పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ | Powerful Police Officer as Vishal | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్

Published Sun, Aug 9 2015 10:30 PM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్

‘‘విశాల్ ‘పందెం కోడి’ చిత్రం నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘పాయుమ్ పులి’ కూడా సరికొత్త కథాంశంతో  రూపొందింది. అందుకే ఈ చిత్రంతో నిర్మాతగా మారాను’’అని దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి చెప్పారు. మధురైలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా సుశీంద్రన్ దర్శకత్వంలో  తమిళంలో విశాల్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘పాయమ్ పులి. ఈ చిత్రాన్ని పంపిణీదారుడు ఎస్. నరసింహ ప్రసాద్‌తో కలిసి జి. నాగేశ్వరరెడ్డి  ‘జయసూర్య’గా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
 
 సెప్టెంబరు 4న  ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం లోగను రచయిత కోన వెంకట్, దర్శకుడు దశరథ్ ఆవిష్కరించారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఇది క్రైమ్ థ్రిల్లర్. విశాల్ ఇందులో పవర్‌పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశారు. సుశీంద్రన్ ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ చిత్రం పాటలను ఈ నెల 21న విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: డి.ఇమాన్, ఛాయాగ్రహణం: వేల్‌రాజ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement