కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి ఇన్ కమ్ ట్యాక్స్‌లో అనేక మార్పులు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ఇన్ కమ్ ట్యాక్స్ శ్లాబ్స్‌లో పన్ను రాయితీ పరిమితి పెంపు, లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్‌లో (ఎల్‌టీసీజీ) డెట్ మ్యూచివల్ ఫండ్స్‌పై పన్న విధింపు వంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు కొన్ని సామాన్యులకు ఊరట కలిగించేవి కాగా.. మరికొన్ని భారంగా మారనున్నాయి. ఇవే కాకుండా ఏప్రిల్ 1 నుంచి ఇంకా ఏయే మార్పులు చోటు చేసుకోనున్నాయో తెలుసుకుందాం.
పన్ను రాయితీ పరిమితి పెంపు
పన్ను రాయితీ పరిమితి రూ. 5 లక్షల నుండి రూ. 7 లక్షలకు పెరిగింది. అంటే రూ. 7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు.
స్టాండర్డ్ డిడక్షన్‌లో లేని మార్పులు
పాత పన్ను విధానంలో ఉద్యోగులకు అందించిన రూ. 50000 స్టాండర్డ్ డిడక్షన్‌లో ఎలాంటి మార్పు లేదు. అయితే పెన్షనర్లకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.15.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు రూ. 52,500 ప్రయోజనం పొందుతారు .
ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు
గతంలో కొత్త పన్ను విధానంలో ఆరు శ్లాబులు ఉండేవి. వాటిని కుదించడంతో దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఐదు శ్లాబులే ఉంటాయి. దీంతో రూ.0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను విధించరు. రూ.3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు 5 శాతం, రూ.6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షల కంటే అధికంగా ఉంటే 30 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది.
డెట్ మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు షాక్
ఆర్థిక బిల్లు 2023 సవరణల్లో భాగంగా లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ (ltcg) ప్రయోజనాన్ని ఎత్తివేసింది. దీంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై పెట్టుబడి పెట్టగా వచ్చే రాబడిపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 35 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని డెట్ మ్యూచువల్ ఫండ్లకు ఇకపై ఎల్‌టీసీజీ ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం డెట్ మ్యూచువల్ ఫండ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం మదుపు చేస్తే వాటిని దీర్ఘకాల పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఈ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఇండికేషన్‌తోపాటు 20 శాతం ఎల్‌టీసీజీ చెల్లించాలి. ఇండికేషన్ లేకుండా అయితే 10 శాతం పన్ను పే చేస్తే సరిపోతుంది.
ఇన్సూరెన్స్ పాలసీలు ఇప్పుడే తీసుకోండి
ఎక్కువ ప్రీమియం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఏప్రిల్ 1 లోపే ఆ పనిచేయడం బెటర్. లేదంటే ఒక సంవత్సరంలో రూ. 5 లక్షలకు మించి ప్రీమియం చెల్లించే జీవిత బీమా పాలసీలపై వచ్చే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
సీనియర్ సిటిజన్లకు ఊరట
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గరిష్ట డిపాజిట్ పరిమితి రూ. 15 లక్షల నుండి రూ. 30 లక్షలకు పెంచింది. గతంలో ఆ డిపాజిట్ కేవలం రూ.15లక్షల వరకు మాత్రమే ఉండేది. దీంతో పాటు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లో సింగిల్ అకౌంట్ కలిగిన వ్యక్తి నెలకు కేవలం రూ.4.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేసే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ డిపాజిట్‌ను రూ.9లక్షలకు పెంచారు. ఇక జాయింట్ అకౌంట్‌లో రూ.7.5 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.15 లక్షల వరకు పెంచారు.
చదవండి : ఫార్మా కంపెనీలకు కేంద్రం భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment