Nijamsagar Project
-
హల్దివాగు దశ, దిశ మారుతోందా!
సాక్షి, సిద్దిపేట: సమృద్ధిగా వర్షాలు పడితేగానీ నిండుగా నీరు కనిపించని హల్దివాగు దశ, దిశ మారుతోంది. కాలంతో పనిలేకుండా రైతులకు నీళ్లు అందేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్ది వాగులోకి.. అక్కడి నుంచి మంజీరా మీదుగా నిజాంసాగర్‌లోకి గోదావరి జలాలను తరలించనున్నారు. సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు నీటి విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం పరిశీలించారు. కొండపోచమ్మ టు నిజాంసాగర్ కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా 6.12 కిలోమీటర్ వద్ద నుంచి హల్దివాగులోకి గోదావరి జలాలను వదిలే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత ఈ కాల్వ నుంచి వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి నీటిని వదులుతారు. అక్కడి నుంచి మత్తడి దూకుతూ గొలుసుకట్టు చెరువులైన వర్గల్ పెద్దచెరువు, శాకారం ధర్మాయిచెరువు, అంబర్‌పేట కాని చెరువులు నిండి నాచారం మీదుగా హల్దివాగుకు గోదావరి జలాలు చేరుతాయి. మొత్తం 98 కిలోమీటర్ల పొడవుండే ఈ వాగు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం యావపూర్, నాగులపల్లి మీదుగా కామారెడ్డి జిల్లాలో మంజీరానదిలో కలుస్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నస్రుల్లాబాద్, నిజామాబాద్ జిల్లా బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు మొదలైన ప్రాంతాల రైతులకు చెందిన 14,268 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 20వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందించేందుకు దోహదపడనుంది. పదిరోజుల్లో నిజాంసాగర్‌కు.. మంగళవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేసే గోదావరి జలాలు హల్దివాగును దాటుకుంటూ పది రోజుల్లో నిజాంసాగర్‌కు చేరుకోనున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగులోకి ప్రవేశించే జలాలు.. వాగుపై ఉన్న 32 చెక్ డ్యామ్‌లను నింపుకొంటూ పది రోజుల్లో నిజాంసాగర్‌లోకి చేరుతాయి. ఏర్పాట్లన్నీ సిద్ధం సీఎం కేసీఆర్ మంగళవారం గోదావరి జలాలను హల్దివాగులోకి విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు వర్గల్ మండలం అవుసులోనిపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్ది వాగు కాల్వలోకి నీటిని విడుదల చేస్తారు. తర్వాత 11.15 గంటలకు మర్కూక్ మండలంలోని పాములపర్తిలో గోదావరి జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు, బందోబస్తును మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. చదవండి: హాట్‌హాట్‌గా ఓటు వేట -
బోసిపోతున్న ‘సాగర్’
రోజురోజుకూ అడుగంటుతున్న జలాలు ప్రధాన కాల్వకు కొనసాగుతున్న నీటి విడుదల భవిష్యత్తులో దాహం తీరేది అనుమానమే!వేసవిలో మోగనున్న ప్రమాద ఘంటికలు నిజాంసాగర్: జిల్లా వరప్రదారుుని అయిన నిజాంసాగర్ ప్రాజె క్ట్టులో నీటి నిల్వలు క్రమ క్రమంగా పడిపోతున్నాయి. వేసవి కాలం ప్రారంభంలోనే తాగునీటి అవసరాల కోసం ప్రధా న కాలువకు నీటి విడుదల చేపడుతుండటంతో ‘సాగర్’ నీరు అడుగంటుతోంది. బోధన్ పట్టణం, నిజామాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి నిజాంసాగర్ నీటిని ఉపయోగిస్తున్నారు. ఈ నెల 20 నుంచి ప్రధాన కాలువకు 1,240 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నారు. నాలుగు రోజుల పాటు 400 ఎమ్‌సీఎఫ్‌టీల నీటిని మాత్రం విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కానీ, ఆరు రోజుల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.తద్వారా ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతుండటంతో రాను న్న కాలంలో తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు. బోధన్, నిజామాబాద్ ప్రజలకు తాగునీరందించేందుకు బెల్లాల్ చెరువు, అలీసాగర్ రిజర్వాయర్‌ను పూర్తిస్థాయి లో నింపాలని అధికారులు నిర్ణరుుంచారు.