Nikhita
-
తిరుపతి ఐఐటీలో సందడి చేసిన సింగర్ నిఖితా (ఫొటోలు)
-
సిల్వర్ ఫాయిల్ సిస్టర్స్
సాధారణంగా గోల్డ్ ఫాయిల్‌ను ఉపయోగించి తంజావూరు పెయింటింగ్స్‌ను డిజైన్ చేస్తారు. అయితే హైదరాబాద్ అత్తాపూర్‌లో ఉంటున్న నిఖిత, అల్కాలు సిల్వర్ ఫాయిల్‌ను ఉపయోగించి, కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. వైకుంఠపాళీ, అష్టాచెమ్మా, లూడో వంటి గేమ్ బోర్డులను సిల్వర్ ఫాయిల్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. దేవతామూర్తులు, ఫోటో ఫ్రేమ్‌లు, వాల్ క్లాక్‌లు, వాల్ ఫ్రేమ్స్, హ్యాంగింగ్స్.. ప్రతీ డిజైన్ వెండివెన్నెలలా చూపరులను ఆకట్టుకునేలా డిజైన్ చేస్తూ, వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇద్దరూ దూరపు బంధువులు. వరసకు అక్కాచెలెళ్లు. ఇద్దరూ గృహిణులుగా తమ తమ ఇంటి బాధ్యతలను చక్కబెట్టుకుంటూ, పిల్లల పనులు చూసుకుంటున్నారు. ‘ఎన్ని పనులున్నా మనలోని అభిరుచికి మెరుగులు దిద్దుకోవాల్సింది మనమే. అందుకే, కొంత సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాం’ అని వివరించారు ఈ కజిన్స్. రోజూ ఎనిమిది గంటలు నిఖిత, అల్కా ఇద్దరూ బి.కామ్ డిగ్రీ పూర్తి చేశారు. ‘ఆసక్తి కొద్దీ ఆభరణాల తయారీ కోర్సు చేశాను’ అని చెప్పిన నిఖిత పదేళ్ల పాటు అందమైన ఆభరణాలను రూపుకట్టారు. ‘దాదాపు వందకు పైగా ఎగ్జిబిషన్లలో నా ఆభరణాలను ప్రదర్శించాను. కరోనా సమయంలో మాత్రం కొత్తగా ఆలోచించాలనుకున్నాను. ఇంటి నుంచే కొత్త వర్క్ తో నా ప్రెజెంటేషన్ ఉండాలనుకున్నాను. అప్పుడే సిల్వర్ ఫాయిల్ ఐడియా వచ్చింది. ఈ విషయాన్ని అల్కాతో చర్చించినప్పుడు మంచి ఆలోచన అంది. తంజావూర్ పెయింటింగ్స్‌లో గోల్డ్ ఫాయిల్‌ను ఉపయోగిస్తారు. అది ఖర్చుతో కూడుకున్నది కూడా. అందుకే మేం సిల్వర్ ఫాయిల్ గురించి ఆలోచించాం. దీంతో ఇద్దరం సిల్వర్ ఫాయిల్‌తో రకరకాల ఫ్రేమ్స్ తయారు చేశాం. వీటిని మిగతా వేటి వేటికి జత చేయచ్చో ఒక ప్లాన్ వేసుకున్నాం. కలపకు సిల్వర్ ఫాయిల్‌ను జత చేస్తూ చాలా ప్రయోగాలే చేశాం. జ్యువెలరీ బాక్సులు, వాచీలు, గేమ్ బోర్డులు.. ప్రతీది ప్రత్యేకం అనిపించేలా డిజైన్ చేశాం’ అని వివరించింది నిఖిత. ‘ఈ వర్క్ లో ఇద్దరం గంటల గంటల సమయం కేటాయించాం. అందుకు మా కుటుంబాలు కూడా సపోర్ట్‌గా ఉన్నాయి. ఫ్రేమ్స్‌కు నాలుగైదు రోజుల సమయం సరిపోతుంది. కానీ, గేమ్ బోర్డులకు పది నుంచి ఇరవై రోజులైనా సమయం పడుతుంది. దాదాపు రోజూ ఎనిమిది నుంచి పది గంటలైనా వీటి తయారీకి కేటాయిస్తాం’ అని తమ వర్క్ గురించి