పిప్పి పళ్ల సమస్య ఇకపై ఉండకపోవచ్చు. ఎందుకంటే.. యూనివర్సిటీ ఆఫ్ ప్లైమౌత్ శాస్త్రవేత్తలు పిప్పి పళ్లను నయం చేయగల మూలకణాలను ఎలుకల్లో గుర్తించారు.. కాబట్టి.. సరైన పంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోతే కొంతకాలానికి చెడు బ్యాక్టీరియా చేరిపోయి పిప్పి పళ్లు వస్తాయని తెలిసిన విషయమే.. దురదృష్టవశాత్తూ ఈ పిప్పి పళ్లు ఏర్పడే ప్రాంతంలో డెంటిన్‌ను శరీరం తయారు చేసుకోలేదు. కానీ.. ఎలుకలు దీనికి భిన్నం. ముందు పళ్లు ఎన్నిసార్లు ఊడినా మళ్లీ పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్లైమౌత్ యూని వర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు జరిపి.. ఎలుకలకు ఉన్న ఈ లక్షణానికి వాటి కం డరాల్లో, ఎముకల్లో ఉండే ప్రత్యేకమైన మూలకణాలు కారణమని తేల్చారు. ఈ మూలకణాలు డెంటిన్ ఉత్పత్తి చేయడంతో పాటు డీఎల్‌కే–1 అనే జన్యువు ద్వారా ఎన్ని కొత్త కణాలు పుట్టా లో కూడా నియంత్రిస్తున్నట్లు పరిశోధనల ద్వా రా తెలిసింది. డీఎల్‌కే1 జన్యువు కూడా పంటి కణజాలం పెరుగుదలలో, గాయాలను మాన్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ మూల కణాలు మానవుల పంటిలో ఉన్నాయా అనే విషయం ఇంకా తెలుసుకోవాల్సి ఉందని డీఎల్‌కే–1 వంటి జన్యువే మన పంటి పెరుగుదలను నియంత్రిస్తోందా అనేది కూడా చూడాలని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బింగ్ హూ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment