nikah halala
-
నియమం పేరుతో కోడలిపై మామ అత్యాచారం..
లక్నో: నిఖా హలాల పేరుతో అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నియమం పేరుతో తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఎంతో మంది ముస్లిం మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిఖా హలాల పేరుతో కోడలిపై సొంత మావయ్యే అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. సొంత మావయ్యతో పాటు మరో నలుగురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని యూపీకి చెందిన ఓ ముస్లిం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరదాబాద్ జిల్లాకి చెందిన ఓ మహిళకి 2014 డిసెంబర్లో వివాహం అయింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే అత్తమామల వేధింపులు మొదయ్యాయి. 2015 డిసెంబర్లో ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆమె తనను వేధిస్తున్నారంటూ భర్తతో పాటు అత్తమామలపై కేసు పెట్టారు. కొద్ది రోజులకి పెద్దలతో ఒప్పందం కుదుర్చుకొని మళ్లీ ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. దీంతో సదరు మహిళ కేసు వాపసు తీసుకున్నారు. అంతా సుఖాంతం అయిందన్న వేళ భర్త నిఖాహలాలను ముందుకు తీసుకొచ్చాడు. మనకు విడాకులయ్యాయని, ఆచారం ప్రకారం మరో పెళ్లి చేసుకోవాలని మహిళను సూచించాడు. మావయ్యతో కాపురం చెయ్యాలని వేధించాడు. గదిలో బంధించి... మామయ్యతో పెళ్లికి నిరాకరించిన ఆ మహిళను భర్త గదిలో బంధించారు. నియమం పేరుతో కోడలిపై అత్యాచారానికి పాల్పడిన మావయ్య మరుసటి రోజు విడాకులిచ్చారు. అనంతరం భర్త బంధువులైన మరో ముగ్గురు కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో గర్భం దాల్చిన సదరు మహిళ 2017లో బాబుకు జన్మనిచ్చింది. నిఖా హలాల పేరుతో అత్యాచారం చేసిన అత్తింటి వారిపై మహిళ ఆదివారం మొరదాబాద్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తున్నారని మహిళ వాపోయారు. సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిఖా హలాల్... ఇస్లాం నియమాల ప్రకారం విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది. -
ఇప్పుడు నిఖా హలాల్ వంతు
న్యూఢిల్లీ : ముస్లింల వివాదాస్పద విడాకుల చట్టం ‘ట్రిపుల్ తలాక్’ను చట్టబద్దం కాదని తేల్చిన కేంద్రం ఇప్పుడు ‘నిఖా హలాల్, బహుభార్యత్వా’ల చట్టబద్దతలను పరిశీలించనున్నట్లు సమాచారం. ‘నిఖా హలాల్, బహుభార్యత్వా’ల ప్రామణికతను సవాలు చేస్తూ గతంలో సుప్రీం కోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ‘ట్రిపుల్ తలాక్’ అంశంతో పాటే వీటిని కూడా పరిశీలించాల్సిందిగా కేంద్రం, సుప్రీం కోర్టును కోరింది. కానీ సుప్రీం కోర్టు ముందు ట్రిపుల్ తలాక్ అంశాన్ని విచారించిన తర్వాత నిఖా హలాల్ అంశాలను చర్చిస్తానని తెలిపింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ అంశాలను పరిశీలించడానికి సుప్రీం కోర్టు ఓ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ‘నిఖా హలాల్, బహుభార్యత్వం అంశాలు లింగ సమానత్వ నియమాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి సుప్రీం కోర్టు వీటి చట్టబద్దతను విచారించనుంద’ని ఒక సీనియర్ న్యాయాధికారి తెలిపారు. గతేడాది ‘ట్రిపుల్ తలాక్’ అంశం చట్టవిరుద్దమని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం ‘నిఖా హలాల్, బహుభార్యత్వం’ అంశాల గురించి చర్చించేందుకు ఈ ఏడాది మార్చ్‌లో సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ‘కేంద్రం తన మాటకు కట్టుబడి ఉంటుంది. నిఖా హలల, బహుభార్యత్వం వంటి అంశాలకు భారత ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకమే. ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా ఇదే అంశాన్ని తెలుపుతుంద’ని ఒక సీనియర్ న్యాయశాఖ అధికారి తెలిపారు. నిఖా హలాల్... ఇస్లాం నియమాల ప్రకారం విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది. -
నిఖత్ పసిడి పంచ్
సాక్షి, హైదరాబాద్: బెల్గ్రేడ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. సెర్బియాలో శనివారం జరిగిన మహిళల 51 కేజీల విభాగం ఫైనల్లో నిజామాబాద్ బాక్సర్ నిఖత్ 3–0తో ఐకతెరిని కుట్‌సోజియోర్‌గోపులు (గ్రీస్)పై విజయం సాధించింది. సెమీ ఫైనల్లో నిఖత్ 3–0తో నీనా రాడోవనోవిచ్ (సెర్బియా)ను ఓడించింది. ంచింది. -
బహుభార్యత్వంపై విచారణకు సుప్రీం ఓకే
న్యూఢిల్లీ: ముస్లింలు అనుసరిస్తున్న బహుభార్యత్వం, నిఖా హలాలాకు రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై తమ వైఖరి చెప్పాలంటూ కేంద్రం, లా కమిషన్లకు నోటీçసులిచ్చింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం 2017లో ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ బహుభార్యత్వం, నిఖా హలాలాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు చేపట్టింది. ఈ రెండు అంశాలపై మరో ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతుందని పేర్కొంది. ఇస్లాం ప్రకారం ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. నిఖా హలాలాను అనుసరించి భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం మహిళ మళ్లీ అతడినే వివాహం చేసుకోరాదు. వేరే వ్యక్తిని పెళ్లాడి అతనితో విడాకులు తీసుకున్నాకే మొదటి భర్తను పెళ్లాడేందుకు అనుమతిస్తారు. వీటిని వ్యతిరేకిస్తూ.. స్త్రీ, పురుషులకు సమన్యాయం కోరుతూ కేసువేశారు. -
ముస్లింలకు కొత్త విడాకుల చట్టం!
- ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తే తెస్తామన్న కేంద్రం - సుప్రీంకోర్టుకు నివేదించిన ఏజీ న్యూఢిల్లీ: ముస్లింల వివాహాల క్రమబద్ధీకరణ, విడాకుల కోసం చట్టం తీసుకువచ్చేందుకు కేంద్ర సంసిద్ధత వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాక్ సహా అన్ని విడాకుల విధానాలను సుప్రీంకోర్టు రద్దువేస్తే కొత్త చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) ముకుల్ రోహత్గీ... ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సోమవారం నివేదించారు. ముస్లింల విడాకుల విధానాలను తాము కొట్టివేసినట్లయితే కేంద్రం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించడంతో రోహత్గీ ఈ వివరణ ఇచ్చారు. విడాకుల కోసం ముస్లిం సమాజంలో అనుసరిస్తున్న మూడు విధానాలు.. తలాక్–ఏ–బిదత్, తలాక్ హసన్, తలాక్ ఆషాన్లు ఏకపక్షం, చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ‘పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, లిబియా తదితర ముస్లిం దేశాల్లోనే కాకుండా లౌకిక దేశమైన శ్రీలంకలోనూ ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశారు. మతపాలిత రాజ్యాలే సంస్కరణలవైపు పయనిస్తోంటే భారత్ వంటి లౌకిక దేశం ఎందుకు వీటిని ఇంకా పాటించాలి?’ అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ప్రస్తుతానికైతే ఒక్క ట్రిపుల్ తలాక్ ఇస్లాంలో తప్పనిసరా కాదా అంశంపైనే వాదనలు విని, తీర్పు చెబుతామని స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ ఇస్లాంలో భాగం కాదని ప్రభుత్వం నిరూపించాల్సి ఉందని పేర్కొంది.