నిద్ర చాలా అవసరం.రనిద్ర తక్కువైతే ఎన్నో రోగాలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర లేమి కారణంగా ఏకాగ్రత లోపించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. తాజాగా హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ మరికొన్ని కీలక విషయాలను ప్రకటించారు. దీంతో ఆయన పోస్ట్ వైరల్‌గా మారింది.తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే చాలా అధ్యయనాలు తేల్చాయి. రోజులో కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. అనేక అధ్యయనాలు నిద్ర లేమి వల్ల బరువు పెరగడం, ఆకలి లేకపోవడం, ఏకాగ్రత తగ్గడం, పనితీరులో మార్పు ,హార్మోన్ల లోపాలు వంటి అనేక రుగ్మతలకు దారి తీస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు , మానసిక రుగ్మతలు అలాగే కొన్ని సందర్భాల్లో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కానీ పెద్దలలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర పోవడం లేదు. ఇది మానవ శరీరంపై, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చాలా మంది న్యూరాలజిస్టులు, నిపుణులు నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో డా. సుధీర్ కుమార్ కూడా మరో కీలక విషయాన్ని వెల్లడించారు.If you lose just one hour of sleep, it could take 4 days to recover from that. Sleep deprivation can cause various symptoms, such as headache, poor focus and attention, increased irritability, poor judgement, poor decision making and increased sleepiness. #sleep #HealthyHabits— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) May 21, 2024కేవలం ఒక గంట నిద్రకోల్పోతే కోలుకోవడానికి నాలుగు రోజులు పడుతుందని సుధీర్ కుమార్ పేర్కొన్నారు. నిద్రలేమితో తలనొప్పి, కంటి చూపులో లోపం, చికాకు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలో సమస్యలొస్తాయని ఆయన తన ఎక్స్‌లో వెల్లడించారు. అధిక ఒత్తిడి ,పేలవమైన జీవనశైలి అలవాట్ల కారణంగా నిద్రలో సమస్యలొస్తాయని ఆయన వివరించారు. అంతేకాదు ఏ వయసులో ఎంత సమయం నిద్ర పోవాలి అనేది కూడా ఆయన స్పష్టం చేశారు.వయసుల వారీగా సగటు రోజువారీ నిద్ర, నవజాత శిశువులు (3 నెలల వరకు): 14 నుండి 17 గంటలు నిద్రపోవాలి. శిశువులు (4 నుండి 12 నెలల వయస్సు): 12 నుండి 16 గంటలు నిద్రపోవాలి.చిన్నపిల్లలు (1 నుండి అయిదేళ్ల వయస్సు): 10 నుండి 14 గంటల వరకు, పాఠశాల వయస్సులో ఉన్న పిల్లలు (6 -12 సంవత్సరాలు): 8 నుండి 10 గంటల నిద్ర.అలాగే రాత్రిపూట 7-9 గంటలు ఒకేసారి నిద్రపోవడం సరైనది, ఉత్తమమైంది. ఒక వేళ రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే అతను/ఆమె పగటిపూట నిద్రపోవడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చుఅని సుధీర్ కుమార్ తెలిపారు -
పద్మశ్రీ గ్రహీత, డాక్టర్ అశోక్ పనగారియా మృతి
జైపూర్: ప్రముఖ న్యూరాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత, డాక్టర్ అశోక్ పనగారియా(71) కోవిడ్ అనంతర సమస్యలతో శుక్రవారం మరణించారు. వైరస్ బారిన పడి అనారోగ్యానికి గరైన డాక్టర్ పనగారియా గడిచిన కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. ఇక ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో శుక్రవారం మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పనగారియా మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ప్రధాని స్పందిస్తూ.. వైద్య రంగంలో తన కృషి భవిష్యత్ తరాల వైద్యులకు అదేవిధంగా పరిశోధకులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కుటుంబానికి ప్రధాని తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. Dr. Ashok Panagariya made a mark as an outstanding neurologist. His pioneering work in the medical field will benefit generations of doctors and researchers. Saddened by his demise. Condolences to his family and friends. Om Shanti. — Narendra Modi (@narendramodi) June 11, 2021 రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పనగారియా మృతి వ్యక్తిగతంగా నాకు, ఆయన కుటుంబానికి తీవ్ర నష్టదాయకం అంటూ సంతాపం వ్యక్తం చేశారు.అలానే పనగారియా మృతిపై ఎనర్జీ మినిస్టర్ బిడి కల్లా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఇతర నాయకులు సంతాపం ప్రకటించారు. చదవండి: కరోనాతో సీనియర్ నటుడు కన్నుమూత -
ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్‌గా చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) చైర్మన్‌గా ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి సొంత ఊరు వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు. న్యూరో ఫిజీషియన్‌గా మంచి గుర్తింపు ఉన్న ఆయన ఇటీవల ప్రభుత్వం ఆరోగ్యశాఖలో సంస్కరణల కోసం నియమించిన నిపుణుల కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. -
తీవ్రమైన మతిమరపు పక్షవాతానికి సూచన కావచ్చు!
