new tax slab
-
Budget 2025: కొత్త ట్యాక్స్ శ్లాబ్ రాబోతోందా?
పన్ను చెల్లింపుదారులకు ఉపశమనంగా రాబోయే యూనియన్ బడ్జెట్ 2025-26 (Union Budget 2025-26) కొత్త పన్ను విధానంలో గణనీయమైన మార్పులు చూడవచ్చు. రూ.10 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితం చేయడంతోపాటు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య వార్షిక ఆదాయానికి కొత్తగా 25% పన్ను శ్లాబ్‌ను (new tax slab)ప్రవేశపెట్టడం వంటివి ఇందులో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025-26ని ప్రకటించబోతున్నారు. రెండు పన్ను విధానాలలో రాయితీలు, పన్ను తగ్గింపుల కోసం వేతనజీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ. 7.75 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదు. ఇందులో రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా వర్తిస్తుంది. ఇక సంవత్సరానికి రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు అత్యధికంగా 30% పన్ను శ్లాబ్ కిందకు వస్తారు. వీటిలో మార్పులపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా నివేదిక పేర్కొంది."రెండు అవకాశాలనూ పరిశీలిస్తున్నాం. బడ్జెట్ అనుమతించినట్లయితే, రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయాన్ని పన్ను రహితం చేయడంతోపాటు రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షల మధ్య ఆదాయానికి 25 శాతం స్లాబ్‌ను ప్రవేశపెట్టవచ్చు" అని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లుగా నివేదిక ఉటంకించింది. ఈ ఆదాయపు పన్ను మినహాయింపు ప్రభావంతో రూ.50,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల ఆదాయ నష్టాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినట్లు వివరించింది.కీలక ప్రతిపాదనలుకేంద్ర బడ్జెట్ 2025-26 నేపథ్యంలో గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) కీలకమైన పన్ను సంస్కరణలను సిఫార్సు చేసింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.5.7 లక్షలకు పెంచాలని సూచించింది. 2025 నాటికి పొదుపు సొమ్ముపై వచ్చే వడ్డీకి ఇస్తున్న రూ. 10,000 మినహాయింపును రూ. 19,450కి పెంచడం, బీమా ప్రీమియంలు, పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌కు సంబంధించి రూ. 1.5 లక్షల మినహాయింపును రూ. 2.6 లక్షలకు సర్దుబాటు చేయడం వంటి చర్యలను జీటీఆర్ఐ ప్రతిపాదించింది.ఇదీ చదవండి: డబుల్ గుడ్‌న్యూస్! కొత్త బడ్జెట్లో రెండు పెద్ద ప్రకటనలు?గత ఏడాది మాదిరిగా కాకుండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను పెంచడంలో ఆశ్చర్యం కలిగించకపోవచ్చని చాలా మంది మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వృద్ధి దెబ్బ తిన్న సమయంలో వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం కొన్ని పన్ను చర్యలను ప్రకటించినప్పటికీ, వృద్ధి లేదా ఆదాయాలను పునరుద్ధరించడానికి ఉత్ప్రేరకంగా పనిచేసే విషయంలో బడ్జెట్ పరిమిత ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుందని వారు నమ్ముతున్నారు. -
పన్ను ఆదా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా?
ఉద్యోగులు తమ పెట్టుబడుల వివరాలను యాజమాన్యాలకు సమర్పించాల్సిన సమయం ఆసన్నమైంది. అన్ని ప్రైవేటు సంస్థలూ జనవరి, ఫిబ్రవరిలో ఉద్యోగుల నుంచి పన్ను ఆదా పెట్టుబడుల వివరాలను సమీకరిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ సాధనాల్లో ఎంత పెట్టుబడులు పెట్టారు, వాటికి సంబంధించి వివరాలతో 12బీబీ ఫారమ్ సమర్పించాల్సి ఉంటుంది. ఆధారాలను కూడా జత చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఉద్యోగి వార్షిక వేతన ప్రయోజనాలపై ఎంత పన్ను పడుతుందో అంచనాకు వచ్చి, ఆ మేరకు చివరి మూడు నెలల్లో వేతనాల నుంచి మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తాయి. వీటి విషయంలో ఉద్యోగులు అవగాహనతో వ్యవహరించడం వల్ల అనవసర పెట్టుబడులను నివారించొచ్చు. పన్ను ఆదా కోసం ఏదో ఒక సాధనంలో ఇన్వెస్ట్ చేయకుండా, తమ లక్ష్యాలకు అనుకూలమైన సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. దీనిపై అవగాహన కల్పించే కథనమిది... కొత్త పన్ను విధానం ఉద్యోగులు నూతన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకుంటే, పెట్టుబడుల ఆధారాలు సమర్పించనక్కర్లేదు. నూతన పన్ను విధానంలో పెద్దగా మినహాయింపుల్లేవు. సెక్షన్ 87ఏ కింద రూ.7 లక్షల వరకు ఆదాయంపై రాయితీ లభిస్తుంది. రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం నేరుగా లభిస్తుంది. వీటితో కలిపితే రూ.7,75,000 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆదాయం ఇంతకు మించితే నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. సెక్షన్ 80సీసీడీ(2) కింద తమ మూలవేతనం, డీఏలో 14 శాతాన్ని పనిచేసే సంస్థ ద్వారా ఎన్పీఎస్ ఖాతాలో జమ చేయించుకుంటే, అంత మేరకు పన్ను లేకుండా చూసుకోవచ్చు. కన్వేయన్స్, ట్రావెల్ అలవెన్స్ ప్రయోజనాలపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. ఉదాహరణకు ఆఫీస్ పనిపై వేరే ప్రాంతానికి వెళ్లి చేసే ఖర్చును తిరిగి పొందడం ద్వారా ఆ మొత్తంపైనా పన్ను చెల్లించక్కర్లేదు. ఆఫీస్‌కు వచ్చి పోయేందుకు చేసే చెల్లింపులపై ప్రతి నెలా రూ.1,600 మొత్తంపైనా పన్ను లేదు.పాత పన్ను విధానం పాత విధానంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రాయితీ ఉంది. రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, 80డీ కింద రూ.25,000–75,000, 80సీసీడీ(1బి) కింద రూ.50,000, హౌస్ రెంట్ అలవెన్స్‌పై మినహాయింపు పొందొచ్చు. కొత్త విధానంలో మాదిరే కన్వేయన్స్, ట్రావెల్స్ ఎక్స్పెన్స్పై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గృహ రుణం ఈఎంఐలు చెల్లిస్తున్నట్టు అయితే. ఈఎంఐలో అసలు భాగాన్ని సెక్షన్ 80సీ కింద, వడ్డీ భాగాన్ని సెక్షన్ 24 కింద చూపించుకోవచ్చు. ఇంటిని సొంతానికి వినియోగిస్తుంటే గృహ రుణంపై ఎంత వడ్డీ చెల్లించినా.. గరిష్టంగా రూ.2 లక్షలపైనే పన్ను చెల్లించక్కర్లేదు. అదే ఇంటిని అద్దెకు ఇస్తే.. ఒక ఆర్థిక సంవత్సరంలో గృహ రుణం కోసం చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపై (పరిమితి లేకుండా) పన్ను లేకుండా చూసుకోవచ్చు. కేవలం 80సీ పరిధిలోని పన్ను ప్రయోజనాలకే పరిమితమైతే రూ.7 లక్షల ఆదాయంపై పన్ను పడదు. హెచ్ఆర్ఏ, హెల్త్ ఇన్సూరెన్స్, ఎన్పీఎస్, గృహ రుణంపై ప్రయోజనాలను వినియోగించుకుంటే రూ.10.25 లక్షల ఆదాయం వరకు పన్ను బాధ్యత లేకుండా చూసుకోవచ్చు.ఎంపికలో జాగ్రత్త? వేతన జీవులు (వేతనం రూపంలోనే ఆదాయం ఉన్న వారు) ఏటా పాత, కొత్త విధానంలో ఎందులో అయినా రిటర్నులు సమర్పించొచ్చు. ఒకవేళ పనిచేసే సంస్థకు తన పన్ను విధానం గురించి వెల్లడించని సందర్భంలో.. కొత్త పన్ను విధానంలోనే యాజమాన్యం టీడీఎస్‌ను మినహాయిస్తుంది. పెట్టుబడుల డిక్లరేషన్ సమయంలో యాజమాన్యాలు పన్ను విధానం మార్చుకునేందుకు అనుమతించకపోవచ్చు. అయినప్పటికీ రిటర్నులు సమ ర్పించే తరుణంలో తమకు అనుకూలమైన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. యాజమాన్యం ఉద్యో గి నుంచి పన్ను కోత విధించినప్పటికీ, రిటర్నులు సమర్పించిన అనంతరం రిఫండ్ కోరొచ్చు. ముందస్తు ప్రణాళిక ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను ఆదాకు సంబంధించి పెట్టుబడుల ప్రణాళిక వేసుకోవడం మెరుగైన మార్గం అవుతుంది. అయినా, ఇప్పటికీ చాలా మంది ఆర్థిక సంవత్సరం చివర్లోనే వీటి గురించి పట్టించుకుంటూ ఉంటారు. ‘‘పన్ను మినహాయింపులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలంటే ముందుగానే ఈ దిశగా ప్రణాళిక వేసుకోవాలి. కొత్త పన్ను విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ, పాత పన్ను విధానం పొదుపును, లక్ష్యం ఆధారిత పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది’’ అని ట్యాక్స్‌స్పానర్ డాట్ కామ్ కో ఫౌండర్ సుదీర్ కౌశిక్ తెలిపారు. సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం కోసం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం మెరుగైన నిర్ణయం కాబోదు. వీటికి బదులు సెక్షన్ 80సీ పరిధిలో ఇతర సాధనాలను పరిశీలించాలి.సెక్షన్ 80సీ అర్హత సాధనాలు → ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌పై దీర్ఘకాలంలో (పదేళ్లకు మించి) 12–15% మధ్య రాబడులు ఉంటా యని అంచనా. గత చరిత్రను గమనిస్తే ఇవి దీర్ఘకాలంలో 25% వరకు వార్షిక రాబడిని ఇచ్చాయి. → సుకన్య పథకం మెచ్యూరిటీ బాలిక వయసు 21 ఏళ్లు నిండిన వెంటనే ముగుస్తుంది. లేదా బాలిక వయసు 18 ఏళ్లు నిండి, 21 ఏళ్లలోపే వివాహం నిశ్చయమైన సందర్భంలోనూ క్లోజ్ చేసుకోవచ్చు. → ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ పెట్టుబడులపై మూడేళ్లలో వార్షిక సగటు రాబడి వివిధ ఫండ్ మేనేజర్ల మధ్య వేర్వేరుగా ఉంది. 15.80 శాతం నుంచి 17.55 శాతం మధ్య ఉంది. → ఐదేళ్లలో 19 శాతం నుంచి 21.17 శాతం మధ్య ఉంది. ఏడేళ్లలో 14.69 శాతం నుంచి 16.01 శాతం మధ్య ఉంది. ఈక్విటీ, డెట్‌తో కూడిన ఎంపికపై రాబడులు దీర్ఘకాలంలో 9–12 శాతం మధ్య ఉంటాయని అంచనా. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ప్రైవేటు రంగ ఉద్యోగులు తమ మూల వేతనం, డీఏలో 10 శాతాన్ని ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీరు 80సీసీడీ(1) కింద పాత విధానంలో పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. 