NII
-
హెచ్డీఎఫ్సీ నికరలాభం 5శాతం డౌన్
దేశీయ అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ గురువారం తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. కన్సాలిడేటేడ్ నికరలాభం జూన్ కార్వర్ట్‌లో 15శాతం పెరిగింది.కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం రూ.23,239 కోట్ల నుంచి రూ.29,959 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం 5శాతం క్షీణించి రూ.3052 కోట్లుగా నమోదయ్యాయి. స్టాండ్‌లోన్ ఆదాయం రూ.12,990 నుంచి రూ.13,017 కోట్లకు పెరిగింది. ఇదే క్యూ1లో నికర వడ్డీ మార్జిన్ 3.3శాతం నుంచి 3.1శాతానికి తగ్గింది. సమీక్షా త్రైమాసికంలో కోవిడ్-19 సంబంధిత కేటాయింపులు రూ.1199 కోట్ల మేరకు జరిపినట్లు కంపెనీ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.3,079 కోట్ల నుంచి 10శాతం పెరిగి రూ.3,392 కోట్లకు చేరింది. వ్యక్తిగత రుణఖాతాదారుల్లో 2శాతం మంది, కార్పోరేట్ రుణగ్రస్తుల్లో 2శాతం కంపెనీలు మారిటోరియంను వినియోగించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు శుక్రవారం నష్టంతో 3.50శాతం రూ.1811 వద్ద ముగిసింది. -
సీఎస్బీ బ్యాంక్ ఐపీఓ... అదరహో !
న్యూఢిల్లీ: సీఎస్బీ బ్యాంక్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ)కు అనూహ్య స్పందన లభించింది. ఈ నెల 22న మొదలై మంగళవారం ముగిసిన ఈ ఐపీఓ 87 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. రూ.193–195 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ సైజు రూ.410 కోట్లు. ఈ ఐపీఓలో భాగంగా మొత్తం 2.10 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. మొత్తం వంద కోట్ల షేర్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల(క్విబ్)లకు కేటాయించిన వాటా 62 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల(ఎన్ఐఐ) వాటా 165 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 44 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ప్రస్తుతం సీఎస్బీ బ్యాంక్ షేర్‌కు గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్‌పీ) రూ.75–100 రేంజ్లో ఉందని, ఈ రేంజ్ లాభాలతోనే(కనీసం) ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టవ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లిస్టింగ్ తేదీ డిసెంబర్ 4. యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.184 కోట్లు ఈ ఐపీఓలో భాగంగా రూ.24 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో 1.97 కోట్ల ఈక్విటీ షేర్లను బ్యాంక్‌లో ఇప్పటికే వాటా ఉన్న కొన్ని కంపెనీలు విక్రయించాయి. కాగా గత గురువారం నాడు సీఎస్బీ బ్యాంక్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.184 కోట్లు సమీకరించింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్ బోణీ బాగుంది
క్యూ3లో లాభం 29 శాతం వృద్ధి ముంబై: గతేడాది అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో పెద్ద నోట్ల రద్దు వంటి ప్రతికూలతలను తట్టుకుని మరీ ప్రైవేటు రంగ ఇండస్ఇండ్ బ్యాంకు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు లాభం 29 శాతం అధికంగా రూ.750.64కోట్లు నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో బ్యాంకు లాభం రూ.581 కోట్లే. డీమానిటైజేషన్ ప్రభావం అంతగా లేదని బ్యాంకు తెలిపింది. ఎన్ఐఐ జూమ్: నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) విభాగంలో లాభం 35 శాతం అధికంగా రూ.1,578 కోట్లు వచ్చిందని... నిధుల వ్యయాలు తగ్గడమే దీనికి కారణమని ఇండస్ ఇండ్ బ్యాంకు ఎండీ రమేశ్ సోబ్తి తెలిపారు. నగదు నిల్వల నిష్పత్తి విషయంలో ఆర్బీఐ తీసుకున్న చర్యల వల్ల ఎన్ఐఐ రూ.40 కోట్లు అధికంగా వచ్చినట్టు చెప్పారు. కలిసొచ్చిన డిపాజిట్లు: ఇక బ్యాంకు డిపాజిట్లు 35 శాతం పెరిగాయి. వీటిలో 56 శాతం సేవింగ్స్ ఖాతాల్లో నిల్వలే. వీటిపై వ్యయాలు తక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. రుణాలు: రుణాల జారీలోనూ ఇండస్ ఇండ్ బ్యాంకు మెరుగైన గణాంకాలను ప్రకటించింది. ఇవి 25 శాతం వృద్ధి చెందాయి. పరిశ్రమ సగటు కంటే ఐదు రెట్లు అధికమని సోబ్తి పేర్కొన్నారు. రుణాలకు డిమాండ్ కూడా తగ్గలేదన్నారు. చెల్లని నోట్లు: రూ.11,400 కోట్ల విలువైన చెల్లని పెద్ద నోట్లను డిపాజిట్లుగా బ్యాంకు స్వీకరించింది. నవంబర్ 8 తర్వాత రూ.200, రూ.1,000 నోట్ల రూపంలో భారీ స్థాయిలో నగదు జమలు వచ్చినప్పటికీ సీఆర్ఆర్ రూపంలో పక్కన పెట్టినట్టు బ్యాంకు తెలిపింది -
ఐసీఐసీఐ లాభం 3,102 కోట్లు
క్యూ2లో స్వల్పంగా 3.2% వృద్ధి.. భారీగా పెరిగిన మొండిబకాయిలు... స్థూల ఎన్పీఏలు 6.82 శాతానికి... భారీగా ఎగబాకిన ఎన్పీఏ కేటాయింపులు ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ను మొండిబకాయిలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2016-17, క్యూ2)లో బ్యాంక్ స్టాండెలోన్(ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే)నికర లాభం స్వల్పంగా 2.3 శాతం మాత్రమే పెరిగి రూ. 3,102 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,030 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మొండిబకాయిలకు(ఎన్పీఏ) కేటాయింపులు(ప్రొవిజనింగ్) భారీగా పెరగడం లాభాలపై ప్రభావం చూపింది. ఇక బ్యాంక్ స్టాండెలోన్ ఆదాయం క్యూ2లో రూ.22,759 కోట్లకు ఎగబాకింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ. 16,106 కోట్లతో పోలిస్తే 41 శాతం పెరిగింది.కన్సాలిడేటెడ్‌గా చూస్తే..: బీమా, మ్యూచువల్ఫండ్ తదితర అనుంబంధ సంస్థలన్నింటితో(కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) కలిపి చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో నికర లాభం 13 శాతం దిగజారి రూ.2,979 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ.3,419 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.25,138 కోట్ల నుంచి రూ.32,435 కోట్లకు చేరింది. 29 శాతం వృద్ధి నమోదైంది. మొండిబకాయిలు పైపైకి...: సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల ఎన్పీఏలు రెట్టింపు స్థారుులో 6.82 శాతానికి ఎగబాకాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఇవి 3.77 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా చూస్తే రూ.15,858 కోట్ల నుంచి రూ.32,178 కోట్లకు చేరాయి. అయితే, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్థూల ఎన్పీఏలు 5.87 శాతం(రూ.27,194 కోట్లు)తో పోలిస్తే దాదాపు 1 శాతం పెరిగాయి. నికర ఎన్పీఏలు 1.65 శాతం(రూ.6,759 కోట్లు) నుంచి 3.57 శాతానికి(రూ.16,215 కోట్లు) ఎగబాకాయి. తొలి త్రైమాసికంలో నికర ఎన్పీఏలు 3.35 శాతం(రూ.15,041 కోట్లు)గా ఉన్నాయి. ఇక క్యూ2లో బ్యాంక్ మొత్తం ప్రొవిజన్‌స అండ్ కంటింజెన్సీస్(ఇతర అవసరాల కోసం) రూ.7,083 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఈ మొత్తం రూ.942 కోట్లు మాత్రమే. ‘క్యూ2లో అదనంగా రూ.3,588 కోట్ల కేటాయింపులు జరపడం ద్వారా బ్యాలెన్స్ షీట్‌ను మరింత పటిష్టం చేశాం. ఇందులో కొన్ని స్టాండర్డ్ రుణాలకు సంబంధించి రూ.1,678 కోట్లు కూడా ఉన్నాయి. ఇక ఫ్లోటింగ్ ప్రాతిపదికన రూ.1,515 కోట్ల కేటాయింపులు జరిపాం’ అని బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. క్యూ2లో తాజాగా రూ.8000 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయి. సోమవారం బ్యాంక్ షేరు ధర బీఎస్ఈలో 3.36 శాతం లాభంతో రూ.279 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. కాగా, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఐసీఐసీఐ ఏడీఆర్ సోమవారం ఒకానొక దశలో 6 శాతంపైగా ఎగబాకి 8.62 డాలర్లను తాకడం గమనార్హం. ఇతర ముఖ్యాంశాలివీ... క్యూ2లో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ.5,253 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఎన్ఐఐ రూ.5,251 కోట్లుగా ఉంది. వడ్డీయేతర ఆదాయం మాత్రం మూడింతలై రూ.3,007 కోట్ల నుంచి రూ.9,120 కోట్లకు దూసుకెళ్లింది. పధానంగా అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఐపీఓ ద్వారా బ్యాంక్ తన వాటాలో 12.63 శాతాన్ని విక్రరుుంచింది. దీని ద్వారా లభించిన మొత్తంతో కలిపితే క్యూ2లో ఇతర ఆదాయం రూ. 5,682 కోట్లుగా నమోదైంది. జూలై-సెప్టెంబర్ కాలంలో బ్యాంక్ రిటైల్ రుణాల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం డిపాజిట్లు 17 శాతం వృద్ధితో సెప్టెంబర్ చివరినాటికి రూ.4,49,071 కోట్లకు పెరిగారుు. మొత్తం రుణాలు రూ.4,54,256 కోట్లకు చేరాయి. రుణ వృద్ధి 11 శాతంగా నమోదైంది. బ్యాంకు మొత్తం ఏటీఎంలు 14,295, బ్రాంచ్‌లు 4,468కి చేరాయి. అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స నికర లాభం క్యూ2లో రూ.415 కోట్ల నుంచి రూ. 419 కోట్లకు పెరిగింది. లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స లాభం రూ.143 కోట్ల నుంచి రూ.171 కోట్లకు ఎగసింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ నికర లాభం రూ.83 కోట్ల నుంచి రూ.130 కోట్లకు పెరిగింది. కొత్తగా మొండిబకాయిలుగా మారిన రుణాల్లో 80 శాతం పరిశీలనలో ఉంచిన(వాచ్‌లిస్ట్) రూ.44,000 కోట్ల రుణ ఖాతాల నుంచే ఉన్నాయి. మా కార్పొరేట్ ఖాతాదారులు కొన్ని కంపెనీలతో కుదుర్చుకున్న తాజా ఒప్పందాలు పూర్తయితే... మొండిబకాయిలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా జేపీ అసోసియేట్స్ సిమెంట్ విభాగాన్ని అల్ట్రాటెక్‌కు విక్రయించేందుకు రూ.16,500 కోట్లతో కుదుర్చుకున్న ఒప్పందం, ఎస్సార్ ఆయిల్‌ను రూయాలు రాస్‌నెఫ్ట్ కన్సార్షియంకు విక్రయిస్తూ తాజాగా కుదుర్చుకున్న డీల్‌లు ఉన్నాయి. ఈ రెండు కంపెనీల నుంచి ఇప్పటికే కొంత బకాయి మొత్తాన్ని అందుకున్నాం. ప్రస్తుతం వాచ్‌లిస్ట్ పరిమాణం రూ.32,490 కోట్లకు తగ్గింది. 6-9 నెలల కాలంలో ఇది మరింత తగ్గుతుందని భావిస్తున్నాం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ -
24% క్షీణించిన ఎస్బీహెచ్ నికరలాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) సెప్టెం బర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికర లాభంలో 24% క్షీణత నమోదయ్యింది. గతేడాది ఇదే కాలంలో రూ.213 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ.163 కోట్లకు పడిపోయింది. ఇదే కాలానికి నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) మూడు శాతం క్షీణించి రూ.976 కోట్ల నుంచి రూ. 944 కోట్లకు తగ్గింది. మొత్తం ఆరు నెలల కాలానికి చూస్తే నికర లాభం రూ.17 శాతం క్షీణించి రూ.456 కోట్లుగా నమోదైనట్లు ఎస్బీహెచ్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గత సంవత్సరంతో పోలిస్తే డిపాజిట్లు 14 శాతం పెరిగి రూ.1,21,986 కోట్లకు, రుణాలు 22 శాతం పెరిగి రూ. 96,548 కోట్లకు చేరుకున్నాయి. ఆర్థిక వృద్ధిరేటు నెమ్మదించడంతో ఆ ప్రభావం నిరర్థక ఆస్తులపై కనిపించింది. సమీక్షా కాలంలో స్థూల నిరర్థక ఆస్తులు రూ.3,186 కోట్ల(3.46%) నుంచి రూ.4,621 కోట్లకు (4.79%), నికర నిరర్థక ఆస్తులు రూ.1,149 కోట్ల (1.61%) నుంచి రూ. 2,338 కోట్ల(2.50%)కు పెరిగాయి. గత ఏడాది కాలంలో కొత్తగా 97 శాఖలను ప్రారంభించడం ద్వారా మొత్తం శాఖల సంఖ్య 1,490కి చేరిందని, వచ్చే ఐదు నెలల్లో 100 శాఖలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఎస్బీహెచ్ ఆ ప్రకటనలో పేర్కొంది.