New teams
-
IPL లో మరో రెండు కొత్త జట్లు ఎంట్రీ
-
రేసులో అదానీ, గోయెంకా
దుబాయ్: మళ్లీ పది జట్ల ఐపీఎల్‌కు నేడు అడుగు పడనుంది. రూ.వేల కోట్ల అంచనాలతో దాఖలైన టెండర్లను నేడు తెరువనున్నారు. సుమారు 22 కంపెనీలు రూ. 10 లక్షలు వెచ్చించి మరీ టెండర్ దరఖాస్తులు దాఖలు చేసినప్పటికీ పోటీలో ప్రధానంగా ఐదారు కంపెనీలే ఉన్నట్లు తెలిసింది. ఇందులోనూ ఎలాగైనా దక్కించుకోవాలనే సంస్థలు మూడే! దేశీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థలైన అదానీ గ్రూప్, గోయెంకా, అరబిందో సంస్థలు ఐపీఎల్లో తమ ‘జెర్సీ’లను చూడాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ అదాయంపై గంపెడాశలు పెట్టుకుంది. ఒక్కో ఫ్రాంచైజీ ద్వారా రూ. 7,000 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆశిస్తోంది. అందుకే కనీస బిడ్ ధర రూ. 2,000 కోట్లు పెట్టింది. అయినాసరే 22 కంపెనీలు టెండర్ల ప్రక్రియపై ఆసక్తి చూపాయంటే ఐపీఎల్ బ్రాండ్విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల మార్కెట్ ఏకంగా రూ.36 వేల కోట్లకు చేరింది. లీగ్‌కు సమకూరే ఈ ఆదాయాన్ని ఫ్రాంచైజీలకు పంపిణీ చేస్తారు. ఈ రకంగా చూసినా బోర్డు ఆశించినట్లు ఒక్కో జట్టుకు రూ. 7,000 కోట్లు కాకపోయినా రెండు కలిపి (రూ. 3,500 కోట్లు చొప్పున) ఆ మొత్తం గ్యారంటీగా వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. రేసులో అరబిందో గ్రూప్ ఉన్నప్పటికీ అదానీ, గోయెంకా కంపెనీలు ఫ్రాంచైజీలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అహ్మదాబాద్ లక్ష్యంగా అదానీ ఐపీఎల్లో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాజస్తాన్, పంజాబ్ ఫ్రాంచైజీలున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో చేరే ఇంకో రెండు నగరాలేవో నేడు తేల్చేస్తారు. బరిలో అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, గువాహటి, పుణే, ధర్మశాల, కటక్ ఉన్నప్పటికీ ప్రధానంగా అహ్మదాబాద్, లక్నోలే ఖరారు అవుతాయని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే అహ్మదాబాద్, లక్నోలే ఫేవరెట్ నగరాలు. ముఖ్యంగా గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్ అహ్మదాబాద్ లక్ష్యంగా టెండరు దాఖలు చేసింది. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీ అనుభవమున్న ఆర్పీఎస్జీ (రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా) గ్రూపు లక్నోను చేజిక్కించుకునే అవకాశముంది. ఐపీఎల్లో చెన్నై, రాజస్తాన్‌లు రెండేళ్ల నిషేధానికి గురైనపుడు పుణే (రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్)తో ఐపీఎల్‌లోకి ప్రవేశించింది. -
కొత్త జట్లతో మరింత ఆదరణ