వివరించింది అల్కా. ప్రత్యేకమైన కానుకలు ‘మేం చేసే డిజైన్స్‌లో మరోదాన్ని పోలిన డిజైన్ ఉండదు. దేనికది ప్రత్యేకం. పెళ్లి్ల, పుట్టినరోజు, గృహప్రవేశాలు వంటి వేడుకలకు ఏదైనా కానుక తీసుకెళ్లాలనుకుంటారు. అదే సమయంలో కానుక తీసుకున్నవాళ్లు ఇంట్లో తీపి జ్ఞాపకంగా అలంకరించుకోవాలనుకుంటారు. ఎన్నేళ్లయినా ప్రత్యేకంగా ఉండే సిల్వర్ ఫాయిల్‌తో డిజైన్స్ తీసుకు రావాలనుకున్నాం. మేం ‘నకాషి’ పేరుతో మా బ్రాండ్‌ను పరిచయం చేస్తున్నాం. ఈ డిజైన్స్‌లో స్వరోస్కి, జెమ్స్ కూడా ఉపయోగిస్తాం. డిజైన్, సైజును బట్టి ధరలు ఉంటాయి. పెట్టుబడి ఇద్దరిది, రాబడి ఇద్దరిదీ’ అంటూ కలిసి పనిచేస్తే కలిగే లాభం గురించి, పంచుకున్న పని రోజుల గురించి ఆనందంగా తెలిపారు ఈ సిల్వర్ ఫాయిల్ సిస్టర్స్. – నిర్మలారెడ్డి -
టైటిల్ పోరుకు నిఖిత, కావ్య
సాక్షి, హైదరాబాద్: ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) ఆధ్వర్యంలో జరుగుతోన్న స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో హెచ్ఎస్ నిఖిత, కావ్య ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగిన క్యాడెట్ బాలికల సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో వీరిద్దరూ విజయం సాధించారు. తొలి సెమీస్‌లో నిఖిత (వీపీజీ) 11–6, 11–5, 11–5, 11–3తో ధ్రితి (జీఎస్ఎం)పై గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో కావ్య (ఏడబ్ల్యూఏ) 6–11, 12–10, 11–7, 11–5, 11–7తో ప్రగ్యాన్ష (వీపీజీ)ని ఓడించింది. మరోవైపు బాలుర విభాగంలో జతిన్‌దేవ్ (ఎస్పీహెచ్ఎస్), పార్థ్ భాటియా (ఏడబ్ల్యూఏ), శౌర్య రాజ్ సక్సేనా (ఎంఎల్ఆర్), కార్తీక్ (నల్లగొండ) సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో జతిన్‌దేవ్11–8, 11–5, 11–5తో ధ్రువ్ సాగర్ (జీఎస్ఎం)పై, పార్థ్ భాటియా 11–4, 11–6, 11–4తో ఒమర్ మంజూర్ ఖాన్ (వీపీజీ)పై, శౌర్యరాజ్ 11–7, 11–6, 11–8తో తరుణ్ ముఖేశ్ (ఎంహెచ్‌జే)పై, కార్తీక్ 8–11, 11–9, 11–8, 10–12, 11–6తో మహేశ్ (జీటీటీఏ)పై విజయం సాధించారు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల వివరాలు సబ్ జూనియర్ బాలురు: కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 3–0తో ఎ. వరుణ్‌పై, ప్రణవ్ (ఏడబ్ల్యూఏ) 3–0తో సయ్యద్ నజీబుల్లా (ఏడబ్ల్యూఏ)పై, త్రిశూల్ మెహ్రా (ఎల్బీ స్టేడియం) 3–1తో యశ్ గోయెల్ (జీఎస్ఎం)పై, సాయికిరణ్ (ఏడబ్ల్యూఏ) 3–2తో శ్రేష్ట్ (ఏడబ్ల్యూఏ)పై, అథర్వ (ఏడబ్ల్యూఏ) 3–0తో రాజు (ఏడబ్ల్యూఏ)పై, జి. వివేక్ సాయి (హెచ్‌వీఎస్) 3–1తో క్రిష్ సింఘ్వి (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు. బాలికలు: ఎన్. భవిత (జీఎస్ఎం) 3–0తో నందిని (వీపీజీ)పై, విధిజైన్ 3–0తో వై. శ్రేయ సత్యమూర్తిపై, ఫాతిమా (డాన్‌బాస్కో) 3–1తో పూజపై, నమ్రత 3–2తో నిఖితపై, అనన్య (జీఎస్ఎం) 3–1తో మెర్సీ (హెచ్‌వీఎస్)పై, గోధ తేజస్విని (నల్లగొండ) 3–2తో పలక్‌పై, ప్రియాన్షి (జీఎస్ఎం) 3–0తో ప్రగ్యాన్ష (వీపీజీ)పై, ఇక్షిత (ఏడబ్ల్యూఏ) 3–0తో అహ్మదీ నౌసీన్ (డాన్‌బాస్కో)పై విజయం సాధించారు. మహిళల సింగిల్స్: నైనా 4–0తో శరణ్య (జీఎస్ఎం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 4–0తో హనీఫాపై, లాస్య (ఏడబ్ల్యూఏ) 4–3తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై, జి. ప్రణీత (హెచ్‌వీఎస్)4–0తో దివ్య (హెచ్‌వీఎస్)పై, బి. రాగ నివేది (జీటీటీఏ) 4–0తో వినిచిత్ర (జీఎస్ఎం)పై, మౌనిక (జీఎస్ఎం) 4–0తో పలక్ షా (ఏవీఎస్‌సీ)పై, నిఖత్ బాను (ఆర్బీఐ) 4–0తో ఐశ్వర్య డాగా (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు. -
క్వార్టర్స్‌లో నిఖిత, తనుషిత
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్ఈ సౌత్‌జోన్ టెన్నిస్ టోర్నమెంట్లో నిఖిత, తనుషిత క్వార్టర్స్‌లో ప్రవేశించారు. సైనిక్‌పురిలోని ఇండస్ స్కూల్ ప్రాంగణంలో ఆదివారం జరిగిన అండర్-19 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తనుషిత రెడ్డి (భవన్స స్కూల్) 6-0తో వింధ్య (ఓక్రిడ్‌జ ఇంటర్నేషనల్ స్కూల్)పై గెలుపొందగా... నిఖిత (గ్లెండాల్ అకాడమీ) 7-3తో విదిషా రెడ్డి (గ్లోబల్ ఎడ్జ స్కూల్)ను ఓడించింది. డబుల్స్ విభాగంలో అనన్య-దర్శిని(ఓక్రిడ్‌జ) ద్వయం 6-3తో సొనాలి జైస్వాల్-నిఖిత (భవన్స స్కూల్) జోడీపై, మాన్య విశ్వనాథ్-విదిషా రెడ్డి (గ్లోబల్ ఎడ్జ స్కూల్) ద్వయం 6-0తో నిఖిత-నిక్కి వర్మ (గ్లెండాల్ అకాడమీ) జోడీపై, సహస్ర-రెనీ శర్మ (చిరెక్ స్కూల్) 6-1తో చార్వి-మేఘన (డీపీఎస్, కర్నాటక)జోడీపై నెగ్గాయి. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు అండర్-19 బాలికల సింగిల్స్: అనన్య (ఓక్రిడ్‌జ) 6-0తో సొనాలి జైస్వాల్ (భవన్స స్కూల్)పై, మాన్య (గ్లోబల్ ఎడ్జ స్కూల్) 6-0తో నిక్కి వర్మ (గ్లెండాల్ అకాడమీ) విజయం సాధించారు. అండర్-14 బాలుర సింగిల్స్: రోహన్ (గ్లోబల్ ఎడ్జ స్కూల్) 6-0తో అభిజిత్ (వలమ్మల్ ఇంటర్నేషనల్ స్కూల్, తమిళనాడు)పై గెలుపొందాడు. అండర్-19 బాలుర సింగిల్స్: రోహన్ (జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్) 6-1తో అశ్విన్ (చెట్టినాడు విద్యాశ్రమ్, తమిళనాడు)పై నెగ్గాడు. -
నిఖిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
పమిడిముక్కల : బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ కన్నెకల మడుగు(డ్రెయిన్)లో మునిగి మరణించిన బాలిక కొండవీటి నిఖిత కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కల్పన గురువారం మేడూరు శివారు ముత్రాసిపాలెం వెళ్లి ఇటీవల కాలువలో పడి చనిపోయిన బాలిక నిఖిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిఖిత తల్లి కామాక్షి, తండ్రి నానీలను ఓదార్చారు. ప్రమాద కారణాలు అడిగి తెలుసుకున్నారు. వీరంకి వద్ద బందరు కాలువకు గండి పడటంతో నీటిని కన్నెకల మడుగు డ్రెయిన్‌కు వదిలారని గ్రామస్తులు చెప్పారు. రేవులో బట్టలు ఉతికేందుకెళ్లిన ముగ్గురు బాలికలు నీటి ఒరవడికి కొట్టుకుపోతుండగా... స్థానికులు ఇద్దరిని రక్షించారని, నిఖిత మరణించిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కల్పన విలేకరులతో మాట్లాడుతూ అధికారులు, సాగునీటి సంఘాల అలసత్వం వల్లే వీరంకి వద్ద కాలువ కట్టకు గండి పడిందని, నిఖిత మరణించిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా పుష్కరాల హడావుడిలో నిమగ్నమై పాలనను గాలికొదిలేశారని విమర్శించారు. బాలిక కుటుంబానికి తమ పార్టీ తరఫున అండగా నిలుస్తామని, నష్టపరిహారం అందించే వరకు పోరాడతామని చెప్పారు. మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ తోట్లవల్లూరు మండల అధ్యక్షుడు జొన్నల రామ్మోహనరెడ్డి, నాయకులు మారపాక మహేష్, పాతూరి చంద్రపాల్, లోయ బ్రదర్స్, జి.రాజ్యలక్ష్మి, ఎం.వసంత, నజీర్, సలీం, కుటుంబరావు, పి.రవికుమార్, డి.మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
కష్ణా పుష్కరాల్లో అపశృతి
కృష్ణా పుష్కరాల్లో అపశృతి చోటుచేసుకుంది. పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరించడానికి వచ్చిన మహిళకు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. ధరణికోట బుద్ధుని ఘాట్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ఎదుట వేసిన టెంట్ కూలిపోయింది. ఆ సమయంలో టెంట్ కింద ఉన్న సాయి నిఖిత అనే మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు ఉన్న మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు వెంటనే వారిని వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
కళాశాలకు వెళ్లి తిరిగి రాని యువతి..
కళాశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంజయ్‌పురి కాలనీకి చెందిన మెరుగు నర్సింహులు కుమార్తె నిఖిత (19) కూకట్‌పల్లిలోని సిద్దార్ధ డిగ్రీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 25న ఉదయం 9 గంటల సమయంలో కాలేజీకి వెళ్లిన యువతి నేటి వరకు తిరిగి రాలేదు. తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విశాల్‌తో నిఖిత డాన్స్
ఎంగల్ అన్న చిత్రంలో విజయకాంత్‌కు చెల్లెలిగా నటించిన నటి నిఖిత గుర్తుందా? ఈ కన్నడ భామ మాతృభాషతో పాటు తమిళం, తెలుగు వంటి ఇతర భాషలలోనూ అడపాదడపా తళుక్కున మెరుస్తుంటారు. తమిళంలో నిఖిత నటించిన చివరి చిత్రం అలెక్స్ పాండియన్. ఆ చిత్రంలో సంతానం చెల్లెల్లో ఒకరిగా కార్తీతో ఆడారు. తాజాగా నటుడు విశాల్‌తో లెగ్‌షేక్ చేశారు. సుశీంద్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి పాయుమ్ పులి అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో విశాల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. విశాల్ అండర్ కవర్ పోలీసుగా పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ చోటు చేసుకుంది. ఆ పాటలో నిఖిత విశాల్‌తో ఆడిపాడటం విశేషం. ఈ పాటను ఇటీవల బిన్నీ మిల్లులో భారీ మార్కెట్ సెట్‌ను వేసి చిత్రీకరించారు. సంగీత దర్శకుడు ఇమాన్ బాణీలు కట్టిన ఈ పాట పాయుమ్ పులి చిత్రంలో హైలైట్‌గా ఉంటుందంటున్నారు చిత్ర యూనిట్. దీన్ని ఐటమ్ సాంగ్ అనరాదని, ఇదో పెప్సీ సాంగ్ అని నిఖిత అంటున్నారు. ఈమె కన్నడంలో హీరోయిన్గా నటిస్తున్న పరభాషల్లో ఏ తరహా పాత్ర వచ్చినా అవకాశాన్ని వదులుకోకుండా నటిచేస్తున్నారన్నది గమనార్హం. -
మరుజన్మనిచ్చిన మాతృమూర్తులు...
నిర్మలా సావంత్... ఒక అమ్మ. వందనాపాటిల్ కూడా అమ్మే. ఈ ఇద్దరూ అందరు తల్లుల్లాగానే తమ కూతుళ్లకు జన్మనిచ్చారు. విధి ఈ ఇద్దరు తల్లులకూ ఒకేరకమైన పరీక్ష పెట్టింది. అదీ ఒకే నెలలో... మూడురోజుల తేడాలో. విధి జూన్ ఐదవ తేదీన నిర్మలాసావంత్ కూతుర్ని పొట్టనపెట్టుకుంది. జూన్ ఎనిమిదవ తేదీన వందనాపాటిల్ కూతురి ప్రాణాలనూ తీసుకుంది. కళకళలాడుతూ కళ్ల ముందు తిరిగిన పిల్లలు అచేతనంగా పడి ఉన్న సమయం... ఆ తల్లుల మనసు చేతనమైంది... బంగారం లాంటి బిడ్డ మట్టిపాలు కావడానికి వీల్లేదంటూ... అవయవదానానికి సిద్ధమయ్యారు. నలుగురి ప్రాణాలను కాపాడి, ఒకరికి చూపునిచ్చారీ తల్లులు. ఈ ఇద్దరూ ఉండేది ముంబయిలోనే. కానీ, ఒకరికొకరు పరిచయమే లేదు. అయినా తల్లి మనసు వారిని ఒకచోట చేర్చింది. ముంబై నగరంలోని బాంద్రాలో నివసించే నిర్మలా సావంత్-ప్రభావల్కర్ దంపతులకు ఒక్కగానొక్క కూతురు హేమంగి. ఇంజినీరింగ్ చదివే హేమంగి ఎప్పుడూ చలాకీగా ఉండేది. తల్లితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేది. నిర్మల రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించడంతోపాటు సామాజిక సేవ చేస్తుంటారు. 1994-95లో నిర్మల ముంబై మేయర్‌గా విధులు నిర్వహించారు. అడ్వకేట్ అయిన నిర్మల ప్రస్తుతం ‘నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్’ (ఎన్డిడబ్ల్యూ) సభ్యురాలు. తరచు తల్లికి చేదోడుగా ఉండే హేమంగి... గడచిన జూన్ అయిదవ తేదీన కూడా నిర్మలకు కావల్సిన వివరాలను కంప్యూటర్ నుంచి తీసి ఇచ్చింది. అదే సమయంలో తలనొప్పిగా ఉందంటూ తలపట్టుకుంది. ఇంట్లో అందరూ మామూలు తలనొప్పిగానే భావించారు. కానీ, ఇంతలోనే ‘‘అమ్మా... నొప్పి ఎక్కువవుతోంది. భరించలేకపోతున్నానని’ చాలా వేదనతో చెప్పింది. ప్రమాదాన్ని శంకించిన నిర్మల కూతుర్ని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధం చేయసాగింది. అంతలోనే ‘నొప్పి భరించలేక పోతున్నా’’నంటూనే వాంతి చేసుకుని ఒక్కసారిగా సోఫాలో వాలిపోయింది హేమంగి. తీవ్ర భయాందోళనలకు గురైన నిర్మల వెంటనే ఇరుగుపొరుగు వారి సహాయంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి హేమంగిని తీసుకవెళ్లింది. డాక్టర్లు ఆమెను ఐసియులోకి చేర్పించి చికిత్స ప్రారంభించారు. నిర్మల మాత్రం వాంతి చేసుకోవడం కారణంగా తన కూతురికి ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండవచ్చని భావించింది. కానీ మెదడులోని నరాలు చిట్లి (బ్రెయిన్ హెమరేజ్) హేమంగి బ్రెయిన్‌డెడ్ అయిందని తెలిసి నిర్మలకు గుండె ఆగినంత పనైంది. ఎంత ఖర్చు అయినా సరే తన బిడ్డను రక్షించమని డాక్టర్లను వేడుకుంది. కానీ ఫలితం దక్కలేదు. ఆమెని ఓదార్చడానికి... ‘‘ఇతర అవయవాలు బాగున్నాయి. అవయవాలను దానం చేయవచ్చని డాక్టర్లు చెప్పారు. చాలా సేపు ఎటూ తేల్చుకోలేక మధన పడిన తర్వాత నిర్మల తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయంతో... లీలావతి ఆసుపత్రిలోని ఓ 38 ఏళ్ల వ్యక్తికి హేమంగి మూత్రపిండాన్ని అమర్చారు. ఠాణే జూపిటర్ ఆసుపత్రిలోని ఓ వ్యక్తికి కాలేయాన్ని అమర్చారు. మరణించినతర్వాత కూడా.... ‘‘దేవుడు ఆమెను త్వరగా తీసుకెళ్లాడు. తను మరణించిన తర్వాత కూడా ఇద్దరికి జీవం పోసింది’’ అంటూ కంటతడిపెట్టారు నిర్మల. మరణం తర్వాత తన అవయవాలు మరొకరికి దానం చేస్తూ అంగీకార పత్రం రాసినట్లు తెలిపారామె. అమూల్యమైన అవయవాలను కాల్చి బూడిదపాలు చేస్తుండడం వల్ల అవి ఎవరికీ అక్కరకు రాకుండా పోతున్నాయి. అందుకే ఈ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు. అయితే కష్టం అనేది వద్దనుకున్నా వచ్చి పడేదే. ఆ కష్టం వచ్చినప్పుడు మనసు దిటవు చేసుకుని అవయవాలను మరొకరికి ఉపయోగపడడానికి ప్రయత్నిస్తే మరెన్నో జీవితాల్లో వసంతం నింపిన వాళ్లవుతారు. అన్నింటినీ మించిన మహోన్నత దానం అవయవదానం. ఇద్దరిలో జీవిస్తోంది! మహారాష్ట్రలోని లక్ష్మణ్ పాటిల్ దంపతులకు కూడా నిర్మలా సావంత్‌కు ఎదురైన పరిస్థితే వచ్చింది. సాంగ్లీ జిల్లాకి చెందిన లక్ష్మణ్ పాటిల్ ఆయన భార్య వందన బతుకుదెరువుకోసం ముంబైకి నగరానికి సమీపంలోని ఠాణే ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక బాబు. లక్ష్మణ్ గోడౌన్లలో హమాలి (కూలి). వీరి రెండవ కూతురు నిఖిత చదువులో చురుకైనది. స్కాలర్షిప్ కూడా తెచ్చుకుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే గడచిన వేసవి సెలవులకూ స్వగ్రామం వెళ్లారు నిఖిత కుటుంబీకులు. పాఠశాలలు తెరవకముందే మళ్లీ ఠాణేకు రావడానికి సిద్ధంకాసాగారు. ఇంతలో ఓ రోజు... వీరి బంధువుల గూడ్స్ టెంపో ఠాణేకు ఖాళీగా వెళ్తోంది. ఆ టెంపోలో వెళ్తే దారి ఖర్చులు కలిసి వస్తాయనే ఆశ. గడచిన జూన్ 8వ తేదీ రాత్రి 10.30 నిమిషాలకు బయలుదేరారు. తెల్లవారి ఐదున్నర సమయంలో కాలాపూర్ వద్ద... ఒక్కసారిగా భారీ శబ్దం. డ్రైవర్, నిఖిత తీవ్రమైన గాయాలతో రక్తం మడుగులో ఉన్నారు. వందన చేతికి గాయం తీవ్రంగా తగిలింది. మిగతా ఇద్దరు పిల్లలకు, లక్ష్మణ్‌కు మాత్రం పెద్దగా గాయాలు కాలేదు. సమీపంలో ఉన్న ‘ఎంజిఎం’ఆసుపత్రికి వీరిని తరలించారు. అప్పటి వరకు మాట్లాడుతున్న నిఖిత ఒక్కసారిగా ఉలుకుపలుకు లేకుండా పోయింది. డాక్టర్లు నిఖిత బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. ఇక ఆమె బతకడం కష్టమని డాక్టర్లు స్పష్టం చేయడంతో ఒక్కసారిగా వీరి దుఃఖం రెట్టింపయింది. భోరున విలపించిన పాటిల్ దంపతులు అంతలోనే గుండెనిబ్బరం చేసుకుని నిఖిత మూత్రపిండాలను దానం చేశారు. ఇలా పాటిల్ దంపతులు అంత బాధలోనూ ైధైర్యంగా తీసుకున్న నిర్ణయం రెండు నిండుప్రాణాలను కాపాడింది. దీంతో వీరి కూతురు నిఖిత ఇద్దరికి ప్రాణం పోసినట్టు. నిఖిత మూత్రపిండాలలో ఒకటి ఎంజిఎం ఆసుపత్రిలోని పేషెంట్‌కు, మరొకటి ముంబై జెస్లోక్ ఆసుపత్రిలోని పేషెంట్‌కు అమర్చారు. అన్నట్లుగానే పేరు తెచ్చుకుంది! పెద్దచదువులు చదివి ఐపిఎస్ అవుతానని, అందరికీ సహాయం చేసి మంచి పేరు తెచ్చుకుంటాననేది. తానన్నట్లే అవయవాలను దానం చేసి మరణించిన తర్వాత తన పేరును సుస్థిరం చేసుకుంది. - లక్ష్మణ్పాటిల్, నిఖిత తండ్రి హేమంగి బ్రెయిన్ డెడ్ అయిందని తెలిసిన క్షణం నేను సర్వం కోల్పోయానన్న బాధ కలిగింది. ఒక్కగానొక్క కూతురు కళ్ల ముందే ఇలా కావడంతో మనోధైర్యాన్ని కోల్పోయాను. గుండెనిబ్బరం చేసుకుని హేమంగి అవయవాలను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అవయవాల మార్పిడి విజయవంతమైందని తెలిసినప్పుడు అంత దుఃఖంలోనూ సంతోషం కలిగింది.వారి రూపంలో నా హేమంగి ఇంకా భూమ్మీదనే ఉంది. - నిర్మలాసావంత్, హేమంగి తల్లి హమాలి పని చేసే మేము బహుశా ఆమెను పెద్దచదువులు ఎంతవరకు చదివించేవాళ్లమో తెలియదు, కాని పదేళ్ల వయసులోనే ఆమె అందరికీ స్ఫూర్తిగా మారింది. - వందనా పాటిల్, నిఖిత తల్లి