80సీ రూ.1.5 లక్షల పరిధిలోనే 80సీడీసీ(1) భాగంగా ఉంటుంది. దీనికి అదనంగా 80సీసీడీ(1బి) కింద మరో రూ.50,000 ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపైనా పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ(2) కింద కార్పొరేట్ ఎన్పీఎస్ ప్రయోజనం కూడా ఉంది. పనిచేసే సంస్థ అనుమతిస్తే పాత, కొత్త విధానాల్లో ఈ ప్రయోజనాన్ని వినియోగించుకోవచ్చని కౌశిక్ తెలిపారు. పాత పన్ను విధానంలో మూలవేతనం, డీఏలో 10 శాతం, కొత్త విధానంలో 14 శాతం చొప్పున యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చని చెప్పారు. వైద్య వ్యయాలపై మినహాయింపులు ఆరోగ్యం కోసం చేసే వ్యయాలకు సెక్షన్ 80డీ కింద పన్ను ప్రయోజనాలున్నాయి. పన్ను చెల్లింపుదారు, తన జీవిత భాగస్వామి, పిల్లల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ప్రీమియం చెల్లిస్తుంటే.. గరిష్టంగా రూ.25,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ అదే వ్యక్తి తన జీవిత భాగస్వామి, పిల్లలతోపాటు 60 ఏళ్ల వయసు లోపు తన తల్లిదండ్రుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంటే అప్పుడు రూ.50,000 మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక పన్ను చెల్లింపుదారు తన కుటుంబంతోపాటు 60 ఏళ్లు నిండిన తల్లిదండ్రుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంటే అప్పుడు గరిష్టంగా రూ.75 వేల వరకు (తన కుటుంబానికి రూ.25 వేలు, తల్లిదండ్రులకు రూ.50 వేలు) పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ పన్ను చెల్లింపుదారు, జీవిత భాగస్వామి, పిల్లలతో కూడిన కుటుంబంలో ఒకరి వయసు 60 ఏళ్లు నిండి, వీరితోపాటు 60 ఏళ్లు నిండిన తల్లిదండ్రులకు సైతం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుంటే అప్పుడు చెరో రూ.50 వేలు చొప్పున మొత్తం రూ.1,00,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం ఈ సెక్షన్ కింద ఉంది. వేతన జీవుల వయసు 60 ఏళ్లలోపే ఉంటుంది కనుక, వీరు తమ కుటుంబం, తమ తల్లిదండ్రుల పేరిట మొత్తంగా రూ.75,000పై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. హెల్త్ చెకప్‌ల కోసం చేసే వ్యయం రూ.5,000 వరకు ఈ సెక్షన్ కింద గరిష్ట పరిమితి లోపు చూపించుకోవచ్చు. పిల్లల ట్యూషన్ ఫీజులు పిల్లల ట్యూషన్ ఫీజుల భారాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకోవడం ద్వారా పన్ను భారాన్ని దింపుకోవచ్చు. ముఖ్యంగా దంపతులు ఇద్దరూ ఉద్యోగులు అయితే, ఇరువురూ ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇద్దరు పిల్లల కోసం ట్యూషన్ ఫీజు రూ.2.5 లక్షలు ఖర్చు చేశారనుకుందాం. అప్పుడు ఒకరు రూ.1.5 లక్షల, మరొకరు రూ.1 లక్ష వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీ రూ.1.5 లక్షల్లో ఇతర పెట్టుబడులు పోగా, మిగిలిన మొత్తానికి దంపతులు ఇద్దరూ ట్యూషన్ ఫీజులో తమకు కావాల్సినంత చూపించుకుని, అంత వరకే క్లెయిమ్ చేసుకోవచ్చు. స్కూల్ డొనేషన్, బస్సు చార్జీలు, స్పోర్ట్స్ తదితర వాటి కోసం చేసే చెల్లింపులపై పన్ను మినహాయింపుల్లేవు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
ఏప్రిల్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..!
