New mines
-
సింగరేణికి నిరాశ
శ్రీరాంపూర్(మంచిర్యాల) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బొగ్గు గని కార్మికులకు ఎలాంటి ఊరటనివ్వలేదు. ఈసారి బడ్జెట్లో ఏమైనా సానుకూల నిర్ణయాలు వస్తాయకున్న కార్మిక వర్గానికి నిరాశే మిగిలింది. కార్మికులే కాకుండా బొగ్గు పరిశ్రమ భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు ఏవీ కూడా ఈ బడ్జెట్లో లేకపోవడంపై కార్మికుల సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల్లో సుమారు మూడున్నర లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అంతర్జాతీయ కోల్మార్కెట్లో దేశీయ బొగ్గు సంస్థలు గట్టి పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఏమైనా గట్టెక్కించే నిర్ణయాలు తీసుకొంటారని ఆశిస్తే నిరాశ పరిచింది. పబ్లిక్ సెక్టార్ కంపెనీలను ఆదుకొనే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రతి సంవత్సరం వేలాది కోట్ల పన్ను బొగ్గు పరిశ్రమలను నుంచి వివిధ సెస్‌ల రూపంలో కేంద్ర ఖజానాకు వెళ్తుంది. కాని అటు నుంచి రూపాయి కేటాయింపు కూడా లేదు. కొత్త గనులకు, బృహత్తర ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం లేదు. కొత్త గనుల కోసం కొన్ని నిధులు ఇస్తే తద్వారా సంస్థలు కొత్త గనులు ఏర్పాటు చేసి మరికొంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వీలుంది. సీఎంపీఎఫ్ ట్రస్టీలో నిధులు నిండుకొని లోటు ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో పెన్షన్ చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం కోసం కొంత నిధిని సమకూర్చాలని చాలా ఏళ్లుగా డిమాండ్ ఉండగా.. బడ్జెట్లో దీన్ని విస్మరించారు. ఆదాయ పన్ను పరిధి ఏమాత్రం పెంచకుండా çపçన్ను రహిత స్లాబ్‌ను రూ.2.5 లక్షలకే పరిమితం చేశారు. రూ.2.5 లక్షల దాటిని వారందరు పన్ను పరిధిలోకి వస్తారు. దీనికి తోడు పొదుపు పథకాల కింద సీఎంపీఎఫ్, పోస్టల్ వంటి వాటిలో పొదుపు చేసుకుంటే పొదుపు కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఉండదు. ఇది కూడా పాతదే. కొత్తగా ఎలాంటి మార్పులు లేవు. దీంతో కార్మికవర్గం తీవ్ర ఆర్థిక నష్టం చవిచూడాల్సి వస్తుంది. 10వ వేతన ఒప్పందం జరిగిన నేపథ్యంలో కార్మికుల వేతనాలు ఇటీవల పెరిగాయి. ఈ పెరిగిన వేతనాలు ఐటీ రూపంలో ప్రభుత్వానికే పోతుంది. 10 వేతన ఒప్పందం వేతనాలతో మొదటి కేటగిరి కార్మికులు కూడా ఆదాయ పన్ను బారిన పడుతున్నారు. సీనియర్ కార్మికులైతే వారికి వచ్చిన వేతనం ప్రతి సంవత్సరం రూ.లక్ష వరకు ఆదాయ పన్నుకే పోతుంది. స్లాబ్ పరిధి పెరుగకపోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పన్ను మాఫీ అందని ద్రాక్ష.... బొగ్గు గని కార్మికులకు ఆదాయ పన్ను మాఫీ అందని ద్రాక్షగానే మారింది. 15 ఏళ్లుగా కార్మికులు ఈ డిమాండ్ చేస్తున్నారు. మిలటరీ, ఆర్మీ వంటి త్రివిద దళాల్లో పనిచేసే వారికి ఆదాయ పన్ను మాఫీ ఉంది. సరిహదుల్లో ఉండే జవాను యుద్ధం వచ్చినప్పుడు తన ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తుంటే బొగ్గు గనుల్లో కార్మికులు నిత్యం ప్రాణాలకు పణంగా పెట్టి పని చేస్తుంటారు. కాబట్టి వీరికి కూడా ఆదాయ పన్ను మాఫీ ఇవ్వాలని డిమాండ్ ఉంది. ఎన్నికలప్పుడు అన్ని పార్టీల నేతలు ఓట్ల కోసం ఈ డిమాండ్‌ను వాడుకుంటున్నారు. తమ ప్రభుత్వం గెలిస్తే ఐటీ మాఫీ చేయిస్తామని హామీ ఇవ్వడం, గెలిచిన తర్వాత విస్మరించడం జరుగుతోంది. బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన శీతాకాల సమావేశాల్లో ఎంపీలు కూడా కేంద్రంపై ఈ అంశం గురించి ఒత్తిడి తేకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. రూ.2 వేల కోట్లతో ఒరిగేదేమీ లేదు.. బడ్జెట్లో సింగరేణికి రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్రంలోని అధికార పార్టీ నేతలు ప్రకటించారు. ప్రతి బడ్జెట్లో ఈ ప్రకటన ఉంటుంది. దీని ఉద్దేశం సింగరేణి రూ.2 వేల కోట్ల వరకు ప్రణాళిక వ్యయం కింద ఖర్చు చేసుకొనే వెసులుబాటు కల్పిచడం అని. అంతే తప్ప కేంద్రం నుంచి ఎలాంటి నిధులు ఉండవని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. కంపెనీ తన నిధులే తాను ఖర్చు చేసుకోవడానికి ఇచ్చే అనుమతిగా పరిగణించుకోవాలని పేర్కొంటున్నారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు చేసింది శూన్యం పబ్లిక్ సెక్టార్ కంపెనీలను మరోసారి కేంద్రం విస్మరించింది. ఇది కేవలం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే ప్రభుత్వం అని మరోసారి రుజువైంది. ఎలాంటి బడ్జెట్ సపోర్టు బొగ్గు పరిశ్రమకు అందించలేదు. కనీసం ఆదాయ పన్ను స్లాబు పెంచితేనైనా కొంత లాభం ఉంటుందనుకుంటే ఆది కూడా లేకుండా పోయింది. వేతనాలు పెరిగినా లాభం లేకుండా పోయింది. తమను గెలిపిస్తే ఆదాయ పన్ను మాఫీ చేయిస్తామని ఓట్ల సమయంలో కార్మికులకు హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలి.– వీ.సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బడ్జెట్ నిరాశ పరిచింది ఈ బడ్జెట్ తీవ్రంగా నిరాశ పరిచింది. కార్మికులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదు. ఆదాయ పన్ను స్లాబు పెంచకపోవడం వల్ల చాలా వేతనం ఐటీకి కోల్పోవాల్సి వస్తుంది. 10 వేజ్‌బోర్డుతో పెరిగిన కొత్త వేతనం ఆదాయ పన్నుకే పోతుంది. పెంచిన వేతనాన్ని ఒక చేతిలో ఇచ్చి.. మరో చేతితో పన్ను రూపంలో తీసుకుంటుంది.– పెట్టం వినోద్, సింగరేణి ఉద్యోగి దోపిడీ ప్రభుత్వమని రుజువైంది బీజేపీ దోపిడీ ప్రభుత్వమని మరోసారి రుజువైంది. సగటు ఉద్యోగిని పన్ను రూపంలో దోచుకొనే విధంగానే బడ్జెట్ ఉంది. ఐటీస్లాబ్ పెంచకపోవడం వల్ల వచ్చిన వేతనంలో 20 నుంచి 30 శాతం పన్నుకే పోతుంది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాçష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి ఎలాంటి రాయితీలు, బడ్జెట్ సపోర్టు ఇవ్వలేదు.– ఎన్నం గోవర్ధన్, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు -
భూపాలపల్లి -2
- సింగరేణిలో అవతరించనున్న 12వ డివిజన్ - ఆమోదముద్ర వేసిన ఉన్నతాధికారులు - నూతన గనుల ఏర్పాటుపై దృష్టి కోల్‌బెల్ట్ : అపారమైన బొగ్గు నిక్షేపాలున్న భూపాలపల్లి ప్రాంతంలో నూతన గనులను చేపట్టేందుకు సింగరేణి సంస్థ సిద్ధమైంది. ఇందులో భాగంగా భూపాలపల్లి డివిజన్లోని ఘణపురం, వెంకటాపురం, పస్రా మండలాల పరిధిలో నూతన గనులకు శ్రీకారం చుట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులను పొందేందుకు కసరత్తు వేగిరం చేసింది. ఈ క్రమంలో సింగరేణిలో 12వ డివిజన్‌గా భూపాలపల్లి-2 అవతరించనుంది. తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. భవిష్యత్‌లో విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బొగ్గు నిల్వలు కలిగిన ప్రాంతాలను గుర్తించడంతో పాటు వెలికితీసే ప్రక్రియను చేపట్టాలని సూచించారు. దీంతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలోని 32 భూగర్భ గనులు, 15 ఉపరితల గనుల ద్వారా 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ నిర్ణయించింది. ములుగు కోల్‌బెల్ట్ పరిధిలో... ములుగు కోల్‌బెల్ట్ పరిధిలో కరీంనగర్ జిల్లా తాడిచర్ల నుంచి ఖమ్మం జిల్లా గుండాల వరకు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని 100 కిలోమీటర్ల దూరంలోని భూగర్బంలో 1056 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ 765 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికితీసే అవకాశాలున్నట్లు సింగరేణి అన్వేషణ విభాగం గుర్తించింది. సుమారు 10 బ్లాకుల్లో ఇట్టి నిల్వలు ఉన్నాయని ప్రభుత్వానికి జియాలాజికల్ రిపోర్టును సమర్పించింది. ఇందులో తాడిచర్ల 1, 2 బ్లాక్‌లో 337 మిలియన్ టన్నులు, ఖాసింపల్లి 2, కేటికే-1 ఎక్స్టెన్షన్లలో 25, మంజూర్‌నగర్‌లో 50, పెద్దాపూర్‌లో 180, మల్లయ్యపల్లిలో 300, వెంకటాపూర్‌లో 100, లక్ష్మిదేవిపేటలో 60, పాలంపేటలో 35, పస్రాలో 100 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. భూపాలపల్లి పరిధిలో 1988లో గనుల తవ్వకానికి శ్రీకారం చుట్టగా.. 1990లో కేటికే 1, 1ఏలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రస్తుతం కేటికే 1, 2, 5, 6, ఓసీపీ, లాంగ్వాల్ ప్రాజెక్టుల నుంచి ఏటా 2.