neutral
-
డిపాజిట్ల సమీకరణ బ్యాంకులకు సవాలే
ముంబై: మార్జిన్లపై ఒత్తిడి పడకుండా డిపాజిట్లను సమీకరించుకోవడం బ్యాంకులకు సవాలేనని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అభిప్రాయపడింది. రుణాలకు నిధుల కేటాయింపుల్లో కొత్త నమూనాకు మారుతుండడం కూడా వాటికి సవాలేనని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైన బ్యాంకింగ్ రంగంపై వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) న్యూట్రల్ రేటింగ్ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. బ్యాలన్స్ షీట్లు బలంగా ఉండడంతోపాటు రుణాలకు వ్యవస్థలో అధిక డిమాండ్, వడ్డీ రేట్లలో స్థిరత్వంతో.. 2023–24లో బ్యాంకుల ఆర్థిక కొలమానాలు మెరుగుపడతాయని అంచనా వేసింది. డిపాజిట్లలో వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9–11 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. పోటీ వాతావరణంలో డిపాజిట్ల రేట్లను సవరించడం కొనసాగుతూనే ఉంటుందని, 2022 మార్చి నుంచి బ్యాంకులు రూ.5 లక్షల కోట్ల నగదు లభ్య తను సాధించాయని తెలిపింది. 2022 డిసెంబర్ నాటికి బ్యాంకింగ్ రంగంలో రుణాల వృద్ధి 18.8 శాతంగా ఉందని, కానీ, డిపాజిట్లలో వృద్ధి 11.8 శాతంగానే ఉండడం.. నిధుల అవసరాలను తెలియజేస్తోందని పేర్కొంది. రుణాల వృద్ధి కంటే, డిపాజిట్ల రాక తక్కువగా ఉండడంతో, ఇది రేట్ల పెరుగుదలకు దారితీస్తుందని అంచనా వేసింది. ఆర్బీఐ రేట్ల సవరణతో.. అటు డిపాజిట్లు, ఇటు రు ణాలపైనా 2 శాతం మేరకు బ్యాంకులు పెంపును అమలు చేసినట్టు తెలిపింది. గతేడాది మే నుంచి ఆర్బీఐ రెపో రేటును 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. బ్యాంకులు తమ రుణ వితరణ డిమాండ్‌ను చేరుకునేందుకు అవి హోల్‌సేల్ డిపాజిట్లు, బల్క్ డిపాజిట్లపై ఆధారపడుతున్నట్టు వెల్లడించింది. సూక్ష్మ రుణ సంస్థలకు రెండు సవాళ్లు... సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ) కరోనా సమయంలో తగిలిన గట్టి ఎదురుదెబ్బ నుంచి బయటకు వచ్చాయని, ఇండియా రేటింగ్స్ మరో నివేదికలో పేర్కొంది. అయి తే రానున్న 12–18 నెలల కాలంలో సూక్ష్మ రుణ పరిశ్రమ ముందు రెండు కీలక రిస్క్‌లు ఉన్నట్టు ఇండియా రేటింగ్స్ నివేదిక తెలిపింది. ఇందులో ఒకటి ద్రవ్యోల్బణంకాగా, రెండవది ఎన్నికలకు సంబంధించి పరిణామాలని తెలిపింది. హెచ్ఎఫ్సీల రుణాల వృద్ధి మోస్తరుగా.. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు గడ్డు కాలం ఎదురైంది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరలు గృహాల అందుబాటుపై ప్రభావం చూపిస్తోంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో హెచ్ఎఫ్సీల రుణాల వృద్ధి కొంత తగ్గి 12.3 శాతానికి పరిమితం అవుతుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ అంశాలకు తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం సైతం రుణ గ్రహీతల నగదు ప్రవాహం (మిగులు)పై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. ఇది హెచ్ఎఫ్సీల రుణ ఆస్తుల నాణ్యతను కూడా దెబ్బతీయవచ్చని అంచనా వేసింది. సమస్యాత్మక రుణ ఖాతాలలో ఇప్పటికే స్వల్ప పెరుగుదల ఉన్నట్టు పేర్కొంది. 2022–23 ఆరంభం నుంచి ఇది స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. ‘‘12 హెచ్ఎఫ్సీల నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు) మొత్తం రుణాల్లో 2021 మార్చి నాటికి 2.9 శాతంగా ఉంటే, 2022 మార్చి నాటికి 2.8 శాతానికి తగ్గాయి. మొత్తం మీద రుణ ఎగవేతలు, పునరుద్ధరించిన రుణాలు కలిపి 2022 మార్చి నాటికి 4 శాతంగా ఉన్నాయి. స్థూల ఎన్పీఏలు 2023 మార్చి నాటికి 2.5 శాతానికి తగ్గుతాయి. మళ్లీ 2024 మార్చి నాటికి 2.67 శాతానికి పెరగొచ్చు. రుణ వ్యయాలు అతి స్వల్పంగా పెరిగినప్పటికీ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగొచ్చు’’అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. అందుబాటు గృహ రుణాల జోరు హెచ్ఎఫ్సీలు 2022–23లో 12.6 శాతం మేర వృద్ధిని చూసే అవకాశం ఉంటే, 2023–24లో 12.3 శాతంగానే ఉంటుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఇక 2021–22లో పరిశ్రమలో నమోదైన రుణాల వృద్ధి 10.4 శాతంగా ఉంది. పరిశ్రమలో అందుబాటు ఇళ్లకు సంబంధించి రుణాలు వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని అంచనా వేసింది. మార్కె ట్లో పోటీ వాతావరణం హెచ్‌ఎఫ్‌సీలపై చూపిస్తోందని పేర్కొంది. దీంతో సంస్థలు నాన్ హౌసింగ్ రుణాలపై దృష్టి సారించడం ద్వారా ఈ పోటీపరమైన సవాళ్లను అధిగమించొచ్చని పేర్కొంది. -
ఆ విధానం యుద్ధాన్ని ఆపడంలో సహాయపడదు!
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానం పై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రిబవర్రి 24 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలతో రష్యా బలగాలు ఉక్రెయిన్ పై దాడులకు దిగింది. గత రెండు నెలలుగా ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తునే ఉంది. దీంతో ప్రపంచ దేశాలన్ని ఉక్రెయిన్‌కి బహిరంగంగా మద్దతు తెలపడమే కాకుండా సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. అయితే భారత్ కూడా ఇరు దేశాలకు యుద్థం వద్దని చర్చలు దిశగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది కానీ తటస్థంగా ఉండిపోయింది. అంతేగాక భారత్ ఆయుధాల కొనుగోలు విషయంలో రష్యా దేశం పై ఆధారపడి ఉండటమే కాకుండా రష్యాతో గల అనుబంధం గురించి చెబుతుండటం గమనార్హం. అయితే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి భారత్ వైఖరిని తప్పుబట్టడమే కాకుండా భారత్ అవలంభిస్తున్న తటస్థ వైఖరి యుద్ధాన్ని ఆపలేదని చెప్పారు. అంతేగాదు ఉక్రెయిన్ పట్ల భారత్ చూపిస్తున్న సానూభూతిని అభినందిస్తున్నాం కానీ ఈ తటస్థ వైఖరి యుద్ధాని ఆపేందుకు ఉపయోగపడదని నొక్కి చెప్పారు. అయినా నేరస్థుడు, బాధితుడు స్పష్టంగా కనిపిస్తున్నప్పడూ బాధితుడి పక్షాన నిలబడటమే నిజమైన కర్తవ్యం అన్నారు. యుద్ధంలో గెలుస్తామని విర్రవీగుతున్న రష్యా భ్రమలను పోగొట్టాలే ఉక్రెయిన్‌కి భారత్ మద్దతు ఇవ్వాలన్నారు. రష్యా కంటే భారత్ భిన్నమైనదన్నారు. అంతేగాదు డిమిట్రో కులేబా ఈ యుద్ధాన్ని ప్రజాస్వామానికి నిరంకుశత్వానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. అందువల్ల అతి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఉక్రెయిన్ పక్షాన నిలబడాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందని వ్యాఖ్యానించారు. పైగా యుద్ధ భూమిలో రష్యా అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్ నిర్వీర్యం చేసేస్తుంది కాబట్టి భారత్‌కి రష్యా ఆయుధాలు కొనగోలు చేయడంలో ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని ప్రశ్నించారు కూడా. ఉక్రెనియన్ భూభాగంలోని యుద్ధ నేరాలకు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు రష్యా పూర్తి బాధ్యత వహించక తప్పదన్నారు. రష్యా యుద్ధంలో ఎంత క్రూరత్వంగా ఉన్న అణ్యాయుధాలను ఉపయోగించదనే భావిస్తున్నానని అన్నారు. పుతిన్‌కి ఏమాత్ర జ్ఞానం ఉంటే అణ్వాయుధాలను ఆశ్రయించడం అంటే మాస్కో ముగింపు అని అర్థం చేసుకుంటాడని డిమిట్రో కులేబా చెప్పారు. (చదవండి: ఉబ్బిన ముఖం, వణికిపోతూ.. క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం?) -
Russia-Ukraine war: డోన్బాస్‌పై రాజీకి రెడీ
లివీవ్: యుద్ధానికి తెర దించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఉక్రెయిన్ కీలక ప్రతిపాదనలు చేసింది. ఆయన డిమాండ్ చేస్తున్నట్టు ఉక్రెయిన్ను తటస్థ దేశంగా ప్రకటించేందుకు సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. అంతేగాక ఎనిమిదేళ్లుగా రష్యా అనుకూల వేర్పాటువాదుల అధీనంలో ఉన్న తూర్పు ప్రాంతం డోన్బాస్ హోదాపై రాజీకి కూడా సిద్ధమన్నారు. ‘‘రష్యా సేనలు మా దేశాన్ని పూర్తిగా వీడటం అసాధ్యమని అర్థమైంది. అందుకే అవి వెనక్కు తగ్గి డోన్బాస్కు పరిమితం కావాలి’’ అని కోరారు. తద్వారా, ఆ ప్రాంతాన్ని రష్యాకు వదులుకుంటామనే సంకేతాలిచ్చారు. తక్షణం యుద్ధం ఆపి శాంతిని నెలకొల్పితే పుతిన్ కోరుతున్నట్టుగా అణ్వస్త్రరహిత దేశ హోదాకు ఒప్పుకోవడంతో పాటు ఇతర భద్రతా హామీలు కూడా ఇస్తామన్నారు. యుద్ధం ముగిశాక ఈ డిమాండ్లపై రిఫరెండం నిర్వహించి జనాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామంటూ ముక్తాయించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మంగళవారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో మరో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో స్వతంత్ర రష్యా మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్, తాను ముఖాముఖీ చర్చిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. నాటోలో చేరొద్దన్న డిమాండ్‌కు అంగీకరిస్తామని జెలెన్స్కీ ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే కీలకాంశాలన్నింటి మీదా ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే పుతిన్–జెలెన్స్కీ భేటీ సాధ్యమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ పునరుద్ఘాటించారు. నిలిచిన రష్యా దళాలు రష్యా దళాలు గత 24 గంటల్లో ఉక్రెయిన్‌లో ఏ ప్రాంతంలోనూ పెద్దగా ముందుకు చొచ్చుకుపోలేదు. ఆహారం, ఇంధనం తదితర నిత్యావసరాల తీవ్ర కొరత, అతిశీతల పరిస్థితులు, ఉక్రెయిన్ తీవ్ర ప్రతిఘటనతో ఎక్కడివక్కడే రక్షణాత్మక పొజిషన్లలో ఉండిపోయినట్టు ఇంగ్లండ్ పేర్కొంది. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా దళాలను చాలావరకు డోన్బాస్ కేసి మళ్లిస్తున్నట్టు ఆ దేశ అత్యున్నత సైనికాధికారి ఒకరు చెప్పారు. రష్యాపై యుద్ధనేరాల ఆరోపణలను విచారించేందుకు సంయుక్త విచారణ బృందం ఏర్పాటుకు పోలండ్, లిథువేనియా, ఉక్రెయిన్లకు సాయపడ్డట్టు యూరోపియన్ యూని యన్ సమన్వయ సమితి యూరోజస్ట్ పేర్కొంది. మరోవైపు పుతిన్ ఇంకెంతమాత్రమూ అధికారంలో ఉండొద్దన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్నట్టు రష్యా పేర్కొంది. రూబుల్ చెల్లింపులు చేయం: జీ7 గ్యాస్ ఎగుమతుల చెల్లింపులను రూబుల్స్‌లోనే చేయాలన్న రష్యా డిమాండ్‌ను తిరస్కరించాలని జీ7 బృందం నిర్ణయించినట్టు జర్మనీ ఇంధన మంత్రి రాబర్ట్ హెబక్ ప్రకటించారు. ‘‘ఇది ఒప్పందాలకు విరుద్ధం. మాకెవరికీ అంగీకారయోగ్యం కాదు’’ అని చెప్పారు. నెదర్లాండ్స్‌కు చెందిన బ్రూవరీ దిగ్గజం హెన్‌కెన్ కూడా రష్యా నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. రష్యాపై ఆంక్షలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చైనా మరోసారి చెప్పింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ వచ్చే వారం భారత్‌లో పర్యటించే అవకాశముంది. భారత్‌కు సరఫరా చేస్తున్న ఇంధనానికి, మిలటరీ హార్డ్‌వేర్‌కు చెల్లింపులు రష్యా కరెన్సీ రూబుల్స్‌లో చేయాలని ఈ సందర్భంగా కోరవచ్చంటున్నారు. ఇంగ్లండ్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ కూడా గురువారం భారత్ రానున్నారు. -
నల్సార్ సాహసోపేతమైన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎల్జీబీటీక్యూ+ (లెస్బియన్, గే, ద్విలింగ, ట్రాన్స్‌జెండర్, క్వీర్ ప్లస్ ) విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఒకడుగు ముందుండే నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్) మరో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. లింగ గుర్తింపు లేనివారి కోసం హాస్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లేడీస్ హాస్టల్–6లో ఏర్పాట్లు.. నల్సార్‌లో బాలికల హాస్టల్–6 భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌ను పూర్తిగా లింగ గుర్తింపు లేని (జెండర్ న్యూట్రల్)వారికోసం కేటాయించారు. అకడమిక్ బ్లాక్‌లో గ్రౌండ్ ఫ్లోర్లో లింగ గుర్తింపు లేనివారి కోసం వాష్‌రూమ్స్‌ను ఏర్పాటు చేశామని నల్సార్ వైస్ చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తఫా ఆదివారం ట్విట్టర్లో తెలిపారు. ఇక ‘జెండర్, సెక్సువల్ మైనారిటీ’అంశాలపై సమగ్ర విద్యా విధానం కోసం యూనివర్సిటీ ట్రాన్స్ పాలసీ కమిటీ ముసాయిదా విధానాన్ని త్వరలో అమలు చేయనుంది. 2015 జూన్‌లో నల్సార్‌లోని ఓ 22 ఏళ్ల బీఏ ఎల్ఎల్బీ విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లో జెండర్ గుర్తింపు వద్దని వర్సిటీ ప్రతినిధులను అభ్యర్థించగా.. ఆ అభ్యర్థనను ఆమోదించి.. సదరు స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లో జెండర్ కాలమ్‌లో మిస్టర్, మిస్కి బదులుగా ‘ఎంఎక్స్’గా పేర్కొంటూ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. నల్సార్ వర్సిటీకి రూ.1.50 కోట్ల విరాళం శామీర్‌పేట్: నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆండ్ బిజినెస్ లా(జేఆర్‌సీఐటీబీఎల్) అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార న్యాయ కేంద్రం ఏర్పాటుకు దాత జస్టిస్ బీపీ. జీవన్‌రెడ్డి రూ. కోటి 50 లక్షల చెక్కును నగరంలోని ఆయన నివాసంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపారకేంద్రం ఏర్పాటుతో చట్టాల్లో సమకాలిన సమస్యలకు సంబంధించిన బోధన, పరిశోధన చేపట్టే లక్ష్యాలు అయిన సెమినార్లు, ఉపన్యాసాలు, స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. నల్సార్ అండర్ గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, డాక్టోరల్ స్థాయిలో కోర్సులను ప్రారంభించడం, బలోపేతం చేయడం, పరిశోధన, ప్రచురించడానికి విధాన రూపకర్తలతో సహకరించడానికి ఐఎంఎఫ్, ఐబీఆర్‌వో, డబ్ల్యూటీవీ. సీఐఐ, ఎఫ్ఐసీసీఐ మొదలైన వివిధ అంతర్జాతీయ, జాతీయ సంస్థలతో ఇంటర్నషిప్‌లను పొందడంలో సహాయం చేయడానికి అధ్యాపక బృందం కృషిచేసిందన్నారు. సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి పివి రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ఎం కాద్రీ, జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి, సుప్రీకోర్డు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి, పాట్నా హై కోర్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్. నర్సింహారెడ్డి, తెంలగాణ హై కోర్డు న్యాయమూర్తులు ఉజ్వల్‌భూయాన్, రాజశేఖర్‌రెడ్డి, పి.నవీన్‌రావు, బార్ కౌన్సిల్ చైర్మెన్ జస్టిస్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా తటస్థంగా ఉండాలి: చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రం విషయంలో తటస్థంగా ఉండాలని అమెరికాకు చైనా సూచించింది. చైనా విదేశాంగ అధికార ప్రతినిథి చున్యింగ్ మాట్లాడుతూ.. సముద్రజలాలకు సంబంధించి పొరుగుదేశాలతో చైనాకు ఉన్నటువంటి విభేదాల విషయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తటస్థంగా ఉండాలని కోరారు. సమస్య పరిష్కారంలో అమెరికా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని చున్యింగ్ అభ్యర్థించారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేజ్ వెల్లడించిన తీర్పును సమర్థిస్తూ.. దానికి కట్టుబడాలని ఒబామా గురువారం స్పష్టం చేసిన నేపథ్యంలో చైనా ఈ ప్రకటన చేయడం విశేషం. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కొనసాగేందుకు అమెరికా నుంచి సానుకూల, నిర్మాణాత్మకమైన ప్రయత్నాలను చైనా ఆశిస్తుందని చున్యింగ్ తెలిపారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో జులైలో ఫిలిప్పీన్స్‌కు అనుకూలంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేజ్ ఇచ్చిన తీర్పును చెల్లనిదిగా, చట్ట వ్యతిరేకమైనదిగా చైనా అభివర్ణించింది. అసలు ఈ వివాదం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేజ్ పరిధిలోనిది కాదని చైనా వాదిస్తోంది. ప్రాదేశిక వివాదాల్లో సంబంధిత దేశాల మధ్య చర్చలకే అమెరికా మద్దతిస్తుందని గతంలో అమెరికా అధికారులు వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా చున్యుంగ్ గుర్తుచేశారు.