విశాల్‌తో నిఖిత డాన్స్ | Vishal to dance with Nikita Thukral in Payum Puli | Sakshi
Sakshi News home page

విశాల్‌తో నిఖిత డాన్స్

Published Mon, Apr 20 2015 3:00 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

విశాల్‌తో నిఖిత డాన్స్ - Sakshi

విశాల్‌తో నిఖిత డాన్స్

 ఎంగల్ అన్న చిత్రంలో విజయకాంత్‌కు చెల్లెలిగా నటించిన నటి నిఖిత గుర్తుందా? ఈ కన్నడ భామ మాతృభాషతో పాటు తమిళం, తెలుగు వంటి ఇతర భాషలలోనూ అడపాదడపా తళుక్కున మెరుస్తుంటారు. తమిళంలో నిఖిత నటించిన చివరి చిత్రం అలెక్స్ పాండియన్. ఆ చిత్రంలో సంతానం చెల్లెల్లో ఒకరిగా కార్తీతో ఆడారు. తాజాగా నటుడు విశాల్‌తో లెగ్‌షేక్ చేశారు. సుశీంద్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి పాయుమ్ పులి అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో విశాల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
 
  విశాల్ అండర్ కవర్ పోలీసుగా పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ చోటు చేసుకుంది. ఆ పాటలో నిఖిత విశాల్‌తో ఆడిపాడటం విశేషం. ఈ పాటను ఇటీవల బిన్నీ మిల్లులో భారీ మార్కెట్ సెట్‌ను వేసి చిత్రీకరించారు. సంగీత దర్శకుడు ఇమాన్ బాణీలు కట్టిన ఈ పాట పాయుమ్ పులి చిత్రంలో హైలైట్‌గా ఉంటుందంటున్నారు చిత్ర యూనిట్. దీన్ని ఐటమ్ సాంగ్ అనరాదని, ఇదో పెప్సీ సాంగ్ అని నిఖిత అంటున్నారు. ఈమె కన్నడంలో హీరోయిన్‌గా నటిస్తున్న పరభాషల్లో ఏ తరహా పాత్ర  వచ్చినా అవకాశాన్ని వదులుకోకుండా నటిచేస్తున్నారన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement