వేయిగొంతుల ‘నైమిశ’ గానం!
నన్నయ ఆది కవే కావొచ్చు. తిక్కన ఉభయ కవిమిత్రుడే కావచ్చు. వారిరువురికీ లేని భాగ్యం తాను శిష్యుడవడం వలన తన గురువు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రివారికి దక్కింది అన్నారు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారా యణ! శ్రీకాళహస్తీశ్వరమహాత్మ్యం రాసిన దూర్జటికి, పాండురంగ మహాత్మ్యం రాసిన తెనాలి రామకృష్ణకు, సుమతీ శతకకారుడు బద్దెన, వేమనకు దక్కని గౌరవం ఒక శతక కర్తగా తనకు దక్కుతోందని తెలుగు భాషాభి మానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. తాను ఇటీవల రచించిన ‘నైమిశ వేంకటేశ శతకా’ న్ని వేయి మంది ఆబాల గోపాలం, జనవరి 10వ తేదీన విజయనగరంలో కంఠోపాఠంగా గానం చేస్తోన్న సందర్భంగా రామలింగేశ్వర రావుతో ఇంటర్వ్యూ సారాంశం.
పురాణాల పుట్టింట పుట్టుక!
యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు జెరూ సలెం పుణ్యస్థలం. ఎందరో కవులు ఆ పుణ్య భూమి గురించి కవిత్వం రాశారు. అలాగే సంప్రదాయ భారతీయులకు నైమిశారణ్యం పుణ్యస్థలి. ఉత్తరభారతంలో లక్నో సమీపం లో 84 క్రోసుల విస్తీర్ణంలో వ్యాపించిన ఆ అర ణ్యం ‘జీవులెనుబది నాల్గులక్షల’కు ముక్తి ధామం! నైమిశారణ్యంలోనే వ్యాసుడు వేదా లను సంకలనం చేశాడు. 18 పురాణాలను రచించాడు. వృతాసురుని సంహారం కోసం తన వెన్నెముకనే ఆయుధంగా అర్పించిన దధీచి వంటి 88 వేల రుషులు తపస్సు చేశా రు. ఇక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర ఆలయం నుంచి బ్రహ్మోత్సవాలలో పాల్గొనవల సిన దిగా సరిగ్గా రెండేళ్ల క్రితం పిలుపు వచ్చింది. నైమిశ వేంకటేశ్వరుని గర్భగుడిలో ఆశు వుగా ఒక పాట వచ్చింది. ‘పురాణాల పుట్టిం టికి రండి, పురాణ పురుషుని చూడండి...’ అని! నైమిశ చరిత్ర మనసును ఆవాహన చేసు కుంది. ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం మొదటి పద్యం ఉబికింది. ఇరవై రోజుల్లో శత కం పూర్తయ్యింది.
అపూర్వ ఆదరణ!
నైమిశ వేంకటేశ్వర శతకం అపూర్వ ఆదరణకు నోచుకుంది. మేము కంఠతా పట్టాం, మేం కం ఠతా పట్టాం అని వివిధ ప్రాంతాల నుంచి స్పందన వచ్చింది. నిరుడు డిసెంబర్ 21న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరి గిన వేడుకలో 750 మంది శతకంలోని 108 పద్యాలనూ గానం చేశారు. పాలకొల్లు నుంచి అభిజిత్ అనే అంధయువకుడు, తమిళనాడు లోని మదురై నుంచి ఒక తమిళ మహిళ, సాధారణ గృహిణులు, చిన్ని చిన్ని వ్యాపారా లు నిర్వహించుకునేవారు, నిరక్షరాస్యులు, సాఫ్ట్వేర్ యువత నైమిశ వేంకటేశ శతకాన్ని కంఠతా పట్టి పఠించారు. ఈ ఆదరణకు మూడు ప్రధాన కారణాలు.
‘దేని పోగొట్టుకొంటిమో దానిపొంది/ అందరికి దానినందరు అందజేసి/ సఖ్యతన్ శాంతిసౌఖ్యాల సాగున టుల/ వేయుమా, బాట వేంకటేశ నైమిశ’ అనే రీతిలోని పద్యాలు నైమిశారణ్య ఐతిహా సిక ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాయి.
‘తామసమునుండి చేరితి నైమిశమును/ రాజసమునుండి పలికితి రామకథను/ సత్త్వదశనుండి వ్రాసితి శతకకృతిని/ వివిధ తత్త్వేశ నైమిశ వేంకటేశ’ వంటి పద్యాలు శ్రీ వేంకటేశుని కృపాకటాక్షాన్ని తెలియజేస్తాయి.
‘తెలుగుపై కాక ధనముపై దృష్టియున్న /యిట్టి, అమృత వాక్స్రసిద్ధి తట్టి రాదు/కొంత అర్ధమయితివి ఓ అనంత/ అదియు వింతలో వింత, నైమిశ వేంక టేశ’ తరహా పద్యాలు తెలుగు భాషపై ప్రేమాభిమానాలు కలవారందరినీ అల రించాయి! ‘శతక పద్యాలను నియమం గా చదివితే నైమిశారణ్యంలోని చక్ర తీర్థంలో స్నానం చేసిన ఫలసిద్ధి కలుగు తుంది’ అనే ఫలశ్రుతి సైతం ఆదరణకు ప్రేరణనిచ్చింది!
గిన్నిస్‌లో ‘శతకగానం’!
లిపి కలిగిన భాషలు మూడువేలున్నాయి. అచ్చయిన 11 నెలల్లో 108 పద్యాలను వేయి మంది కంఠస్తం చేయడం అనే సంఘటన ఏ భాషలో సంభవించినా అది సాహితీ సరస్వ తికి సత్కారమే. తెలుగులో ఈ అపూర్వ ఘట న జరగడం, భాషకూ కవికీ దక్కిన అదృష్టం! ఒక కవి జీవితకాలంలో జరిగే ఈ అపూర్వ సందర్భం సాధ్యం కావడానికి సాహిత్యంలో ఆధునిక సాంకేతికత తెచ్చిన సౌలభ్యం కూడా కారణమే! ‘నైమిశ వేంకటేశ శతకం’ వేయి గొంతుల నుంచి ధ్వనించడం, గిన్నిస్ బుక్‌లో నమోదు కావడం సహజమే కదా!
పున్నా కృష్ణమూర్తి