కొత్త పరిశోధన అత్యధిక విద్యావంతులూ, ఎప్పుడూ ఏ విషయాన్నైనా అనర్గళంగా గుర్తు తెచ్చుకొని చెప్పేవారిలో... అకస్మాత్తుగా వారు తమ పరిజ్ఞానాన్ని మరచిపోతుండటం, అవసరమైనప్పుడు బాగా గుర్తున్నట్లుగా ఫీలయ్యే అంశాలే జ్ఞప్తికి రాకపోతుండటం జరుగుతుంటే వారికి పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా పరిగణించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒక డచ్ అధ్యయనం పేర్కొంటోంది. ఈ అధ్యయనాన్ని 55 ఏళ్లు పైబడ్డ 9,152 మందిపై నిర్వహించారు. దాదాపు 20 ఏళ్లపాటు ఈ అధ్యయనం సాగింది. వీళ్లలో 1,134 మంది పక్షవాతానికి గురయ్యారు. ఇక మతిమరపు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించిన మరో 20 శాతం మందిలో స్ట్రోక్ (పక్షవాతం) వచ్చే లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. యూనివర్సిటీలలో నిత్యం బోధించే సబ్జెక్టులను సైతం మరచిన వారిలో స్ట్రోక్ అవకాశాలు 39 శాతం ఎక్కువగా ఉన్నట్లు కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయన ఫలితాలను ‘స్ట్రోక్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరిచారు. కాబట్టి బాగా గుర్తున్న విషయాలను మరచిపోయేవారు ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించడం మేలు అని నిపుణులు సూచిస్తున్నారు. -
పల్స్ చూసుకోండి... పక్షవాతం నుంచి రక్షణ పొందండి...
క్రమం తప్పకుండా నాడీ స్పందించే తీరును పరీక్షించుకుంటూ ఉంటే అది పక్షవాతం ప్రమాదాన్ని గణనీయంగా నివారిస్తుందంటున్నారు జర్మనీకి చెందిన న్యూరాలజిస్టులు. వాళ్లే కాదు... అమెరికాకు చెందిన యూఎస్ నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కూడా అదే మాట చెబుతున్నారు. పైగా వారు నిర్వహించిన ఒక అధ్యయనంలోనూ ఇదే తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కనుగొన్న విషయాల ప్రకారం... మొదటిసారి పక్షవాతం (స్ట్రోక్)కు గురై కోలుకున్నవారిలో 24 శాతం మంది మహిళల్లో, 42 శాతం మంది పురుషుల్లో ఐదేళ్లలోపు మరోసారి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. ఎడమచేతి మణికట్టు వద్ద ఉండే రేడియల్ ఆర్టరీ అనే రక్తనాళాన్ని పట్టుకుని పల్స్‌ను పరీక్షిస్తున్నప్పుడు అందులో ఏవైనా తేడాలు ఉంటే గుండె కొట్టుకోవడంలో తేడా ఉందని అర్థం. గుండె స్పందనల లయ సరిగ్గా లేని ఈ కండిషన్‌ను ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. ఇది ఒక్కోసారి మరణానికి దారితీయవచ్చు. మొదటిసారి స్ట్రోక్ వచ్చిన 256 మందిపై నిర్వహించిన పల్స్ రీడింగ్ ద్వారా వాళ్లలో ఈ ఏట్రిల్ ఫిబ్రిలేషన్‌ను గుర్తించి, ప్రమాదాలను నివారించడం సాధ్యమైనట్లు పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ అనే జర్నల్‌లోనూ పొందుపరిచారు. -
ఆరోగ్యానికి సురక్షా కార్డు
ఇప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ల కాలం అంతరించిపోయింది. చేయిలాగితే న్యూరాలజిస్టుకూ, ఛాతీ నొప్పెడితే కార్డియాలజిస్టుకూ చూపించుకుంటున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్య చరిత్ర సమస్తమూ ఒక డాక్టర్ దగ్గర ఉండి... ఆ డాక్టర్ 24 గంటలూ మనకు అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుందో ఊహించండి. అలా ఫ్యామిలీ ఫిజీషియన్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు ‘దేశీఎండీ’ అనే అంతర్జాతీయ సంస్థకు చెందిన ఔత్సాహికులైన ముగ్గురు డాక్టర్లు. కార్డియాలజిస్టు అయిన డాక్టర్ అజయ్ త్రిపురనేని సీఈవోగా, ఆంకాలజిస్టు డాక్టర్ రాకేశ్ సూరపనేని సీవోవోగా, జనరల్ ఫిజీషియన్ అయిన సతీశ్ పోట్లూరి సీఎమ్వోగా వ్యవహరిస్తూ నెలకొల్పిన ఈ సంస్థ ఆన్లైన్లో... ఆ మాటకొస్తే ఫోన్‌లైన్‌లోనే ఒక ఫ్యామిలీ ఫిజీషియన్ భూమికను పోషిస్తుంటుంది. డయాబెటిస్, రక్తపోటు, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారూ లేదా ఆరోగ్యవంతులైనా సరే ముందుగా ‘దేశీఎండీ’ సంస్థనుంచి ఒక ‘సురక్షా కార్డు’ తీసుకోవాలి. ఇందుకు రోగి చెల్లించాల్సిన మొత్తం ఏడాదికి రూ. 1250. ఇక ఆ తర్వాత ఈ కార్డు హోల్డరు ఏడాదిపాటు రోజులోని ఏ సమయంలోనైనా, ప్రయాణం చేస్తున్నా తన ఆరోగ్యం గురించి ఏ అనుమానం వచ్చినా సరే... ఫోన్లోనే డాక్టరును సంప్రదించవచ్చు. సమస్య చిన్నదైతే డాక్టర్ ఫోన్లోనే మందులు సూచిస్తారు. పెద్దదైతే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లమని సూచిస్తారు. ఒకవేళ ఏవైనా పరీక్షలు అవసరమైతే వాటిని చేయిస్తారు. ఆ పరీక్షలు రిపోర్టులను ‘దేశీఎండీ’ డేటాబేస్‌లో నిక్షిప్తం చేసి ఉంచుతారు. ఒకవేళ రోగికే ఫలానా డాక్టర్ మీద గురి, నమ్మకం ఉండి అక్కడికే వెళ్తానన్నా సరే... తమ వద్ద ఉన్న డేటాబేస్‌లోని రోగి వివరాలన్నింటినీ రోగి కోరిన డాక్టర్‌కు అందజేస్తారు. ఉదాహరణకు రోగి ప్రయాణంలో ఉండి... వేరే ఊళ్లో ఉన్నాడనుకుందాం. ఆ సమయంలో అతడికి ఏదో సమస్య వచ్చింది. సదరు రోగి వెంటనే ‘దేశీఎండీ’కి ఫోన్ చేసి, తన సమస్య వివరిస్తే... రోగి ఆ సమయానికి ఉన్న ఊళ్లో ఉన్న ఆసుపత్రుల వివరాల ఆధారంగా అతడికి సరైన చికిత్స దొరికే ఆసుపత్రిని సూచిస్తారు. ఇలా రోగి డాక్టర్ కోసం క్యూలో వేచి ఉండాల్సిన ఆవశ్యకత లేదు. చిన్న సమస్యకైతే ఉన్న చోటి నుంచి కదలాల్సిన అవసరం లేదు. ఏడాది పాటు రోగి ఎప్పుడు కోరితే అప్పుడు తన ఆరోగ్య వివరాలను ఫోన్ ఫిజీషియన్‌తో సంప్రదించవచ్చు. ఒక డాక్టర్‌ను సంప్రదించాక రోగి సెకండ్ ఓపీనియన్ కోసం ఎవరినైనా కలవాలనుకుంటే వారిని సూచిస్తారు. ఒకవేళ రోగే ప్రత్యేకంగా ఫలానా డాక్టర్‌ను కలవాలని కోరుకున్నా వారికే తమ వద్ద ఉన్న రోగి ‘ఆరోగ్య చరిత్ర’ను ఫోన్ ఫిజీషియన్ వివరిస్తారు. మరి డాక్టర్ల వైపు నుంచో... దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు ఈ సురక్షాకార్డు తీసుకుంటే... అక్కడి డాక్టర్లు నెలకొకసారి రోగి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తారు. రోగులు తాము క్రమం తప్పకుండా చేయించాల్సిన పరీక్షలనూ, ఫాలో అప్ను మరచిపోతుంటారు కదా... అలాంటి వారిని ఆసుపత్రికి వెళ్లమని హెచ్చరిస్తుంటారు. వెళ్లే ముందు చేయించాల్సిన పరీక్షలను సూచిస్తుంటారు. వెళ్లి వచ్చాక ఆ రిపోర్టులను దాచి ఉంచడం కోసం పంపమని కోరుతుంటాడు. ఇవీ సురక్షాకార్డుతో కలిగే కొన్ని ఉపయోగాలు. మరింతగా తెలుసుకోవాలనుకుంటే సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040-42428282. అలాగే వెబ్సైట్ అడ్రస్ : www.desimd.com -
2030 నాటికి భారత్‌లో ఏడు మిలియన్ల మంది ‘అల్జీమర్ వ్యాధిగ్రస్తులు’
అల్జీమర్స్‌పై చర్చా సదస్సులో న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూరాధ సాక్షి, బెంగళూరు : భారతదేశంలో 2030 నాటికి దాదాపు ఏడు మిలియన్ల మంది అల్జీమర్ వ్యాధిగ్రస్తులు ఉంటారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాలు తెలియజేస్తున్నాయని కొలంబియా ఏషియా హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అనూరాధ తెలిపారు. వరల్డ్ అల్జీమర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారమిక్కడి కొలంబియా ఏషియా ఆస్పత్రిలో ‘అల్జీమర్స్’ వ్యాధిపై చర్చా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న డాక్టర్ అనూరాధ మాట్లాడుతూ....వృద్ధాప్యం కారణంగా మెదడులోని కణాల పనితీరు క్షీణించడాన్నే అల్జీమర్స్‌గా పిలుస్తారని చెప్పారు. ప్రస్తుతం భారత్ వంటి దేశాల్లో సగటు వ్యక్తి ఆయుర్దాయం పెరుగుతుండటం అదే సమయంలో జననాల సంఖ్య తగ్గిపోతుండడం, రానున్న ఇరవై ఏళ్లలో అల్జీమర్స్‌తో బాధపడే వారి సంఖ్య పెరగడానికి ప్రముఖ కారణాలని తెలిపారు. ఇక ప్రస్తుత జీవన విధానం వల్ల కూడా రానున్న కాలంలో అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉందని అన్నారు. వృద్ధాప్యంలో అల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే శారీరకంగానే కాక మానసికంగా కూడా సంతోషంగా, దృఢంగా ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. ఇదే విషయంపై ప్రజల్లో అవగాహనను పెంచడం కోసం కొలంబియా ఏషియా కృషి చేస్తోందని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో కుటుంబసభ్యులతో ఎక్కువసేపు గడపడం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మన చుట్టూ సృష్టించుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని, తద్వారా అల్జీమర్స్‌కు దూరంగా ఉండవ చ్చని సూచించారు.