బెల్లాల్ చెరువు ద్వారా బోధన్ పట్టణానికి రోజుకు 1.5 ఎమ్‌సీఎఫ్‌టీలు, అలీసాగర్ రిజర్వాయర్ ద్వారా జిల్లా కేంద్రానికి 1.5 ఎమ్‌సీఎఫ్‌టీల నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ రెండు జలాశయూలను పూర్తిగా నింపినా నెల రోజుల అవసరాలకే సరిపోతా రుు. ఈ లెక్కన వచ్చే మార్చి నెలాఖరు నుంచి తాగునీటికి అవస్థలు పడాల్సిందే. గతేడాది కంటే తగ్గిన నిల్వలు నిజాంసాగర్ నీటిమట్టం గతేడాదితో పోలిస్తే ఈ యేడు భారీగా తగ్గిపోరుుంది. ప్రాజెక్టు పూర్తిస్థారుు నీటిమట్టం 1405 అడుగులు. 17.08 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1 379.16 అడుగులతో 1.17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయూనికి 1398.88 అడుగులతో 10.189 టీఎం సీల నీరు నిల్వ ఉంది.కనిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో సాగర్ వెల వెలబోతోంది. ఈ యేడు వర్షాలు సకాలంలో కురవకపోతే తాగునీటి కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. మెదక్ జిల్లాలో ఉన్న సింగూరు జలాశయంలో సైతం నీటి మ ట్టం ఆశాజనకంగా లేదు. దీంతో సింగూరు జలాలపై ఆశలు ఆవిరికానున్నాయి. గత రబీ సీజన్లో సింగూరు జలాశయం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఏడు టీఎంసీల నీటిని విడుద ల చేయూలని ప్రతిపాదించారు. నాలుగు టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో గత వేసవిలో తాగు నీటికి ఢోకా లేకుండా పోయింది. ప్రస్తుతం సింగూరు జలాశయంలో 517.654 మీటర్లతో 8.5 టీఎంసీల నీరు మా త్రమే నిల్వ ఉంది. అక్కడి నీటిని జంటనగరాల తాగు నీటి అ వసరాలకు ఉపయోగించనున్నందున నిజాంసాగర్‌కు జలా లు రావడం అనుమానమే. -
ప్రధాన కాలువ.. పారేదెలా!
నిజాంసాగర్, న్యూస్‌లైన్: నిజాంసాగర్ ప్రాజెక్టు చివరాయకట్టుకు సాగునీరు అందడం కలగానే మిగులుతోంది. ఏళ్లు గడుస్తున్నా ప్రధాన కాలువ ఆధునికీకరణ పనుల్లో పురోగతి లేకపోవడమే ఇందుకు కారణంగా రైతులు ఆవేదన చెందుతున్నారు. నిధులు ఉన్నా నిష్ర్పయోజనంగా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నిజాం కాలంలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ బలహీనంగా మారింది. కాలువ గట్టుకు ఏర్పాటు చేసిన బండరాళ్లు అక్కడక్కడా తొలగిపోయాయి. ప్రాజెక్టు నిర్మించిన సమయం లో 3 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా 155 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువను బలపర్చారు. అయితే ఎప్పటికప్పుడు సరైన మరమ్మతులు చేయని కారణంగా క్రమక్రమంగా కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం 1,800 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని కూడా తట్టుకోలేక పోతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన ప్రతిసారి ఎక్కడో ఒకచోట గండ్లు పడుతూ వేలాది ఎకరాలకు అందాల్సిన సాగు నీరు వృథా అవుతోంది. చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు చేరడం లేదు. ప్రధాన కాలువ ఈ దుస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ఆధునికీకరణ పనుల కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008-09లో రూ. 549.5 కోట్లను మంజూరు చేశారు. ఆధునికీకరణ కోసం వచ్చిన నిధులను జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు 15 ప్యాకేజీలుగా విభజించారు. రెండు ప్యాకేజీలు మాత్రం ప్రాణహిత చేవెళ్ల పథకం పనుల్లోకి వెళ్లగా 13 ప్యాకేజీల్లో ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. అయితే పనులు అనుకున్నంత మేర సాగడం లేదు. అన్ని ప్యాకేజీల్లో ప్రధాన కాలువకు సిమెంట్ లైనింగ్ చేయాల్సి ఉంది. కాగా 1,2, ప్యాకేజీలతో పాటు మరికొన్ని ప్యాకేజీల్లో సిమెంట్ లైనింగ్ పనులు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. ఆయా ప్యాకేజీల్లో కట్టబలోపేతం, ముళ్ల పొదల తొలగింపు పనులు ఆసంపూర్తిగానే ఉన్నాయి. మిగతా ప్యాకేజీల్లో సుమారు 4 నుంచి 6 కిలోమీటర్ల మేర సిమెంట్ లైనింగ్ పనులు మాత్రం జరిగాయి. ఆయా ప్యాకేజీల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు మాత్రం రూ. 250 కోట్ల మేర డబ్బులు చెల్లించారు. ఇదిలా ఉండగా ప్రస్తుత రబీ సీజన్లో చివరి ఆయకట్టు వరకు రైతన్నలు పంటల సాగు కోసం సమాయత్తమవుతున్నారు. ప్రధాన కాలువ మొదటి ఆయకట్టు ప్రాంతంలో పటిష్టంగా లేకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరందడం కష్టంగా మారనుంది.