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి ఇన్ కమ్ ట్యాక్స్‌లో అనేక మార్పులు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ఇన్ కమ్ ట్యాక్స్ శ్లాబ్స్‌లో పన్ను రాయితీ పరిమితి పెంపు, లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్‌లో (ఎల్టీసీజీ) డెట్ మ్యూచివల్ ఫండ్స్‌పై పన్న విధింపు వంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు కొన్ని సామాన్యులకు ఊరట కలిగించేవి కాగా.. మరికొన్ని భారంగా మారనున్నాయి. ఇవే కాకుండా ఏప్రిల్ 1 నుంచి ఇంకా ఏయే మార్పులు చోటు చేసుకోనున్నాయో తెలుసుకుందాం. పన్ను రాయితీ పరిమితి పెంపు పన్ను రాయితీ పరిమితి రూ. 5 లక్షల నుండి రూ. 7 లక్షలకు పెరిగింది. అంటే రూ. 7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ డిడక్షన్‌లో లేని మార్పులు పాత పన్ను విధానంలో ఉద్యోగులకు అందించిన రూ. 50000 స్టాండర్డ్ డిడక్షన్‌లో ఎలాంటి మార్పు లేదు. అయితే పెన్షనర్లకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.15.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు రూ. 52,500 ప్రయోజనం పొందుతారు . ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు గతంలో కొత్త పన్ను విధానంలో ఆరు శ్లాబులు ఉండేవి. వాటిని కుదించడంతో దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఐదు శ్లాబులే ఉంటాయి. దీంతో రూ.0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను విధించరు. రూ.3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు 5 శాతం, రూ.6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షల కంటే అధికంగా ఉంటే 30 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు షాక్ ఆర్థిక బిల్లు 2023 సవరణల్లో భాగంగా లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ (ltcg) ప్రయోజనాన్ని ఎత్తివేసింది. దీంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై పెట్టుబడి పెట్టగా వచ్చే రాబడిపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 35 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని డెట్ మ్యూచువల్ ఫండ్లకు ఇకపై ఎల్టీసీజీ ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం డెట్ మ్యూచువల్ ఫండ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం మదుపు చేస్తే వాటిని దీర్ఘకాల పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఈ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఇండికేషన్‌తోపాటు 20 శాతం ఎల్టీసీజీ చెల్లించాలి. ఇండికేషన్ లేకుండా అయితే 10 శాతం పన్ను పే చేస్తే సరిపోతుంది. ఇన్సూరెన్స్ పాలసీలు ఇప్పుడే తీసుకోండి ఎక్కువ ప్రీమియం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఏప్రిల్ 1 లోపే ఆ పనిచేయడం బెటర్. లేదంటే ఒక సంవత్సరంలో రూ. 5 లక్షలకు మించి ప్రీమియం చెల్లించే జీవిత బీమా పాలసీలపై వచ్చే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు ఊరట సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గరిష్ట డిపాజిట్ పరిమితి రూ. 15 లక్షల నుండి రూ. 30 లక్షలకు పెంచింది. గతంలో ఆ డిపాజిట్ కేవలం రూ.15లక్షల వరకు మాత్రమే ఉండేది. దీంతో పాటు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో సింగిల్ అకౌంట్ కలిగిన వ్యక్తి నెలకు కేవలం రూ.4.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేసే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ డిపాజిట్‌ను రూ.9లక్షలకు పెంచారు. ఇక జాయింట్ అకౌంట్లో రూ.7.5 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.15 లక్షల వరకు పెంచారు. చదవండి : ఫార్మా కంపెనీలకు కేంద్రం భారీ షాక్! -
కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా పన్ను లేదు!