దుబాయ్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్తగా మరో రెండు జట్లు అదనంగా రావడంతో ఆటకు మరింత ప్రచారం లభిస్తుందని భారత్ స్టార్ షట్లర్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు అభిప్రాయపడింది. గత రెండు సీజన్లలో లీగ్‌కు మంచి ఆదరణ లభించిందని, ఈసారి కూడా టోర్నీ మరింత ఆకర్షణీయంగా జరుగుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 14 వరకు భారత్‌లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. తొలి రెండు సీజన్ల పాటు ఈ లీగ్‌లో ఆరు జట్లు ఉండగా, ఇప్పుడు అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, నార్త్ ఈస్టర్న్ వారియర్స్ జట్లు కూడా వచ్చాయి. సింధు నాయకత్వంలోని చెన్నై స్మాషర్స్ జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ‘మేం టైటిల్ నిలబెట్టుకుంటామనే నమ్మకం ఉంది. ఈసారి స్మాషర్స్ అభిమానుల కోసం చెన్నైలో కూడా మ్యాచ్‌లు ఉన్నాయి. గత ఏడాది అక్కడ మేం ఆడలేకపోయాం. ఇప్పుడు అక్కడ కూడా ఆటపై ఆసక్తి పెరుగుతుంది. పైగా గువాహటిలాంటి చోటికి కూడా పీబీఎల్ వెళుతోంది. గతంలో ఏ స్థాయిలో కూడా అక్కడ ఆడని మాకు అదో కొత్త అనుభవం అవుతుంది. సహజంగానే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఆదరణ పెరిగి చివరకు బ్యాడ్మింటన్‌కే మేలు చేస్తుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. ఒక్కడి ప్రదర్శన సరిపోదు... పీబీఎల్ గత సీజన్లో తమ జట్టు బాగానే ఆడిందని, అయితే కీలక సమయంలో ఎదురైన పరాజయాలతో టోర్నీలో సెమీఫైనల్‌కే పరిమితమయ్యామని అవధ్ వారియర్స్ కెప్టెన్, ప్రపంచ మూడో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ అన్నాడు. ‘బ్యాడ్మింటన్ వ్యక్తిగత ఆటే అయినా పీబీఎల్ వద్దకు వచ్చేసరికి అది టీమ్ గేమ్‌గా మారిపోయింది. నా ఒక్కడి ప్రదర్శనపైనే ఆధారపడి జట్టు ముందుకు వెళ్ళలేదు. ఈసారి జట్టు మరింత బలంగా ఉంది కాబట్టి తొలిసారి టైటిల్‌ను గెలుచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తాం’ అని శ్రీకాంత్ అన్నాడు. -
కొత్త జట్లు.. కొత్త వేలం!
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి రెండేళ్ల పాటు చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు దూరమవడంతో బీసీసీఐలో టెన్షన్ మొదలైంది. బోర్డుకు కాసుల పంట పండిస్తున్న ఈ లీగ్‌లో ఆ రెండు జట్లు ప్రధానమైనవి. దాంతో తాజా పరిణామాలపై చర్చించేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ ఈనెల 19న సమావేశం కాబోతోంది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, మాజీ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే సహా మొత్తం 11 మంది పాల్గొంటారు. అయితే తీర్పుకు సంబంధించిన పూర్తి పత్రాలు బీసీసీఐ న్యాయ సంఘానికి అందిన తర్వాతే సమావేశం ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా 3 అంశాలపై ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది. అవి ఆ రెండు జట్ల స్థానాల్లో కొత్త వాటి కోసం బిడ్డింగ్‌ను ఏర్పాటు చేయడం. చెన్నై, రాజస్థాన్ ఆటగాళ్లను మాత్రమే వేలంలో ఉంచడం, లేదా అందరు ప్లేయర్లను వేలంలోకి తీసుకురావడం. చెన్నై మాతృసంస్థ అయిన ఇండియన్ సిమెంట్స్ నుంచి దాన్ని విడిగా ఏర్పాటు చేయడం. న్యాయపరమైన ఇబ్బందులు.. చెన్నైని దాని మాతృ సంస్థ నుంచి వేరు చేయడంపై గత సమావేశంలోనే చర్చించినట్లు, అయితే న్యాయ పరమైన సలహాల కోసం