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఏరియాలో నూతన గనులు.. భూపాలపల్లి డివిజన్ పరిధిలో ఘణపురం మండలం పెద్దాపురం సమీపంలో పెద్దాపూర్ బ్లాక్‌లో, వెంకటాపురం మండలం పరిధిలో వెంకటాపూర్ బ్లాక్‌లో ఒక్కొక్కటి చొప్పున, మల్లయ్యపల్లి, లక్ష్మిదేవిపేట, పస్రా బ్లాక్‌లో నూతన గనులను చేపట్టేందుకు సింగరేణి యూజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. సింగరేణి సంస్థ ఒక్కో ఏరియాలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం నడుస్తున్న గనుల్లో ఏటా 2.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతున్నందున, నూతన గనుల ఏర్పాటుతో మరో డివిజన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసింది. భూపాలపల్లి మండలం మంజూర్‌నగర్ సమీపంలోని సింగరేణి ఆస్పత్రి వెనుక ఉన్న స్థలం నూతనంగా ఏర్పాటు కానున్న డివిజన్ కేంద్ర కార్యాలయానికి అనువైనదిగా గుర్తించారు. ఈమేరకు సింగరేణి సర్వేవిభాగం సర్వే పనులను సైతం నిర్వహించింది. ప్రత్యేక డివిజన్ ఏర్పాటు విషయంలో సింగరేణి ఉన్నత స్థాయి అధికారులు సైతం ఆమోదముద్ర వేశారు. సింగరేణి కంపనీ పరిధిలో ప్రస్తుతం 11 డివిజన్లుండగా, భూపాలపల్లి-2 డివిజన్ ఏర్పాటుతో ఆ సంఖ్య 12కు చేరనుంది. -
సింగరేణిలో మరో నాలుగు గనులు
- రెండు భూగర్భ మైన్స్... మరో రెండు ఓసీపీలు - ఏడాదిలోగా పనులు ప్రారంభం - వార్షిక లక్ష్యం 3.30 మిలియన్ టన్నులు గోదావరిఖని: సింగరేణి సంస్థ ఏడాదిలో నాలుగు కొత్త గనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించింది. రాబోయే ఐదేళ్లలో మొత్తం 17 గనులు ప్రారంభించాలని నిర్ణయించింది. తొలిదశలో ఈ ఏడాది ఖమ్మం జిల్లా మణుగూరు వద్ద కొండాపూర్ భూగర్భ గని, ఆదిలాబాద్ జిల్లా మందమర్రి వద్ద కాసిపేట-2 భూగర్భ గని, బెల్లంపల్లిలో ఓసీపీ-2, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కేకే- ఓసీపీ ప్రారంభించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. కొత్తగనుల ద్వారా ఏటా 3.50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయూలని లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్య సాధనకు కొత్త గనులు.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 56 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి యూజమాన్యం తన ఉత్పత్తి లక్ష్యాన్ని నివేదించింది. తన వార్షిక లక్ష్యాన్ని మాత్రం 60.03 మిలియన్ టన్నులుగా నిర్దేశించుకుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతే.. కేంద్ర ప్రభుత్వం బొగ్గు కేటాయింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుందన్న ఉద్దేశంతో లక్ష్యం ఎక్కుగా నిర్దేశించుకున్నా.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం తక్కువ చేసి చూపించింది. ఒడిశా ‘నైనీ’ బ్లాక్‌పై దృష్టి.. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన బొగ్గు బ్లాకుల్లో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సింగరేణి సంస్థకు ఒడిశాలోని ‘నైనీ’ బ్లాక్ దక్కింది. ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గును ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద 600 మెగావాట్ల మూడో విద్యుత్ యూనిట్‌కు అందించే వీలుంది. దీంతో ఈ బ్లాక్ నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టే ఆలోచనలో ఉంది. అరుుతే, గతంలో నైనీ బ్లాక్‌ను జిందాల్ కంపెనీ చేపట్టింది. ఆ సంస్థ వెచ్చించిన సొమ్మును కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ సూచన మేరకు తాను చెల్లించేందుకు సింగరేణి సిద్ధంగా ఉంది. తాను నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్య సాధన వైపు సాగుతోంది. నిర్దేశిత లక్ష్య సాధనకు కొత్త గనులు ప్రస్తుతం సింగరేణిలో 34 భూగర్భ గనులు, 16 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు బొగ్గు ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని భావించిన యూజమాన్యం.. రాబోయే ఏడాదిలో కొత్త భూగర్భ గనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు నిర్ణయించింది.