new medicine
-
అమెరికా మార్కెట్లో కొత్తగా 30 ఔషధాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) వచ్చే ఆర్థిక సంవత్సరం కీలకమైన అమెరికా మార్కెట్లో దాదా పు 30 కొత్త ఔషధాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్థాయిలో వృద్ధి ఉన్నా వచ్చే అయిదు నుంచి ఏడేళ్లలో రెండంకెల స్థాయిలో సాధించగలమని ఇన్వెస్టర్లతో సమావేశంలో కంపెనీ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. ప్రస్తుతానికి ధరలపరమైన ఒత్తిళ్ల కారణంగా ఆదాయ వృద్ధి కొంత ఒడిదుడుకులకు లోను కావచ్చని పేర్కొన్నారు. అటు చైనా మార్కె ట్లో తాము ఏటా రెండంకెల స్థాయిలో ఫైలింగ్స్ చేస్తున్నామని చెప్పారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో 40,50 ఫైలింగ్స్ ఉండొచ్చని వివరించారు. సాధారణంగా ఉత్పత్తులకు అనుమతి లభించాలంటే .. దరఖాస్తు చేసుకున్న తర్వాత 18–24 నెలలు వరకు సమయం పడుతుందని ఇజ్రేలీ తెలిపారు. గతేడాది నాలుగు ఉత్పత్తులకు అనుమతి లభించిందని, ఈ ఏడాది కూడా దాదాపు అదే స్థాయిలో లేదా అంతకు మించి ఉండొచ్చని ఆశిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే డబుల్ డిజిట్ వృద్ధి సాధిస్తున్నామని.. వచ్చే, ఆపై ఆర్థిక సంవత్సరాల్లో ఇది ఇంకా మెరుగుపడగలదని పేర్కొన్నారు. -
బైద్యనాథ్ నుంచి మధుమేహరి ఔషధం
హైదరాబాద్: మధుమేహం నియంత్రణే లక్ష్యంగా ప్రముఖ ఆయుర్వేదిక్ సంస్థ.. బైద్యనాథ్ అత్యంత శాస్త్రీయ, పరిశోధనలతో ‘మధుమేహరి పేరుతో ఔషధాన్ని రూపొందించింది. మధుమేహారీ యోగ్ ట్యాబ్లెట్‌తో పాటు భోజనానికి ముందు ఈ ఔషధాన్ని ఒక టీ స్పూను నీటిలో కలపి రోజుకు రెండు సార్లు సేవించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. కాలపరీక్షలకు నిలబడిన సుద్ధ శిలాజిత్, త్రివంగ భస్మలతో ఈ గ్రాన్యుల్స్ను అభివృద్ధి చేసినట్లు కూడా ప్రకటనలో సంస్థ తెలిపింది. -
పాముకాటుకు కొత్త మందు
సాక్షి, హైదరాబాద్: పాముకాటుకు దుష్ప్రభావం లేని విరుగుడు మందు తయారు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అలాగే పాముకాటు మందుకు కొరత లేకుండా ఆధునిక పద్ధతిలో ల్యాబొరేటరీల్లో తయారు చేసే విధానం కూడా అందుబాటులోకి రానుంది. ఈ విషయంలో భారతీయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు మంచి ఫలితాలిచ్చాయి. ‘నేచర్ జెనెటిక్స్’అనే వెబ్సైట్ తాజా సంచికలో ఈ వివరాలను ప్రచురించింది. ప్రస్తుతం పాముకాటు బాధితులకు వాడుతున్న యాంటీ వీనం సీరం అనే మందు కొన్నిసార్లు పని చేయకపోవడం, అనేక సందర్భాల్లో దుష్ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయి. యాంటీ వీనం సీరం వేశాక కొంతమందిలో బీపీ పడిపోవడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం తదితర పలు సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పాము విషాన్ని గుర్రాల్లో ప్రవేశపెట్టి ప్రతిదేహకాలను (యాంటీ బాడీస్) ఉత్పత్తి చేస్తారు. వాటిని శుద్ధి చేసి యాంటీ వీనం సీరం తయారు చేస్తారు. అయితే గుర్రంలోని ప్రతిదేహకాలు, మనుషుల్లోని ప్రతిదేహకాలు ఒకటి కాదు కాబట్టి అనేకసార్లు దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. పూర్తిస్థాయిలో విరుగుడుగా పనిచేయట్లేవు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేలా ఆధునిక పద్ధతిలో యాంటీ వీనం తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు నేచర్ జెనటిక్స్ తెలిపింది. దీనివల్ల వంద శాతం సమర్థంగా పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. తాచు పాములోని జన్యువుల డీకోడ్! తాచుపాముల్లోని విషాన్ని ఉత్పత్తికి కారణమయ్యే 139 రకాల జన్యువులను పరిశోధకులు గుర్తించారు. అందులో 19 రకాలను సంక్లిష్టమైన జన్యువులుగా భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆధునిక పద్ధతిలో తాచు పాములోని జన్యువులను డీకోడ్ చేయడం ద్వారా వీటిని గుర్తించారు. మొదటిసారిగా భారతీయ తాచుపాముల విష సంబంధిత ట్యాక్సిన్ జన్యువుల పూర్తి జాబితా ఇప్పుడు మన వద్ద ఉందని నేచర్ జెనెటిక్స్ వెల్లడించింది. అత్యాధునిక జన్యు సాంకేతిక పరిజ్ఞానాల కలయికను ఉపయోగించి, మన నాగుపాములకు సంబంధించిన జన్యువులను కూడా శాస్త్రవేత్తలు సమీకరించారు. పాము కాటు మరణాలల్లో మూడో వంతు ఈ రకపు విషాలే కారణమని నిర్ధారించారు. వీటిని సింథటిక్ పద్ధతిలో లేబరేటరీల్లో యాంటీ వీనం తయారు చేసి ప్రస్తుత పాము కాటు మందును ఆధునీకరించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. గుర్రాల నుంచి తయారు చేయడం క్లిష్టమైన, శ్రమతో కూడిన వ్యవహారం. పైగా సీరం కొరత ఉండటంతో అనేకమంది పాము కాటుకు బలవుతున్నారు. రాష్ట్రంలో 942 పాము కాటు కేసులు.. రాష్ట్రంలో గతేడాది మొదటి 8 నెలల్లో 942 పాము కాటు కేసులు నమోదయ్యాయి. మన దేశంలో 300 రకాల సర్పాలున్నాయి. అందులో 66 రకాల పాములు విషపూరితమైనవి. వాటిల్లో 61 రకాల పాముల్లో మనిషిని చంపేంత విషం ఉండదు. ఇక మిగిలినవే మనుషులకు ప్రాణాహాని. తెలంగాణలో 31 రకాల పాములున్నాయి. వాటిల్లో 6 పాములు మాత్రమే విషపూరితమైనవి. తాచు పాము, రక్తపింజర, కట్ల పాము, చిన్న పింజర ఈ నాలుగు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక లంబిడి గాజుల పాము (ఇదో రకం అరుదైన కట్ల పాము, ఇది ఏటూరునాగారం ఏరియాలోనే ఉంటుంది).. ఇంకోటి బ్యాంబూ బిట్ వైఫర్. ఇది అరుదైన రక్త పింజర. వీటిల్లో తాచు పాములే 48 శాతం ఉంటాయి. 33 శాతం జెర్రి గొడ్డు రకం పాములుంటాయి. తాచుపాము, కట్లపాము కరిస్తే నరాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. రక్తపింజర కరిస్తే రక్తపు వాంతులతో మరణిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు, ఇతర పనులు చేసే వారిలో అనేక మంది పాము కా>ట్లకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో యాంటీ వీనం సీరం ఇంజక్షన్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను, నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువగా రాత్రి వేళల్లోనే పాము కాటుకు గురవుతారు. కానీ ఆ సమయంలో ప్రభుత్వాసుపత్రులు తెరిచి ఉండట్లేదు. దీంతో ఇబ్బందులు తప్పట్లేదు. ఏటా వెయ్యి మంది..: డాక్టర్ మాదల కిరణ్, అనెస్థీషియా అండ్ క్రిటికల్‌కేర్ శాఖాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ దేశంలో అనధికారికంగా 46 వేల మంది చనిపోతున్నారు. రాష్ట్రంలో ఆ సంఖ్య వెయ్యి వరకు ఉంటుంది. దేశంలో శాస్త్రవేత్తలు తాచు పాములో అత్యంత కీలకమైన జన్యువులను గుర్తించారు. దీంతో ఆధునిక పద్ధతిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేని యాంటీ వీనం కనుగొనే వీలు కలిగింది. – డాక్టర్ మాదల కిరణ్, అనెస్థీషియా అండ్ క్రిటికల్‌కేర్ శాఖాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
పిప్పి పళ్లకు గుడ్‌బై?
పిప్పి పళ్ల సమస్య ఇకపై ఉండకపోవచ్చు. ఎందుకంటే.. యూనివర్సిటీ ఆఫ్ ప్లైమౌత్ శాస్త్రవేత్తలు పిప్పి పళ్లను నయం చేయగల మూలకణాలను ఎలుకల్లో గుర్తించారు.. కాబట్టి.. సరైన పంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే కొంతకాలానికి చెడు బ్యాక్టీరియా చేరిపోయి పిప్పి పళ్లు వస్తాయని తెలిసిన విషయమే.. దురదృష్టవశాత్తూ ఈ పిప్పి పళ్లు ఏర్పడే ప్రాంతంలో డెంటిన్‌ను శరీరం తయారు చేసుకోలేదు. కానీ.. ఎలుకలు దీనికి భిన్నం. ముందు పళ్లు ఎన్నిసార్లు ఊడినా మళ్లీ పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్లైమౌత్ యూని వర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు జరిపి.. ఎలుకలకు ఉన్న ఈ లక్షణానికి వాటి కం డరాల్లో, ఎముకల్లో ఉండే ప్రత్యేకమైన మూలకణాలు కారణమని తేల్చారు. ఈ మూలకణాలు డెంటిన్ ఉత్పత్తి చేయడంతో పాటు డీఎల్‌కే–1 అనే జన్యువు ద్వారా ఎన్ని కొత్త కణాలు పుట్టా లో కూడా నియంత్రిస్తున్నట్లు పరిశోధనల ద్వా రా తెలిసింది. డీఎల్‌కే1 జన్యువు కూడా పంటి కణజాలం పెరుగుదలలో, గాయాలను మాన్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ మూల కణాలు మానవుల పంటిలో ఉన్నాయా అనే విషయం ఇంకా తెలుసుకోవాల్సి ఉందని డీఎల్‌కే–1 వంటి జన్యువే మన పంటి పెరుగుదలను నియంత్రిస్తోందా అనేది కూడా చూడాలని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బింగ్ హూ తెలిపారు. -
తేయాకు కణాలతో ఊపిరితిత్తుల కేన్సర్‌కు కొత్త ఔషధం
గ్రీన్ టీలో బోలెడన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని, తరచూ ఈ పానీయాన్ని సేవించడం ద్వారా కేన్సర్‌ను నివారించవచ్చునని మనం తరచూ వింటుంటాం. ఇందులో వాస్తవం లేకపోలేదు. భారతియార్, స్వాన్సీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి తేయాకులోకి కొన్ని ప్రత్యేక కణాల ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌కు సమర్థమైన చికిత్స ఇవ్వవచ్చని నిరూపించారు. ఈ క్వాంటమ్ డాట్ కణాలు అతి సూక్ష్మమైనవి. ధర్మాలూ అనూహ్యం. కొన్ని రసాయనాలతో కలిసి వేర్వేరు రంగుల్లో ప్రతిదీప్తిని కనబరుస్తాయి. అందువల్లనే వీటిని ఇప్పటికే సోలార్ సెల్స్ మొదలుకొని వైద్య పరీక్షల్లోనూ వాడుతున్నారు. కేన్సర్ చికిత్సలోనూ, యాంటీబయాటిక్ నిరోధకతను ఎదుర్కొనేందుకూ ఈ క్వాంటమ్ డాట్స్ ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతియార్, స్వాన్సీ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు తేయాకు నుంచి క్వాంటమ్ డాట్ కణాలను వెలికి తీశారు. వీటి సమక్షంలో ఊపిరితిత్తుల కేన్సర్ కణాలు వెలిగిపోవడమే కాకుండా.. వాటిని నాశనం కూడా చేసేశాయి. కేన్సర్ కణాల్లోకి చొచ్చుకుపోయిన క్వాంటమ్ డాట్స్ 80 శాతం కణాలను నిర్వీర్యం చేసినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సుధాకర్ పిచ్చయి ముత్తు తెలిపారు. క్వాంటమ్ డాట్స్‌ను కేన్సర్ చికిత్సకు మాత్రమే కాకుండా యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్న రంగుల తయారీలోనూ వాడవచ్చునని, తేయాకు నుంచి వీటిని మరింత చౌకగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. -
ఆ మహిళలకు రెడ్‌వైన్ భలే మందట
పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) తో బాధపడే మహిళలకు రెడ్ వైన్ దివ్య ఔషధంలా పనిచేస్తుందని తాజా అధ్యయనం తేల్చింది.రెడ్ వైన్, ద్రాక్ష లలో ఉండే ఒక సహజ సమ్మేళనం హార్మోన్ అసమతుల్యత తో ఇబ్బందులుపడే స్త్రీలకు సహాయపడుతుందని తేల్చారు..సాధారణంగా గింజల్లో (నట్స్) కనిపించే, వ్యాధులనుంచి గుండెను కాపాడే యాంటీ ఆక్సిడెంట్... రెస్వెట్రాల్ సప్లిమెంట్ ను రెడ్ వైన్ లో కనుగొన్నట్టు తెలిపారు. ఈ అధ్యయనాన్ని ఎండోక్రైన్ సొసైటీ జర్నల్ 'క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం' లో ప్రచురించింది. వైద్యశాస్త్రం ప్రకారం పురుషుల్లో ఎక్కువగా, మహిళల్లో తక్కువగాను ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిఎక్కువ మోతాదులో మహిళల్లో ఉత్పత్తికావడం మూలంగా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వంధ్యత్వం, బరువు పెరగడం. మొటిమలు, అన్ వాంటెడ్ హెయిర్ గ్రోత్, లాంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు ఈ పునరుత్పత్తి హార్మోను టెస్టోస్టెరాన్ మహిళల్లో మధుమేహ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాలిఫోర్నియా, శాన్ డియాగో, విశ్వవిద్యాలయ పరిశోధకులు రెడ్ వైన్ లోని (వేరుశెనగ, బ్లాక్ బెర్రీస్ , చాక్లెట్లలో లభించే) రెస్వెట్రాల్ అనే పాలీఫినాల్ తో 30 మంది మహిళలపై మూడు నెలలపాటు పరిశోధించారు. ఈ క్రమంలో వారిలోని హార్మోన్ స్థాయిలు సరి చేయగలిగినట్టు చెప్పారు. దాదాపు 23.1 శాతం టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గినట్టు గుర్తించారు. రెస్వెట్రాల్.. ఇన్సులిన్ నియంత్రణకు , మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందనీ, శరీరం యొక్క సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుందని తమ పరిశోధనలో తేలిందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఎండీ, సీనియర్ రచయిత, అంటోని జె డ్యూలెబా ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పీసీఎస్ తో భాధపడుతున్న స్త్రీలలో మెటబాలిజ సమస్యలను తగ్గించేందుకు సహాయం చేస్తుందన్నారు. -
బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో కొత్త మందు
న్యూయార్క్: మెదడులో కణితిలు వ్యాపించకుండా సమర్థవంతంగా నిరోధించే కొత్త ఔషధం పీపీఎఫ్‌ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మెదడు కణాలలోని టీఆర్ఓవై అనే ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మందు పనిచేస్తుంది. ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో పీపీఎఫ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని ట్రాన్సిషనల్ జినోమిక్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. మెదడులోని క్యాన్సర్‌కు గురైన గ్లియోబ్లాస్టోమా కణాలలోని ప్రొటీన్లను నశింపచేయడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో వాడే కీమోథెరపీతో పాటు రేడియోథెరపి విధానాలకు ఈ ఔషధం సహాయకారిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. పరిశోధనకు సంబంధించిన వివరాలను సీనియర్ రచయిత నెహన్ ట్రాన్ వెల్లడిస్తూ.. క్యాన్సర్ కణాలను నిస్సహాయంగా మార్చడంలో పీపీఎఫ్ ఔషధం విజయవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. మెదడులోని క్యాన్సర్ బారిన పడిన కణాలు వ్యాపించకుండా పీపీఎఫ్ పనిచేయడం వలన చికిత్సలో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.