వేచి ఉన్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఆ రెండు జట్ల యజమాన్యాలు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు చెప్పా రు. తర్వాతి సమావేశంలో దానిపై చర్చిస్తామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ జట్లపై మంచి అభిప్రాయం పోయిన నేపథ్యంలో ఎవరైనా కొంటారా? ఒకవేళ కొన్నా ఈ తీర్పు దృష్ట్యా వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్త జట్లు.. ఆ రెండు జట్లను వదిలేసి కొత్త జట్లను తేవడమే బీసీసీఐ చివరి ఆప్షన్లా కనిపిస్తోంది. కొత్త జట్లు వస్తే వారికి ఎక్కువ ఆటగాళ్లు అందుబాటులో ఉండరు. సస్పెండ్ అయిన రెండు జట్లలోని 45 మంది ఆటగాళ్లతో ఒక చిన్న వేలం నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. అయితే తక్కువ మంది ప్లేయర్లు ఉంటారంటే కొత్త యజమానులు జట్లను కొంటారా అనేదే ప్రశ్న? అందరు ఆటగాళ్లను మరోసారి వేలంలోని తీసుకొచ్చి మళ్లీ మొదట్నుంచి మొదలుపెట్టే అవకాశం కూడా లేకపోలేదు. -
‘మెరుపు’ లకు ముస్తాబు
బంగ్లా కోటలో ఇక అదిరే ఆట తొలిసారి టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం టెస్టు క్రికెట్ సంప్రదాయ భోజనం లాంటిది. కడుపు నిండుతుంది. టి20 క్రికెట్ చిరుతిండి (జంక్‌ఫుడ్) లాంటిది. ఇంకా తినాలనిపిస్తుంది. ఆరోగ్యకరం కాకపోయినా చిరుతిండిలోనే మజా. రోజంతా కూర్చుని క్రికెట్ చూడటం బోర్‌గా మారిన రోజుల్లో టి20లకు ఆదరణ పెరిగింది. అలాంటి టి20లో ప్రపంచ సమరం జరిగితే... ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడాల్సిందే. ఇక ఆ సమయం వచ్చేసింది. బంగ్లాదేశ్‌లో టి20 ప్రపంచకప్‌కు రంగం సిద్ధమవుతోంది. మరో ఆరు రోజుల్లో పొట్టి ఫార్మాట్లో ధనాధన్ మెరుపులు చూడొచ్చు. 22 రోజుల పాటు కావలసినంత పరుగుల వినోదం. ఆసియా కప్‌ను సమర్థంగా నిర్వహించిన బంగ్లాదేశ్... ఇక ఓ మెగా టోర్నీనీ సూపర్ హిట్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ప్రపంచంలోని ఎనిమిది అగ్రశ్రేణి జట్లతో పాటు పసికూనలుగా భావించే కొత్త జట్లు కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 16 నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతున్నా... ఇవి చిన్న జట్ల మధ్య అర్హత మ్యాచ్‌లు మాత్రమే. అసలు సిసలు హోరు 21 నుంచి మొదలవుతుంది. అది కూడా భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌తో. టి20 ప్రపంచకప్‌కు సంబంధించిన అనేక విశేషాలతో ‘సాక్షి’ కౌంట్‌డౌన్ నేటి నుంచి... సాక్షి క్రీడావిభాగం తొలిసారి 2007లో మొదలైన టి20 ప్రపంచకప్ ఇప్పటికి నాలుగుసార్లు జరిగింది. టోర్నీలో అత్యధికంగా 12 జట్లు మాత్రమే ఆడాయి. ఈసారి మాత్రం ఆ సంఖ్యను ఐసీసీ 16కు పెంచింది. వన్డే ప్రపంచకప్‌లో జట్లను తగ్గించాలనే నిర్ణయం కారణంగా చిన్న దేశాలకు సమస్యలు రాకూడదని టి20 ప్రపంచకప్‌లో ఇక నుంచి 16 దేశాలను ఆడించాలని నిర్ణయించారు. అయితే దీనివల్ల టోర్నీ నాణ్యత దెబ్బతినకూడదు. దీంతో ప్రపంచకప్‌ను రెండు భాగాలుగా విభజించారు. ఎనిమిది అగ్రశ్రేణి జట్లు నేరుగా ప్రధాన