మిక్స్ అండ్ మ్యాచ్... చాఫీ
కొత్త పరిశోధన
ఆరోగ్యానికి కాఫీ తాగడం మంచిదా లేక చాయ్ తాగాలా? కాదు కాదు, కాఫీ ఎక్కువ హానికరమా లేక చాయ్ హానికరమా? ఇలాంటి అనేక సందేహాలు తరచూ వినిపిస్తూంటాయి. అయితే తాజా పరిశోధనలు ఇందుకు భిన్నంగా... కాఫీ ఆకుతో చేసిన చాయ్ తాగడం మంచిదంటున్నాయి.
కాఫీ చెట్టు ఆకులతో చేసిన తేనీరు ఎలా ఉంటుంది?... సాధారణ తేయాకుతో చేసిన తేనీటి కంటే వగరు, చేదు తక్కువ. అలాగే కాఫీ గింజల పొడితో చేసిన కాఫీతో పోలిస్తే అంత స్ట్రాంగ్‌గా ఉండదు.
కాఫీ ఆకు లక్షణాలేమిటి?... నొప్పి, వాపులను తగ్గిస్తుంది, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. గుండెసంబంధ వ్యాధులను, డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. మెదడులోని న్యూరాన్లను రక్షిస్తుంది.
ఇథియోపియా, సౌత్ సూడాన్, ఇండోనేసియా దేశాలలో కాఫీ ఆకుల తేనీటినే తాగుతారు. ఇంతకీ దీనికి ఏ పేరు పెడితే బావుంటుంది? కాఫీ, చాయ్ రెండింటినీ కలిపి ‘చాఫీ’ అందామా?!