ఆదాయపు పన్నుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పన్ను విధానం 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి అంటే వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. కొత్త ఆదాయపు పన్ను విధానంలో జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు రూ. 7.5 లక్షల వరకూ వార్షిక ఆదాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: ఈ పథకంతో సీనియర్ సిటిజన్స్‌కు రూ.20 వేల వరకు రాబడి! 2023 బడ్జెట్ ఏమి చెబుతోంది? ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 7 లక్షలకు మించకుంటే అలాంటివారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని 2023 బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87ఏ కింద లభించే గరిష్ట రాయితీ పరిమితిని 2023 బడ్జెట్లో రూ.12,500 నుంచి రూ.25,000కి పెంచింది. (ఇక ఎయిర్‌ప్యాడ్స్ కూడా తక్కువ ధరకే: రూ. 1,654 కోట్లతో ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ!) సెక్షన్ 87ఏ కింద రాయితీ ఎవరికి వర్తిస్తుంది? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. సెక్షన్ 87ఏ కింద రాయితీ కేవలం భారత్‌లో నివాసం ఉంటున్న వారికి మాత్రమే. ప్రవాసభారతీయులు (ఎన్నారైలు), హిందూ అవిభక్త కుటుంబాలు, సంస్థలు వంటి ఈ రాయితీకి అనర్హులు. స్టాండర్డ్ డిడక్షన్ జీతం అందుకునే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 2023 కొత్త బడ్జెట్లో రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను పొడిగించింది. ఇంతకు ముందు స్టాండర్డ్ డిడక్షన్ పాత ఆదాయపు పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉండేది. రూ. 7.5 లక్షల వరకూ పన్ను లేదు 2023 బడ్జెట్లో ప్రకటించిన తగ్గింపు, రాయితీ, ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పుల ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పింఛన్‌దారులు వార్షిక ఆదాయం రూ. 7.5 లక్షల వరకూ ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రాథమిక మినహాయింపుపై గందరగోళం వద్దు 2023 బడ్జెట్ ప్రకారం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. మరి రూ.7.5 లక్షల వరకు పన్ను లేదని ఎలా చెబుతున్నారని గందరగోళానికి గురికావద్దు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 3 లక్షలు దాటితే పన్ను విధిస్తారు. అయితే రూ.7.5 లక్షల వరకు ఆదాయం ఉన్నా కూడా కొత్త పన్ను విధానంలో రిబేట్, తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. -
28% శ్లాబులో ఇక 35 మాత్రమే
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో అత్యధిక పన్ను రేటైన 28 శాతం శ్లాబులో ఇక 35 వస్తువులే మిగిలాయి. 2017 జూలై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు 28 శాతం శ్లాబులో మొత్తం 226 వస్తువులు ఉండేవి. అయితే గత ఏడాది కాలంలో ఈ శ్లాబులోని 191 వస్తువులపై జీఎస్టీ మండలి పన్ను రేట్లను తగ్గించింది. వాటిలో కొన్నింటిపై పన్ను పూర్తిగా ఎత్తివేయగా, మరి కొన్నింటిని 5, 12, 18 శాతం శ్లాబుల్లో చేర్చింది. ప్రస్తుతం 28 శాతం శ్లాబులో ఎయిర్ కండీషనర్లు, వంటపాత్రలు కడిగే యంత్రాలు, 27 అంగుళాల కంటే పెద్దవైన టీవీలు, తదితర విలాసవంతమైన వస్తువులతోపాటు సిగరెట్లు, గుట్కా వంటి ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులు మాత్రమే ఉన్నాయి. ఈ నెల 27న కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చి, స్థిరమైన ఆదాయం రావడం మొదలైన అనంతరం.. 28 శాతం శ్లాబు నుంచి మరికొన్ని వస్తువులను కూడా ప్రభుత్వం తొలగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత విలాసవంతమైన వస్తువులు, ఆరోగ్య హానికారక ఉత్పత్తులపైన మాత్రమే అత్యధిక పన్నును వసూలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండొచ్చంటున్నారు.