మ్యాచ్‌లు ఆడేందుకు రెండు గ్రూపులుగా విడిపోయాయి. మిగిలిన 8 చిన్న దేశాలను కూడా రెండు గ్రూపులుగా చేసి అర్హత మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో గ్రూప్ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లు వెళ్లి ఎనిమిది పెద్ద జట్లతో పాటు ప్రధాన మ్యాచ్‌లు ఆడతాయి. గత టోర్నీ వరకు ఉన్న సూపర్ సిక్స్ మ్యాచ్‌లను ఈసారి తీసేశారు. మూడు కొత్త జట్లు ఈసారి టి20 ప్రపంచకప్ ద్వారా మూడు కొత్త జట్లు ఈ ఫార్మాట్లో తొలిసారి ఆడబోతున్నాయి. నేపాల్, హాంకాంగ్, యూఏఈ అర్హత మ్యాచ్‌లలో బరిలోకి దిగుతున్నాయి. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో పాటు, ఆ జట్టును ఆసియాకప్‌లో కంగుతినిపించిన అఫ్ఘానిస్థాన్, జింబాబ్వే, నెదర్లాండ్స్, ఐర్లాండ్ మిగిలిన జట్లు. అర్హత రౌండ్ గ్రూప్ ‘ఎ’: బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, నేపాల్, హాంకాంగ్ గ్రూప్ ‘బి’:జింబాబ్వే, ఐర్లాండ్, యూఏఈ, నెదర్లాండ్స్ ఈ రెండు గ్రూప్‌ల నుంచి విజేతలుగా నిలిచిన జట్లు ప్రధాన దశకు అర్హత సాధిస్తాయి. ప్రధాన రౌండ్ (సూపర్ 10 సిరీస్) గ్రూప్-1: శ్రీలంక, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, క్వాలిఫయర్ (గ్రూప్ ‘బి’ విజేత) గ్రూప్-2: భారత్, వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, క్వాలిఫయర్ (గ్రూప్ ‘ఎ’ విజేత) గ్రూప్-1, గ్రూప్-2 లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరతాయి. మార్చి 16 నుంచి 21 వరకు అర్హత రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రధాన గ్రూప్‌ల మ్యాచ్‌లు జరుగుతాయి. ఏప్రిల్ 3, 4 తేదీల్లో సెమీఫైనల్స్ జరుగుతాయి. ఏప్రిల్ 6న ఫైనల్ జరుగుతుంది. ఒకవేళ ఏదైనా అంతరాయం కలిగితే రిజర్వ్ డే 7న మ్యాచ్ జరుగుతుంది. మహిళలూ సిద్ధం పురుషుల టోర్నీతో సమాంతరంగా మహిళలకూ టి20 ప్రపంచకప్ జరుగుతుంది. పురుషులకు ఇది ఐదో టి20 ప్రపంచకప్ కాగా... మహిళలకు మాత్రం నాలుగోది. 2009లో తొలిసారి పురుషులతో పాటు మహిళలకూ టోర్నీ నిర్వహణ ప్రారంభమైంది. మహిళల జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఐర్లాండ్ గ్రూప్ ‘బి’: భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్ రెండు గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరతాయి. ఎవరికెంతెంత? ఈసారి పురుషుల విభాగంలో విజేత జట్టుకు 11 లక్షల డాలర్లు (రూ. 6 కోట్ల 71 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్ జట్టుకు 5 లక్షల 50 వేల డాలర్లు (రూ. 3 కోట్ల 35 లక్షలు) దక్కుతాయి. సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లు 2 లక్షల 75 వేల డాలర్ల (రూ. కోటీ 67 లక్షలు) చొప్పున అందుకుంటాయి. ప్రధాన రౌండ్లో ప్రతి మ్యాచ్ విజయానికి 40 వేల డాలర్ల (రూ. 24 లక్షల 43 వేలు) చొప్పున లభిస్తాయి. మహిళల విభాగంలో విజేత జట్టుకు 70 వేల డాలర్లు (రూ. 42 లక్షల 75 వేలు)... రన్నరప్ జట్టుకు 30 వేల డాలర్లు (రూ. 18 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీగా దక్కుతాయి.