పెద్ద టీవీలు, పాత్రలు కడిగే యంత్రాలు, డిజిటల్ కెమెరాలు, ఏసీలు తదితరాలను కూడా ప్రభుత్వం 18 శాతం పన్ను శ్లాబులోనే చేర్చొచ్చని డెలాయిట్ ఇండియా భాగస్వామి ఎంఎస్ మణి పేర్కొన్నారు. ఆరోగ్యానికి చేటు చేసే ఉత్పత్తులను మాత్రమే 28 శాతం జీఎస్టీ శ్లాబులో ఉంచితే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. భవిష్యత్తులో అత్యంత విలాస వస్తువులు, ఆరోగ్యం పాడు చేసే ఉత్పత్తులపైనే 28 శాతం పన్ను ఉండేలా ప్రభుత్వ వైఖరి కనిపిస్తోందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ భాగస్వామి అభిషేక్ జైన్ అంటున్నారు. 27 నుంచి 28 శాతం శ్లాబులో మిగిలేవి ఏసీలు, 27 అంగుళాల కన్నా పెద్ద టీవీలు, పాత్రలు కడిగే యంత్రాలు, డిజిటల్ కెమెరాలు, వీడియో రికార్డర్లు, సిమెంటు, మోటార్ వాహనాలు, వాహనాల విడిభాగాలు, టైర్లు, స్టీమర్లు, విమానాలు, శీతల పానీయాలు, బెట్టింగ్, పొగాకు, సిగరెట్, పాన్ మసాలా, గుట్కాలు తదితరాలు. భవిష్యత్తులో మూడు శ్లాబ్‌లే: సుశీల్ మోదీ జీఎస్టీలో పన్ను రేట్ల శ్లాబ్‌లను భవిష్యత్తులో మూడుకు తగ్గించే అవకాశం ఉండొచ్చని బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ వెల్లడించారు. జీఎస్టీపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘానికి సుశీల్ నేతృత్వం వహిస్తుండటం తెలిసిందే. ‘ప్రస్తుతం జీఎస్టీలో 0, 5, 12, 18, 28 శాతం పన్నులు.. మొత్తం 5 శ్లాబులు ఉన్నాయి. వీటిని మూడుకు తగ్గించే ఆలోచన ఉంది. అయితే, ఇది రాష్ట్రాల ఆదాయానికి సంబంధించింది కాబట్టి సమయం పడుతుందని సుశీల్ చెప్పారు. -
జీఎస్టీ: బంగారం బతికిపోయింది
-
జీఎస్టీ: బంగారం బతికిపోయింది
బులియన్ మార్కెట్ వర్గాలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కొంత ఊరటనిచ్చారు. బంగారంపై భారీమొత్తంలో పన్ను రేట్లను కాకుండా.. 3 శాతం రేటును మాత్రమే విధించనున్నట్టు పేర్కొన్నారు. జీఎస్టీ పన్ను శ్లాబుల్లో కొత్తగా ఈ శ్లాబును చేర్చుతూ బంగారాన్ని దీన్ని పరిధిలోకి తీసుకొచ్చారు..బంగారంతో పాటు, బంగారం ఆభరణాలు, డైమండ్లపై కూడా 3 శాతం జీఎస్టీనే విధించాలని ఆర్థిక మంత్రి నేతృత్వంలో నేడు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ రేటు పరిశ్రమ వర్గాల అంచనాల మేరకే వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం బంగారంపై సుమారు 2 శాతం పన్ను వసూలుచేస్తున్నారు. కొన్నిరాష్ట్రాల్లో వ్యాట్ ఎక్కువగా ఉండటంతో పన్ను రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. గతనెలలో జరిగిన జీఎస్టీ మండలి భేటీలో నాలుగు రకాల జీఎస్టీ శ్లాబులను నిర్ణయించిన సంగతి తెలిసిందే. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతాలను జీఎస్టీ శ్లాబులుగా నిర్ణయించారు. అయితే వీటిలో అతితక్కువ రేటు 5 శాతం పరిధిలోకి లేదా 2 శాతంలోకి తీసుకురావాలని ప్రతిపాదనలు వచ్చాయి. వారి ప్రతిపాదనలతో పాటు మధ్యతరగతి వర్గాలు బంగారంపై ఎక్కువగా సేవింగ్స్ చేసే అవకాశాలున్న కారణంతో బంగారంపై జీఎస్టీ రేటును తక్కువగా 3శాతంగా నిర్ణయించారు. అంతేకాక తక్కువ రేట్లతో అక్రమ రవాణాకు కూడా అడ్డుకట్ట వేయొచ్చని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. పన్నుల భారం ఎక్కువగా ఉంటే, పన్నులు ఎగవేయాలనే ఆలోచలను పెరిగి స్మగ్లింగ్ కు దారితీస్తుందని ఆర్థికమంత్రిత్వశాఖకు అంతకముందే బులియన్ మార్కెట్ వర్గాలు విన్నపించుకున్నాయి. బులియన్ మార్కెట్ దారుల విన్నపం మేరకు ప్రభుత్వం కూడా బంగారంపై తక్కువగానే రేట్లను ఉంచింది. బంగారంపై నేడు విధించిన 3 శాతం జీఎస్టీని స్వాగతించదగినదేనని టైటాన్ సీఎఫ్ఓ సుబ్రహ్మణ్యమ్ అన్నారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమలుకు జెమ్స్ అండ్ జువెల్లరీ పరిశ్రమ సన్నద్దంగా ఉందని పేర్కొన్నారు. 3 శాతం రేటు బంగారం డిమాండ్ ను దెబ్బతీస్తుందని అనుకోవడం లేదని, వినియోగదారులకు ఇది ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతమున్న రేటుకు జీఎస్టీ రేటుకు పెద్దగా తేడా లేదని, అంగీకరించే విధంగానే ఉందని బులియన్ వర్గాలు చెప్పాయి.